కాన్స్టాంటైన్

https://branham.org/en/articles/9232015_Constantine

నేడు, చరిత్రలో మొట్టమొదటిసారిగా, పోప్ యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ యొక్క సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. అతని ప్రసంగం యొక్క సాధారణ ఇతివృత్తం ప్రపంచ ఐక్యత మరియు మానవజాతి యొక్క ఉమ్మడి మేలు కోసం కలిసి పనిచేయడం. ఇది ప్రశంసనీయమైనదిగా అనిపిస్తుంది, కానీ  మొదటి నుండి దెయ్యం అబద్ధాలలో ఇది ఒకటి.

1,700 సంవత్సరాల క్రితం, మరొక గొప్ప రాజకీయ నాయకుడు, ఐక్యత గురించి మరియు హింసించబడిన ప్రజలను ఎలా ఒకచోటకు తీసుకురాగలరు అనే వాటిపై ప్రపంచ నాయకులను టేబుల్ చర్చకు తీసుకువచ్చారు. ఆ ప్రజలను క్రైస్తవులు అని పిలుస్తారు మరియు వారు చాలా ముఖ్యమైన కొన్ని సూత్రాలపై లోతుగా విభజించబడ్డారు.

నాల్గవ శతాబ్దం చరిత్ర క్రైస్తవులపై  క్రూరమైన హింసలతో ప్రారంభమైంది. క్రీ.శ. 303లో, డియోక్లషియన్ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని భూమి నుండి నిర్మూలించడానికి తన చివరి ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో, రోమన్ సామ్రాజ్యం అంతటా క్రైస్తవ మతం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. క్రైస్తవులు అత్యుత్తమ పౌరులు, కానీ వారు ఒక్క కారణం చేత సామ్రాజ్యానికి ముప్పుగా భావించబడ్డారు: వారు చక్రవర్తులను దైవముగా గుర్తించడానికి లేదా సీజర్‌ను తమ “ప్రభువు” అని పిలవడానికి నిరాకరించారు.

ఈ సమయంలో క్రైస్తవుని జీవితం భూమి పైన హింస, భూమి క్రింద ప్రార్థన మరియు ఆరాధనగా కొనసాగింది. తరువాతి 10 సంవత్సరాలలో, క్రీస్తును తిరస్కరించని మరియు సీజర్‌ను “ప్రభువు”గా గుర్తించని ఏ క్రైస్తవుడిపైనైనా ఊహించదగిన ప్రతి క్రూరత్వం విధించబడింది.

“కాన్‌స్టాంటైన్ ది గ్రేట్” అని పిలువబడే రోమన్ చక్రవర్తి అధికారంలోకి వచ్చి క్రైస్తవుల రక్తదాహంతో కూడిన హింసను ముగించాడు.

Text Box: కాథలిక్ చర్చికి అధికారం ఇచ్చింది కాన్‌స్టాంటైన్ అని చాలా మంది విశ్వాసులకు తెలుసు, అయితే చరిత్రకారులు సాధారణంగా కాన్‌స్టాంటైన్‌ను వేరే కోణంలో చూపిస్తారు. అంతర్యుద్ధంలో తన ప్రత్యర్థులలో ఇద్దరిని ఓడించినప్పుడు అతను రోమ్ చక్రవర్తి అయ్యాడు. అంతిమ అంతర్యుద్ధంలో ఒకదానికి ముందు, అతనికి ఒక కల వచ్చింది, అక్కడ అతని ముందు తెల్లటి శిలువ కనిపించింది. క్రైస్తవులు తన కోసం ప్రార్థిస్తే యుద్ధంలో గెలుస్తాననేది శకునంగా భావించాడు. అతను తన కవచాలపై శిలువలను చిత్రించాడు, ఆపై రోమన్ సామ్రాజ్యంపై పాలనను గెలవడానికి తీవ్ర అనుకూల పరిస్థితులను ఓడించాడు. కొత్త చక్రవర్తిగా, అతను క్రైస్తవులను ప్రబలంగా చంపడం మరియు హింసించడాన్ని త్వరగా ఆపివేసి, వారికి ఆరాధనా స్వేచ్ఛను ఇచ్చాడు.

