ఆనాటి జ్ఞాపకాలు: మీకు తెలుసా? (హతసాక్షులు)

branham.org/en/articles/12162019_FromTheArchivesDidYouKnowMartyrs నుండి అనువదించబడింది

నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.

II తిమోతి 4:6-8

ఇవి మన ప్రియమైన అపొస్తలుడైన పౌలు వ్రాసిన చివరి మాటలు. ఈ గొప్ప యుద్ధంలో మనకు మార్గం సుగమం చేయడానికి అతను మరియు చాలా మంది అంతిమ మూల్యం చెల్లించారు. విశ్వాసము యొక్క గొప్ప స్తంభములుగాయున్న వీరిగురుంచి మనం చదివినప్పుడు 2,000 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పరుగును పూర్తి చేయడానికి ఇది మనకు స్ఫూర్తినిస్తుంది. వారి అర్పణ సువార్త కోసం చనిపోవడం, మనది సువార్త కోసం జీవించడం.

ప్రారంభ సంఘములోని కొంతమంది పురుషుల జాబితా మరియు వారు తమ కిరీటాన్ని ఎలా పొందుకున్నారు అనునది ఇక్కడ ఉంది,. కిందిది ఫాక్స్ యొక్క మార్టిర్లు పుస్తకం (Foxe’s Book of Martyrs)నుండి తీసుకోబడింది.

I. స్తెఫెను

క్రీస్తు ద్రోహులకు మరియు హంతకులకు అతను సువార్తను బోధించే నమ్మకమైన పద్ధతి ద్వారా అతని మరణం సంభవించింది. ఎంతటి పిచ్చితో ప్రేరేపించబడ్డారో, వారు అతనిని నగరం నుండి వెళ్లగొట్టి, రాళ్లతో కొట్టి చంపారు. అతను బాధపడ్డ సమయం సాధారణంగా మన ప్రభువు శిలువ వేయబడిన పస్కాలో మరియు అతని ఆరోహణ కాలానికి తరువాతి వసంతములో జరిగినట్లు భావించబడుతుంది.

దీని తరువాత, క్రీస్తును మెస్సీయగా లేదా ప్రవక్తగా విశ్వసించే వారందరికీ వ్యతిరేకంగా గొప్ప హింస తలెత్తింది. మనకు వెంటనే పరిశుద్ధ లూకా ద్వారా ఇలా చెప్పబడినది, “జెరూసలేం వద్ద ఉన్న సంఘమునకు వ్యతిరేకంగా గొప్ప హింస జరిగింది; మరియు “అపొస్తలులు తప్ప వారందరూ యూదయ మరియు సమరయ ప్రాంతాలలో చెల్లాచెదురుగా ఉన్నారు.”

దాదాపు రెండు వేల మంది క్రైస్తవులు, ఏడుగురు డీకన్‌లలో ఒకరైన నికానోర్‌తో, “స్తెఫెను గురించి తలెత్తిన హింస సమయంలో హతసాక్షులు అయ్యారు.

II. గొప్పవాడైన యాకోబు(James the Great)

గలిలయలోని బేతస్థ లో జన్మించాడు మరియు మొదట “శిష్యుడు” అని పిలవబడ్డాడు. అతను ఎగువ ఆసియాలో శ్రద్ధగా పనిచేశాడు మరియు ఫ్రిజియాలోని హెలియోపోలిస్‌లో హతసాక్షి అయ్యాడు. అతను కొరడాలతో కొట్టబడ్డాడు, జైలులో వేయబడ్డాడు మరియు తరువాత సిలువ వేయబడ్డాడు, A.D. 54.

IV. మత్తయి

సుంకము వసూలు చేసే వ్యక్తి, నజరేతులో జన్మించాడు. అతను తన సువార్తను హీబ్రూలో వ్రాసాడు, దానిని నీతిమంతుడైన యాకోబు గ్రీకులోకి అనువదించాడు. అతని శ్రమల దృశ్యం పార్థియా మరియు ఇథియోపియా, ఆ తరువాతి దేశంలో అతను హతసాక్షి అయ్యాడు, A.D. 60, నడబా నగరంలో బల్లెముతో చంపబడ్డాడు.

