
మరొక అవకాశం
https://branham.org/en/articles/5232019_AnotherChance
2 ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.
3 ఇదిగో శాస్త్రులలో కొందరుఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా
4 యేసు వారి తలంపులు గ్రహించిమీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?
5 నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా?
6 అయినను పాప ములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచ మెత్తికొని నీ
7 వాడు లేచి తన యింటికి వెళ్లెను.
8 జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
మత్తయి 9:2-8
గొప్ప అద్భుతం ఏది? అది అద్భుతమైన స్వస్థతా, లేక రక్షణా? పక్షవాత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి వలె, ఈ సహోదరుడు ఆ రెండింటినీ పొందుకున్నాడు . మరియు, అనేకుల వలె, ఆయన మనుష్యులకు అటువంటి శక్తిని అనుగ్రహించినందుకు మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నాము!
దేవుడు నిజంగా ఉన్నాడని మరియు ఆయన మీ జీవితానికి సహాయం చేయగలడని చూపించడానికి, దేవుడు నా జీవితంలో చేసిన దాని గురించిన ఒక సాక్ష్యాన్ని నేను మీకు చెబుతాను.
నా పేరు జోస్ డేనియల్ నూనెజ్ నార్వేజ్. గత శరదృతువులో, నా ముఖం మధ్యలో తీవ్రమైన నొప్పి మొదలైంది. నన్ను పరీక్ష కొరకు ఆసుపత్రికి తీసుకువెళ్లారు, కానీ వైద్యులు ఏమీ కనుగొనలేకపోయారు. నా కంటి చూపు మసకబారడం మొదలైంది, మరియు నా ముఖం వికృతంగా మారేలా సగం భాగం అద్భుతంగా పెరగడం ప్రారంభమైంది.
మా నాన్నగారు తీవ్ర నిరాశకు గురై, నా అనారోగ్యం కోసం ప్రార్థనలు చేయమని కొంతమంది కాపరులను పిలిచారు మరియు సహోదరులు నా కొరకు ప్రార్ధన చేస్తున్నారు. నా పని అయిపోయిందని నేను అనుకున్నాను. రోజులు గడిచాయి, నా ముఖం పెద్దదవుతూ వచ్చింది, కానీ వైద్యులు నా విషయంలో ఏమీ చేయలేకపోయారు. మరణం అంచున ఉన్న ఆ స్థితిలో నన్ను నేను చూసుకొని చాలా కుంగిపోయాను. కణితి అప్పటికే మెదడును తాకుతోందని, ఇక ఏమీ చేయలేమని వైద్యులు మాకు చెప్పారు. నాకు మరొకసారి జీవించే అవకాశం ఇవ్వమని నా దేవుడిని వేడుకున్నాను.
ఒక రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక తెల్లని పావురం కనిపించింది. ఒక గంభీరమైన స్వరం నాతో, “అబద్ధాన్ని విడిచిపెట్టు” అని చెప్పింది. ఆ కలకు నేను ఆశ్చర్యపోయి మా నాన్నగారికి చెప్పాను. మేము కాపరి గారిని పిలిచాము. అప్పుడు నేను, “ప్రభువైన యేసుక్రీస్తును నా హృదయంలో అంగీకరించాలనుకుంటున్నాను” అని చెప్పాను. కాపరి గారు నా కోసం ప్రార్థన చేశారు. నేను నా ప్రభువును అంగీకరించిన తర్వాత, నా జీవితం మరో మలుపు తిరగడం ప్రారంభించింది. నా జీవితంలో స్వస్థత మొదలైంది, మరియు ఆయన ప్రతిరోజూ నా జీవితంలో ఎలా పనిచేస్తున్నారో నేను చూడగలిగాను.
నా నోటిలోని కణితి తగ్గడం మొదలైంది, మరియు నెమ్మదిగా అంతా చక్కబడింది. నేను కోలుకోవడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు . దేవుడు నాకు మరొకసారి జీవించే అవకాశం ఇచ్చాడు, మరియు నేను ఈ సాక్ష్యాన్ని దేవుని గౌరవార్థం చెబుతున్నాను. మన దేవునికి స్తోత్రం; ఆయన ఇంకనూ గొప్ప స్వస్థపరచువాడైయున్నాడు.
జోస్ డేనియల్ నూనెజ్ నార్వాజ్
కొలంబియా