దైవిక స్వస్థత

మెక్సికోలోని ఒక సహోదరి నుండి మేము అందుకున్న సాక్ష్యం క్రింది విధంగా ఉంది, ఆమె దేవుని వర్తమానికుడి మాటను స్వీకరించి, ఆమె స్వస్థతను అంగీకరించింది.

https://branham.org/en/articles/20100831_DivineHealing

ఈ సాక్ష్యం వినుచున్న మీరు గొప్పగా ఆశీర్వదించబడునుగాక అనేది నా కోరిక

నా పేరు సహోదరి మాక్లోవియా గొంజాలెజ్, నేను మనాలిస్కో జాలిస్కో మెక్సికోలోని క్రిస్టియన్ చర్చ్‌కి వెళ్తాను, ఈ ఘడియకు విలియం బ్రెన్హామ్ ఇచ్చిన వర్తమానమును మేము నమ్ముతాము.

ఎల్ కాపులిన్ అనే పేరుగల గడ్డిబీడులో ఉన్నందున, ఒక రాత్రి తీవ్రమైన అసౌకర్యంతో నేను మేల్కొన్నాను. నేను లేచి నడవడానికి ప్రయత్నించాను, నేలపై పడిపోయాను. నేను మళ్ళీ ప్రయత్నించాను మరియు మళ్ళీ పడిపోయాను. కాబట్టి నేను రాత్రంతా నేలపై పడుకుని, తలుపు తెరవడానికి పోరాడుతూ, సహాయం కోసం పిలిచాను. దేవుడు మాత్రమే నా మాట వినగలడు, ఎందుకంటే నేను మాట్లాడలేను, మరియు నన్ను నేను లాగుకొని, తలుపు తెరవగలిగాను. నా పిల్లలు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగలిగారు, అక్కడ నేను నాలుగు రోజులు ఉన్నాను.

నాకు మస్తిష్క రక్తస్రావం(cerebral hemorrhage) ఉంది, నా కాలు, నా చేయి మరియు నా నాలుకతో సహా నా శరీరం మొత్తం ఒక వైపు పక్షవాతానికి గురయ్యాను, నేను మాట్లాడలేనంతగా లేదా కదలలేనంతగా. వైద్యులు నా కోసం ఏమీ చేయలేకపోయారు, కాబట్టి వారు నన్ను తిరిగి నా ఇంటికి పంపించారు, నేను మంచము మీదనే ఉండవలిసింది కాబట్టి నా శరీరము  బిగుతుగా అవ్వకుండా ఎలా జాగ్రత్త వహించాలో నా కుటుంబ సభ్యులకు సూచనలు ఇచ్చారు

నేను మూడు వారాల పాటు నా మంచం మీద సాగిలపడి పడుకున్నాను. ఒక రోజు ఉదయం నా పిల్లలు నన్ను కదిలించడానికి చాలా పోరాడుతున్నారు, ఎందుకంటే నా శరీరం మొత్తం వైకల్యంతో మరియు చాలా బలహీనంగా ఉంది. ప్రతిదీ చాలా దీనంగా మరియు విచారకరమైన తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు అనిపించింది. అదే రోజు, నా కుమార్తె కార్మెన్ నా కోసం “మీలో ఉన్నవాడు” అనే ప్రవక్త యొక్క టేప్‌ను ఉంచి, “అభిషేకించబడిన వస్త్రం” నాకు చూపిస్తూ, మార్కును ఉదహరిస్తూ తన కుడి చేతిని నా నుదిటిపై “అభిషేకించబడిన వస్త్రం”తో ఉంచింది. మార్కు16:17-18 బైబిల్ ఇలా చెబుతోంది, “నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను..” అబ్రాహాము సంతానం శత్రువు గవినిని స్వాధీన పరుచుకొనును అని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నాకు గుర్తుచేస్తోంది. మేము దేవుని ప్రవక్త (విలియం బ్రాన్‌హామ్)తో కలిసి ప్రార్థించాము. నా కూతురు నా గదిని విడిచిపెట్టింది, టేప్ వింటూ నేను ఒంటరిగా ఉన్నాను. దేవుని వర్తమానికుడు ఇలా ఆజ్ఞ ఇవ్వడం నేను విన్నాను, ” ఈ మంచం మీద పడుకొనియున్న అమ్మ నీవు దానిని నమ్ముచున్నవా?…, యేసుక్రీస్తు నామంలో లేచి నిలబడువుము …ఆమె యొక్క  చీలమండములు బలముపొందుకున్నవి.” ఆ ఆదేశాలు నా కోసమే అని నేను భావించాను; కాబట్టి నేను నన్ను నెట్టుకొని మంచం మీద కూర్చొని దేవుడిని స్తుతించడం మొదలుపెట్టాను, నా చేతులుతో చప్పట్లు కొట్టాను మరియు నా కాళ్ళను కదిలించాను. “అది నేనే” అన్నాను. ఇదంతా విన్న నా కూతురు కార్మెన్ చాలా కంగారుగా నా గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. నేను ఆమెతో, “దేవుడు కోరుకున్నది అదే. నన్ను లేవమని చెప్పాడు.” నేను “ప్రభువా, నేను కూడా నీ దానినే” అన్నాను. (అది “మీలో ఉన్నవాడు” అనే వర్తమానము యొక్క టేప్ చివరిలో కనుబడుతుంది.

అప్పటి నుండి, నేను అంతగా ఇతరుల సహాయంతో కాకుండగా లేచి, నా స్వంత కాళ్ళపై వంటగదికి వెళ్లడం ప్రారంభించాను. నేను నా కుటుంబ సభ్యులతో ఇలా అన్నాను, “నేను తినాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను. అప్పటి నుండి, నా ప్రభువైన యేసుక్రీస్తును సేవించడానికి ఆయన నన్ను పిలిచిన స్థలంలో సేవ చేస్తూ నా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నాను.

నేను ఆయన శక్తిని తెలుసుకొనుటకు, మరియు యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతీగా ఉన్నాడని అనుభవించి మరియు తెలుసుకోవటానికి అనుమతించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను; హెబ్రీయులు 13:8. ఇది సెప్టెంబర్ 2009లో జరిగింది.

నా సాక్ష్యాన్ని చదివినందుకు ధన్యవాదాలు.

క్రీస్తులో మీ సహోదరి,

మాక్లోవియా గొంజాలెజ్

An Independent Church of the WORD,