V. నీతిమంతుడైన యాకోబు( James the Just)

చాలామంది యాకోబును యేసు యొక్క సోదరుడు అని నమ్ముతారు. అతను జెరూసలేం సంఘముల పర్యవేక్షణకు ఎన్నికయ్యాడు; మరియు పరిశుద్ధ గ్రంధములో యాకోబు పత్రికను రాసాడు. తొంభై నాలుగు సంవత్సరాల వయస్సులో అతను యూదులచే రాళ్ళతో కొట్టబడ్డాడు; మరియు చివరకు అతని మెదడును గుదియతో విపరీతంగా కొడతారు.

VI. మత్తీయ

ఇతర శిష్యుల కంటే తక్కువగా తెలిసినవాడు, యూదా యొక్క ఖాళీ స్థలాన్ని భర్తీ చేయడానికి ఎన్నుకోబడ్డాడు. అతను జెరూసలేం వద్ద రాళ్లతో కొట్టబడ్డాడు మరియు తరువాత శిరచ్ఛేదం చేయబడ్డాడు.

VII. అంద్రెయి

పేతురుకు సోదరుడు. అతను అనేక ఆసియా దేశాలకు సువార్తను బోధించాడు; కానీ అతను ఎడెస్సా వద్దకు చేరుకున్నప్పుడు, అతను సిలువపై సిలువ వేయబడ్డాడు, దాని యొక్క రెండు చివరలు భూమిలో అడ్డంగా అమర్చబడ్డాయి. అందువల్ల పరిశుద్ధ అంద్రెయి సిలువ అనే పదం ఉత్పన్నమైనది.

VIII. మార్కు

లేవీ తెగకు చెందిన యూదుల తల్లిదండ్రులకు జన్మించాడు. అతను పేతురు ద్వారా క్రైస్తవ్యములోకి మార్చబడ్డాడు, అతనకి లేఖకుడు (డిక్టేషన్ తీసుకోవడానికి ఉద్యోగం పొందిన వ్యక్తి)గా పనిచేశాడు మరియు అతని పరిశీలనలో గ్రీకు భాషలో తన సువార్తను వ్రాసాడు.మార్కును అలెగ్జాండ్రియా ప్రజలు ముక్కలుగా లాగారు, సెరాపిస్ యొక్క  గంభీరమైన వారి విగ్రహం వద్ద, అతని జీవితాన్ని వారి కనికరం లేని చేతులతో ముగించారు.

IX. పేతురు

అనేక ఇతర పరిశుద్ధులలో, దీవించబడిన అపొస్తలుడైన పేతురు మరణశిక్షకు విధించబడి సిలువ వేయబడ్డాడు. నీరో పేతురును చంపడానికి అతనిపై కేసు పెట్టాడని హెగెసిప్పస్ చెప్పాడు; అది గ్రహించిన ప్రజలు, పేతురును పట్టణం విడిచి పారిపోవాలని చాలా వేడుకున్నారు. పేతురు, వారు బలవంతపెట్టడముతో, తప్పించుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు. కానీ, తలుపు వద్దకు వస్తూ, ప్రభువైన క్రీస్తు తన దగ్గరకు రావడం చూశాడు, ఆయనను ఆరాధిస్తూ “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” ఆయన జవాబిచ్చాడు “నేను సిలువ వేయబడుటకు మరల వచ్చితిని.” దీని ద్వారా, పేతురు తను పొందబోయే హింసను గ్రహించి, నగరానికి తిరిగి వచ్చాడు. అతను తల క్రిందికి మరియు పాదాలు పైకి పెట్టి సిలువ వేయబడ్డాడని, తనకు తాను అలా కోరుకున్నాడని యెరోము చెప్పాడు, ఎందుకంటే అతను (అతను చెప్పాడు) ప్రభువు వలె అదే రూపం మరియు పద్ధతిలో సిలువ వేయబడటానికి అనర్హుడని చెప్పాడు.

