https://branham.org/en/articles/2172020_OnlyBelieve నుండి అనువదించబడింది
మేము మెక్సికోలోని ఒక సోదరి నుండి ఈ సాక్ష్యాన్ని అందుకున్నాము. :
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు వధువుకు.
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామంలో నేను మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్న, నేడు మరియు యుగయుగములు ఒకటేరీతిగా ఉన్నాడని నిశ్చయించుకునేలా నా సోదరులు మరియు సోదరీమణులను ప్రోత్సహించడానికి ఈ రోజు నేను ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం మన ప్రియమైన ప్రవక్త విలియం మారియన్ బ్రాన్‌హామ్ యొక్క టేపులపై ఉంది.
నమ్మిక మాత్రముంచుము అన్నీ సాధ్యమే.
నా పేరు గ్లాడిస్ వి. టోర్రెస్ డి పెరెజ్. నేను మెక్సికోలోని మైకోకాన్‌లోని ఉరుపాన్‌లో నివసిస్తున్నాను. సుమారు ఐదు నెలల క్రితం నాకు వెన్నునొప్పి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది, నా ఛాతీలో గురక మరియు విపరీతమైన అలసట వచ్చింది. డిసెంబరు చివరిలో, ఇది సాధారణ ఫ్లూ లాగా కనిపించింది. తక్కువ వ్యవధిలో మూడుసార్లు వచ్చి వెళ్లింది. మేము వైద్యుడిని సందర్శించాము, అతను నాకు చికిత్స అందించాడు, అది మూడు సార్లు పనిచేసి ఉండాల్సింది, కానీ నా ఊపిరితిత్తులు చాలా అధ్వాన్నంగా మారాయి.
జనవరి 9న ఊపిరి పీల్చుకోవడం కష్టమైనది. నేను డాక్టర్ వద్దకు తిరిగి వెళ్ళాను,అది బ్రోన్కైటిస్ అని చెప్పారు.ఆయన నాకు సరైన చికిత్స అందించారు మరియు మొత్తం విశ్రాంతిని తీసుకోమన్నారు. “ఐదు రోజుల్లో నువ్వు బాగుపడతావు. బాగుండకపోతే మళ్ళీ రా” అన్నారు.
కానీ నేను బాగుపడలేదు, నేను అధ్వాన్నంగా ఉన్నాను. నాకు చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది మరియు నా ఛాతీలో నొప్పి చాలా బలంగా ప్రారంభమైనది, అది నా ఎడమ చేతికి వ్యాపించింది, దీనివల్ల వణుకు మరియు అధిక చెమట పట్టింది. చాలా రోజులుగా అది తగ్గడం లేదు. నేను న్యుమోనియాకు చికిత్స చేసిన డాక్టర్ వద్దకు మళ్లీ వెళ్లాను. నిరాశా నిస్పృహల మధ్య, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నాకు తెలుసు.
నేను లైఫ్‌లైన్ యాప్‌ను తెరిచాను (దీనిని నేను ఆంగ్ల భాషలో ఉంచాను). ఒక ట్రక్కు లోపలి చిత్రం వెంటనే నా దృష్టిని ఆకర్షించింది. దీనిని “ఆశ్చర్యపరచకుండా ఎప్పుడూ లేదు” అని అంటారు. ఈ సాక్ష్యంలో, దేవుడు ఉన్నాడని నిశ్చయత కలిగి ఉండు అనే శీర్షికతో ప్రవక్త వర్తమానము యొక్క CDని ప్లే చేయడం ద్వారా పాడైపోతున్న ట్రక్కును ఎలా మరమ్మతులు చేశారనే దానికి సంబంధించినది. మనకు చాలినంత విశ్వాసం ఉంటే దేవుడు ఇంకా అద్భుతాలు చేస్తున్నాడని చూసి నేను సంతోషించాను మరియు ఆశ్చర్యపోయాను. నేను ఏడ్చిఇలా అన్నాను, “ప్రభువా, మీరు మీ వాక్యము యొక్క వర్తమానమును ప్లే చేయడం ద్వారా ట్రక్కును సరిచేయగలిగితే, మీరు నా శ్వాసనాళాలు మరియు ఊపిరితిత్తులను పునరుద్ధరించగలరని నాకు తెలుసు.”
నేను “దేవుడు ఉన్నాడని నిశ్చయత కలిగి ఉండు” అనే వర్తమానమును ప్లే చేసి, ఆ పరికరాన్ని నా ఛాతీపై ఉంచాను. కొన్ని నిమిషాలు గడిచాయి, అకస్మాత్తుగా నాకు దగ్గు వచ్చింది. నేను పారదర్శకంగా కనబడే, చాలా జిగటగా ఉండిన నీటిని దగ్గడం ప్రారంభించాను. ఇది మూడు రోజుల పాటు కొనసాగింది. నా ఊపిరితిత్తులు కొద్దికొద్దిగా ఎలా పునరుద్ధరించబడుతున్నాయో నేను అనుభూతి చెందాను. ఈరోజు, శనివారం, ఫిబ్రవరి 1, 2020, నేను మేల్కొన్నప్పుడు, నేను లోతైన శ్వాస తీసుకున్నాను మరియు నాకు కొత్త ఊపిరితిత్తులను ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాను. దేవునికే మహిమ.
సోదరులు మరియు సోదరీమణులారా, భయపడవద్దు, నిరాశ చెందకండి. నమ్మకమైనవాడు అని పిలువబడే ఏకైక ఆయన మనలను జీవింపచేస్తున్నాడు. ఆయన పిల్లలచే స్వీకరించబడటానికి త్వరపెట్టుచున్న శక్తి మన మధ్య వేచి ఉంది.
దేవుడు మిమ్మలిని దీవించును గాక.
క్రీస్తులో మీ సోదరి
గ్లాడిస్ డి పెరెజ్