సంస్కరణ దినం

10/31/2017

https://branham.org/en/articles/10262017_ReformationDay

1405లో, ఒక యాజకుడు మాత్రమే దేవుని వాక్యాన్ని చదవగలడనే కాథలిక్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా జాన్ హస్ కొనసాగిస్తున్న తన “మత విరోధమైన” వైఖరిని ఆపాలని పోప్ ఇన్నోసెంట్ ఆపేక్షించారు. మానవుడు బైబిల్‌ను అర్ధంచేసుకోవడానికి యాజకుడు అవసరం లేదని, దానిని స్వయంగా చదివి అర్థం చేసుకునే హక్కు అతనికి ఉండాలని హస్ బోధించాడు. పాపపరిహారపత్రాలు అమ్మకంపై తన నిరసనను నిలిపివేయాలని మరియు పోప్‌కి వ్యతిరేకంగా తన మాటలను ఉపసంహరించుకోవాలని కూడా హస్ ను ఆదేశించారు. రోమన్ కాథలిక్ చర్చి అని పిలువబడే అధికార సోపానక్రమాన్ని నిరసించిన కారణంగానే పదుల పదిలక్షల మంది హత్యకు గురైనట్లుగానే తన స్థానములో నిలచిన దేవుని మనిషి కూడా అదే విధముగా శిక్షించబడినారు.

ఆ దురదృష్టకరమైన రోజున, హస్ కట్టెల కట్టలతో చుట్టబడి, కొయ్యకు కట్టబడ్డాడు. తలారి మంటలను వెలిగించటానికి వంగి, “ఇప్పుడు మేము పెద్ద బాతును ఉడికించాలి” అన్నాడు. (హస్ అంటే బోహేమియన్ భాషలో పెద్ద బాతు అని అర్థం). దేవుని మనిషి ఈ ప్రవచనతో ప్రతిస్పందించాడు, “అవును, కానీ 100 సంవత్సరాలలో మీరు చేరుకోలేని హంస వస్తుంది.”

సుమారు వంద సంవత్సరాల తర్వాత, మార్టిన్ లూథర్ అనే క్యాథలిక్ యాజకుడు రోమన్ సంఘము యొక్క ఘోరమైన తప్పులను చూసి, సాధారణ మనిషికి తన సాధారణ భాషలో వర్తమానము (బైబిల్) అందుబాటులో ఉండాలని బోధించడం ప్రారంభించాడు. హస్ చేసినట్లుగా, అతను పాపపరిహారపత్రాలకు వ్యతిరేకంగా బోధించాడు మరియు విశ్వాసం ద్వారా నీతిమత్వమును బోధించడం ద్వారా కాథలిక్ సిద్ధాంతాన్ని ధిక్కరించాడు. అతను మతాధికారులు మరియు పోప్ ఇద్దరి ఖచ్చితత్వాన్ని తిరస్కరించాడు, బైబిల్‌పై మాత్రమే తన నమ్మకాన్ని ఉంచాడు. అతని మాటలు రోమన్ స్థాపన యొక్క హృదయాన్ని కదిలించాయి. తర్వాత, అక్టోబరు 31, 1517న, లూథర్ తన 95 సిద్ధాంతల పత్రాన్ని జర్మనీలో విట్టెన్‌బర్గ్‌లోని కోటలోని చర్చి తలుపుకు వ్రేలాడదీశాడు. ప్రొటెస్టంట్ సంస్కరణ ప్రారంభమైంది.

లూథర్ వెంటనే బైబిల్‌ను జర్మన్‌లోకి అనువదించే పనిలో పడ్డాడు. అదే సమయంలో, విలియం టిండేల్ అనే మరో దేవుని సేవకుడు ఆంగ్ల అనువాదాన్ని ప్రారంభించాడు. మరిన్ని భాషలలో అనువాదాలు కార్యరూపం దాల్చడం ప్రారంభించాయి. చర్చి యొక్క అపారమైన శక్తి కూడా ప్రజలకు వర్తమానము చేరకుండా ఆపలేకపోయింది. సంఘము యొక్క సిద్ధాంతాలను గ్రహించడానికి సామాన్యుడు తన యాజకుడు పై ఆధారపడవలసిన అవసరం లేదు. మతాధికారుల విచారనకు, ఒక అణగారిన రైతు కూడా స్వయముగా వాక్యాన్ని చదవి, అతనికి వేదిక నుండి భోదించబడుతున్న లోపాలను నిర్ధారించగలడు.

లూథర్ ప్రొటెస్టంట్ సంస్కరణను ప్రారంభించిన ఆ నిర్ణయాత్మక ఉదయం నుండి నేటికి 500 సంవత్సరాలు. దానితో సాతాను రాజ్యానికి బలమైన దెబ్బ తగిలింది, కానీ అపవాది అంతం కాలేదు. లూథర్ రంగం నుండి వెళ్లిపోయే సమయం వరకు మాత్రమే ఉంటుందని మరియు సంఘసేఖపరమైన ఆత్మ మరోసారి పాలించబడుతుందని వాడికి తెలుసు.

