ఎందుకంటే దేవుడు అలా చెప్పాడు

https://branham.org/articles/8152018_BecauseGodSaidSo నుండి అనువదించబడింది

మరియు మీరు మీ హృదయంలో గొప్ప అభ్యర్థనను కలిగి ఉన్నారు మరియు విశ్వాసముగలఅభ్యర్థనను కలిగి ఉన్నారు. మీరు తల్లి కావాలని, బిడ్డను మీ చేతుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నారు. అని ప్రభువు ఈలాగు సెలవిస్తున్నాడు. వెళ్లి స్వీకరించు; నా సహోదరి, నేను నిన్ను యేసుక్రీస్తు నామంలో ఆశీర్వదిస్తున్నాను. ఆమెన్. దేవునిపై విశ్వాసం కలిగి ఉండు. సందేహించకు.

58-0625 సొలొమోను కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు

పిల్లల విషయంలో ఈ కుటుంబానికి అంతా చేదు వార్తే. వారు తమ పుట్టబోయే బిడ్డను కోల్పోయారు, కానీ వారు తమ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. వారు గర్భం దాల్చిన తర్వాత, వారి విశ్వాసాన్ని అధిగమించడానికి హెచ్చరికలు మరియు అడ్డంకులు ఉన్నాయి. కానీ అది వారికి పట్టింపు లేదు, ఉండకూడదు కూడా. విశ్వాసము, లేని వాటిని ఉన్నట్లుగా చేసింది. వారి పరీక్ష విజయంగా మరియు మీ విశ్వాసాన్ని బలపరిచే సాక్ష్యంగా మారింది.

ఈ గొప్ప ఆశీర్వాదాన్ని కోరుకునే వారికి ఈ సాక్ష్యం ఆశీర్వదించాలని మరియు ప్రోత్సహించాలని నేను ప్రార్థిస్తున్నాను. 

నాకు మరియు నా భర్తకు పెళ్లయి కొంతకాలం గడిచినా పిల్లలు లేరు. చివరకు నేను గర్భవతి అయినప్పుడు, వైద్యులు రెండు గర్భాశయ ఫైబ్రాయిడ్లను కనుగొన్నారు. మేము దేవుణ్ణి విశ్వసిస్తూ దాని గురించి ప్రార్థించాము, మరియు నాకు కొడుకు పుడతాడని ప్రభువు నాకు కలలో చూపించాడు.

నెలలు నిండకుండానే ప్రసవం కారణంగా 19 వారాలకే చిన్నారి మరణించింది. మా ఇద్దరికి అమితమైన బాధ కలిగిందని చెప్పనవసరం లేదు. పసిపిల్లల్లా ఏడ్చేశాం. తర్వాత నా తల్లితో మాట్లాడటం నాకు గుర్తుంది; నేను చాలా విచారంగా మరియు కృంగిపోయాను, కానీ ఇంత జరిగినా, నేను ఇలా అన్నాను, “అమ్మా, ప్రభువు నాకు కొడుకు పుడతాడని చెప్పాడు, కానీ  ఎప్పుడు అన్నది చెప్పలేదు.”

నేను ఎక్కువగా ప్రార్థించడం మొదలుపెట్టాను,  మరియు నేను చాలా హృదయవిదారకంగా ఉన్నాను, హన్నా ఎలా భావించి ఉంటుందో ఇప్పుడు నాకు తెలిసోచ్చింధి. నా భర్త నన్ను ఓదార్చడానికి చెప్పగలిగేది లేదా చేయగలిగేది ఏమీ లేకుండెను. చిరునవ్వుతో సేవకు హాజరవుతాను, కాని ఇంట్లో నేను కన్నీళ్లతో ఉన్నాను.

