18-1119 విడుదల పొందెను

విడుదల పొందెను

https://branham.org/en/articles/10232018_SetFree

సాతానుడు ఒక శక్తివంతమైన విరోధి మరియు కుయుక్తిగల శత్రువు. వాడు ఎల్లప్పుడూ వరదలా రాడు, కానీ కొన్నిసార్లు కొద్దికొద్దిగా దొంగచాటుగా చొరబడతాడు, మనం తెలుసుకునేలోపే వాడు మన జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు , దాని నుండి విడిపించుకోవడం చాలా కష్టమవుతుంది. మనలో ప్రతి ఒక్కరికీ మనం విడిచిపెట్టవలసిన అలవాట్లు ఉంటాయి. అవి ఎక్కువగా తినడం లేదా సమయం వృధా ఎక్కువగా చేయడం వంటి సామాన్య విషయాలు కావచ్చు, లేదా అంతకంటే చాలా వినాశన కరమైన విషయాలైనా కావచ్చు.

ఘానాలోని ఈ సహోదరుడు, సమయం మించిపోకముందే సాతానుడి కపటాలను గుర్తించి, చర్య తీసుకున్నాడు. అతని క్రియలు ఫలితాలనిచ్చాయి మరియు మనమందరం పంచుకోవడానికి ఒక సాక్ష్యాన్ని అందించాయి.

దేవుని పరిశుద్ధులారా ,

ఈ రోజు ఉటంకము పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడినదని నేను కూడా సాక్ష్యమిస్తున్నాను.

21 సంవత్సరాలుగా నాతో పాతుకుపోయిన ఒక చెడు అలవాటును వదిలించుకోవడానికి నేను 40 రోజుల ప్రార్థన మరియు ఉపవాస యాత్రను ప్రారంభించాను. నేను అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను. కానీ ఈసారి, ప్రతిరోజూ ఆ ఉటంకమును తీసుకున్న వర్తమానమును పూర్తిగా చదువుతూ, ఆ రోజు ఉటంకముతో నా ఉపవాసాన్ని ప్రారంభించమని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించింది.

కాబట్టి ఉపవాసంలో ఉన్న ప్రతి రోజు నా వర్తమానము కొరకు , నేను ఆ రోజు ఉటంకము వద్దకు వెళ్లి, దానిని చదివి, అది ఎక్కడనుండి తీయబడిందో ఆ పూర్తి వర్తమానమును చదువుతాను.

నేను విధేయుడనై , టేబుల్ యాప్ మరియు ఆడియో సహాయంతో పూర్తి వర్తమానమును చదవడానికి ప్రయత్నించినప్పుడు, ఏదో మార్పు జరిగిందని నాకు అనిపిస్తోంది.

ఎందుకు? నాకు పాపం చేయాలనే కోరిక నశించింది. గత 21 ఏళ్లలో మొదటిసారిగా, నేను ఈ అలవాటుకు లొంగకుండా రెండు వారాలు ఉండగలుగుతున్నాను, మరియు నేను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నానని నాకు తెలుసు.

దానియేలు 12:10 లో దేవుడు ఇలా చెప్పాడు, అంత్యదినములలో అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. మరియు నేను నా వాగ్దానాన్ని ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో పొందుతున్నాను.

నిశ్చయంగా ప్రభువు “నా ప్రాణ ఆహారాన్ని” మార్చి, శరీరమనే కుక్క ఆహారాన్ని తీసివేసి, ఆయన వాక్యమనే స్వచ్ఛమైన ఆహారాన్ని ఉంచాడని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం!

మీరు నెట్‌లో ‘ఈరోజు ఉటంకమును ‘ పెట్టడానికి పడే శ్రమ, పరలోకములో బంగారం మరియు ప్రశస్తమైన రత్నాలుగా ప్రతిఫలిస్తోంది.

కాబట్టి ఆపవద్దు. ఆమేన్.

ఐజాక్ ఎన్నిన్

ఘనా

An Independent Church of the WORD,