ఫిలదెల్ఫియా మరియు లవొదికయ కాలములలో, సాతాను తన హంతక మార్గాలను మందగించి ప్రజలను తప్పుడు భద్రతా భావంలోకి నెట్టాడు. అయితే, చరిత్ర అంతటా మనం అంత్యక్రీస్తు ఆత్మను చూడవచ్చు మరియు ఆ సమయాలు ముగిశాయని అనుకోవడం అవివేకం. సాతాను ఇప్పటికీ హంతకుడు అని ప్రపంచం ఎప్పటికీ మరచిపోకూడదు మరియు రోమన్ భావజాలం ఎప్పటిలాగే ఈ రోజు శక్తివంతమైనది.

ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

1999లో, లూథరన్ మరియు రోమన్ క్యాథలిక్ చర్చిలు 500-సంవత్సరాల ప్రొటెస్టంట్ సంస్కరణకు ముగింపు పలికేందుకు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశాయి. ఇతర విషయాలతోపాటు, రెండు చర్చిలు ఇప్పుడు “క్రీస్తుపై విశ్వాసం ద్వారా దేవుని కృపతో మేము నీతిమత్వము గురించి ఒక సాధారణ అవగాహనను” పంచుకుంటున్నామని ఒప్పందం పేర్కొంది. రెండు సంఘాలు ఇది తప్పనిసరిగా “ప్రొటెస్టంట్ సంస్కరణకు మూలమైన నీతిమత్వము యొక్క స్వభావంపై 500 సంవత్సరాల నాటి వివాదాన్ని పరిష్కరిస్తుంది” అని చెప్పారు.

            మార్టిన్ లూథర్ ఈ ఒప్పందానికి బహు దుఃఖపడేవాడు.

లూథర్ పాపపరిహార పత్రాలను, పోప్ యొక్క అధికారమును, సంఘము యొక్క అధికారమును మరియు “క్రియల ద్వారా నీతిమత్వము”తో పాటు దాదాపు 90 ఇతర విషయాలను నిరసించాడు. అయితే, దురదృష్టవశాత్తు, ఇటీవలి రాజకీయ కుట్ర పనిచేసింది.

ఎక్యుమెనికలిజం యొక్క ఆత్మలో (ఎక్యుమెనికలిజం- వివిధ మత వర్గాల మధ్య సహకారం మరియు అవగాహనను ప్రోత్సహించే ఉద్యమం) ప్రపంచ మెథడిస్టు మండలి మరియు ఇతర సంఘసేఖలు కాథోలూథరెన్స్ నిర్దేశించిన విషాన్ని హృదయపూర్వకంగా మింగివేసాయి మరియు వారి విభేదాలను పట్టించుకోవడం మానివేశాయి. పోప్ ఫ్రాన్సిస్ 1999లో ప్రారంభించిన దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అనేక ప్రజాకర్షణ గలవారితో జతకట్టడం ద్వారా దీనిని జయించగలిగాడు.

టోనీ పామర్ (కుడి) మరియు ఇతర సంఘ నాయకులు పోప్‌తో నిలబడి ఉన్నారు.

ఫిబ్రవరి, 2014లో, టోనీ పాల్మెర్ అనే ఆంగ్లికన్ ఎపిస్కోపల్ బిషప్ ప్రొటెస్టంట్ సంస్కరణను ముగించడం గురించి కెన్నెత్ కోప్‌ల్యాండ్ మరియు ప్రజాకర్షణ ఉద్యమ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీ.పామర్ ఈ క్రింది ప్రకటన చేసాడు: “సహోదరులు మరియు సహోదరమనులారా, లూథర్ నిరసన ముగిసింది. నీది?” అతను పోప్ నుండి రికార్డింగ్‌ను ప్లే చేసాడు, అది నిలబడి చప్పట్లు కొట్టి ఆమోదించబడింది. టోనీ పాల్మెర్ కొన్ని నెలల తర్వాత ఒక మోటార్ సైకిల్ ప్రమాదంలో విషాదకరంగా మరణించాడు, కానీ అతని సందేశం బలం పొందుతుంది.

జూలై 23, 2015న, కాథలిక్ హెరాల్డ్ వార్తా సంస్థ (క్యాథలిక్ చర్చికి ప్రధానమైనది) ది పోప్స్ గ్రేట్ ఎవాంజెలికల్ గాంబుల్ అనే శీర్షికతో ఒక కథనాన్ని పోస్ట్ చేసింది. వ్యాసం ఈ విధంగా ప్రారంభమైంది:

పోప్ ఫ్రాన్సిస్ కార్యాలయంలో ఎక్కడో క్రైస్తవ చరిత్ర గమనాన్ని మార్చే పత్రం ఉంది. ఇది కాథలిక్కులు మరియు సువార్తికులు మధ్య శత్రుత్వానికి ముగింపుని ప్రకటించింది మరియు రెండు సంప్రదాయాలు ఇప్పుడు “పనిలో ఐక్యమయ్యాయి, ఎందుకంటే మేము ఒకే సువార్తను ప్రకటిస్తున్నాము”. ఈ రోజు ప్రపంచంలోని నలుగురి క్రైస్తవులలో ఒకరికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎవాంజెలికల్ నాయకులతో పాటు, 2017లో సంస్కరణ యొక్క 500వ వార్షికోత్సవం సందర్భముగా పత్రంపై సంతకం చేయాలని పరిశుద్ధ తండ్రి ఆలోచిస్తున్నారు.

