లైఫ్‌లైన్

https://branham.org/en/articles/20121228_OnceWasBlind నుండి అనువదించబడింది.

లైఫ్‌లైన్ VGR ద్వారా నెలవారీ ప్రచురణ. కిందిది జూలై, 1996లో ప్రచురించబడింది.

ఒక్కప్పుడు గ్రుడ్డివాడను

జూలై 1996

యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు యుగయుగములు ఒకటేరీతిగా ఉన్నాడు.

హెబ్రీయులు 13:8

ఈ రోజు ప్రపంచంలో వర్తమానము ఎలా వ్యాప్తి చెందుతోంది అనేదానిపై దృష్టి పెట్టే బదులు, ఈ నెలలో నేను మిమ్మల్ని దాదాపు 50 సంవత్సరాల వెనకటి కాలానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను మరియు నాకు ఆశీర్వాదంగా ఉన్న ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క శక్తిని వాస్తవికతలో మరియు శక్తిలో వారి కళ్ల ముందు ప్రత్యక్షంగా చూసినప్పుడు, ఇతరులు కూడా యేసు ప్రభువుపై విశ్వాసం కలిగి ఉంటారని వారు సాక్ష్యమివ్వడానికి మరియు  పంచుకోవడానికి ఇష్టపడతారు.

బ్రదర్ బ్రన్హామ్ ఇలా అన్నారు,

“సువార్త గురించి ఏదో ఉంది, మనం మంచి వార్త విన్నప్పుడు, మనం ఇతరులకు చెప్పడానికి ఇష్టపడతాము, కాదా. రక్షించబడిన ప్రతి ఒక్కరూ అందరికీ చెప్పాలనుకుంటారు. స్వస్థపరచబడిన ప్రతి ఒక్కరూ మరొకరికి చెప్పాలనుకుంటారు.

50-0716 నీవు దీనిని నమ్ముచున్నవా?

ఆ విధంగా ఆగస్ట్, 1947లో ఆ రోజు, ఒక యువకుడు ప్రభువైన యేసుక్రీస్తుపై తన వ్యక్తిగత విశ్వాసాన్ని మరియు స్వస్థపరచగల ఆయన శక్తిని తన ప్రాంతంలో తనకు తెలిసిన ప్రజలతో పంచుకోవడానికి బయలుదేరాడు.

కొన్ని రోజుల క్రితం సహోదరుడు బ్రాన్‌హామ్ యొక్క మరొక కూడికలో చాలా అద్భుతాలు జరగడం చూసిన అతను, సహోదరుడు బ్రాన్‌హామ్ తన స్వస్థలమైన కాల్గరీ, ఆల్బెర్టాలో జరగబోయే కూడికలకు హాజరుకావాలని ప్రజలను ఆహ్వానించడం ప్రారంభించాడు.

అతను క్రైస్తవుడు కాదని తనకు తెలిసిన ఒక ఫ్రెంచ్ కెనడియన్ ఇంటికి వెళ్ళాడు. అతను డోర్ బెల్ మోగించాడు మరియు యజమాని వచ్చినప్పుడు, కాల్గరీలో జరగబోయే కూడికలకు అతన్ని ఆహ్వానించాడు.

“నేను మీ దేవుడిని నమ్మను!” అని చేదుగా, గట్టిగా అరిచాడు.

ఈ ఆకస్మిక సమాధానానికి ఆశ్చర్యపోయిన ఆ క్రైస్తవుడు అలాగా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందని అతనిని అడిగాడు.

“లోపలికి వచ్చి కూర్చో. నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను, ”అని ఫ్రెంచ్ కెనడియన్ అన్నాడు, యువకుడిని తన గదిలోకి నడిపించాడు. అతను తనను తాను సమధానపరుచుకొని, కొన్ని క్షణాల తర్వాత ఒక చిన్న అమ్మాయిని గదిలోకి నడిపించాడు.

“అందుకే నేను మీ దేవుడిని నమ్మను!” అని బాలిక తండ్రి అరిచాడు.

క్రైస్తవ యువకుడు చిన్న అమ్మాయి వైపు తిరిగాడు. ఆమె నల్లని జుట్టు మృదువైన లక్షణాలతో సున్నితమైన ముఖము సిగ్గుతో కూడిన చిరునవ్వు ఏ తండ్రి హృదయంలోకైనా చొచ్చుకుపోతుంది. కానీ ఆమె కళ్ళు ఉండాల్సిన చోట, చర్మంలో ఖాళీ లోతులు మాత్రమే ఉన్నాయి. పాప కళ్ళు లేకుండా పుట్టింది!

“ఇదిగో, ఆమె ముఖమును చూడండి!” తండ్రి అన్నాడు. తన కళ్ళను నమ్మలేక, ఆ యువకుడు ఆమె ముదురు కనుబొమ్మల క్రింద పుటాకార, మృదువైన చర్మాన్ని మెల్లగా తాకాడు. ఖాళీ లోతులు గట్టిగా ఉన్నాయి, దాని వెనుక ఎముకతో చర్మమే ఉంది. “మీ పెద్ద దేవుడి గురించి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు?” వ్యంగ్యంగా అడిగాడు ఆమె తండ్రి.

