కొంచం చరిత్రను చూద్దాము: నాశనదిన గడియారం

https://branham.org/en/articles/292017_ABitOfHistoryTheDoomsdayClock నుండి అనువదించబడింది.

1947లో, చికాగో అటామిక్ సైంటిస్ట్స్ అనే బృందం ప్రపంచ విపత్తుకు కౌంట్‌డౌన్‌ను(లెక్కించడం) సూచించే చిహ్నాన్ని సృష్టించింది. ప్రపంచ విపత్తు అంటే ఏమిటి? అప్పట్లో అందరి దృష్టి అణు మారణహోమం పైనే ఉంది. వాస్తవానికి, చికాగో అటామిక్ సైంటిస్ట్‌ల వ్యవస్థాపకులు మాన్‌హట్టన్ ప్రాజెక్ట్ అని పిలువబడే మొదటి అణు బాంబును అభివృద్ధి చేయడానికి పనిచేశారు. గడియారం 1947లో అర్ధరాత్రికి ఏడు నిమిషాలతో ప్రారంభమైంది, అయితే సోవియట్ యూనియన్ వారి మొదటి అణు బాంబును పరీక్షించి, అణు ఆయుధ పోటీని ప్రారంభించిన తర్వాత 1949లో త్వరగా మూడు నిమిషాలకు వెళ్లింది.

గడియారం నాశనదినానికి అత్యంత దగ్గరగా 1953లో గడియారం రెండు నిమిషాలకు జరిగింది. యునైటెడ్ స్టేట్స్ దాని మొదటి థర్మోన్యూక్లియర్ పరికరాన్ని (అసలు అణు బాంబు కంటే చాలా శక్తివంతమైనది) పరీక్షించడం మరియు సోవియట్ యూనియన్ వారి స్వంతదానిని పరీక్షించడం వల్ల ఈ చర్య జరిగింది. “ప్రభువు రెండవ రాకడ” అనే వర్తమానములో సహోదరుడు బ్రాన్‌హామ్ దీనిని ప్రస్తావించారు.

“గడియారం అర్ధరాత్రికి మూడు నిమిషాల వరకు జరిగింది” అని శాస్త్రీయ ప్రపంచం చెబితే, వారు హైడ్రోజన్ లేదా ఆక్సిజన్, పరమాణువు మరియు అన్నిటినీ కనుగొన్నప్పుడు అర్ధరాత్రికి ఒక నిమిషం వరకు వారు దానిని తగ్గిస్తారని నేను భావిస్తున్నాను. వారు ఉపయోగించుకోగలిగే శక్తులు ఐదు నిమిషాల వ్యవధిలో పూర్తిగా వినాశనానికి కారణం కావచ్చు. వారు, ఖచ్చితంగా ఈ రాత్రి, ముప్పై నిమిషాల్లో మొత్తం ఉత్తర అమెరికా ఖండంలోని ఏ వ్యక్తి జీవించలేడు. మరియు అది మనల్ని ద్వేషించే ద్రోహుల చేతుల్లోనే ఉంది. మరియు, దానితో పాటు, మనము నావలు మరియు ఓడలను ఉంచాము, అన్నింటినీ చుట్టూ ఉంచాము… సైబీరియా గుండా, హంగేరిలో మరియు వివిధ ప్రదేశాలలో, మన ఓడలు ఉంచబడ్డాయి, ఒకే రకమైన క్షిపణులతో మొపబడ్డాయి.

సోదరులారా, మీరు అనుకున్నదానికంటే ఆలస్యం అయింది! సొదొమ మరియు గొమొర్రాలకు ఆ రాత్రి, వారు తమ చివరి ఘడియలో జీవిస్తున్నారని తెలియదు. వస్తుందని ఊహించిన మరణదూత ఆ రాత్రికి వస్తాడని ఈజిప్టుకు తెలియదు. పెరల్ హార్బర్ ఆ దాడి జరిగినట్లు గ్రహించలేదు. మనము త్రాసులో తూచబడ్డాము మరియు అసంతృప్తిగా కనబడుతున్నాము! మనము అంత్య కాలములో ఉన్నాము!

  57-0417 ప్రభువు యొక్క రెండవ రాకడ

ఇటీవల, శాస్త్రవేత్తలు తమ నాశనదిన లెక్కల్లో కొన్ని ఇతర విషయాలను చేర్చారు. జీవశాస్త్రాలలో కొత్త పరిణామాలు (జన్యుపరంగా మార్పు చెందిన జీవులు, కొత్త వ్యాధులు, కృత్రిమ మేధస్సు (రోబోలు) మొదలైనవి) మరియు భౌగోళిక ఉష్ణోగ్రత ఇప్పుడు అంచనాలలో సమీకృతించబడ్డాయి.

జనవరి 26, 2017న, నాశనదిన గడియారం అర్ధరాత్రికి రెండున్నర నిమిషాలు అని చూపించింది. అర్ధరాత్రికి కదిలిన గడియారంలో ఇది రెండవ దగ్గరిది, మరియు వారు అరనిమిషాన్ని ఉపయోగించడం మొదటిసారి. ఈ చర్యకు బృందం యొక్క హేతువు ఏమిటంటే, “…ప్రపంచవ్యాప్తంగా కఠినమైన జాతీయవాదం పెరగడం, అణ్వాయుధాలపై యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మరియు ట్రంప్ పరిపాలన ద్వారా వాతావరణ మార్పుపై శాస్త్రీయ ఏకాభిప్రాయంపై అవిశ్వాసం.” ఎందుకో వారికి సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ ఏదో జరగబోతోందన్న అశాంతి ప్రపంచ దేశాలలో ఉంది. వారికి మా దగ్గర ఒక సులభమైన సమాధానం ఉంది: ఏదో జరగబోతోంది!

గడియారాన్ని మరో రెండు నిమిషాలు ముందుకు నెట్టడానికి ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి: ఇజ్రాయెల్ రెండు వేల సంవత్సరాలకు పైగా మొదటిసారిగా తన స్వదేశంలో ఉంది. దేవుడు మలాకీ 4 ప్రకారం క్రీస్తు యొక్క రాకడకు ముందుగా వచ్చేవాడిని పంపాడు. అతని వర్తమానము ప్రపంచమంతటా పంపబడటం, డ్రైవర్ లేని కార్లు, సంశయవాదులు లేవడం, అనైతికత, పూర్తి వెఱ్ఱితనము మరియు మన కళ్ల ముందు జరుగుతున్న అనేక ఇతర విషయాల గురించి ముందుగావచ్చేవాడు ప్రవచించాడు. దేవుని గడియారం యొక్క చేతులు ప్రమాదకరంగా అర్ధరాత్రికి చేరువవుతున్నాయి మరియు వధువు గమనిస్తోంది.

An Independent Church of the WORD,