23-0820 అయిదవ ముద్ర

వర్తమానము: 63-0322 అయిదవ ముద్ర

PDF

BranhamTabernacle.org

ప్రియమైన పరిపూర్ణ వాక్య వధువా,

దేవుడు తన చివరి శక్తిని పంపించాడు. తిరిగి మన పితరుల యొక్క అసలైన విశ్వాసమునకు మనలను పునరుద్ధరించడానికి ఆయన తన యొక్క గొప్ప పక్షిరాజును క్రిందకు పంపాడు. ఇది పక్షిరాజు కాలమైయున్నది. ఇకమీదట ఏ జీవులు లేవు. ఇకమీదట ఏ వర్తమానికులు లేరు. ఇకమీదట ఏ మనుషుల గుంపు లేదు. అంతా పూర్తయినది. మనము అంతమున ఉన్నాము. ప్రకటన 10:7 లోని స్వరము వచ్చియున్నది మరియు ఆయన తన వధువును బయటకు పిలువడానికి తన గొప్ప పక్షిరాజు ప్రవక్తను ఉపయోగించుకున్నాడు.

ఆదివారమున మీరు గనుక మా పాస్టరు గారు అనగా దేవుని యొక్క గొప్ప పక్షిరాజు, చెప్పేది వినుచుండినయెడల, అతడు మాతో చెప్పినట్లే దీనిని మీకు చెప్పుటను మీరు వినియుంటారు:

“మీరు సరిగ్గా దేవుని యొక్క వాక్యమైయున్న, ఆ ఏడు ఉరుములను తీసుకొని; మరియు ముక్కలు చేసి మరియు చీల్చివేసి మరియు ఆకాశాములను సైతం మూసివేసే ఆ గుంపుయైయున్నారు. మీరు దీనిని మూసివేయగలరు, లేదా దానిని చేయగలరు, మీరు కోరినదల్లా చేయగలరు. శత్రువు మీ నోటి నుండి వచ్చే మాట ద్వారా వధించబడతాడు, ఏలయనగా అది రెండంచులు-గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడియైనది. మీరు ఒక వంద బిలియన్ టన్నుల ఈగలు కలుగును గాక అని పలుకగలరు ఒకవేళ మీరు కోరినయెడల అట్లు చేయగలరు. మీరు పలికేది, ఏదైనా జరుగుతుంది, ఎందుకనగా అది దేవుని నోట నుండి వచ్చుచున్న దేవుని యొక్క వాక్యమైయున్నది. అది ఆయన వాక్యమైయున్నది, కానీ దానిని జరిగించుటకు ఆయన ఎల్లప్పుడూ మానవుడిని వాడుకుంటాడు”.

దేవుడు పంపిన ఆ పక్షిరాజును వినుటకొరకు ప్లే నొక్కడం యొక్క ప్రాముఖ్యతను; నేను ఏ విధంగా నొక్కి చెప్పగలను? ఈ వర్తమానము ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో పరిపూర్ణమైనది…ఎంతో పరిపూర్ణమైనది, ఎంతగా అంటే ఆయన దానిని ఒక దూతకైనా అప్పగించలేదు. ఆయన దానిని ఇవ్వడానికి ఏ ఇతర వ్యక్తియు లేడు, ఏ ఇతర మనుష్యుల గుంపు లేదు, తన గొప్ప పక్షిరాజు ప్రవక్త తప్ప, ఆయన దానిని ఇవ్వడానికి వేరెవ్వరునూ లేరు.

మనము దాని గురించి మాట్లాడవచ్చు, దానిని ఉపదేశించవచ్చు, దానిని ప్రసంగించవచ్చు కూడా, కానీ “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” ను కలిగియున్న స్వరము ఒకే ఒక్కటి ఉన్నది మరియు మీరు ప్రతీ మాటను నమ్మవలసియున్నది. మీరు మీ నిత్యత్వపు గమ్యమును దానిపై ఉంచగలుగునట్టి ఒకే ఒక్క స్వరము ఉన్నది. దేవుడు తన వధువును నడిపించుటకు ఎన్నుకొనిన ఒకే ఒక్క స్వరము ఉన్నది, మరియు ఆయన యొక్క వధువు మాత్రమే ప్రత్యక్షతను కలిగియుంటుంది.

ఆయన తన వాక్యమంతటినీ బయలుపరచుటకు జగత్తుపునాది వేయబడకముందే తాను ఎన్నుకున్న ఒకేఒక్క పక్షిరాజు ప్రవక్త ఉన్నాడు….అతడే విలియమ్ మారియన్ బ్రెన్హామ్, అతడు, మరియు అతడు మాత్రమే, ఈ దినమునకు దేవుని యొక్క పక్షిరాజు వర్తమానికుడైయున్నాడు. అతడు, మరియు అతడు మాత్రమే, దేవుని యొక్క వధువును నడిపించుటకు పంపబడినాడు.

