https://branham.org/en/articles/20140127_TestingTime
మనమందరం ఒకరినొకరు విశ్వాసం కలిగి ఉండమని ప్రోత్సహిస్తాము కానీ ఒక సంక్షోభం మనకు వచ్చినప్పుడు, విషయాలు కొద్దిగా భిన్నంగా కనిపిస్తాయి. సహోదరుడు మోషే ఈ వెబ్‌సైట్‌లోని సాక్ష్యాలను చదవడానికి ఇష్టపడతారు మరియు అతని పరీక్ష సమయం వచ్చినప్పుడు అది గుర్తుకు వచ్చింది.
నేను ఎల్లప్పుడూ ఈ వెబ్‌సైట్‌లోని సాక్ష్యాలను చదవటానికి ఇష్టపడుతాను మరియు ప్రభువైన యేసు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన పిల్లల కోసం ఏమి చేస్తున్నాడో తెలుసుకొని ఆనందిస్తాను, కాని అది నాకు ఎప్పటికీ జరగదని అనుకొని నేను వాటిని కొంచెం దూరంపెట్టి చదువుతాను.
నేను పనికి వెళ్తున్నప్పుడు గత ఆదివారం నాడు విన్న వర్తమానమును ఆలోచిస్తూనే ఉన్నాను: మూడు రకముల విశ్వాసులు, మరియు సునాదము ద్వారా ప్రభువు మన జీవితాలను ఎలా మారుస్తున్నాడు, అనుదానిపై. నేను చేరుకున్న తర్వాత, పార్కింగ్ నుండి ఆకులు తీయమని మా యజమాని నన్ను అడిగాడు. నా బట్టలు మార్చుకోకుండా, నేను ఒక గోనెసంచి మరియు దంతెన తీసుకొని, ఊడ్చుకుంటూ వచ్చాను.నేను నా పనిని పూర్తి చేయబోవు సమయానికి నా పెళ్లి ఉంగరం పోగొట్టుకున్నట్లు గమనించాను.
ఆ క్షణంలో, ఒక సోదరి పోగొట్టుకున్న పెళ్లి ఉంగరం గురించిన సాక్ష్యం నాకు వెంటనే గుర్తుకు వచ్చింది. నమ్ముట గురించి ఈ వర్తమానము మనతో ఎలా మాట్లాడుతోందని నేను ఆలోచించాను. అయితే , నాకు నేను ఇలా చెప్పుకున్నాను : “నీకు నమ్మకం ఉండాలి, నీవు దానిని కనుగొంటావు.” నేను ఒక చిన్న ప్రార్థన చేసాను మరియు నేలపై వెతికి ఆకులను జల్లెడ పట్టాను. నేను దానిని కనుగొనలేకపోయాను.
నేను నిండు సంచిలోంచి ఆకులను జాగ్రత్తగా ఖాళీ అయ్యేదాకా చూసాను. కానీ నేను నా పనిచేయు స్థలానికి తిరిగి రావాలనే తొందరలో ఉన్నాను, కాబట్టి నేను తర్వాత వెతకాలని అనుకున్నాను. అక్కడికి చేరుకున్నాక, నా యజమాని నన్ను దొరికిందా అని అడిగాడు. నేను, “లేదు, నా పని పూర్తయిన తర్వాత ప్రశాంతంగా వెతుకుతాను.” అని చెప్పాను. నేను అక్కడ కూర్చున్నాను కాని నేను నా ఉంగరం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను మరియు అది ఎలా పోయింది అని నేను ఆశ్చర్యపోతున్నాను మరియు నేను ముఖ్యంగా విశ్వాసంతో నమ్మడం గురించి ఆలోచిస్తున్నాను.
మేము కాఫీ తీసుకునే విరామ సమయంలో, మా యజమాని నా దగ్గరకు వచ్చి, “రాత్రి వరకు వేచి ఉండకండి. వెలుతురు ఉన్నప్పుడు వెతకండి” అని చెప్పారు. నాకు ఏదో తట్టింది, వెంటనే. నేను బయటకు వెళ్లి, గోనె సంచిని తీసుకొని వెతికాను. నేను వాస్తవికతను ముఖాముఖిగా ఎదుర్కొన్నందున నేను సిగ్గుపడ్డాను. నేను తరచుగా విశ్వాసం కలిగి ఉండమని చెబుతున్నాను, కానీ విశ్వాసం కలిగి ఉండవలసినప్పుడు, నేను వెనుకడుగు వేస్తున్నాను. నేను వెతికాను కానీ దానిని కనుగొనలేకపోయాను, మొదటి చిన్న ఆకుల కుప్పలో త్వరగా కనబడాలని కోరుకున్నటున్నాను బహుశా. కాబట్టి ఆందోళన వచ్చింది. “ఇప్పుడు నేను ఉంగరం లేకుండా తిరిగి వెల్లితే, నేను ఏమి చెప్పగలను?” కాబట్టి, నేను ఆగిపోయాను, బైబిల్ గ్రంధములోని నాణెం పోగొట్టుకున్న ఆ స్త్రీ గురించి ఆలోచించాను మరియు ఆమె ఇంట్లో ఒక చిన్న మూల మాత్రమే కాకుండా తన ఇల్లు మొత్తం వెతికింది. ఆపై నేను ప్రవక్త చెప్పింది నాకు నేను పునరావృతం చేసుకున్నాను, “విశ్వాసం అనునది నిరీక్షించబడువాటి యొక్క నిజస్వరూపము మరియు అదృశ్యమైనవి యున్నవనుటకు సాదృశ్యము.” నేను వెతకడం పునఃప్రారంభించాను మరియు చివరకు నేను దానిని కనుగొన్నాను. ఉంగరం అక్కడ ఉంది; ఆకులలో యున్న దానిని వెలుగు ప్రకాశింపచేస్తుంది! మన జీవితాలను ప్రకాశింపచేసే ఈ అద్భుతమైన వర్తమానమును ఇచ్చినందుకు నేను ప్రభువుకు చాలా కృతజ్ఞుడను.
దేవుడు మిమ్మును దీవించును గాక,
బ్రో.మోషే, ఇటలీ.