ఒక రాత్రి మా కాపరి విశ్వాసం గురించి బోధించడం నాకు గుర్తుంది, మరియు అతను ఇలా అన్నారు, “ఎందుకు మీ పట్ల మీరు జాలిపడుతూ, ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు?”. అది నేనే కాబట్టి ఆ మాట నాకు తట్టింది. గడిచిన రాత్రే నేను ఏడ్చాను.

నేను ప్రార్థన కొనసాగించాను, మరియు సమయానికి ప్రభువు ఆ గాయాన్ని మూసివేసాడు. నేను కనుగొన్న ప్రతి విశ్వాస సందేశాన్ని చదవడం ప్రారంభించాను. ప్రభువు బిడ్డను అనుగ్రహించిన ప్రతి  సంతాన ప్రాప్తి లేని స్త్రీ గురించి బైబిల్లో నేను తప్పక దాదాపు ప్రతి రోజు చదివి ఉంటాను. మేము మా బిడ్డను కోల్పోయిన సంవత్సరం, మా కుక్క చనిపోయింది మరియు భారీ వర్షం కారణంగా మా ఇల్లు జలమయమైంది, కానీ మేము ప్రభువును విశ్వసించటం కొనసాగించాము.

ఒక రాత్రి నేను చర్చిలో కూర్చున్నాను మరియు ప్రభువు నాతో ఇలా మాట్లాడాడు, “నీకు కావలసిన ఆ బిడ్డను నేను నీకు అనుగ్రహిస్తే నీవు ఏమి చేస్తావు? నీవు ఎలా ఉంటావు?”. నేను సమాధానం చెప్పలేదు, కానీ నేను ఎంత సంతోషంగా ఉంటానో అనుకున్నాను. ఆ స్వరం (ప్రభువు) ఇలా అన్నాడు, “నీవు అలాగే ఉండాలి మరియు ఇది ఎప్పుడో పూర్తయింది కాబట్టి ఇది నీ విశ్వాసాన్ని చూపుతుంది.”నేను, “అవును, ప్రభూ” అని తలంచాను, ఆ సంవత్సరంలో కొంత సమయము తర్వాత, నేను అప్పటికే గర్భవతిని అని నాకు తెలియదు. వైద్యులు నా గర్భాన్ని నిర్ధారించడానికి మరియు నేను బిడ్డను చూడడానికి పది వారాలు పట్టింది. నేను కన్నీళ్లు పెట్టుకున్నాను ; మా ఇల్లు చాలా సంతోషంగా ఉంది.

గర్భం స్థాపించబడిన తర్వాత, మళ్లీ రక్తస్రావం ప్రారంభమైంది. మా డాక్టర్‌ను సందర్శించిన సంగతి నాకు గుర్తుంది. ఆమె చెప్పింది, “గర్భస్రావం జరిగే అవకాశం కనిపిస్తోంది.” నా భర్త ఆమె వైపు చూసి, “మేము ఈ విషయంలో  దేవుణ్ణి నమ్ముతున్నాం” అన్నారు. మమ్మల్ని నిలబెట్టినది దేవుని వాక్యమే.

“ఇది ఇప్పటికే పూర్తయింది” అని నా తలలో నిరంతరము పునరావృత్తం చేసుకున్నట్టు నాకుగుర్తుంది.  మేము అసత్యమైన వ్యర్ధదేవతలు గురించిన వర్తమానములను చదవడం ప్రారంభించాము. నేను కనుగొన్న ప్రతి సాక్ష్యాన్ని నేను చదివాను మరియు ముఖ్యంగా, మేము ఆ విశ్వాసాన్ని పట్టుకొని ప్రార్థించాము.  

