హాలోవీన్: పురాణమా లేదా నిజమా ?

https://youngfoundations.org/articles/10292016_HalloweenAMythOrTheTruth

ఈ వారాంతంలో హాలోవీన్ రాబోతోందని అందరికీ తెలుసు, ఎందుకంటే మీరు తిరిగే ప్రతిచోటా మీరు దెయ్యాలు మరియు గోబ్లిన్‌లు(మరుగుజ్జు వలె ఉండే చిన్న దయ్యాలు)  మరియు ఆ కాలంలోని హీరోల వలె ప్రదర్శించబడే దుష్ట పాత్రలను చూస్తారు. మీరు నడిచే దాదాపు ప్రతి దుకాణంలో భయానక చలనచిత్రాలు మరియు చనిపోయి వెంటాడేవారి గగుర్పాటు కలిగించే సంగీతం మీ కళ్లు మరియు చెవులను పీడిస్తాయి. మరియు విచారకరమైన విషయమేమిటంటే, శతాబ్దాలుగా ” హాలోవీన్ యొక్క అన్యమత సంప్రదాయాలు ” జరుపుకునే వారు చేసినట్లే, అన్ని వయసుల వారు దుస్తులు ధరించి, వారితో కలిసిపోవడానికి ప్రయత్నిస్తూ ఈ సాతాను పాత్రలుగా నటిస్తూ వారాంతంలో గడుపుతారు. సూపర్‌మ్యాన్ మరియు బాట్‌మ్యాన్ వంటి కల్పిత పాత్రల నుండి మంత్రగత్తెలు, దెయ్యాలు మరియు గోబ్లిన్‌ల వరకు, వారు తమ అభిమాన హీరో లేదా పాత్రను ప్రదర్శిస్తారు, వారి మనస్సులు వంకరగా మరియు దెయ్యాల ప్రాంగణంలోకి వక్రీకరించబడి, చెడు భయానకం మధ్యలో విస్మయంతో కూర్చుంటారు. కేవలము దెయ్యాన్ని పూజిస్తున్నారని వారికి తెలిస్తే…

 …అయితే దెయ్యం ఉంది! ఖచ్చితంగా ఉంది. మరియు ప్రజలు దెయ్యాన్ని ఆరాధిస్తారు, వారు ఏమి చేస్తున్నారో కూడా తెలియదు…

-WMB 65-0425

దెయ్యం వారిని పట్టుకుంది. హాలోవీన్ రాత్రికి బయటికి వెళ్లి నీచంగా ప్రవర్తించడం సాధారణం మాత్రమే కాదు, హాలోవీన్ రాత్రి వేళ తలుపును తీసి చెట్టుకు వేలాడదీస్తారు లేదా చిన్నపిల్లలు చేసే నీచ కార్యాలు చేస్తారు లేదా వ్యవసాయధారుని బండిని తీసి రహదారిపై పెడతారు, అలా కాదు; అయితే వారు పిచ్చివారు. పిచ్చిబట్టిన వారు చేయునవి చేస్తారు, నిన్ను కాల్చివేస్తారు, చంపుతారు, హత్యచేస్తారు, విషం పెడతారు, ఏదైనా చేస్తారు. అది రాబోవుతున్న తరము.

-WMB 60-0221

దెయ్యాలు మరియు చనిపోయినవారి సంబరాలు జరుపుకోవడానికి దేశం సిద్ధమవుతుండగా, క్రైస్తవులు మాత్రం పరిశుద్ధాత్మ మరియు నిత్య జీవితంలో  తమ విశ్వాసాన్ని ఉంచుతున్నారు. మనం సజీవ దేవుడిని సేవిస్తున్నామని మరియు నిర్ధారించబడిన ప్రవక్త ద్వారా అందించబడిన నిజమైన వర్తమానమును విశ్వసిస్తున్నామని తెలుసుకోవడం ఆనందంగా ఉంది కదా! గగుర్పాటు కలిగించే గోబ్లిన్‌లకు మరియు దెయ్యాల పిశాచాలకు మన జీవితంలో చోటు లేదు. మన హృదయాలు విశ్వాసం మరియు ప్రేమతో నిండి ఉన్నాయి. ఈ వారాంతంలో, మీరు ఎవరో మరియు మీరు దేని కోసం నిలబడతారో గుర్తుంచుకోండి. ప్రపంచం ముందు దెయ్యం చిత్రీకరించే ప్రతి అబద్ధానికి, ఒక నిజమైన సత్యము ఉంది మరియు అది మన దగ్గర ఉంది!

