బిల్లీ పౌలు బ్రెన్హామ్

https://branham.org/en/billypaulbranham నుండి అనువదించబడింది.

సహోదరుడు బ్రెన్హామ్ యొక్క పెద్ద కుమారుడు బ్రదర్ బిల్లీ పౌలు బ్రెన్హామ్ కంటే ఈ ముగింపు-కాల పరిచర్యకు ఎవరూ దగ్గరి సాక్షి కాదు. 14 సంవత్సరాల పాటు, తన తండ్రికి ప్రయాణ సహచరుడిగా మరియు వ్యక్తిగత కార్యదర్శిగా, అతను ప్రవచన వరము యొక్క కార్యమును మరియు మనుష్యుడిని, కార్యాలయాన్ని మరియు పరిచర్యను నిర్ధారించడానికి పంపబడిన సూచనను ప్రత్యక్షంగా చూశాడు. వేలాది మంది స్వస్థత పొందుకున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నారు. అతను సహోదరుడు బ్రెన్హామ్ వందల కొద్దీ దర్శనాలు చెప్పడం విన్నాడు, ఆపై అవి నెరవేరడం చూశాడు. అతని తండ్రి మాటలలో, “దేవుడు బిల్లీ పౌలును గౌరవించాడు.” బ్రదర్ బిల్లీ పౌలు సెప్టెంబర్ 13, 1935న విలియం మరియు హోప్ బ్రెన్హామ్ లకు జన్మించాడు. అతను రెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని తల్లి మరియు బుల్లి సోదరి, షారోన్ రోజ్ ఇద్దరూ క్షయవ్యాధితో మరణించారు, కేవలం ఐదు రోజుల తేడాతో.

ఆయన తండ్రి స్వస్థత కూటములు ప్రారంభించినప్పుడు ఆయన వయస్సు 11 సంవత్సరాలు, అది ఆయనను దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లింది. ఆయన పాఠశాలలో లేనప్పుడు, ఆయన తన తండ్రితో కలిసి ప్రయాణించాడు మరియు ప్రతి సేవకు ముందు పుస్తకాలు మరియు కరపత్రాలను విక్రయించే అధికారిక ‘స్థానం’ కూడా ఇవ్వబడింది.

ఇల్లినాయిస్‌లోని వాండాలియాలో 1947 జూన్‌లో ఒక రాత్రి, బ్రదర్ బ్రెన్హామ్ బస చేసిన మోటెల్ గదిలో ప్రభువుదూత ప్రత్యక్షంగా కనిపించాడు. ఆయనతో పాటు ఆయన కుమారుడు బిల్లీ పౌలు మరియు ఆయన తమ్ముడు డానీ ఉన్నారు. ఆయన అబ్బాయిలను నిద్రలేపనా అని ప్రవక్త దూతను అడిగాడు, కాబట్టి వారు అతని ముందు నిలబడి ఉన్న దూత సముఖమును చూడగలరని.

దూత అన్నాడు, “నీ కుమారుడు బిల్లీ ని నిద్రలేపు అని”.

“నేను పెద్దవాడైనప్పుడు, నేను నా తండ్రిని అడిగాను,’ ఆ రాత్రి ప్రభువుదూత ఆయనను చూడడానికి నన్ను ఎట్లాగు అనుమతించాడు?’

ఆయన సమాధానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చెప్పాడు, ‘ఎందుకంటే, నాతో కలిసి పనిచేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు, కుమారుడా, మరియు ఆయన నీకు తనను తాను వ్యక్తపరచాలని కోరుకున్నాడు.’ మరియు ఆ రాత్రి నుండి వాండాలియాలో, మేము ఎక్కడ ఉన్నా సరే, నేను నాన్న, ‘ఆయన ఇక్కడ ఉన్నాడు’ అని చెప్పేది వినడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. ఆ ఉనికి ఎప్పుడు దగ్గర ఉన్నదో నేను ఎప్పుడూ చెప్పగలను.

