
విశ్వాసం
https://branham.org/en/articles/9272016_Faith
మనం మన లక్షణములను చూడకూడదు, అయితే దేవుని వాగ్దానాన్ని చూడాలి. అవును, అయ్యా. “నా నామమున తండ్రిని ఏమి అడిగినను , నేను చేతును .” అదే . మనం విశ్వసించి, ఒప్పుకున్న మన ఒప్పుకోలు విషయంలో విజ్ఞాపన చేయడానికి, ఆయన ఉన్నతమైన మహిమగల తన కుడిచేతి వైపున ఆసీనుడైన ప్రధాన యాజకుడు. మరియు ఆయన మన కొరకు చేసిన దేనినైనా, మనం దానిని ఒప్పుకొని, విశ్వసించ గలిగిన యెడల, దేవుని సన్నిధిలో దానిని నెరవేర్చుటకు ఆయన అక్కడ ఉన్నాడు. మనం ఏ లక్షణములను చూడకుండా ఎంతగానో సంతోషించే వారమై ఉండాలి.దేవుడు వాగ్దానం చేసిన దానిని చూడండి. అది ఒక వాగ్దానం.
62-0612 ఇదిగో సొలొమోను కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు
ఈ యువ సహోదరుని సాక్ష్యం ఈ రోజు మీ విశ్వాసాన్ని తప్పకుండా బలపరుస్తుంది. లక్షణాలు ఏవైనప్పటికీ, విజ్ఞానశాస్త్రం చెప్పగలిగే దేనికంటెను ఎక్కువగా అతను దేవుని వాగ్దానాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు అతను విజయం సాధించి, దేవుడు తన జీవితానికి ఉద్దేశించిన ఏ పిలుపుకైనా సిద్ధంగా ఉన్నాడు.
నేను మా అమ్మమ్మ గృహములో ఉన్నప్పుడు, మా అమ్మ పనిలో ఉండగా నాకు తీవ్రమైన ఆస్తమా వచ్చింది. మా అమ్మమ్మ నన్ను ఇంటికి తీసుకువెళ్ళింది, నేను మా సవతి తండ్రితో అక్కడే ఉన్నాను. నాకు శ్వాస తీసుకోవడం మరింత కష్టమవుతూ పోయింది. నాకు ఊపిరి ఆడటం లేదని నేను చాలా కంగారుపడ్డాను. అందుకే నన్ను తీసుకెళ్ళడానికి త్వరగా అంబులెన్స్ పంపమని ఆయన దేవుడిని ప్రార్థించారు. దేవుడు రంగం మీదకి వచ్చి , అంబులెన్స్ సమయానికి వచ్చేలా చేశాడు. నేను ఆసుపత్రికి చేరుకున్నప్పుడు సుమారు మూడు రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నాను, నన్ను తిరిగి బ్రతికించే ఆశ లేదని నా డాక్టర్ చెప్పారు.
నా కాలి బొటనవేలు కదలడం చూసిన తర్వాత వైద్యులు నన్ను మరో ఆసుపత్రికి పంపారు. అక్కడ, నాకు చివరికి స్పృహ వచ్చింది. అప్పుడు నా వయసు కేవలం తొమ్మిదేళ్లు, నేను కృత్రిమ శ్వాస మీద యున్నాను , అయినా దేవుడు నన్ను స్వస్థపరిచాడని నేను వైద్యులకు, నర్సులకు చెబుతున్నాను. నేను ఒక ప్రశ్నోత్తరాల ఆట ఆడుతున్నప్పుడు, అందులోని ఒక ప్రశ్న, “ఆస్తమాకు నివారణ ఉంది, నిజమా లేక అబద్ధమా?” అని వచ్చింది. నేను ‘నిజం’ అని పెట్టాను, కానీ ఆ ఆట అది అబద్ధమని చెప్పింది. ఆ ప్రశ్నకు సమాధానం అబద్ధమని నేను వైద్యులకు, నర్సులకు, మా అమ్మకు, ఇంకా అక్కడున్న ప్రతి ఒక్కరికీ చెప్పాను. అన్ని రోగాలకు నివారణ దేవుడేనని, ఆయన దేన్నైనా స్వస్థపరచగలడని నేను వారికి చెప్పాను. నా విశ్వాసం నన్ను ఆ ఆసుపత్రి నుండి బయటపడేలా చేసింది, ఇప్పుడు ఆ ఆస్తమా అనే దెయ్యం నన్ను విడిచిపెట్టింది.
నేను ఇప్పుడు శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా పరిగెత్తగలను. ఇప్పుడు నా వయసు 14, త్వరలో 15 ఏళ్ళు వస్తాయి. భూమిపై దేవుని పని కోసం నా అవసరం ఉంది కాబట్టే నేను ఇంకా ఇక్కడ ఉన్నానని నమ్ముతున్నాను.
సోదరుడు జాషువా స్టీఫెన్స్
USA