16-0203 వెండి బంగారములు నాయొద్ద లేవు

https://branham.org/en/articles/212016_SilverandGoldHaveINone

అంతట పేతురు ― వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పెను.
అపొస్తలుల కార్యములు 3:6

శృంగారమను దేవాలయపు ద్వారము అని పిలువబడే చోట యున్న వ్యక్తి ఉన్న స్థితిలోనే ప్రపంచంలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మరో రోజు గడపడానికి సరిపోయే కొద్దిపాటి డబ్బు వస్తుందనే ఆశతో తమ చేతిని చాపుతారు. కానీ పేతురు, యోహానుల వలె, మన దగ్గర కూడా ప్రపంచంలోని సంపదలన్నింటికంటే ఎంతో విలువైనది ఉంది. మనం ప్రజలకు ఇవ్వగల ఆశీర్వాదాలు వారికి కేవలం పూట భోజనాన్ని మాత్రమే అందించవుకానీ,అవి మన ప్రభువైన యేసు రాకడ వరకు వారిని పోషిస్తాయి.

కొద్దిగా డబ్బు ఇచ్చే దయగల వ్యక్తి దొరుకుతాడేమోనని ఆశించిన ఒక నిస్సహాయుడైన వ్యక్తి గురించిన సాక్ష్యాన్ని మా డర్బన్ కార్యాలయం నుండి మేము స్వీకరించాము. ప్రపంచంలోని వెండి, బంగారముల కంటే ఎంతో విలువైనదాన్ని తాను పొందుకుంటాడని అతనికి ఏమాత్రం తెలియదు.

సోదరుడు గెరెమీ చెంగయ్య (క్రింద చిత్రంలో ఉన్నవారు) ఈ ఉదయం మా కార్యాలయం బయట ఉన్న సూచికను చదివిన తర్వాత మా కార్యాలయంలోకి అడుగుపెట్టారు.

అతను నిరుపేదగా, క్రుంగినవాడుగా,నిస్సహాయ స్థితిలో సహాయం కోసం మొరపెట్టుకుంటూ వచ్చాడు. నేను అతని బంధువుల వివరాలు అడిగాను, అతను తన తల్లి వివరాలు ఇచ్చాడు. అతను చెప్పిన కథలోని కొన్ని విషయాలను నిర్ధారించుకోవడానికి నేను ఆమెకు ఫోన్ చేశాను, ఆమె అతని శ్రమపడ్డ గతం గురించి మరికొంత సమాచారం ఇచ్చారు.

ఆ తర్వాత నేను అతనితో మాట్లాడటానికి తిరిగి వెళ్లి, సహాయం కోసం మా కార్యాలయానికి రావడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పాను. అతను ఊహించిన విధంగా మేము సహాయం చేయలేకపోవచ్చు, కానీ అతనికి ప్రయోజనం చేకూర్చే ‘ఏదో ఒకటి’ మా దగ్గర ఖచ్చితంగా ఉంది.

మా మధ్య చాలాసేపు చర్చ జరిగింది, అతను నాతో మనసు విప్పి మాట్లాడటం మొదలుపెట్టాడు. కొకైన్, హెరాయిన్, మరియు ఔషధకర ద్రవ్యాలతో సహా వివిధ రకాల మత్తుపదార్థాల కొరకు తనకున్న కోరికను తీర్చుకోవడానికి, అతను దుకాణాల నుండి వస్తువులను దొంగిలించడం, అబద్ధాలు చెప్పడం వంటివి ఎలా చేశాడో వివరించాడు.

2010లో, అతను హెరాయిన్ మరియు ఔషధకర ద్రవ్యాల యొక్క ప్రాణాంతక మిశ్రమాన్ని అధిక మోతాదులో తీసుకున్నాడు, మరియు ఈ ఉదయం మా కార్యాలయంలోకి ప్రవేశించే ముందు కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నాడు. ఈ మిశ్రమం వలన అతని స్నేహితులలో చాలామంది చనిపోయారు, అలాంటిది అతను ఈ రోజుకీ బ్రతికి ఉండటం ఒక అద్భుతమని మాత్రమే చెప్పగలం.

నేను అతనితో దేవుని వాక్యాన్ని, క్రీస్తు యేసులో మాత్రమే లభించే కృపను గురించి చెప్పడం కొనసాగించాను. మేము అతని జీవితం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, చలించిపోయిన ఆయన కళ్ళలో నుండి కన్నీళ్లు ఆగలేదు.

దాహంతో ఉన్న ఈ అపరిచితునికి ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేదు, కానీ మా దగ్గర ఉన్నదానిని మేము ఉచితంగా అతనికి ఇచ్చాము. అతను ప్రార్థించి, తన గతంలోని తప్పులన్నిటినీ క్షమించమని దేవుణ్ణి వేడుకున్నాడు, ఆ తర్వాత నేను కూడా అతనితో కలిసి ప్రార్థించాను.

ఈ రోజు ఉదయం, ఆయన “ఈ రోజు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని” అంగీకరించాడు , మరియు మేము ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఆయనకు బాప్తిస్మమిచ్చాము. మేము ఆయనకు కొన్ని వర్తమానము పుస్తకాల రూపంలో “ఋతువుకు తగిన ఆత్మీయ ఆహారము కూడా ఇచ్చాము. యాభై సంవత్సరాల క్రితం దేవుడు ఈ నగరానికి ఒక ప్రవక్తను ఏలాగు పంపించాడని, ఆయన గ్రేవిల్ రేస్‌కోర్స్‌లో ఎన్నో గొప్ప కార్యాలు చేశారని మేము ఆయనకు తెలియజేశాము.

మరియు ఈ రోజు, ఆయన కృప వలన, డర్బన్ వీధుల్లో నడుస్తున్న ఒక అపరిచితుని జీవితంలో మరొక అద్భుతం జరిగింది. ఈ వర్తమానము యొక్క ప్రాభల్యం , ఈ స్వరం యొక్క ప్రభావం, భూమి యొక్క మారుమూల ప్రాంతాలలో ఉన్న ఆత్మలకు ఇప్పటికీ చేరుతోంది.

ఈ సాక్ష్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.

దేవుడు మిమ్మల్ని దీవించును గాక,

వి.జి.ఆర్. డర్బన్ కార్యాలయం

ఈ ఉదయం నీవు ఒక వర్తమానికుడవు . మీరు … మీరు సువార్తకు లేదా దుర్వార్తకు వర్తమానికులు , మనం రాయబారులమని, మనం దూతలమని, పునరుత్థాన సువార్తికులమని తెలుసుకోవడం ఎంత అద్భుతం కదా? మరియు మనము క్రీస్తు జీవిస్తున్నాడని పాపభరితమైన లోకానికి తెలియజేసే దేవుని దూతలము. ఆయన మన హృదయాలలో జీవిస్తున్నాడు. ఆయన మన ఆత్మలలో జీవిస్తున్నాడు. మరియు ఆయన మనలను పాపమనే నీచమైన, భ్రష్టమైన జీవితం నుండి బయటకు లాగి , మనలను హెచ్చించి, మన ఆత్మలో “హల్లెలూయా” ను ఉంచి , మనలను నూతన సృష్టిగా చేస్తాడు. మనము వర్తమానికులము, నిబంధన యొక్క దూతలము. ఎంతటి అద్భుతం!
57-0825M హెబ్రీయులు రెండవ అధ్యాయము #1

An Independent Church of the WORD,