కాన్స్టాంటైన్ మొదటి “క్రిస్టియన్” రోమన్ చక్రవర్తిగా పిలువబడ్డాడు, అయితే అతని క్రైస్తవ మతం రాజకీయంగా మాత్రమే ఉంది. రాజకీయ ప్రవీణుడుగా అతని సామర్థ్యమే అతని గొప్ప ఆస్తి. అతను తన రాజ్యంలో క్రైస్తవ మతంలోని వివిధ వర్గాల మధ్య, అలాగే అన్యమతస్థుల మధ్య విభజనను చూశాడు. తన రాజ్యాన్ని బలోపేతం చేయడానికి, అతను మతపరమైన విభేదాలను పరిష్కరించడానికి మత పెద్దలను (నైసీన్ మండలి) ఒకచోట చేర్చాడు. వారు చర్చించిన విషయాలలో: క్రీస్తు యొక్క దైవత్వము ,దేవత్వము, శాశ్వతమైన పుత్రత్వం, ఈస్టర్ మరియు ఇతర సెలవులు జరుపుకునే తేదీ మరియు వేరేవి . సిద్ధాంతపరమైన సమస్యలపై (ఎక్యుమెనికలిజం- వివిధ మత వర్గాల మధ్య సహకారం మరియు అవగాహనను ప్రోత్సహించే ఉద్యమం) ఒక ఒప్పందానికి రావడానికి పెద్ద సంఖ్యలో మత పెద్దలను (బిషప్‌లు) సమావేశపరచడానికి రాష్ట్ర (రోమ్) అధికారాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. మండలి సాధారణ ప్రజలపై కాథలిక్ సిద్ధాంతాలను అమలు చేయడానికి చర్చ్ కి అధికారము ఇవ్వడానికి చర్చ్ తో రాష్ట్ర (రోమ్) అధికారాన్ని మిళితం చేసింది. ఆ విధంగా, గుర్రపు స్వారీ చేసేవానికి తన కత్తిని చంపడానికి ఇవ్వబడిందని మనం చూస్తాము.

ఏడు సంఘ కాలముల వివరణ”లో కాన్‌స్టాంటైన్ గురించి సహోదరుడు బ్రాన్‌హామ్ వ్రాసినది ఇక్కడ ఉంది.

హింస మరియు మరణం నుండి విముక్తి పొందుటకు ఇతడిచ్చిన స్వాతంత్ర్యము అది మొదట కనిపించినంత ఉదారముగా కనబడలేదు. కాన్‌స్టాంటైన్ ఇప్పుడు అమలుచేయ అధికారి వలె హోదా పొందెను. అమలు చేయవలసిన వాడు ప్రేక్షకుని వలె సర్దుకు పోలేడు కదా. సంఘము యొక్క వ్యవహారములలో తాను కూడా సహాయపడుటకు తీర్మానించుకొనెను. ఆ యా విషయాలు మీద వారు వివేదములు కలిగియున్నట్లు అతడు చూచెను. అలెగ్జాండర్ బిషప్ అరియస్, తన అనుచరులకు తప్పుడు భోద చేసెను. యేసు కేవలము దేవుడు అనుట తప్పు అనియు, దేవుని కంటే తక్కువ వాడనియు, దేవుని ద్వారా సృజింపబడినవాడనియు చెప్పెను.  పాశ్చాత్య సంఘము అందుకు భిన్నమైన  అభిప్రాయమును కలిగి ఉండెను. యేసు దేవుడనియు తండ్రితో సరిసమానుడు అనియు వారు నమ్ముచుండిరి.ఇటువంటి సంగతులతో పాటు అన్య ఆచారములు ఆరాధనలోకి ప్రవేశించినవి.325లో నైసీన్ మండలికి చక్రవర్తి పిలుపునిచ్చాడు, అతను అన్ని గుంపులును ఏకము చేయవచ్చు అని, వారు తమ విభేదాలను విస్మరించి ,ఒక సామాన్య అవగాహనకు వచ్చుదరని ,అందరూ ఒకటగుదురని తలంచెను.ఇది కాన్‌స్టాంటైన్‌తో ప్రారంభమైనప్పటికీ, అది అంతం కాలేదు, “ప్రపంచ సంఘ సమితిగా” నేటికి చాలా సజీవంగా ఉండటం విచిత్రం కాదా? నిజంగా ఆనాడు అతడు సాధించవలెననుకొనునది ఈనాడు ఈ ప్రపంచ సంఘ ఉద్యమము ద్వారా సాధించబడుచున్నది.

పెర్గమె సంఘ కాలము అధ్యాయము.5
నైసియా మొదటి మండలి, (325AD)

కాన్‌స్టాంటైన్ ప్రారంభించిన దానితో పోలిస్తే డయోక్లెషియన్ చక్రవర్తి మరియు అతని దుష్కార్యాలు ఒక చిన్న విషయం, అన్నీ ఐక్యత పేరుతోనే. నేటికీ, కాన్‌స్టాంటైన్ యొక్క ప్రపంచ సంఘ ఉద్యమ మండలి (ఎక్యుమెనికల్ మండలి)  యొక్క అదే ఆత్మ ద్వారా పోప్ శక్తి విస్తరించి కొనసాగడం మనం చూస్తున్నాము.

