23-0813 నాలుగవ ముద్ర

వర్తమానము: 63-0321 నాలుగవ ముద్ర

PDF

BranhamTabernacle.org

ప్రియమైన పక్షిరాజు పిల్లలారా,

దేవుని యొక్క స్వరము మనము ముందెన్నడూ వెళ్ళనంత ఎత్తుకి మనల్ని తీసుకొనివెళ్ళి, మరియు ఆయన వాక్యమును బయలుపరుచుచున్నది. ఆయన మనల్ని ఆకాశంలో ఎంతో ఎత్తుకు తీసుకువెళ్తుండగా మనము ఆయన బలమైన రెక్కలలోనికి మన ముక్కులను గుచ్చియుంచాము. మనము ఆ నీలాకాశంలో కారుమబ్బులకు పైగా ఎగురుచున్నాము. మనము నిత్యత్వములోనికి చూడగలుగుచున్నాము. అది మనకు పూర్తిగా ఒక నూతన ప్రత్యక్షతయైయున్నది. ఆయన మనల్ని ఎత్తుకు తీసుకువెళ్తున్నాకొద్దీ, అది అంత స్పష్టమౌతూ ఉంటుంది. మనము ఇట్లు కేకలు వేస్తాము: దానిని చూస్తున్నాను…నేను దానిని చూస్తున్నాను.

ఆయన ఇప్పుడు తన బలమైన రెక్కలను తీసుకొని, వాటిని గట్టిగా ఊపి మరియు మనతో ఇట్లు చెప్పాడు, “ఎగరండి, నా చిన్న పిల్లలారా ఎగరండి.” ప్రారంభంలో మనము ఎంతగానో భయపడ్డాము. శత్రువు మన మెదడులను అనేక సందేహాలతో నింపుతుండేవాడు. నేను చెయ్యలేను, నేను అస్సలు చెయ్యలేను. పిదప ఆయన తిరిగి మనకు కేకవేసి మరియు ఇట్లు ఉరుముటను మనము విన్నాము, “మీరు ఎగరగలరు, మీరు నా పక్షిరాజులు, కేవలం మీ రెక్కలను ఆడించడం మొదలుపెట్టండి!!”

అప్పుడు, ఒక్కసారిగా మన చిన్న రెక్కలు వాటంతట అవే రెపరెపలాడటం మొదలైనది. మనము ఎవరమన్నదాని గూర్చి మరియు ఏమి చేయవలెనన్నదాని గూర్చి ఆయన వాక్యము నిశ్చయతను ఇచ్చుటను మనము వింటున్నాకొద్దీ, మన రెక్కలు అంతకంతకు బలపడినవి. రెపరెప, రెపరెప, రెపరెప….ప్లే నొక్కు, ప్లే నొక్కు, ప్లే నొక్కు… పిదప ఉన్నట్టుండి, మనము ఎగురుచున్నాము. మనము పక్షిరాజులము.

ఏదైనా ఒక చిన్న భయం మన మనస్సులలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు, మనము కేవలం వెతికి మరియు ఆయన స్వరమును వినడం మొదలుపెట్టాము. అక్కడే ఆయన ఉన్నాడు, ఒకవేళ మనము పడిపోతుంటే మనల్ని పట్టుకోడానికి మన ప్రక్కనే ఎగురుతూ ఉన్నాడు. మనము దేనికీ భయపడాల్సిన అవసరం లేదని మనము గ్రహించాము, తండ్రి పక్షిరాజు సరిగ్గా మనతోనే ఉన్నాడు. మనము చేసే ప్రతీ కదలికను ఆయన గమనిస్తున్నాడు. ఆయన మనకు ఏమీ జరగనివ్వడు.

మనము ముందెన్నడూ అనుభవించనటువంటి ఒక స్వేచ్ఛ మరియు నిశ్చయత. మీరు నా పక్షిరాజులు, అని ఆయన మనకు చెప్తూనే ఉంటాడు. నేను మీ కొరకు విడిచిపెట్టిన స్వరముతో నిలిచియుండుట ద్వారా మీరు విధేయులై మరియు సరిగ్గా నేను మీకు చేయమని చెప్పిన దానినే చేస్తున్నారు.

