https://branhamtabernacle.org/te/streaming/viewservice/42538672-4C48-4C09-B6DA-DB4D96531DE7
Category Archives: Uncategorized
25-0209 దానియేలును గాబ్రియేలు దర్శించుటకు గల ఆరు కారణాలు
25-0202 దానియేలునకు గాబ్రియేలు యొక్క ఉపదేశములు
25-0126 ప్రకటన గ్రంథము, ఐదవ అధ్యాయము భాగము II
62-1231 పోరాటము
24-1229 ప్రకటన గ్రంథము, నాలుగవ అధ్యాయము 1వ భాగము
24-1222 చుట్టబడిన దేవుని కానుక
వర్తమానము: 60-1225 చుట్టబడిన దేవుని కానుక
>>>https://branhamtabernacle.org/te/streaming/viewservice/7B953587-E85A-4AE8-B4EB-4C11F035B7D8<<<
[catlist search=”60-1225″
ప్రత్యేక ప్రకటన
ప్రియమైన వధువా,
మరలా ఈ సంవత్సరముయొక్క ముగింపు దినమున ఒక ప్రత్యేకమైన వర్తమానమును మరియు ప్రభురాత్రి భోజనమును కలిగియుండమని ప్రభువు నా హృదయములో ఉంచాడు. స్నేహితులారా, నూతన సంవత్సరములోనికి ప్రవేశిస్తుండగా, దేవుని స్వరము మనతో మాట్లాడటాన్ని వినుచు, ప్రభువు భోజనములో పాల్గొని, మరియు మన జీవితములను మరలా-సమర్పించుకొనుట కంటే మనము ఇంకే గొప్ప కార్యమును చేయగలము. “ప్రభువా, మేము సంవత్సరముగుండా చేసిన మా పొరపాటులన్నిటికీ మమ్మల్ని క్షమించుము; ఇప్పుడు మేము నిన్ను సమీపిస్తున్నాము, నీవు మా చేయి పట్టుకొని ఈ రానున్న సంవత్సరములో మాకు మార్గదర్శకత్వము చేయుదువా అని వేడుకొనుచున్నాము. మేము ముందెన్నడూ సేవించనంతగా నిన్ను సేవించుదుము గాక, మరియు నీ దైవికమైన చిత్తములో ఉన్నయెడల, జరుగనైయున్న ఆ గొప్ప ఎత్తబడుట సంభవించు సంవత్సరము ఇదేయైయుండును గాక. ప్రభువా, నిత్యత్వమంతా నీతో జీవించుటకై మేము కేవలం గృహమునకు వెళ్ళాలని కోరుచున్నాము,” అని మనము మన హృదయాలనుండి చెప్తుండగా, లోకమంతటినీ వెలుపట ఉంచి తలుపులు మూసివేసి, మరియు వాక్యములో ఈ ప్రత్యేకమైన కూడిక కొరకు వధువుతో ఐక్యమవ్వడం ఎటువంటి ఒక పవిత్రమైన సమయముగా ఉంటుంది కదా. ఈ ప్రత్యేకమైన పునః ప్రతిష్ఠ కూడిక కొరకు ఆయనయొక్క సింహాసనము చుట్టూ కూడుకోవడానికి నేను వేచియుండలేకపోవుచున్నాను, ప్రభువునకు స్తుతి కలుగును గాక.
జఫర్సన్విల్ ప్రాంతములో ఉన్న విశ్వాసులకు, మన స్థానిక కాలమానం ప్రకారంగా సాయంత్రం 7:00 గంటల సమయమప్పుడు నేను టేపును ప్రారంభించగోరుచున్నాను. మనము గతంలో చేసినట్లే, ఆ సమయానికి పూర్తి వర్తమానము మరియు ప్రభు రాత్రి భోజనపు కూడిక వాయిస్ రేడియోలో వస్తుంది. మీరు YFYC భవనము వద్దనుండి తీసుకొనుటకు, ప్రభు రాత్రి భోజనపు ద్రాక్షరసము ప్యాకెట్లు, బుధవారము, డిసెంబరు 18న, మధ్యాహ్నం 1:00 – 5:00 గంటలవరకు అందుబాటులో ఉంచుతాము.
జఫర్సన్విల్ ప్రాంతమునకు వెలుపలనున్నవారు, దయచేసి మీకు అనుకూలమైన సమయములో ఈ ప్రత్యేకమైన కూడికను కలిగియుండండి. త్వరలో వర్తమానము కొరకు మరియు ప్రభు రాత్రి భోజనపు కూడిక కొరకు డౌన్లోడు చేసుకోగల ఒక లింకును మేము అందజేస్తాము.
మనము క్రిస్మస్ సెలవును సమీపిస్తుండగా, ఒక అద్భుతమైన సురక్షితమైన సెలవు సమయమును కలిగియుండాలని, మరియు పునరుత్థానుడైన ప్రభువైన యేసుయొక్క అనగా…వాక్యముయొక్క ఆనందముతో నిండినట్టి, ఒక సంతోషకరమైన క్రిస్మస్ ను కలిగియుండాలని మీకు మరియు మీ కుటుంబమునకు శుభాకాంక్షలు తెలియజేయగోరుచున్నాను.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక,
సహోదరుడు జోసఫ్
24-1215 స్పష్టముకాని ధ్వని
వర్తమానము: 60-1218 స్పష్టముకాని ధ్వని
ప్రియమైన గృహ సంఘపు వధువా,
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహన్నం 12:00 గంటల సమయమప్పుడు, మనమందరమూ కూడి వచ్చి మరియు 60-1218 స్పష్టముకాని ధ్వని అనే వర్తమానమును విందాము.
సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్
24-1208 లవొదికయ సంఘకాలము
వర్తమానము: 60-1211E లవొదికయ సంఘకాలము