23-0806 మూడవ ముద్ర

వర్తమానము: 63-0320 మూడవ ముద్ర

PDF

BranhamTabernacle.org

ప్రియమైన ఉత్తేజపు వధువు,

సిద్ధంగా ఉండండి, ఈ ఆదివారం మీరు మీ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యక్షత ద్వారా మరింత ఉత్తేజాన్ని పొందబోతున్నారు. మీరు కేవలం వాక్యము మీద త్రాగి ఉంటారు. ఇది చాలా బాగుంటుంది, మరియు సహజంగా ఉంటుంది…మరియు అతను మాట్లాడినప్పటికంటే కూడా స్పష్టంగా ఉంటుంది. మరియు దాన్ని పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది, మీరు చేయవలిసింది ప్లే నొక్కండి!

టేపులను తీసుకోండి, వాటిని చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే, మీరు దానిని    టేప్‌లో పొందుతారు, ఎందుకంటే వారు వాటిని టేప్‌లను తిరిగి ప్లే చేస్తున్నారు, మరియు అవి    నిజంగా మంచివి మరియు సహజమైనవి. కాబట్టి, మీరు దానిని అక్కడ స్పష్టంగా పొందుతారు.

దేవుని ఏడవ దూత వర్తమానికుడు ఇప్పుడేమి చెప్పాడు? బైబిల్ యొక్క అన్ని రహస్యాలను బయలుపర్చటానికి దేవుడు ఎంచుకున్నవాడు;  ఏడు ముద్రలు, ఉరుములు మరియు పూర్తి వాక్యమును బయలుపర్చటానికి అతను ఎంచుకున్నవాడు. అతను తన వధువును పిలవడానికి ఎంచుకున్న దూత. చివరి రోజుల్లో అతని స్వరము కలిగుండటానికి అతని చేత ఎంచబడినవాడు.

మన కోసం అతను ఏమి చెప్పాడో మనకు అర్థమయ్యిందని నిర్ధారించుకోవడానికి ఆ కోట్‌ని మరోసారి చదువుదాం.

“మీరు దాన్ని పొందుతారు”, ఎక్కడ?

“మీకు ఇది స్పష్టంగా తెలుస్తుంది”, ఎక్కడ?

ప్లే నొక్కడం మరియు టేపులను వినడం ఎంత ముఖ్యమో మాట్లాడండి. మహిమ!! ఇది నా మాట కాదు, ఇది అతని వధువుతో చెప్పే దేవుని వాక్యం, అక్కడ పొందండి…టేపుల్లో. ఉపదేశకులరా, నా వెనుక నుండి దూరంగా ఉండండి.

ఈ వర్తమానమును తాము విశ్వసిస్తున్నామని చెప్పుకునే ఎవరైనా టేపులను ప్లే చేయడం వధువు చేయగలిగిన గొప్ప పని కాదని ఎలా చెప్పగలరు? ఒక కాపరి తన పరిచర్యను ప్రవక్త కంటే  పైగా ఎలా ఉంచగలడు? కేవలం కోట్ చేయడమే కాదు….నేను ఇప్పుడు కూడా దాన్ని చేస్తున్నాను, కానీ అతని మందకు ఆ స్వరమును ప్లే చేయడం ద్వారా వారు “అక్కడ దాన్ని స్పష్టంగా పొందగలరు”.

ప్రపంచంలోనే గొప్ప పరిచర్య టేప్ పరిచర్య. ప్లే నొక్కడం కంటే గొప్పది ఏదీ లేదు. ప్రభువు ఈలాగు సెలవిస్తున్నాడు అని అతని వధువుకు దేవునిచేత నియమింపబడిన ఒకే ఒక్క స్వరము , టేప్ లపై యున్న స్వరము.