ఈరోజు పోప్ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇది అమెరికా యొక్క ఘనమైన స్థాపనకు చాలా వ్యత్యాసంగా ఉంది. 1919లో రోమ్‌లో ఆగిన వుడ్రో విల్సన్ మినహా మరే అధ్యక్షుడు 1959 వరకు పోప్‌ను కలవలేదు. ఆ సంవత్సరం డిసెంబరు 6న ఐసెన్‌హోవర్ యొక్క సమావేశం U.S.లో విధాన మార్పును తీసుకువంచింది, ఇది పోప్‌తో ప్రతి తదుపరి అధ్యక్షుని సమావేశానికి దారితీసింది. అప్పటి నుండి, 1962 క్యూబా క్షిపణి సంక్షోభం, 1979 నాటి ఇరాన్ బందీ సంక్షోభం, ప్రచ్ఛన్న యుద్ధం మరియు సోవియట్ యూనియన్ పతనం ,మరియు ఇటీవలి కాలంలో దౌత్య సంబంధాలు మరియు కమ్యూనిస్ట్ దేశం క్యూబాతో వాణిజ్యం తో సహా అమెరికా యొక్క ప్రధాన అంతర్జాతీయ వ్యవహారాల్లో పోప్‌లు కీలక పాత్ర పోషించారు.

దాదాపు సరిగ్గా 50 సంవత్సరాల క్రితం, పోప్ పాల్ VI న్యూయార్క్ వచ్చారు, అక్కడ ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి  సభలో ప్రసంగించారు. అక్టోబరు 4, 1965 నాటి తన ప్రసంగం నుండి ఒక సారాంశం ఇక్కడ ఉంది, దేశాలను ఏకం చేయాలనే UN లక్ష్యం గురించి మాట్లాడుతూ మరియు మతాలను ఏకం చేయాలనే కాథలిక్ చర్చి యొక్క లక్ష్యంతో దానిని పోల్చారు:

మనం సూత్రాన్ని ఉపయోగించుకుందాం: వాటిని ఒకదానితో ఒకటి కలపడానికి. మీరు ఒక అనుబంధం, ప్రజల మధ్య వారధి, రాష్ట్రాల మధ్య సంబంధాల వ్యవస్థ. మీ యొక్క ఈ లక్షణం ఒక విధంగా మా కాథలిక్ చర్చి ఆధ్యాత్మిక క్రమంలో ఉండాలనుకుంటున్న దానిని లౌకిక క్రమంలో ప్రతిబింబిస్తుందని చెప్పాలని  మేము తహతహలాడుతున్నాం: ఒకటి మరియు సార్వత్రికము.

పోప్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఆకర్షణీయమైన దానిలో తన చేతిని దూర్చుతున్నాడు: పేదలకు ఆహారం ఇవ్వడం, పేదరికాన్ని నిర్మూలించడం మరియు భౌగోళిక ఉష్ణోగ్రతను ఆపడం. కాంగ్రెస్ సంయుక్త సమ్మవేశములో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా, ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ఈ అంశాలపై ప్రసంగించనున్నారు. ప్రపంచ రాజకీయ రంగంలో తనని తాను అగ్రగామిగా నిలబెట్టుకుంటున్నాడు.

ఫిలదెల్ఫియాలోని ప్రపంచ కుటుంబాల సమావేశంలో అతను శనివారం “కుటుంబ విలువలు” గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ వారు అమెరికా గడ్డపై ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ప్రజలు గుమికూడతారని ఆశిస్తున్నారు. మేము పంచుకోవాలనుకుంటున్న ప్రోత్సాహకరమైన సమాచారం ఏమిటంటే, పోప్ ఊరేగింపులో ఒక బిల్‌బోర్డ్‌ను రిజర్వ్ చేయాలనే ఆలోచనతో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వేలాది మంది ప్రజలు ప్రార్థన పూసలు పట్టుకున్న మహిళ యొక్క చిత్రాన్ని  ఈ  ప్రశ్నతో చూస్తారు. “నామంలో… నామం ఏమిటి? www.themessage.com“. ఈ కరపత్రం ప్రత్యేకంగా క్యాథలిక్‌ల కోసం రూపొందించబడింది, వీరిలో చాలామంది తమ తల్లి సంఘం నుండి తప్ప ఎటువంటి మతపరమైన ప్రచరణలను తీసుకోరు. పదిలక్షల మంది హాజరవుతుండగా, ఆ పదిలక్షలలో ఒకరు, కేవలము ఒకరు ఉండవచ్చు,

పోప్ ఆదివారం సాయంత్రం 8:00 గంటలకు బయలుదేరి, అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా మేఘాల మీదుగా ప్రయాణిస్తారు. చంద్రగ్రహణం 8:11 గంటలకు ప్రారంభమవుతుంది. అతను నిస్సందేహంగా తన కిటికీలో నుండి రక్తవర్ణములో ఉన్న చంద్రుడిని చూస్తాడు. దుష్ట రోమన్ పాలన చేతిలో శతాబ్దాలుగా హింసించబడిన మరియు హత్య చేయబడిన నమ్మకమైన చిన్న సంఘము గురించి అతను ఆలోచించవచ్చు లేదా ఫిలదెల్ఫియాలో అతను చూసిన ఆ బిల్‌బోర్డ్ గురించి ఆలోచించవచ్చు.

మేము రేపు ఆదివారం రక్తవర్ణములో యున్న చంద్రునిపై ఒక కథనాన్ని పోస్ట్ చేస్తాము.

An Independent Church of the WORD,