X.పౌలు

ఇంతకు ముందు సౌలు అని పిలువబడే అపొస్తలుడైన పౌలు , క్రీస్తు సువార్తను ప్రకటించడములో అతడు గొప్ప కష్టాలు మరియు చెప్పలేని శ్రమలు పొందిన తర్వాత, నీరో కింద జరిగిన ఈ మొదటి హింసలో కూడా శ్రమపొందెను. అతను మరణశిక్ష కింద నీరో అతని మరణ వార్తను తెలియజేయడానికి అతని ఇద్దరు ఎస్క్వైర్‌లను, ఫెరెగా మరియు పార్థెమియస్‌లను పంపినట్లు ప్రకటించాడని అబ్డియాస్ చెప్పాడు. వారు, పౌలు దగ్గరకు వచ్చి ప్రజలకు ఉపదేశిస్తూ, వారు విశ్వసించేలా తమ కోసం ప్రార్థించమని కోరారు,  త్వరలో వారు నమ్మి; అతని సమాధి వద్ద  బాప్తీసము పొందాలని వారికి చెప్పాడు. ఇది పూర్తయింది, సైనికులు వచ్చి అతన్ని నగరం నుండి ఉరితీసే ప్రదేశానికి తీసుకువెళ్లారు, అక్కడ అతను ప్రార్థనలు చేసిన తర్వాత కత్తికి తన మెడను ఇచ్చాడు.

XI. యూదా

యాకోబు పత్రిక రాసిన యాకోబుకు సోదరుదు, సాధారణంగా థడ్డియస్ అని పిలుస్తారు. అతను ఎడెస్సా, A.D. 72లో సిలువ వేయబడ్డాడు.

XII. బర్తోలొమయి

అనేక దేశాలలో ఉపదేశించాడు మరియు మత్తయి సువార్తను భారతదేశ భాషలోకి అనువదించి, ఆ దేశంలో ప్రచారం చేశాడు. అసహనానికి గురైన విగ్రహారాధకులచే అతను చాలా సమయం క్రూరంగా కొట్టబడ్డాడు మరియు సిలువ వేయబడ్డాడు.

XIII.తోమా

దిదిమస్ అని పిలువబడ్డాడు, పార్థియా మరియు భారతదేశంలో సువార్తను బోధించాడు, అక్కడ అన్యమత పూజారుల ఆగ్రహానికి లోనై, అతను ఈటెతో  చంపబడతాడు.

XIV. లూకా

సువార్తికుడు, అతని పేరుతో వెళ్ళే సువార్త రచయిత. అతను పౌలుతో కలిసి వివిధ దేశాలలో పర్యటించాడు మరియు గ్రీకుదేశములోని విగ్రహారాధన చేసే పూజారులచే ఒలీవ చెట్టుకు ఉరితీయబడ్డాడని భావిస్తారు.

XV. సీమోను

జెలోతే అనబడిన సీమోను, ఆఫ్రికాలోని మారిటానియాలో మరియు బ్రిటన్‌లో కూడా సువార్తను బోధించాడు, ఆ తరువాతి దేశంలో అతను సిలువ వేయబడ్డాడు, A.D. 74.

XVI.యోహాను

“ప్రియమైన శిష్యుడు,” గొప్పవాడైన యాకోబుకు (జేమ్స్ ది గ్రేట్‌) సోదరుడు … ఎఫెస్సీ నుండి అతన్ని రోమ్‌కు పంపమని ఆదేశించబడింది, అక్కడ అతను మరిగే నూనెలో వేయబడ్డాడు. అతను గాయం లేకుండా, అద్భుతంగా తప్పించుకున్నాడు. డొమిషియన్ అతనిని పద్మాసు ద్వీపానికి వెల్లగొట్టాడు, అక్కడ అతను ప్రకటన గ్రంధము వ్రాసాడు. డొమిషియన్ వారసుడు నెర్వా అతనిని తిరిగి పిలిచాడు. హతసాక్షి అవ్వని ఏకైక అపొస్తలుడు అతను.

XVII. బర్నబా

సైప్రస్‌కు చెందినవాడు, కానీ యూదుల సంతతికి చెందినవాడు, అతని మరణం దాదాపు A.D. 73లో జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇంకా, ఈ నిరంతర హింసలు మరియు భయంకరమైన శిక్షలు ఉన్నప్పటికీ, సంఘము ప్రతిరోజూ పెరిగింది, అపొస్తలుల బోధలో మరియు పంపబడినవారితో లోతుగా పాతుకుపోయింది మరియు పరిశుద్ధుల రక్తంతో పుష్కలంగా నీరు పోయబడింది.

An Independent Church of the WORD,