దిగ్భ్రాంతికి లోనైనప్పటికీ, ఆ యువకుడి విశ్వాసం వమ్ము కాలేదు. కొన్ని రోజుల క్రితం సహోదరుడు బ్రాన్‌హామ్‌ కూడికలలో అతను చూసిన అద్భుతాలు మరియు ఆశ్చర్యకరమైనవి అతని మనస్సులో తాజాగా ఉన్నాయి.

“ఒక దేవుని మనిషి ఎడ్మంటన్‌కు వస్తున్నాడు,” యువకుడు ఉత్సాహంగా చెప్పాడు.

 “ ఆమె కొరకు ప్రార్థించడానికి కూడికలకు తీసుకెళ్లనివ్వండి. దేవుడు ఆమెకు కళ్ళు ఇవ్వగలడని నేను నిజంగా నమ్ముతున్నాను.

అది ధైర్యంగా చేసిన ప్రకటన, మరియు కోపంగా ఉన్న తండ్రి అంగీకరించడం కూడా కష్టం. అతను సంకోచించాడు, కానీ “సరే, ఆమెకు కళ్ళు వస్తే, మేము మీ దేవుడిని నమ్ముతాము.”

ఎడ్మాంటన్‌లో సాయంత్రం కూడికలు మైదానంలో నిర్వహించబడ్డాయి మరియు సహోదరుడు బ్రాన్‌హామ్ పరిచర్య ప్రారంభమైన ఆ తొలిరోజుల్లో, సేవ ప్రారంభమవడానికి చాలా సమయము ముందే భవనం నిండిపోయేది. ప్రార్థన పంక్తి ప్రారంభమైనప్పుడు, చిన్న అమ్మాయి మైదానం లోపలి భాగంలో ఉన్న పొడవైన వరుసలో తన స్థానములో నిలబడింది.

ప్రతి వ్యక్తి దేవుని ప్రవక్త ముందు నడిచినప్పుడు, ఆమె చిన్న మనస్సులో లేదా ఆమె తల్లిదండ్రుల ఆలోచనలు ఏమిటో మనం ఊహించగలము. ఒక తల్లి లేదా తండ్రి నిస్సందేహంగా వారికి అందించబడే ఏదైనా ఆశను పట్టుకొనియుంటారు. ఈ మనిషి మాట్లాడిన యేసుక్రీస్తు నిజంగా ప్రపంచానికి సృష్టికర్తా? ఆ దేవుడు ఈ ఖాళీ లోతులలో కొత్త కళ్లను సృష్టిస్తాడా? ఈ విధేయుడైన వ్యక్తి యొక్క ప్రార్థనలు నిజంగా అలాంటి అద్భుతాన్ని తీసుకురాగలవా?

చివరకు ఆమె వంతు వచ్చింది.క్రైస్తవుడు వేదికపైన కొంత దూరంలోనే ఉన్నందున, ఆమె సన్న నల్లటి జుట్టు మరియు దయగల కళ్ళతో ఒకరి ఆత్మలోకి చూడగలిగేలా కనిపించే చిన్న వ్యక్తి ముందుకు తీసుకురాబడింది. కానీ ఆమె అతన్ని చూడలేదు, ఎందుకంటే అతని రూపాన్ని గ్రహించడానికి ఆమెకు కళ్ళు లేవు. అయితే, అతను ఆమెతో మాట్లాడిన క్షణంలో, ఆమె తన ప్రియమైన తల్లి కంటే కూడా స్వచ్ఛమైన మరియు బలమైన ప్రేమ సమక్షంలో ఆమెలో ఉన్న భయం మాయమై ఉండాలి.

సోదరుడు బ్రాన్‌హామ్ ఆమె కోసం ప్రార్థించాడు, కానీ ఏమీ జరగలేదు. అతను ఆమె కోసం రెండవసారి ప్రార్థించాడు. మళ్ళీ, ఆమె రూపములో ఏమీ మారలేదు. అయితే, మూడవసారి, దేవుని ప్రవక్త ఆమె ముఖం మీద తన చేతులు ఉంచి, ఖాళీ లోతులను కప్పాడు. అతని ప్రార్థన చాలా సామాన్యమైనది, “ప్రభువైన యేసు, కేవలము ఆమెలో నీ కన్నులను ఉంచండి.” అతను తన చేతులను కొన్ని క్షణాలు మాత్రమే ఉంచాడు, బహుశా ఒక నిమిషం ఆమె కళ్ళపై ఉంచి, “అదిగో, ప్రియమైన పాప!” అని చెప్పాడు.