మీరు ఎప్పుడైనా  వీధిలో ఒక ముసలి మంత్రగత్తెని చూసినప్పుడు, ఒక జ్యోతీష్యం లేదా సోది చెప్పేవారు , మీ చేతులు పట్టుకుని, “నువ్వు అలా-ఇలా .” అన్నప్పుడు, గుర్తుంచుకోండి, ఆ మంత్రగత్తె నిజమైన సత్యమైన దేవుని ప్రవక్త వలె నటిస్తోంది. అది నిజము. మీరు ఏదైనా అబద్ధమును చూసినప్పుడు, అది వేషధారణ కలిగుంటుంది; అది… సాతాను ఏదో వక్రీకరించి, దేవుడు కలిగియున్న సత్యమైనవాటి గురించి తప్పుడు భావన కలిగిస్తుంటాడు.-

-WMB 56-0815

సహోదరుడు జోసెఫ్ శాంతికరమైన జలముల (స్టిల్ వాటర్స్) వద్ద ఉన్న యువతకు మరియు టాబెర్నకెల్  వద్ద ఉన్న విశ్వాసులకు చెబుతున్నట్లుగా, మనము వేరే రకమైన హీరోలు మరియు పాత్రల కోసం చూస్తాము. మనము బైబిల్ యొక్క దేవుని హీరోల వైపు చూస్తాము మరియు మనమే దేవుని హీరోలము. మనము వారిలాగే దుస్తులు ధరిస్తాము, వారిలాగే ప్రవర్తిస్తాము, వారి గురించి మనకు మరింత చెప్పే సంగీతం మరియు వర్తమానములను వింటాము. అప్పుడు మనం అందరికంటే గొప్ప హీరో, మన ప్రభువైన యేసుక్రీస్తులా అవుతాము.

మనం విశ్వాసులుగా, సాతానును గౌరవించటానికి ప్రపంచం ఉపయోగించే రోజుని తీసుకొని  మరియు పాత నిబంధనలోని ప్రవక్తలు మరియు పితరులను గౌరవించటానికి దానిని ఉపయోగించవచ్చు. దెయ్యం లేదా గోబ్లిన్ల  కంటే అబ్రాహాము మరియు శారా, లేదా జాషువా మరియు కాలేబు వంటి వారికి నివాళులు అర్పించడం ద్వారా మరింత క్రైస్తవునిగా మారడం లేదా? దుష్ట జీవిలా ప్రవర్తిస్తూ ఒకరిని భయపెట్టడానికి ప్రయత్నించడం కంటే మన ప్రభువైన యేసు గురించి మాట్లాడటం గొప్ప సాక్ష్యం కాదా? శత్రువుకు ఒక్కరోజు కూడా ఉండనివ్వకూడదు, ఒక్క రోజు కూడా.

పాత నిబంధన హీరోలు విశ్వాసం కలిగి ఉన్నారు; వారు దానిని కార్యాచరణలో పెట్టారు. మీకు ఒక ఉదాహరణగా వారు యూన్నారు.

-WMB 55-1003

అది హాలోవీన్ లేదా మరే ఇతర రోజు అయినా, బైబిల్ మనకు బోధిస్తున్నట్లుగా , ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండమని మన పిల్లలకు నేర్పించాలి. ప్రపంచంలోని విలన్‌లు మరియు హీరోల కంటే బైబిల్‌లోని హీరోలను ఆదర్శంగా తీసుకోవడానికి వారిని ప్రోత్సహించండి మరియు వారికి బోధించండి. చాలా మంది పిల్లలు ఇష్టపడే విధంగా వారు దుస్తులు ధరించి ఆడాలనుకుంటే, మనం ఎల్లప్పుడూ చిత్రీకరించాల్సిన మరియు అలా ఉండాలని కోరుకునే నిజమైన, క్రీస్తువలె జీవించిన వారి గురించి వారికి బోధించే అవకాశంగా  ఉపయోగించుకోండి. దీన్ని మరింత సరదాగా మరియు అనుకూలంగా చేయడానికి, వారు తమకు ఇష్టమైన బైబిల్ హీరోలు లేదా పాత్రలకు సంబంధించిన బైబిల్ వాక్యాలు లేదా వచనములను గుర్తుపెట్టుకోవచ్చు లేదా చిన్న నాటకం కూడా వేయవచ్చు.

మీరు చేసినట్లైతే, ఏదైనా చిత్రాలను మాతో పంచుకోవడం మర్చిపోవద్దు! 🙂

మీరు గుర్తుంచుకోవడానికి మేము కొన్ని “బైబిల్ యొక్క హీరోస్” వాక్యాలను  సంకలనం చేసాము, వీటిని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆయన వాక్యానికి నమ్మకంగా ఉండే మరియు మన కాలంలో సత్యానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకునే దేవుని చిన్న హీరోలందరి గురించి మేము చాలా గర్వపడుతున్నాము. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి, నడిపించాలని మరియు వారికి సువార్త సత్యాన్ని బోధిస్తున్న తల్లిదండ్రులందరికై  మేము ప్రార్థిస్తున్నాము. వారికి ఇది గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరం!

కాబట్టి మనం సాక్షులుగా, హెబ్రీయులు 11 మరియు బైబిల్‌లోని అనేక చోట్ల, విశ్వాసం యొక్క హీరోలు దేవుని వాగ్దానానికి కట్టుబడి ఉన్నారని చూస్తాము. ఎవరైనా ఏమి చెప్పినా అక్కడే ఉండండి మరియు దేవుడు తన మంచి సమయంలో దానిని మీకు ఇస్తాడు.

-WMB 62-0120

దేవుడు మిమ్మల్ని  దీవించును గాక !

యంగ్ ఫౌండేషన్స్

మీరు హాలోవీన్ గురించి మరింత చదవాలనుకుంటే, branham.org  “ఈ లింక్” దగ్గర ఒక కథనాన్ని పోస్ట్ చేసింది

An Independent Church of the WORD,