branham.org/en/articles/7212020_HealedOfScoliosis నుండి అనువదించబడింది
ప్రియమైన సోదర సోదరీమణులారా,
నమస్కారము, నాకు పన్నెండు సంవత్సరాలు మరియు ప్రభువు నన్ను ఎలా స్వస్థపరిచాడు అనే దాని గురించి నేను మీతో ఒక సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఏప్రిల్‌లో నా వెన్నులో ఏదో వింత గమనించాము. మా అమ్మ నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లింది, నాకు పార్శ్వగూని ఉన్నట్లు నిర్ధారణ అయింది.
నా ఎక్స్‌రేలు భయంకరంగా కనిపించాయి. నాకు రెండు వంపులు, పదిహేను డిగ్రీల వంపు మరియు పద్దెనిమిది డిగ్రీల వంపు ఉన్నాయి. నేను అంగీకరించాలి, నా ఎక్స్-రే లను చూసినప్పుడు, నేను నిజంగా భయపడ్డాను. డాక్టర్ నేను 24 గంటలూ బ్యాక్ బ్రేస్ (వెనుక కట్టు) వేసుకోవాల్సి ఉంటుందని, సర్జరీని నివారించడమే మా లక్ష్యం అని చెప్పారు. నేను జూలై చివరిలో నా బ్యాక్ బ్రేస్‌ను పొందాను, ఆపై ఒక వారం తర్వాత, నేను స్టిల్ వాటర్స్ క్యాంప్(Still Waters Camp) 4 కి వెళ్లాను. నేను క్యాంప్‌కి వెళ్లే ముందు మా సోదరి సోదరుడు జోసెఫ్ నా బ్యాక్ బ్రేస్‌పై సంతకం చేయాలనే ఆలోచనతో వచ్చింది. ఇది చాలా గొప్ప ఆలోచన అని నేను భావించాను, కాబట్టి నేను శుక్రవారం క్యాంప్‌కి వెళ్ళినప్పుడు బ్రదర్ జోసెఫ్ దానిపై సంతకం చేసే అవకాశం కోసం వెతుకుతున్నాను. శుక్రవారం నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు, కానీ శనివారం నేను మరియు నా స్నేహితురాలు జెట్ స్కిస్ (jet skis) కోసం లైన్‌లో ఉన్నాము, భోజన సమయానికి ముందే నడపాలని ఆశతో ఉన్నాము.
మేము ఎదురు చూస్తున్నప్పుడు, సహోదరుడు జోసెఫ్ కొన్ని అడుగుల దూరంలో నిలబడి, జెట్ స్కిస్‌పై చిన్నపిల్లలమైన మమ్మల్ని చూస్తున్నట్లు నేను గమనించాను. ఇది మంచి అవకాశం! నేను ఆయన దగ్గరకు వెళ్ళాను, ఆయన నన్ను చూసి హలో అన్నారు. నేను, “హాయ్ బ్రదర్ జోసెఫ్, మీరు నా కోసం ఏదైనా సంతకం చేయగలరా.” నేను దానిని తీసుకోని వచ్చే అంతవరకు వేచి ఉంటారా అని అడిగాను.ఆయన ఉంటానని చెప్పినప్పుడు మరియు నేను నా బ్యాక్ బ్రేస్ తెచ్చుకోవడానికి బంక్‌హౌస్ కు చిరునవ్వుతో పరిగెత్తాను.
నేను సహోదరుడు జోసెఫ్ వద్దకు తిరిగి పరుగెత్తుకుంటూ, “ఇది నా బ్యాక్ బ్రేస్(వెనుక కట్టు), మరియు మీరు నా కోసం సంతకం చేయగలరా అని అడిగాను.” సహోదరుడు జోసెఫ్ నా బ్యాక్ బ్రేస్ ను తీసుకొని తన పేరు మరియు ఒక లేఖనంతో సంతకం చేశారు. నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పి, నా స్నేహితురాలి వద్దకు తిరిగి వెళ్ళాను. నా స్నేహితురాలు మరియు నేను జెట్ స్కిస్ కి వెల్లకముందే వారు మమ్మల్ని భోజనానికి పిలిచారు, కానీ నేను చాలా సంతోషముగా ఉన్నాను.
క్యాంప్ తర్వాత నేను మళ్లీ నా పార్శ్వగూని వైద్యుడి వద్దకు వెళ్లి మరిన్ని ఎక్స్-రేలు తీసుకున్నాను. నా రెండు వంపులు అప్పటికే పది డిగ్రీల వంపుగా మారాయి! నేను చాలా సంతోషంగా ఉన్నాను మరియు నా డాక్టర్ కూడా. సర్జరీకి దూరంగా ఉండేందుకు ఇదొక గొప్ప అవకాశం అని అన్నారు. ఆ తర్వాత నేను, నా కుటుంబం ఎల్లప్పుడూ నా కోసం ప్రార్థిస్తూ మరియు విశ్వాసం కలిగి ఉన్నాము , నేను నా బ్యాక్ బ్రేస్ అన్ని సమయాలలో ధరించాను. అక్టోబర్‌లో నాకు మరో అపాయింట్‌మెంట్ ఉంది. నేను, అమ్మ వెళ్ళాము మరిన్ని ఎక్స్-రేలు తీశారు. వైద్యులు తమ కంప్యూటర్‌లో ఎక్స్‌రేలను చూశారు. నా డాక్టర్ మరొక డాక్టర్ వైపు చూసి, “చూడండి, పార్శ్వగూని… పార్శ్వగూని పోయింది.” అతను నాకు మరియు మా అమ్మకి ఎక్స్-రే చూపించారు, నా వెనుకభాగం పూర్తిగా నిటారుగా ఉంది! నేను, మా అమ్మ చాలా సంతోషంగా, కృతజ్ఞతతో బయలుదేరాము. చాలా సంవత్సరాలుగా బ్యాక్ బ్రేస్ ధరించి, సర్జరీ చేయడం జరుగుతుంది కానీ నాకు బ్యాక్ బ్రేస్ ధరించడానికి కేవలం మూడు నెలలు మాత్రమే పట్టింది మరియు పార్శ్వగూని నుండి నన్ను స్వస్థపరిచిన ప్రభువుకు కృతజ్ఞతలు.
వెన్ను నిటారుగా రావడానికి ప్రార్థన, విశ్వాసం మరియు ప్రవక్త సంతకం చేసిన బ్యాక్ బ్రేస్ అని మా నాన్న చెప్పారు! నేను ఆయనతో ఏకీభవించాను. నన్ను స్వస్థత పరిచినందుకు నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాను. ఈ పెద్ద ప్రపంచంలో నేను చిన్న అమ్మాయిని, అయినా ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. (2019 ఎండా కాలము)
దేవుడు మిమ్మల్ని దీవించును గాక,
సోదరి ఎల్లా.