హాలోవీన్ – నిజమైన అర్థం

https://branham.org/en/articles/10272016_HalloweenTheTrueMeaning

ఈరోజు హాలోవీన్. ఈ సాయంత్రం, యునైటెడ్ స్టేట్స్ యొక్క వీధులు (మరియు అనేక ఇతర దేశాలు) పిశాచమైన దుస్తులు ధరించిన పిల్లలతో నిండిపోతాయి, ఇంటింటికీ వెళ్లి మిఠాయిలు సేకరిస్తారు. మరియు ఇది పిల్లల కోసం మాత్రమే కాదు. భక్తిహీనమైన వేషధారణలతో పాపపు విందులుతో సంవత్సరంలో ఈ సమయములో ప్రతిచోటా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ, అక్టోబరు 31  చనిపోయిన వారితో సహవాసము అనేది ఒక గగుర్పాటు కలిగించే జ్ఞాపకార్థం అనిపించినప్పటికీ- మరియు గత 2,000 సంవత్సరాలలో చాలా విషయాల వలె, క్యాథలిక్ సంఘము ఈ సెలవుదినం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించింది – ఈ దినం మన హృదయాలలో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండాలి. మొదటగా, హాలోవీన్ యొక్క మూలాల గురించి కొంచెం చరిత్ర చూద్దాము.

హాలోవీన్ కొన్ని కలతపెట్టే అన్యమత పద్ధతులలో దాని మూలాలను కలిగి ఉంది. యేసు భూమిపై ఉన్న సమయంలోనే, ఇప్పుడు ఐర్లాండ్, యుకె మరియు ఉత్తర ఫ్రాన్స్ అని పిలువబడే ప్రాంతాలలో సెల్టులు ఆధిపత్యంలో ఉన్నారు. వారు నవంబర్ 1 న నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు, కానీ నూతన సంవత్సరానికి ముందు రాత్రి, జీవించి ఉన్న మరియు చనిపోయిన వారి మధ్య రేఖ అస్పష్టంగా మారిందని వారు విశ్వసించారు. సెల్టిక్ పూజారులు లేదా డ్రూయిడులు, ఈ ప్రత్యేక రాత్రి చనిపోయిన వారితో సులభంగా సంభాషించడానికి మరియు రాబోయే విషయాలను ముందుగా చెప్పడానికి లేదా దైవికమైన భవిష్యత్తును చూసేందుకు వీలు కల్పిస్తుందని భావించారు.

తమను తాము దాచుకోవడానికి మరియు ఈ రాత్రి విస్తారంగా ఉన్న దుష్టశక్తులతో కలిసిపోవడానికి, డ్రూయిడ్స్ జంతు చర్మాలు, పుర్రెలు, ఎముకలు మరియు వారు మాట్లాడదలిచిన ఆత్మల వలె కనిపించే వాటితో తమను తాము కప్పుకున్నారు. హాలోవీన్ దుస్తులు ఇప్పటికీ తరచుగా మరణంతో ముడిపడి ఉన్నాయని మీరు గమనించవచ్చు.

చనిపోయిన వారి దినము పవిత్ర దినాలు (ది డే ఆఫ్ ది డెడ్ హోలీ డేస్ )

A.D. 43 నాటికి, రోమన్ సామ్రాజ్యం పూర్వపు సెల్టిక్ భూములను పాలించింది. రోమన్లు వారి స్వంత రెండు పండుగలను (పోమోనా రోమన్ పండుగ  ( రోమన్ పండ్ల దేవత) మరియు చనిపోయినవారిని స్మరించుకునే రోజు) సెల్టిక్ సంప్రదాయం యొక్క భవిష్యవాణితో (ముందు చెప్పినట్లుగా) కలిపారు. వేడుకలను కలపడం రోమన్లకు మంచి రాజకీయ ఎత్తుగడ. బిలాము, కాన్స్టాంటైన్ మరియు అనేకమంది ఇతరుల నుండి మనకు తెలిసినట్లుగా, సాతానుడు చరిత్ర అంతటా “మిశ్రమ” ఆత్మను నిపుణంగా ఉపయోగించాడు.

