2/29/2020 ఘానా లో క్రియేషన్స్

https://branham.org/en/articles/262020_CreationsInGhana

ఘానాలోని ఒక సంఘము నుండి మేము ఈ క్రింది నివేదికను అందుకున్నాము, వారు జెఫెర్సన్ విల్ క్రియేషన్స్ బృందం నుండి చూస్తున్న వాటిని వారి యువత కోసం ఉపయోగిస్తున్నారు.

మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపగల నామములో వందనములు.

ఈ చివరి కాలములో ఆయన వధువులో భాగం కావడం ఎంత ఆశీర్వాదకరము. విశ్వాసుల మధ్య ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఏమి చేస్తున్నాడో మన కళ్ళతో సాక్ష్యమివ్వగలుగుతున్నాము, నిజంగా సత్యం ముందుకు సాగుతోంది. ప్రవక్త యొక్క ఈ శక్తివంతమైన మాటలను మనం ఎలా గుర్తుంచుకుంటామో కదా.

అయితే ఎత్తబడిన సంఘము తనకు తాను సిద్ధపడుటను కూడా చూడగలరు. అది గొప్ప రంగస్థలి . ఈ బైబిల్ గ్రంధములో ముందుగా  తెలియచేయబడిన  గంభీరమైన నాటకమును దేవుని సన్నిధి రుజువుచేయుచు దానికి అదే  తెరువబడేటట్టు చేయడాన్ని మీరు  చూడగలరు. మహా మహిమకర సమయములో మనము నివసించుట ఎంత ధన్యత!

63-1124 E”మూడు రకముల విశ్వాసులు”.

                  

దేవుని కృప వలన, మనము దర్శనమును పట్టుకున్నాము మరియు ఇటీవల “సంపూర్ణ మనుష్యుని యొక్క పరిపూర్ణ ఎదుగుదల” పై మా మొదటి క్రియేషన్స్ కార్యాచరణను అమలు చేయడంలో బిజీగా మరియు చాలా ఉత్సాహంగా ఉన్నాము.

ఈ కార్యకలాపం జనవరి 25న జరిగింది. మేము మధ్యానము 2:00 గంటలకు ప్రారంభించాము. ప్రారంభ ప్రార్థన తరువాత, సుమారు 25 మంది యువకులు పాటలు పాడారు. మేము కూడుకొనుట యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, ఒక విశ్వాసిని వాని సృష్టికర్త ముందు పరిపూర్ణంగా చేసే లక్షణాలను వారికి పరిచయం చేయడం. యోబు, యోసేపు వంటి బైబిల్ పాత్రలు వారికి పరిపూర్ణ పురుషులుగా చూపించబడ్డాయి మరియు యువ సైనికులు వారి వలె ఆకాంక్షించటానికి ప్రేరణ పొందారు. వారు ఒక విశ్వాసి పరిపూర్ణుడు కావడానికి కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలను ఉదహరించారు.

ఇంకా, ప్రవక్త బోధించిన సంపూర్ణ మనుష్యుని యొక్క పరిపూర్ణ ఎదుగుదల మీద వారికి  శిక్షణ ఇవ్వబడినది . విశ్వాసం నుండి ప్రారంభించి ప్రతి అడుగు నిజ జీవిత పరిస్థితులను మరియు బైబిల్ నుండి ఉదాహరణలను ఉపయోగించి వివరించబడింది.

మానసిక చిత్రాన్ని కలిగి ఉండటానికి, ప్రతి బిడ్డకు సామగ్రి (డ్రాయింగ్ బుక్, పెన్సిల్, రంగు, ఎరేజర్, రూలర్ మొదలైనవి) ఇవ్వబడింది. క్రియేషన్స్ పిడిఎఫ్ ” సంపూర్ణ మనుష్యుని యొక్క పరిపూర్ణ ఎదుగుదల ” ఆధారంగా వారి బోధకులు నిర్దేశించిన విధంగా పిరమిడ్ ను గీయడం మరియు రంగు వేయడమును వారికి చూపించారు.

యువత ఇప్పుడు కార్యకలాపం ముగిసే సమయానికి రేఖాచిత్రంలోని వివిధ దశలను ప్రస్తావించగలిగారు మరియు వివిధ స్థాయిలను వివరించగలిగారు. బైబిల్ గ్రంధములో జోసెఫ్ మాదిరిగా జీవిస్తామని వారు వాగ్దానం చేశారు. కొన్ని పాటలు  మరియు ముగింపు ప్రార్థనతో సాయంత్రం 4:00 గంటలకు పాఠం ముగిసింది.

Voice of god recordings ఉన్నందుకు మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు వారి యొక్క పని మరియు వారి వెబ్సైట్లు మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నవి. సోదరుడు జోసెఫ్ జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపునకు, ఆయన నాయకత్వం మరియు వధువు పట్ల ఆయనకున్న లోతైన శ్రద్ధకు మేము దేవుణ్ణి నిరంతరం స్తుతిస్తున్నాము.

మీ అద్భుతమైన సహకారానికి, మీరు మా కోసం చేసిన అన్నిటికీ, మీ విశ్వాసాన్ని మరియు మీరు చేసిన అన్నిటికీ మీలో ప్రతి ఒక్కరికి మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాము. మేము దానిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. దానిని  నిత్యజీవము మాత్రమే తెలియజేస్తుంది. .

54-0404E దేవునికి ఏర్పరచిన మార్గము ఉంది

దయచేసి పంపించిన కొన్ని చిత్రాలను చూడండి,

ఘానా నుండి క్రీస్తులో మీ సోదరులు.

An Independent Church of the WORD,