సంస్కరణ ఇప్పటికే ముగిసిందని ఫ్రాన్సిస్ నమ్మాడు. ఇది 1999లో ముగిసిందని, ఆ సంవత్సరంలో కాథలిక్ చర్చి మరియు లూథరన్ ప్రపంచ సమాఖ్య లూథర్ నిరసనకు మూల సిద్ధాంతమైన నీతిమత్వముపై ఉమ్మడి ప్రకటనను జారీ చేశాయని, అని అతను నమ్మాడు.

పత్రం ఈరోజు సంతకం చేయబడిందో లేదో మాకు తెలియదు, కానీ అది నిజంగా పట్టింపు లేదు. సంఘము ఎటువైపు పయనిస్తుందో మనమందరం చూడవచ్చు.

అక్టోబరు 31, 2016న, లూథర్ యొక్క సంస్కరణను జరుపుకోవడానికి మరియు ఐక్యత కోసం తన బహిరంగ అభ్యర్ధనను కొనసాగించడానికి పోప్ ఫ్రాన్సిస్ స్వీడన్‌కు (చారిత్రాత్మకంగా, ప్రొటెస్టాంటిజం యొక్క ఛాంపియన్) వెళ్లారు. CBS వార్తలు ఒక కథనాన్ని ప్రచురించింది మరియు ఈ క్రింది వాటిని చెప్పింది:

“ఐదు శతాబ్దాల క్రితం మార్టిన్ లూథర్ యొక్క “మత విరోధమైన” సంస్కరణలకు వ్యతిరేకంగా విశ్వాసాన్ని రక్షించడానికి స్థాపించబడిన జెస్యూట్ మతక్రమము, దానికి చెందిన  పోప్ ఫ్రాన్సిస్ ప్రొటెస్టంట్ సంస్కరణ యొక్క 500వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం లౌకిక దేశమైన స్వీడన్‌కు వెళ్ళి అసాధారణమైన సాహసోపేతమైన సంజ్ఞ చేశారు.”

ఫ్రాన్సిస్ ప్రయత్నాలు రాజీగా కనిపిస్తాయి ,కానీ అవి పూర్తిగా రాజకీయమైనవి. కాథలిక్ చర్చి రాజీపడదు; అది ఎప్పుడూ లేదు మరియు ఎప్పటికీ చేయదు. దీని ఉద్దేశ్యం మానవుల జీవితాలు మరియు ఆత్మలు రెండింటిపై ఆధిపత్యం చెలాయించడం, మరియు ఇది చేయడానికి రాజకీయ పరాక్రమాన్ని ఉపయోగిస్తుంది. గత 2,000 సంవత్సరాలలో మనం అనుభవించిన వాటిని మరియు కాథలిక్ చర్చి ప్రారంభించిన హింసను మర్చిపోవడానికి సంఘాలు చాలా సముఖంగా ఉన్నాయి.

క్రీ.శ. 325లో, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ప్రజలను “ఐక్యత” యొక్క ఉచ్చులోకి ఆకర్షించడానికి పోప్ ఫ్రాన్సిస్ వలె అదే వ్యూహాలను ఉపయోగించాడు. అమాయకంగా కనిపించే తెల్ల గుఱ్ఱపు సవారీ నైసీన్ మండలి వద్ద తన రక్తపు ఖడ్గము తీసుకొని పదుల పది లక్షల మంది క్రైస్తవులను చంపాడు. ఆ ఆత్మ ఇప్పటికీ మన మధ్య ఉంది. సంఘసేఖ పరమైన ప్రపంచం దాని కోసం పడిపోవచ్చు, కానీ వధువు ఎప్పటికీ మోసపోదు మరియు మనం ఎప్పటికీ మరచిపోము.

ఈ ఘడియలను గురుంచి ప్రవక్త మనలను హెచ్చరించాడు. ఆయన వర్తమానము “నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారుకాకుండునట్లు దానిని విడచి బయటకు రండి.” “కొన్ని రాయితీలు ఇవ్వండి, తద్వారా మనం ఒక ఐక్య సంఘముగా ఉండగలము” అనే దానికి ఇది ఎంతో వ్యత్యాసము. అవును, వధువు వాక్యం క్రింద ఐక్యమై ఉంది మరియు అదే వాక్యం ద్వారా మన శత్రువును మనం తెలుసుకుంటాము. మార్టిన్ లూథర్ దేని కోసం నిలబడ్డాడో మనం ఎప్పటికీ మర్చిపోలేము.

ఈ 500 సంవత్సరాల సంస్కరణ దినోత్సవం సందర్భంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాకగత సంవత్సరం.

 హాలోవీన్ కథనాన్ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

An Independent Church of the WORD,