ఇప్పటివరకు వింతగా అనిపిస్తుందా? కాథలిక్ సంఘము జోక్యం చేసుకున్నప్పుడు ఇది మరింత దిగజారుతుంది.

కొన్ని వందల సంవత్సరాల తరువాత, విగ్రహారాధన మరియు క్రైస్తవ్యాన్ని మిళితం చేసే ప్రత్యేక మైన కాథలిక్ పద్ధతిలో, “ఆల్ సెయింట్స్ డే” స్థాపించబడింది మరియు చనిపోయినవారి యొక్క డ్రూయిడ్ వేడుకతో బాగా సరిపోయేలా కనిపించింది. పవిత్రమైన రోజు నవంబర్ 1, సెల్టిక్ న్యూ ఇయర్ నాడు పెట్టబడింది. చర్చి ప్రకారం, ఆల్ సెయింట్స్ డే లేదా “ఆల్ హాలోస్ డే” అనేది “స్వర్గంలో గొప్ప అందమైన దర్శనాన్ని పొందిన” వారి వేడుక. ప్రాథమికంగా, ఇది మరణించిన మరియు స్వర్గానికి వెళ్ళిన వారిని గౌరవిస్తుంది. కొన్ని సంస్కృతులలో, ప్రజలు మరణించిన వారి ఆత్మలతో ఉండటానికి స్మశానవాటికలకు వెళతారు మరియు ఇష్టమైన ఆహారాలు మరియు పానీయాలు అలాగే మరణించిన వారి ఫోటోలు మరియు జ్ఞాపకాలను కలిగి ఉన్న వ్వ్యక్తిగత బలిపీఠాలను నిర్మిస్తారు. ఆత్మల సందర్శనలను ప్రోత్సహించడం దీని ఉద్దేశం, తద్వారా జీవిస్తున్న వారు నిర్దేశించిన ప్రార్థనలు మరియు  వ్యాఖ్యలను ఆత్మలు వింటాయని . నవంబర్ 1 “బాధ్యత దినం”గా పరిగణించబడుతుంది, అంటే కాథలిక్కులందరూ తప్పనిసరిగా మాస్ (mass)కి హాజరు కావాలి.

ముందుగా పేర్కొన్న డ్రూయిడ్/అన్యమత వేడుక ఆల్ హాలోస్ డే (ఆల్ సెయింట్స్ డే) సందర్భంగా జరిగింది, కాబట్టి దీనిని హాలోస్ ఈవ్ అంటారు. హాలోవీన్ అని కూడా అంటారు. మరియు… అది మరింత దిగజారుతుంది (చింతించకండి, వ్యాసం చివరలో ఇది  మెరుగుపడుతుంది).

రాజకీయపరంగా సరైన, అన్నిటినీ కలిపుకొనె ఆత్మను కలిగిన కాథలిక్ చర్చి వారు నవంబర్ 2న మరో సెలవు దినాన్ని జోడించారు. “ఆల్ సోల్స్ డే” మరణించిన ప్రతి ఒక్కరినీ గౌరవిస్తుంది, వారు స్వర్గానికి వెళ్లినా లేదా. “లేదా” భాగం కొంచెం కలవరపెడుతుంది, కానీ మేము ఈ వ్యాసంలో దానిలోకి వెళ్లము. మునుపటి రోజు వలె, కొన్ని మతపరమైన పండుగలలో ప్రజలు చనిపోయిన వారి వలె దుస్తులు ధరిస్తారు, మరణించిన వారి ఆత్మలను స్వాగతించడానికి ప్రయత్నిస్తారు. ఇది అధికారిక “చనిపోయిన వారి రోజు” మరియు సాధారణంగా వేడుక యొక్క చివరి రోజు.