నేను  “భయపడిన” క్షణాలు ఉండెను, కానీ నేను ప్రార్థించాను మరియు నేను దేవుడు ఇచ్చిన ఆ వాక్యముకు కట్టుబడి ఉన్నాను. ఒక వారం తర్వాత, ప్రభువు మాకు ఒక మార్గాన్ని తెరిచాడు, మరియు నన్ను ఇద్దరు వైద్యులు పరీక్షించారు. రక్తస్రావం జరిగినట్లు కనిపించలేదు. యథాప్రకారం పరీక్షలుకొనసాగాయి మరియు నా మునుపటి గర్భం నుండి ఉండిన రెండు ఫైబ్రాయిడ్‌లు గట్టిబడ్డాయనినేను తరువాత తెలుసుకున్నాను. దేవుని కృప వల్ల అవి చచ్చిన స్థితిలో ఉన్నాయి, కానీ అవి ఇంకా లోపలే ఉన్నాయి.

నా వైద్యుడు గర్భాన్ని చాలా దగ్గరగా పర్యవేక్షించాడు. నేను ప్రతి రెండు మూడు వారాలకు అల్ట్రాసౌండ్లు చేయించుకున్నాను. అడుగడుగునా యుద్ధాలు జరిగాయి, కానీ దేవుడు విజయాన్ని ఇచ్చాడు. నా అల్ట్రాసౌండ్ దీన్ని నిర్ధారించండానికి ముందు, నేను అందరికీ చెప్పాను, “ఇది అబ్బాయి” అని. వారు, “సరే నీకు ఎలా తెలుసు?” అని అడిగినప్పుడు, నా సమాధానం, “దేవుడు అలా చెప్పాడు.”

28 వారాలలో నా గర్భాశయం తెరవడం ప్రారంభించిందని నాకు గుర్తుంది, ఆ రోజు నేను వెంటనే ఆసుపత్రిలో చేరాను. వైద్యులకు ఏమి చేయాలో అర్థం కాలేదు, నాకు నొప్పి లేదు మరియు రక్తస్రావం లేదు. వారు నా కేసు మరియు సాధ్యమైనంత ఉత్తమమైన కార్యచర్య గురించి చర్చించడానికి సమావేశమయ్యారు, కానీ వారికి ఇంకా ఏమి చేయాలో అర్థం కాలేదు.

వారు సాధ్యాసాధ్యాలు మరియు ఫలితాలను వివరించారు, ఆపై వారు ఏమీ చేయలేకపోయినందున నన్ను డిశ్చార్జ్ చేశారు. పిల్లవాడు 34 వారాల ముందు వస్తే, నన్ను పెద్ద ఆసుపత్రికి తరలించవలసి ఉంటుందని డాక్టర్ చెప్పారు. నేను గర్భం దాల్చినంత కాలం విశ్రాంతిలో ఉంచబడ్డాను.

నా 29-వారాల అల్ట్రాసౌండ్‌లో, సహజమైన ప్రసవ సమయంలో ఫైబ్రాయిడ్ శిశువుకు అడ్డుగా ఉంటుందా లేదా వారు సి-సెక్షన్ చేయవలసి ఉంటుందా అని డాక్టర్ పరీక్షించవలసి వచ్చింది.                           

ఆ రోజు ఆమె చూసింది మరియు దాని జాడ లేదు. దేవుడు నా ప్రార్థనలకు మళ్లీ సమాధానం ఇచ్చాడు. ఆపరేషన్ చేయవద్దని ప్రభువును అడిగాను. నేను ఇంకా స్వస్థపరచబడ్డాను. మా అబ్బాయి సరిగ్గా 34 వారాలకు ఎటువంటి సమస్యలు లేకుండా జన్మించాడు.

మేము అతనిని ఇంటికి తీసుకెళ్లి అతనిని జాగ్రత్తగా చూసుకోగలిగాము. ఈ రోజు, అతను ఇప్పుడు 11 నెలల ఆరోగ్యకరమైన మగబిడ్డగా ఉన్నాడు మరియు ఈ ఆశీర్వాదం కోసం మేము దేవునికి చాలా కృతజ్ఞులం.

దేవునికి  మహిమ కలుగునుగాక

-సోదరి కింబర్లీ

An Independent Church of the WORD,