15-0316 మీరు క్యాన్సర్‌కు భయపడుతున్నారా?

https://branham.org/en/articles/3112015_DoYouFearCancer

మీరు క్యాన్సర్‌కు భయపడుతున్నారా? ఒక విశ్వాసి దేనికైనా భయపడతాడా? అస్సలు లేదు! శత్రువు చాలా బలంగా ఉన్నప్పుడు, యెహోషువ చెప్పినట్లుగా, “దాని జయించుటకు మన శక్తి చాలుననెను.!” అని నేటి విశ్వాసులమైన మనం చెప్పలేమా? క్యాన్సర్‌తో జరిగే ఈ పోరాటంలో వైద్యశాస్త్రం విఫలమవుతున్నప్పటికీ, దేవుడు తన పిల్లల కొరకు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తూనే ఉన్నాడు.

భారతదేశంలోని చెన్నైలో ఉన్న VGR కార్యాలయ నిర్వాహకుడైన సహోదరుడు జోయెల్ పరమానందం, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయాన్ని అన్వయించిన ఒక స్థానిక పాస్టర్ యొక్క ఈ సాక్ష్యాన్ని మాకు పంపారు, దాని ద్వారా శత్రువు మరొకసారి దేశం నుండి తరిమివేయబడ్డాడు.

సహోదరుడు జోయెల్, ప్రభువుకు స్తోత్రములు ! నేను సహోదరుడు కొల్లి బర్నబస్, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావారి జిల్లాలో పాస్టర్‌గా ఉన్నాను.

భాగ్యమ్మ అనే మహిళ ఒక సంవత్సరం నుండి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమె జుట్టు చాలా రాలిపోతోంది. ఆమె చాలా చిక్కిపోయింది. అప్పుడు మా సంఘంలోని ఒక సహోదరుడు ఆమెకు వర్తమానమును తెలియజేశాడు, ఆ తర్వాత నేను వెళ్లి ఆమెకు వర్తమానమును , మరియు ఈ రోజు దేవుడు ఏమి చేశాడో తెలియజేశాను. నేను ఆమెకు ఒక ప్రార్థన వస్త్రాన్ని ఇచ్చి ఆమె కోసం ప్రార్థించాను. అంతేకాదు, దేవుడు తన ప్రవక్తయైన సహోదరుడు బ్రాన్హామ్ ద్వారా చేసిన అద్భుతాల గురించి మేము మాట్లాడుకున్నాము. ఆమె వర్తమానమును విశ్వసించింది మరియు మేము కలిసి ప్రార్థన చేశాము.

అది ఒక సంవత్సరం క్రితం జరిగింది, మరియు ఇటీవల ఆమె హైదరాబాద్ లోని ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడి వైధ్యుడు ఆమెకు కీమోథెరపీ చికిత్స చేయబోతున్నారు, కానీ ఆ చికిత్సకు ముందు, ఆయన ఒక రోగ నిర్ధారణ పరీక్ష చేశారు. ఆ వైధ్యుడు , “మీకు క్యాన్సర్ లేదు, మరియు మీరు వెళ్ళవచ్చు” అని చెప్పారు. ప్రభువుకు స్తోత్రములు కలుగును గాక ! హల్లెలూయా, ఆమె స్వస్థత పొందినది !

ఆమె తన జీవితంలో దేవుని అద్భుతాన్ని చూసింది, మరియు మేమందరం కలిసి దేవుణ్ణి అత్యధికంగా స్తుతించాము! ఆ తర్వాత, ఆమె విశ్వాసంలో కొనసాగేలా ప్రోత్సహించడానికి మేము ఆమెతో మరియు ఆమె కుటుంబంతో కలిసి ప్రార్థన చేశాము. వారికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు.

నా పరిచర్య కొరకు మరియు నా కుటుంబం కొరకు ప్రార్థించండి. మేము VGR మరియు శరీరము లోని అవయములందరి కొరకు ప్రార్థిస్తున్నాము.

ప్రభువుకు స్తోత్రం సహోదరుడా . యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.

సహోదరుడు కె. బర్నబాస్

భారతదేశం

An Independent Church of the WORD,