మరోసారి స్పష్టంగా చెప్పనివ్వండి. నేను ఏ పరిచారకుడు ఉపదేశించడానికి వ్యతిరేకం కాదు, అలాగే ఒక పరిచారకుడు ఉపదేశించలేడని లేదా బోధించలేడని నేను భావించను.  కానీ నా కొరకు మరియు నా పరిచర్య కొరకు, అవతారమెత్తిన వాక్యము  శరీరధారియాయెను!  అది మాగ్నెటిక్ టేప్‌లో రికార్డ్ చేయబడి,నిల్వచేయబడెను, దానిని వినమని ప్రంపంచానికి చెప్పటానికి పిలవబడ్డాను. ఇది దేవుని యొక్క స్వరము అని నేను నమ్ముతున్నాను, మరియు ఇది, మరియు ఇది మాత్రమే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఇది మీకు కావాల్సినవన్నీ ఇస్తుంది, ఎత్తబడే విశ్వాసముతో సహా, ఎందుకంటే ఇది ప్రభువు ఈలాగు సెల్వస్తున్నాడు

వధువుకు నా మాట అవసరం లేదు, నేను మిగతా పరిచారకుల మాదిరిగానే వాక్యాన్ని ఉల్లేఖిస్తున్నాను. మీరు కోట్ చేసి, మీ పరిచర్య మరియు మీ పిలుపు వినడం ఎంత ముఖ్యమో చెప్పండి, ప్రభువును స్తుతించండి. టేప్ లపై దేవుని యొక్క స్వరము అత్యంత ముఖ్యమైన పరిచర్య అని  నేను ప్రజలకు చెబుతున్నాను. అంతకంటే గొప్పది ఏమీ లేదు. వారికి ఇంకేమీ ఉండవలసిన అవసరం లేదు.

ప్రజలు ఏ పరిచారకుడు యెడల లేదా పరిచర్య పట్ల తప్పుడు వైఖరి లేదా తప్పుడ ఆత్మ కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో నేను ఈ విషయాలు చెప్పడం లేదు, దేవుడు నిషేధించుగాక. నేను వారిని ప్రేమిస్తున్నాను. వారు నా సోదరులు. దేవుడు వారి జీవితాలకు పిలుపునిచ్చాడు. దేవుని చేత అభిషేకం పొందిన మనుష్యులకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం నాకు లేదు, కానీ చాలామంది తమ పరిచర్యకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని మరియు వధువు వినగలిగే అత్యంత ముఖ్యమైన స్వరము టేప్ పై ఉన్నదేవుని స్వరము  పై ఉంచలేదని నేను మాట్లాడలిసి మరియు చెప్పవలసి వచ్చింది.

నేను కేవలం “బ్రదర్ బ్రన్‌హామ్‌ని మీ సంఘము యొక్క వేదిక పైకి తిరిగి తీసుకురండి” అని చెప్పాను మరియు చాలా మంది పరిచారకుల తమను తాము స్వీకరించి తమ ప్రజలకు సహోదరుడు బ్రన్‌హామ్ టేప్‌లో అలా చెప్పలేదని చెప్తున్నారు, మరియు వారు వాక్యాన్ని తీసుకొని ప్రజలకు ఇవ్వుటకు పిలవబడ్డారని; వారి చర్చిలలో టేపులను ప్లే చేయకూడదని సాకులు చెబుతున్నారు.

ఒక కాపరి తమ చర్చిలో టేపులను ప్లే చేస్తే అది తప్పు అని వారు అంటున్నారు, ప్రజలను విమర్శిస్తూ, వారు తమ సంఘములో కేవలము టేపులను వింటుంటే, పరిచర్య కాకుండా, వారు వధువు కాదు అని చెప్తున్నారు.

వాళ్లు చాలా సాకులు ప్రజలకు చెప్తుంటే విన్నాను. వారు తమ ప్రజలకు, “టేపులు మీరు తప్పక వినవలసిన అత్యంత ముఖ్యమైన విషయం” అని చెప్పరు. వారు అలా చేస్తే, అప్పుడు ప్రజలు అడుగుతారు… ” టేప్‌లు చాలా ముఖ్యమైనది అయితే మనం ఎందుకు మన సంఘములో ప్లే చేయకూడదు?”