అతను ఆమె ముఖం మీద నుండి తన చేతులు తీసివేసినప్పుడు, అక్కడ ఖాళీగా ఉన్న లోతులలో కళ్ళు ఉన్నాయి!

అతను క్రైస్తవ యువకుడిని పేరు పెట్టి పిలిచి, “నువ్వు ఇక్కడికి వస్తావా ఆమె కళ్ళపై వేళ్లు పెట్టు” అన్నాడు.

ఆ యువకుడు విధేయతతో పైకి లేచి, చాలా ముదురు గోధుమరంగు, పొడవాటి కనురెప్పలతో ఉన్న పాప కళ్ళను చాలా చాలా సున్నితంగా తాకాడు, క్షణాల ముందే, అతనికి కొన్ని అడుగుల దూరంలో ఖాళీ లోతులతో నిలబడి ఉంది! “ఆ లోతులలో కళ్ళు ఉండటమే కాదు, అవి ఫ్రెంచ్ కళ్ళు!”

ఈ అద్భుతం ఫలితంగా, ఆమె తల్లి మరియు తండ్రి ఇద్దరూ తమ పాపాలకు పశ్చాత్తాపపడ్డారు మరియు ప్రభువైన యేసును తమ వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించారు!

మన క్రైస్తవ యౌవన సహోదరుడు ఇప్పుడు వృద్ధుడు. ఆ రోజు నుండి వారి కుటుంబం యొక్క పేరు లేదా వారికి ఏమి జరిగిందో అతనికి గుర్తు లేదు, వారు ప్రభువును సేవిస్తున్నారు అని తప్ప.

కెనడాలో ఎక్కడో అందమైన ముదురు గోధుమ రంగు కళ్ళతో మధ్య వయస్కురాలైన మహిళ ఉండవచ్చు. దాదాపు అర్ధ శతాబ్దం క్రితం ఆగస్ట్ రాత్రి గురించి ఆమెకు పెద్దగా గుర్తులేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆమె యోహాను 9వ అధ్యాయంలోని వ్యక్తిలా చెప్పగలదు, “ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనైయుండి, ఇప్పుడు చూచుచున్నాననెను”

మరియు ఆయన కనుగుడ్లు కూడా లేని ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. మరియు అతను కొంచెం బురదచేసి వాని కళ్ళకు పూసాడు, “నీవు సిలోయము కొనేటికి వెళ్లి అందులో కడుక్కోమని చెప్పాడు”. వాడు వెళ్లి కడుగుకొని చూపుగాలవాడై వచ్చెను.

60-0626 సజీవ దేవుని యొక్క విఫలమ్మవని వాస్తవాలు.

ప్రియమైన క్రైస్తవ మిత్రుడా:

ఏమైనా అయితే….

ఇది జరగకపోయివుంటే ఏమి జరిగేదో లేదా అది ఎన్నడూ జరగకపోతే ఏమిటని మనం తరచుగా ఆలోచిస్తాము. ఈ నెల లైఫ్‌లైన్‌లోని సాక్ష్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, “ఈ క్రైస్తవ యువకుడు ఈ కుటుంబానికి సాక్ష్యమివ్వడానికి ఇష్టపడకపోతే ఎలా?” అని మనం ఆలోచించకుండా ఉండలేము. అలా జరిగి ఉంటే, మీరు ఈ రోజు ఈ సాక్ష్యాన్ని చదివేవారు కాదు, చిన్న అమ్మాయికి కొత్త కళ్ళు వచ్చేవి కావు, మరియు ఆమె తల్లిదండ్రులు ప్రభువును ఎన్నడూ స్వీకరించివుండేవారుకాదు.

క్రైస్తవులుగా, మనం చూసినవాటిని మరియు విన్నవాటిని ఇతరులకు చెప్పవలసిన బాధ్యత మనపై ఉంది. బ్రదర్ బ్రన్హామ్ ఇలా అన్నాడు, “బహుశా మీరు సముద్రాన్ని దాటలేక పోవచ్చు, కానీ మీరు వీధిని దాటగలరు. ఏదో ఒకటి చేద్దాం. దేవుని మహిమ కోసం ఏదైనా చేద్దాం. ”

వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ కు మీరు అందిస్తున్న సహకారానికి చాలా ధన్యవాదాలు. ఈ వర్తమానమును ప్రింట్ మరియు ఆడియో రికార్డింగ్‌లలో రెండు డజనుకు పైగా భాషల్లో పంపిణీ కొనసాగుతుంది, దేవుని ప్రజల సహాయం లేకుండా ఇది సాధ్యం కాదు.

బ్రదర్ జోసెఫ్ ఎం. బ్రాన్‌హామ్

మరియు నేను–నేను–నేను క్రైస్తవునిగా నా బాధ్యతను నిర్వహిస్తాను; నేను సాక్ష్యమిస్తాను.

61-0516A యేసుక్రీస్తు నిన్న,నేడు మరియు యుగయుగములు ఒకటేరీతేగా ఉన్నాడు.

An Independent Church of the WORD,