A group of people wearing clothing

Description automatically generated

ప్రపంచంలోని ఏ మతం అయినా నిర్వహించే విచిత్రమైన మూడు రోజుల ఆచారాన్ని ఇది పూర్తి చేస్తుంది: ది కాథలిక్ డే ఆఫ్ ది డెడ్ హోలీ డేస్. ఇదంతా ఈరోజు హాలోవీన్‌తో మొదలవుతుంది.

నిజమైన వేడుక

ఇప్పుడు మీ ముఖము నుండి కోపమును తీసివేసి మరియు మీరు మళ్లీ నవ్వడం ప్రారంభిస్తారు. అక్టోబరు 31 కూడా క్రైస్తవ మత చరిత్రలో గొప్ప రోజులలో ఒకటిగా పరిగణించబడుతుందని మీకు తెలుసా? ఇది కాథలిక్ చర్చిచే అరుదుగా పేర్కొనబడే విషయం, దీనిని కాకుండా చెడు దుస్తులను మరియు చనిపోయినవారి ఆరాధనను ప్రోత్సహించడానికి ఇష్టపడతుంది. ఈరోజు చాలా తక్కువగా తెలిసిన సెలవుదినం, ఇది అక్టోబర్ 31, 1517న ప్రారంభమైంది, జర్మనీలోని ఒక చర్చి భాగము వహిస్తుంది , దీనిని ఆల్ సెయింట్స్ చర్చ్ అని వ్యంగ్యంగా పిలుస్తారు. మీరు సంఘకాల పుస్తకాన్ని చదివి ఉంటే, అది కాజిల్ చర్చ్ అని మీకు తెలుసు.

మార్టిన్ లూథర్ జర్మనీలోని విట్టెన్‌బర్గ్‌లోని కాజిల్ చర్చ్ తలుపుకు తన 95 థీసెస్‌ని(మత సూత్రాలను) వ్రేలాడదీసి, క్రైస్తవ సంస్కరణను ప్రారంభించిన రోజు ఇది! ఇదంతా నేటికి సరిగ్గా 499 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది! అవును, కాథలిక్ చర్చి దాని కంటే పిశాచాలు మరియు అస్థిపంజరాలతో సహా దేనినైనా గౌరవిస్తుంది!

Text Box: మార్టిన్ లూథర్ జర్మనీలోని విట్టెన్‌బర్గ్‌లోని కాజిల్ చర్చ్ తలుపుకు తన 95 థీసెస్‌ని(మత సూత్రాలను) వ్రేలాడదీసి, క్రైస్తవ సంస్కరణను ప్రారంభించిన రోజు ఇది! ఇదంతా నేటికి సరిగ్గా 499 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది! అవును, కాథలిక్ చర్చి దాని కంటే పిశాచాలు మరియు అస్థిపంజరాలతో సహా దేనినైనా గౌరవిస్తుంది!
కాబట్టి, ప్రపంచం అస్థిపంజరాలు మరియు రక్త పిశాచులను జరుపుకుంటున్నందున, ప్రపంచాన్ని మార్చిన సంస్కరణ యొక్క  ప్రారంభాన్ని మనం జరుపుకోవచ్చు.

కాబట్టి, ప్రపంచం అస్థిపంజరాలు మరియు రక్త పిశాచులను జరుపుకుంటున్నందున, ప్రపంచాన్ని మార్చిన సంస్కరణ యొక్క  ప్రారంభాన్ని మనం జరుపుకోవచ్చు.

సంస్కరణ దినోత్సవ శుభాకాంక్షలు!

మీరు హాలోవీన్ గురించి కొంచెం ఎక్కువ చదవాలనుకుంటే, యంగ్ ఫౌండేషన్స్ ఈ లింక్‌లో ఒక కథనాన్ని పోస్ట్ చేసింది: హాలోవీన్ ఎ మిత్ ఆర్ ది ట్రూత్

An Independent Church of the WORD,