నా పిలుపు, లేదా ఏ సేవకుల యొక్క పిలుపైనా, ఒకే ఒక్క విషయము కొరకైయున్నది: మిమ్మల్ని అతని యొద్దకు, దేవుని యొక్క గొప్ప పక్షిరాజు వద్దకు నడిపించుటకైయున్నది. ఆయన చేత ఎన్నుకొనబడినవాడు. ఆయన యొక్క అగ్నిస్తంభముచేత నిర్ధారించబడినవాడు. ఆయన గ్రంథమును తెరిచి, మరియు ఆ ముద్రలను విప్పి, మరియు వాటిని భూమి మీదకి పంపినప్పుడు, తన ప్రజలమైయున్న మనకు వాటిని బయలుపరచడానికి, ఆయనచేత ఎన్నుకొనబడినవాడు.

టేపుపై అతడు పలికిన మాటలు అతని మాటలు కావు, అవి పలుకబడి మరియు ఆయన యొక్క వధువు వినడానికి టేపుపై రికార్డు చేయబడిన దేవుని యొక్క ఆలోచనలైయున్నవి; మరియు కేవలం మీరు, ఆయన వధువైయున్న మీరు మాత్రమే దానియొక్క నిజ ప్రత్యక్షతను కలిగియున్నారు.

వధువా, కేవలం దాని గురించి ఆలోచించుము! మనము చేరుకున్నాము. అంతే. శాస్త్రీయ పరిశోధన దానిని ఋజువు చేసినది. వాక్యము యొక్క నిర్థారణ దానిని ఋజువు చేసినది. మరియు మనము ఇక్కడ ఉన్నాము! మరియు ఈ ప్రత్యక్షత దేవుని యొద్దనుండి వచ్చుచున్నది, మరియు అది సత్యమైయున్నది. మరియు మీరు దానిని గుర్తించుచున్నారు గనుక, మనము పూర్తిగా పునరుద్ధరించబడిన ఆయన యొక్క కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము.

ఇక ఆలోచించేది ఏమీ లేదు. ఇక ప్రశ్నించేది ఏమీ లేదు. మనము ఆయన యొక్క పరిపూర్ణమైన వాక్య వధువైయున్నాము. మనము ఎవరమన్నది మనము గుర్తించాము. ఆయన తన పక్షిరాజుకు, తెల్లని వస్త్రాలను ధరించుకున్నవారిని చూచుటకు అనుమతించాడు, దేవుని కృపను బట్టి ఆ ప్రజలము మనమేయైయున్నాము.

వధువా ధైర్యము తెచ్చుకొనుము. మనము దాదాపు అక్కడికి చేరుకున్నాము. మనము దానిని అనుభూతి చెందగలుగుచున్నాము. ఇంతకు ముందెన్నడూ లేనంతగా అది ఇప్పుడు మనకు ఎంతో వాస్తవముగానున్నది. శతృవు మనలను ద్వేషిస్తున్నాడు, కానీ దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన కేవలం మనతో ఉండటం మాత్రమే కాదు కానీ, ఆయన మనలో ఉన్నాడు. మనము ఆయన యొక్క శరీధారియైన వాక్యమైయున్నాము.

మనము విఫలము అవ్వలేమని, మరియు విఫలము అవ్వమని, ఆయన సాతానుకి ఋజువు చేయుచున్నాడు. విశ్వాసము మరియు సందేహము మాత్రమే ఉన్నాయి. అయితే మనము కేవలం విశ్వాసమునే కలిగియున్నాము. మనయందు కాదు గాని, ఆయన యొక్క వాక్యములో విశ్వాసమును కలిగియున్నాము, మరియు అది విఫలమవ్వజాలదు. ఎందువలన? మనము వాక్యమైయున్నాము. దేవుడు ఆలాగున చెప్పెను!!

మీరు ఆయనను ఎన్నుకోలేదు కానీ, ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అసలు సాతానుడు మీకు ఏదైనా ఎలా చేయగలడు, దేవుడే మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన వాక్యమును నమ్ముటలో మీరు తప్పిపోరని ఆయన ఎరిగియున్నాడు గనుక ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. సాతాను మీతో ఇలా చెప్తాడు, “కానీ నువ్వు విఫలమవుతావు, విఫలమవుతావు, విఫలమవుతావు”…నీవు చెప్పేది నిజమే, నేను నా శరీరములో విఫలమవుతాను, అయితే నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, మరియు ప్రతీ వాక్యమును నమ్ముటలో నేను విఫలమవ్వను.

మనము దేవుని కొరకు పరీక్షించబడి మరియు శ్రమల గుండా వెళ్ళవలసియున్నది, తద్వారా ఆయన తనకి, మరియు మనకి శత్రువైనవానికి…మనము ఆయన యొక్క పరిపూర్ణమైన వాక్య వధువైయున్నాము అని ఋజువు చేయుటకైయున్నది.

ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారముగా 12:00 P.M., కు దేవుని యొక్క గొప్ప పక్షిరాజు, ప్రత్యక్షతను తీసుకువచ్చుటను మనము వినుచుండగా, ఆ గొప్ప పరిశుద్ధాత్మ మీ గృహములను, మీ సంఘములను లేదా మీరు ఎక్కడున్నా మిమ్ములను నింపునుగాక: అయిదవ ముద్ర 63-0322.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

వర్తమానమును వినుటకుముందు చదవవలసిన లేఖనములు:

దానియేలు 9:20-27
అపొస్తుల కార్యములు 15:13-14
రోమా 11:25-26
ప్రకటన 6:9-11 / 11:7-8 / 22:8-9