ఆ స్వరము

branham.org/en/articles/412020_ThatVoice నుండి అనువదించబడింది

ఫిబ్రవరి 25, 2020న “కేవలము నమ్మిక మాత్రము ఉంచుము” అనే శీర్షికతో పోస్ట్ చేసిన కథనం నుండి ఫీడ్‌బ్యాక్‌గా జెఫెర్సన్‌విల్లోని విశ్వాసి నుండి మేము ఈ సాక్ష్యాన్ని అందుకున్నాము.

మా హోమ్ టేప్ సేవలు మరింత మెరుగవుతున్నాయి! ఇది ఎంతటి దీవెన! ఈ గత ఆదివారం, మార్చి 1, 2020, మా చిన్న కుటుంబం అంతా  గదిలో కూర్చొని “భేదార్థమైన విత్తనము” అను వర్తమానమును వింటున్నాము. టేప్ చివరలో సహోదరుడు బ్రాన్‌హామ్ జబ్బుపడిన వారి కోసం ప్రార్థిస్తున్నారు, మేమంతా ఒకరిపై ఒకరు చేతులుంచాము. సోదరుడు బ్రాన్‌హామ్ ఒక చిన్న పిల్లవాడి కోసం, అతని మోకాళ్లు బాగుపడాలని ప్రార్థిస్తున్నారు.

మూడు సంవత్సరాల వయస్సు ఉన్న మా చిన్న పిల్లవాడికి కొన్ని నెలలుగా ప్రతి రాత్రి మోకాళ్ల చుట్టూ నొప్పులు పెరుగుతున్నాయి. అతను స్థిరపడి నిద్రపోతున్న సమయంలో అవి మరింత బలపడుతున్నవి మరియు తరచుగా కనిపిస్తున్నాయి. అతను మేల్కొని మరియు నొప్పి నుండి చాలా తీవ్రంగా ఏడుస్తాడు. కండరాల నొప్పికి ఔషధం లేదా టైలెనాల్ కూడా అతనికి పెద్దగా సహాయపడలేదు. మేము చేయగలిగేది అతనిపై ప్రార్థన వస్త్రాన్ని పిన్ చేసి, అతను ఏడుస్తూ నిద్రపోయే వరకు మేము అతని మోకాళ్లను రుద్దుతూ అతనితో ప్రార్థన చేయడం. కానీ అదంతా కూడా మారబోతున్నది! దేవునికి స్తుతులు!

వర్తమానము ముగిసే సమయానికి, బ్రదర్ బ్రన్హామ్ చెప్పారు.

160 దేవుడు నిన్ను స్వస్థత పరుస్తాడని నమ్ముతున్నావా? ఆ చిన్న బాలుడు అతని మోకాళ్ళ పైన చేతులు పెట్టాలని ఆశిస్తున్నావు. అతను కూడా స్వస్థత పొందుతాడు. నీవు నమ్ముతున్నవా? మీకు స్త్రీ సంబంధమైన జబ్బువుంది, ఇప్పుడు నీకు అది ఉండదు.నీ విశ్వాసం నిన్ను స్వస్థ పరిచి నిన్ను బాగుచేసింది.

161 యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు యుగయుగములు ఒకటే రీతీగా ఉన్నాడని నమ్ముతున్నవా? అలాగైనట్లైతే మనం ఒకరిపై ఒకరము చేతులు ఉంచుదాము, మనలలో ప్రతిఒక్కరు విశ్వాస ప్రార్థనను చేద్దాము, విశ్వాస ప్రార్థన చేయండి.

162 ప్రియమైన దేవా, నీ యొక్క దైవక సన్నిధానము చేత మేము ఎంతగానో కప్పబడి ఉండగనే, ప్రజల మధ్య నీవు సంచారము చేస్తూ ప్రతిచోటా రోగులను స్వస్థత పరుచుచుండగనే మేము చూస్తున్నాము.నీవు దేవడైయున్నావు. ఈ సభికులందరిని స్వస్థత పరచమని నిన్ను ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క ఊపిరి వారిపై నిర్మలమైనదిగా పడునుగాక , కాలము ఉరుకులు తీస్తుందని వారు ఎరుగుదురు గాక. ఇక్కడ ఎంత కాలమై యున్నను కొద్ది కాలమే ఉన్నవారము, ఆ తర్వాత మేము ఎవరిని ప్రేమిస్తున్నామో ఆయనతో సదాకాలము ఉంటాము  ఇప్పుడు ఆయన సన్నిధి ప్రతిఒక్కరిని  స్వస్థ పరుచును గాక.

163 మేము సాతానును గద్ధిస్తున్నాము, అతని కార్యాలన్నింటిని గద్ధిస్తున్నాము. యేసుక్రీస్తు నామమున, సాతానుడా, ప్రజలలో నుండి బయటకు రా.

164 ఇప్పుడు ఆయనను ఎవరైతే నమ్ముతున్నారో, మీ స్వస్థతను అంగీకరించి లేచి నిలబడండి, “ నా స్వస్థతను అంగీకరించి నిలబడియున్నాను అని చెప్పండి. నేను నమ్ముతాను అని చెప్పండి.” ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, మీరు నిజంగా నమ్మినట్లైతే  నిలబడండి. ఇప్పుడు మీ చేతులు పైకెత్తి, “ప్రభువైన యేసూ, నీ స్వస్థకై ధన్యవాదాలు” అని చెప్పండి. దేవుడు మీతో ఉండునుగాక. ఆమెన్.

     65-0118 – బేదార్థమైన విత్తనము

     రెవ. విలియం మారియన్ బ్రాన్హామ్

సహోదరుడు బ్రాన్‌హామ్ చిన్న పిల్లవాడి మోకాళ్ల కోసం ప్రార్థిస్తున్న సమయంలో, మా చిన్న పిల్లవాడు నిశ్శబ్దంగా తన కార్లతో ఆడుకుంటున్నాడు. సహోదరుడు బ్రాన్‌హామ్ తన ప్రార్థనను ముగించిన వెంటనే, మా చిన్న పిల్లవాడు మలాకీ, ఆనందంగా, ఎవరూ ఏమీ అనకముందే, “ఆయన నా మోకాళ్ల కోసం ప్రార్థించాడు! యేసు నా మోకాళ్లను మెరుగుపరిచాడు!” మేము అతనితో సంతోషిస్తున్నాము మరియు చిన్న వయస్సులోనే బ్రదర్ బ్రాన్‌హామ్ ప్రార్థిస్తున్న ఆ చిన్న పిల్లవాడితో పాటుగా తన పేరును అన్వయించుకోవడానికి మలాకీకి ఇచ్చిన ప్రత్యక్షత మరియు విశ్వాసాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

నిజంగా, మనకు కావలసింది ఆ టేపుల పై ఉంది! కేవలము ప్లే నొక్కండి! దాచియుంచిన ఆహారానికి ధన్యవాదాలు ప్రభూ! క్రీస్తులో మీ సోదరి,

రూతు.

An Independent Church of the WORD,