మరియు నేడు, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును అని నమ్ముతున్నాను.

15 సంవత్సరాల వయస్సులో, అతను టెక్సాస్‌లోని బైబిల్ పాఠశాలకు హాజరవుతున్నప్పుడు అతని తండ్రి, అతనితో ఆఫ్రికాకు వెళ్లాలనుకుంటున్నావా అని అడిగారు. పాఠశాల మానేశాడు మరియు ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు. తరువాతి 14 సంవత్సరాలు, అతను నిరంతరం తన తండ్రితోనే ఉన్నాడు. అతను ప్రతి కూటములోను, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రార్థన కార్డులు అందజేసేవాడు మరియు ప్రతి సేవలో అతను తన తండ్రిని వేదికపైకి మరియు వెలుపలికి తీసుకెళ్లేవాడు, తరచుగా ఆయన సుదీర్ఘ ఆత్మ వివేచన వరుస తర్వాత నిలబడలేకపోయినప్పుడు. అతను సహోదరుడు బ్రెన్హామ్ యొక్క వ్యక్తిగత సంబంధమును చూసుకున్నాడు మరియు 1961లో అతను బ్రెన్హామ్ టాబర్‌నాకిల్‌కు కార్యదర్శి/కోశాధికారి అయ్యాడు మరియు ధర్మకర్తల మండలి సభ్యుడు అయ్యాడు.

డిసెంబరు 18, 1965న, సహోదరుడు బ్రెన్హామ్ ప్రాణాలను తీసే ప్రమాదం జరిగిన సమయంలో అతను తన తండ్రి కారు కంటే కొంచెం ముందుగా ప్రయాణిస్తున్నాడు. వారు అంబులెన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అతను ఆయనను తన చేతుల్లోకి తీసుకున్నాడు మరియు ఆసుపత్రికి వెళ్ళే మార్గంలో అతని తండ్రి తన చివరి మాటలు మాట్లాడటం విన్నాడు.

సహోదరుడు బ్రెన్హామ్ మరణించిన తర్వాత, సహోదరుడు బిల్లీ పౌలు కొత్తగా ఏర్పడిన విలియం బ్రెన్హామ్ ఎవాంజెలిస్టిక్ అసోసియేషన్‌కు అధ్యక్షుడయ్యాడు. అతను ఆ హోదాలో కొనసాగాడు మరియు సువార్త అభివృద్ధికి తన అంకితభావం మరియు ఈ ఘడియ వర్తమానము ప్రకటించాలనే అతని నిబద్ధత ద్వారా, బ్రదర్ బ్రెన్హామ్ పరిచర్య యొక్క మిషనరీ మరియు సువార్త ప్రయత్నాలు ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికి చేరుతున్నాయి. ఆయన 1981లో వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు.

ఆయన మరియు ఆయన భార్య, సిస్టర్ లాయ్స్కు ఇద్దరు కుమారులు, విలియం పౌలు జూనియర్ మరియు డేవిడ్, ఆరుగురు మనవలు మరియు ఎనిమిది మంది మనవరాళ్ళు ఉన్నారు.


పైన ఉన్న link లో బిల్లీ పౌలు బ్రెన్హామ్ సాక్ష్యము తెలుగులో వినగలరు. ఈ వీడియో https://branham.org/en/articles/1062020_BrotherBillyPaul నుండి తీసుకొనబడినది. తెలుగు అనువాదంలో తప్పులున్నచో క్షమించగలరు.


పైన ఉన్న link లో బిల్లీ పౌలు బ్రెన్హామ్ క్యాన్సర్ నుండి స్వస్థత పొందుకున్నసాక్ష్యమును తెలుగులో వినగలరు.ఈ వీడియో Tape_Fed Stephen Tutani youtube channel నుండి తీసుకొనబడినది. తెలుగు అనువాదంలో తప్పులున్నచో క్షమించగలరు.

An Independent Church of the WORD,