టేపులపై ఆయన మనకు దేనినైనా చెప్పినప్పుడు, అది ఆయన యొక్క మాట అని మనము ఎరిగియున్నాము గనుక, మనము వెళ్ళి దానిని చేస్తామని ఆయనకు తెలియును. ఆయన సరిగ్గా దాని వెనుక నిలబడతాడు. అది బైబిలు గ్రంథములో వ్రాయబడనప్పటికిని, ఎలాగైనా, ఆయన దాని పక్షమున నిలబడతాడు.

అది దానికి వెలుపటనున్నయెడల, ఆయన దానిని తన ప్రవక్తకు బయలుపరుస్తాడని, మనకు తెలియును. దేవుని యొక్క సమస్త మర్మములు తన ప్రవక్తకు, మరియు అతనికి మాత్రమే తెలియజేయబడినవని మనము గ్రహించాము, కావున మనము తెలుసుకోవలిసినది ఏదైనా, అది టేపుపైనున్నది.

ఉత్తేజమును కలుగజేసే ప్రత్యక్షత యొక్క శక్తిని గూర్చి మాట్లాడండి. దానిని మనము గట్టిగా గొంతెత్తి కేకవేయగోరుచున్నాము. లోకము ఇట్లు తెలుసుకోవాలని మనము కోరుచున్నాము, నేనొక టేపు పక్షిరాజును!

దేవుని తలంపులు, ఒక మాట ద్వారా పలుకబడినప్పుడు అవి సృష్టిగా మారతాయి. అది, ఆయన తన తలంపును, ఒక తలంపుగా మీకు—మీకు ప్రదర్శించినప్పుడైయున్నది, మరియు అది మీకు బయలుపరచబడియున్నది. అప్పుడు, మీరు దానిని పలికేంత వరకు అది ఇంకనూ ఒక తలంపైయున్నది.

అది మనకు బయలుపరచబడినది. మహిమ. ఇప్పుడు మనము దానిని పలుకగోరుచున్నాము. మనము యేసుక్రీస్తు యొక్క వధువైయున్నాము. ఆయన నన్ను ఎరిగియున్నాడు, జగత్తు పునాది వేయబడకముందే నన్ను ఏర్పరచుకున్నాడు. నేను శరీరధారియైన ఆయన యొక్క సజీవ వాక్యమునైయున్నాను. అడుగుడి మరియు మీకియ్యబడును అని ఆయన నాతో చెప్పాడు. తట్టుడి, తీయబడును. మనకు అవసరమున్న ఏదైనా, మనము దానిని పలుకుతాము.

ఇది పక్షిరాజు కాలము మరియు మనం ఆయన యొక్క పక్షిరాజులమైయున్నాము. మనము మన జీవితములో ఇంతకంటే సంతోషముగా లేదా సంతృప్తిగా ఎప్పుడూ లేము. ఏ భయము లేదు. ఏ చింత లేదు.

మీరు వచ్చి ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారం, 12:00 P.M., గంటలప్పుడు మాతో కలిసి నూతన ఎత్తులకు ఎగరవలెనని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, దేవునియొక్క బలమైన పక్షిరాజు కేకవేయుచూ మనకు దీనిని బయలుపరచునప్పుడైయున్నది నాలుగవ ముద్ర 63-0321.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

ఈ ప్రసంగమును వినడానికి సిద్ధపడుటకు చదవాల్సిన లేఖనములు నాలుగవ ముద్ర 63-0321.
పరిశుద్ధ. మత్తయి 4
పరిశుద్ధ. లూకా 24:49
పరిశుద్ధ. యోహాను 6:63
అపొస్తలుల కార్యములు 2:38
ప్రకటన 2:18-23, 6:7-8, 10:1-7, 12:13, 13:1-14, 16:12-16, 19:15-17
ఆదికాండము 1:1
కీర్తనలు 16:8-11
II సమూయేలు 6:14
యిర్మీయా 32
యోవేలు 2:28
ఆమోసు 3:7
మలాకీ 4