మేము ఆదివారం వినబోయేది ఇతననే:

దేవుడు ఒక మనిషిలో ప్రత్యక్షమయ్యాడు మరియు అతని వెనుక ఎవరు ఉన్నారో చెప్పాడు; మరియు సారా డేరాలో నవ్వుతూ ఏమి చేసింది. మరియు ఈ లేఖనాలన్నీ, మలాకీ యొక్క, మరియు మొదలగునవి, చివరి రోజులలో జరుగుతుందని ప్రవించించారు. హెబ్రీయులు 4 లో చెప్పబడినది, “వాక్యంతిరిగి వచ్చినప్పుడు. మలాకీ 4 లో అది ఒక వ్యక్తి ద్వారా తిరిగి వస్తుందని చెప్పబడినది.

ఆ వాక్యము ఒక వ్యక్తి ద్వారా తిరిగి వచ్చింది మరియు మేము అతని స్వరమును టేప్‌లో రికార్డ్ చేసాము మరియు మేము దానిని ప్రతి ఆదివారం వినబోతున్నాము.

ఈ ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు, జెఫెర్సన్‌విల్లే సమయానికి, అవతారమెత్తిన వాక్యము శరీరధారియాయెను మరియు మాగ్నెటిక్ టేప్‌లో రికార్డ్ చేయబడినది మేము వింటున్నామని మరోసారి ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఇది మనకు ప్రత్యక్షను అందిస్తుంది: మూడవ ముద్ర 63-0320.

వధువు, మనకు ఏమి సమయం ఉంది. ఏ ఆనందం మన హృదయాలను నింపుతుంది. దేవుడు స్వయంగా సాతానుతో చెప్పినది మనము విన్నప్పుడు మన ఆత్మలకు ఎలాంటి శాంతి కలుగుతుంది:  “వారిని వదిలేయి . నువ్వువారిలో ఒకరిని పట్టుకుంటే, పరిశుభ్రమైన వాక్యముతో మరియు ద్రాక్షరసముతో నింపబడిన నా చిన్న మంద, ఏలాటి ‘మరియా శుభము’ ఆలాటిది చెప్పవద్దు లేక నీ మూఢభక్తి చేయవద్దు.నీ చేతులు వారిపై నుండి తీసివేయుము.మరియు నా యొక్క నూనెతో అభిషేకము పొందుట వలన  ద్రాక్షారసము యొక్క ఆనందమును కలిగియున్నారు, గనుక వారెక్కడకు వెళ్తున్నారో వారికి తెలుసు, ఎందుకంటే వారికి నా వాగ్దాన వాక్యం తెలుసు.  ‘నేను వారిని మరల తిరిగి లేపేదను. దానిని పాడు చేయవద్దు!. వారిని గజిబిజి చేయుటకు వెళ్ళవద్దు….. కేవలం వారికి  దూరంగా ఉండు”.

మనం భయపడాల్సిన పనిలేదు. మనకు వాక్యము ఉంది. మనము వాక్యము. మేము దేని కోసం ఆగము. మన దేవుని కుమారులు మరియు కుమార్తెలము. సాతాను, విడిచిపెట్టు, ప్రతిదీ మనకే చెందుతుంది. దేవుడు అలా చెప్పాడు. అది రాయబడివుంది!

బ్రో. జోసెఫ్ బ్రాన్‌హామ్

లేఖనాలు

మత్తయి సువార్త 25: 3-4

యోహాను సువార్త 1: 1, 1:14, 14:12, 17:17

అపొస్తలుల కార్యములు 2 వ అధ్యాయం

తిమోతి 3:16

హెబ్రీయులు 4:12, 13: 8

యోహాను 5: 7

లేవీయులు 8:12

యిర్మీయా 32 వ అధ్యాయం

యోవేలు 2:28

జెకర్యా 4:12