వాక్యము విషయమై సంతోషించడం 

https://branham.org/en/articles/4252018_HesOmnipresent

భూమిపై అత్యంత సంతోషకరమైన వ్యక్తులు ఎవరు? మనం చదివిన లేదా విన్న దాని గురించి ఎందుకు ఎప్పుడూ సాక్ష్యమిస్తున్నాము లేదా మాట్లాడుతున్నాము? మన ఉత్సాహానికి వేరే వివరణ లేదు: వధువు వాక్యాన్ని ప్రేమిస్తుంది! ఆమె దానిని ఎంతగానో ప్రేమిస్తుంది, ఎంతనగ ఆమె వాక్యం అయ్యెంతగ! సహోదరుడు బ్రెన్హామ్ సంఘకాలము పుస్తకంలో ఇలా అన్నాడు: మొదటి సంఘము పౌలు యొక్క మాటను వినినట్లుగానే వారు అతని మాటను విందురు “ఆమె వాక్య వధువుగా మారేంతవరుకు వాక్యములో పరిపక్వము చెందును. పవిత్ర వాక్యము మరియు విశ్వాసము యున్న చోట తప్పక కనబడునటువంటి బలమగు కార్యములు ఆమెలో కనిపించును . ” మొదటి సంఘము పౌలు యొక్క మాటను వినినట్లుగానే వారు అతని మాటను విందురు , ఆయన చెప్పినది గమనించండి “? దేవుని కృప ద్వారా, వధువు ప్రతిరోజూ వర్తమానికుడను వినగలదు మరియు ఆమె దానిపై ఆనందిస్తుంది! ఇప్పుడు, మేము ఎందుకు అంత సంతోషంగా ఉన్నామో మీరు చూడగలరా?

ఈ క్రింది సాక్ష్యం 50 సంవత్సరాల క్రితం మాట్లాడిన దేవుని వాక్యాన్ని తీసుకుంటున్న సోదరి నుండి, మరియు ఆమె దానిని తన జీవితానికి అన్వయించుకుంటుంది.

దేవుని వాక్యంతో నా హృదయం చాలా ఆనందంగా ఉంది!

కొన్ని రోజుల క్రితం, సంఘములోని కొంతమంది విశ్వాసులు వాట్సాప్ మీదగా సహవాసము చేస్తున్నారు, ఒక కోట్(Quote) తరువాత ఒకటి. ఈ చివరి కాలపు వర్తమానము గూర్చి మేము ఆశ్చర్యపోతున్నాము.

సోదరులలో ఒకరు చెప్పిన విషయం ఉంది, మరియు నా ఆలోచనలు నేరుగా ఈ కోట్‌కు వెళ్ళాయి:

నేను, మీ సంఘకాపరిగా, మీ సహోదరునిగా , నేను కలిగియున్న అదే విశ్వాసమును, మీలో స్థాపించవలిసిందిగా నేను దేవుడిని వేడుకున్నాను. నేను దేనిని అయితే అడిగానో దానిని పొందుకుంటానని నేను నమ్ముచున్నాను. నేను కలిగియున్నదియు మరియు ఈ ఘడియకు నేను మీకు ఇచ్చినదయునైన అదే విశ్వాసముతో మీరు ఇప్పుడు  నాతో పాటు దానిని నమ్మినట్లైతే చాలు. మరియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో, మీ  వ్యాధిని, మీ బాధను గద్దించి, దానితో ఇట్లు చెప్పండి, నీవు “వెల్లవలిసియున్నది” ఎందుకంటే మీరు యేసు క్రీస్తు శక్తితో పాటు మీ విశ్వాసమును  మరియు నా విశ్వాసమును కలిగియున్నారు, దానిని రుజువు చేయుటకు మరియు ఆయన ఇక్కడ ఉన్నాడని నిరూపించుటకు ఆయన సర్వవ్యాప్తి అయి ఇక్కడ ఉన్నాడు, ఆయనే ఈ సమయమున మిమ్మల్ని బాగుచేస్తాడు.  

63-1110E మీలో ఉన్నవాడు

మేము మా చిన్న పునరుజ్జీవనాన్ని కలిగి ఉన్నాము! నేను ఈ ఒక్క కోట్‌ను పట్టుకుని, ప్రతి యుద్ధంలో పోరాడి మరియు ప్రతిసారీ గెలవగలను!

ఈ వర్తమానము నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది! విశ్వాసులు ఈ కోట్ గుర్తుకు తెచ్చుకోవాలని మరియు ప్రోత్సహించబడాలని నేను కోరుకుంటున్నాను.

VGR  మీరు చేస్తున్న అన్నిటికీ చాలా ధన్యవాదాలు, మరియు అమూల్యమైన సోదరులు మరియు సోదరీమణులకు మీలో ప్రతి ఒక్కరికి నా వినయపూర్వకమైన కృతజ్ఞతలు!

దేవుని పేరట ప్రేమా మరియు ఆశీర్వదములు

-సోదరి ఫెలిషా

ఈ రోజు,  వాక్యమును ధ్యానించడానికి కొంత సమయం కేటాయించండి మరియు మీరు విన్నదాన్ని మీ స్వంత జీవితానికి వర్తింపజేయండి. మన ప్రభువైన యేసు ఇంకా సింహాసనంపై ఉన్నాడని, మరియు ఆయన తన వధువుతో నిరంతరం తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని  తెలుసుకోవడం మంచిగా అనిపించడంలేదా? అవును, ఇది మంచిది అనిపిస్తుంది.

An Independent Church of the WORD,