విలియం బ్రాన్‌హామ్

https://branham.org/en/williambranham నుండి అనువదించబడింది.

విలియం బ్రెన్హామ్ (మేము ఆయనను బ్రదర్ బ్రెన్హామ్ అని పిలుస్తాము) 1909 వసంతఋతువులో తన జీవితాన్ని ప్రారంభించాడు. అతను దక్షిణ కెంటుకీ కొండలలోని అత్యంత పేద కుటుంబములో జన్మించాడు. అతను ఒక చిన్న గదిలో జన్మించిన నిమిషాల వ్యవధిలో, ఒక వింతైన వెలుగు గదిలోకి ప్రవేశించి, అతను పడుకున్న మంచం మీద కదిలింది. ఇది ఆధునిక క్రైస్తవ ప్రపంచం యొక్క ముఖాన్ని మార్చే అతీతమైన జీవితానికి నాంది.

మద్యానికి బానిసైన తండ్రి మరియు ఇంట్లో మత సంబంధమైనది తక్కువగా ఉండటంతో అతనికి పెద్దగా అవకాశాలు లేవు. ప్రతికూల పరిస్థితులు ఉన్నపటికి, సహోదరుడు బ్రెన్హామ్ దేవుని యొక్క బలాడ్యుడుగా ఎదిగాడు. దాదాపు 38 సంవత్సరాల వయస్సులో, అతను ఇండియానాలోని జెఫెర్సన్‌విల్లో తన ఇంటికి ఉత్తరాన ఉన్న ఒక చిన్న స్థలంలో(జంతువులను వేటాడే స్థలంలో) ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు, అర్థరాత్రి వేళ, ప్రభువు దూత అతనిని దర్శించి, రోగుల కోసం ప్రార్థించమని అతనికి ఆజ్ఞాపించాడు.

ఇతర విషయాలతోపాటు, దూత అతనితో ఇలా చెప్పాడు:

“ప్రజలు నిన్ను నమ్మునట్లుగా నీవు చేసుకొనునట్లైతే, నీవు  ప్రార్ధించేటప్పుడు నమ్మకముగానున్నట్లైతే, నీ ప్రార్థన ఎదుట చిట్టచివరగా క్యాన్సర్తో సహా నిలువనేరదు.

సందేహాలన్నీ తీరిపోయాయి. సహోదరుడు బ్రెన్హామ్ ఇప్పుడు తన ఆజ్ఞను పొందాడు మరియు ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఒక ప్రపంచవ్యాప్త స్వస్థత ఉజ్జీవము ప్రారంభమైంది.

పెంతెకొస్తు రోజు నుండి అత్యంత గొప్పగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం సహోదరుడు బ్రెన్హామ్ పరిచర్యలో చూస్తాము. బ్రెన్హామ్ కూడికలకు వందల వేల మంది హాజరయ్యారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేలాదిమంది స్వస్థత పొందారు. ఓరల్ రాబర్ట్స్,T.L. ఒస్బోర్న్, మరియు A.A. అలెన్ వంటి ఇతర సువార్తికులు, వెంటనే బ్రదర్ బ్రెన్హామ్ ను అనుసరించారు మరియు వారి స్వంత స్వస్థత ఉజ్జీవములు ప్రారంభించారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రభువు తన ఆశీర్వాదాలను కురిపించాడు. యేసుక్రీస్తు స్వస్థత హస్తం మరోసారి ఆయన ప్రజలను తాకింది.

సహోదరుడు బ్రెన్హామ్ పరిచర్యకు సమానమైనది లేదు. యేసుక్రీస్తు గలిలయ తీరంలో నడిచినప్పుడు ఎంత సజీవంగా ఉన్నాడో ఈరోజు కూడా అలాగే ఉన్నాడని నిరూపించాడు. అపొస్తలుడైన పౌలు వలె, సహోదరుడు బ్రెన్హామ్ సువార్త కేవలం మాటతో మాత్రమే కాకుండ, శక్తితో కూడా ఉందని చూపించాడు! దాచబడిన మర్మముల ప్రత్యక్షత మరియు దేవుని యొక్క వ్యక్తీకరించబడిన శక్తి కలిసుకున్నాయి, చాలా ప్రత్యేకమైన పరిచర్య. ప్రసిద్ధముగా, శాస్త్రులు బైబిల్ ప్రవక్తల వాక్యాలను  రికార్డ్ చేసినందున, అతని వర్తమానములను మాగ్నెటిక్ టేప్‌లో రికార్డ్ చేయబడ్డాయి. ఈ రోజు, మనము ఆ రికార్డింగ్‌లను ప్రేమతో పట్టుకున్నాము.

డిసెంబరు, 1965లో ఒక విషాదకరమైన కారు ప్రమాదం కారణంగా సహోదరుడు బ్రెన్హామ్ మరణించాడు. దేవుడు తన సేవకునిని ఇంటికి తీసుకువెళ్లాడు, కానీ మన హృదయాలకు ఎంతో ఇష్టమైన ఆ విలువైన రికార్డింగ్‌లను ఆయన మనకు విడిచిపెట్టాడు.

An Independent Church of the WORD,