23-0827 ఆరవ ముద్ర

వర్తమానము: 63-0323 ఆరవ ముద్ర

PDF

BranhamTabernacle.org

ప్రియమైన దేవుని ప్రవక్త యొక్క ప్రజలారా,

వినండి, నేను మీకు చెప్పడానికి ఒక విషయాన్ని కలిగియున్నాను. అది ఎంతో మేలైనది, అది నా హృదయంలో మండుచున్నది. దానిని మీరు మర్చిపోలేదని నేను ఆశిస్తున్నాను, చూడండి . ఆయన సన్నిధిలో, నన్ను దీనిని చెప్పనివ్వండి. ఆయన కృపవలన, కొద్ది కాలం క్రితం నా ప్రజలను, తెల్లని వస్త్రములలో ఉండుటను కూడా, ఆయన నాకు చూపించెను.

తూర్పు తీరము నుండి పశ్చిమము వరకు, దేశవ్యాప్తంగా, మనము కూడుకొనుచున్నాము. కాలములో మనము ఎన్నో గంటల వ్యవధిలో ఉన్నాము, కానీ దేవుని ప్రవక్త యొక్క ప్రజలముగా మనము కలిసేయున్నాము. మనము ఒక్కటై యున్నాము.

దేవుని యొక్క ప్రవక్త ఇక్కడ భూమిమీద ఉన్నప్పుడు, గొప్పదియును, మరియు వధువు ఉండగోరిన ఒకే ఒక స్థలము ఏదనగా, ఆ స్వరము, “శుభోదయం స్నేహితులారా,” అని చెప్పుటను వినడానికి వేచియుండి, టెలిఫోను-వద్ద కూడుకోవడమేయై యున్నది.

ఎనిమిది మరియు పెన్ స్ట్రీటు మూలన ఆ జనసమూహములో కూర్చొనియుండుటకు వారు ఎంతగా ఇష్టపడేవారు కదా. కేవలం ఒక్క కుర్చీని పొందుటకు, లేదా గోడలకు ఆనుకొని మరియు గంటల సేపు నిలబడియుండుటకు వారు సంతోషంగా ఆ రాత్రంతా పార్కింగ్ స్థలములో సమయము గడిపియుండేవారు. కేవలం ఆ ఒక్క కూటమునకు హాజరవ్వడానికి వీలవుతుందంటే, వారికున్నదంతయూ అమ్మియుండేవారు, వారి ఉద్యోగమును వదులుకొనియుండేవారు.

ప్రవక్త పలికిన ప్రతీ మాటపై వారి జీవితమంతా వ్రేలాడుకొనియున్నది. వారు ఒక్క విషయాన్ని కూడా తప్పిపోదలంచుకోలేదు. ఒక దినమున వారు టేపును పొందుకోగలరని వారు ఎరిగియున్నప్పటికినీ, దేవుడు మానవ పెదవుల ద్వారా మాట్లాడుచున్న ఆ క్షణములోనే వారు వధువుతో ఐక్యమైయ్యుండగోరినారు.

ఇదే వారి జీవితమైయున్నది. ప్రతీ వారము వారు దీని కొరకే వేచియుండేవారు. తదుపరి వర్తమానమును వినుటకంటే వారికి ప్రాముఖ్యమైనది మరేదియు లేదు. ఇప్పుడు, తమకుతాము, అందరూ ఒకేసారి, దేవుని యొక్క ఏడవ దూత ప్రవక్త చెప్పినదానిని, వాక్యము వెంబడి వాక్యముగా వినుటకు అవకాశమును కలిగియున్నారని, వారికి తెలిసియుండగా వారు ఎంతో అత్యుత్సాహంతో ఉండియున్నారు.

దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. ఆయన యొక్క వధువు తన స్వరము చుట్టూ ఐక్యమవ్వాలని ఆయన కోరుకున్నాడు. ఆయన యొక్క వధువంతయూ ఒకేసారి తన స్వరమును వినాలని ఆయన కోరుకున్నాడు. ఆయన యొక్క వర్తమానికుడైన దూత ద్వారా పలుకబడిన ఆయన యొక్క స్వరము మాత్రమే తన వధువును ఐక్యము చేసే స్వరమైయున్నదని ఆయనకు తెలియును .

ఆయనయొక్క గొప్ప ప్రణాళిక జరుగుచుండినది.

అమెరికాలోని సంఘ కాపరులందరూ వారి సంఘములు ఖచ్చితంగా టెలిఫోన్-వద్ద కూడుకొనియుండునట్లు చూసుకున్నారు. ఆ స్వరమును వినుటకంటే ప్రాముఖ్యమైనది మరేదియు లేదన్న దర్శనమును వారు పట్టుకున్నారు.

వారు తమ సంఘస్తులకు దానినే నేర్పించారు. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తో దేవుడు ఒక ప్రవక్తను పంపియున్నాడు. అతడు అగ్నిస్తంభము చేత నిర్ధారించబడినాడు. ఇది మీకు దేవుని యొక్క స్వరమైయున్నది. ఇది మలాకీ 4, మరియు ప్రకటన 10:7 అయ్యున్నది. తన వధువును నడిపించుటకు అతడు దేవుడు పిలుచుకున్న వ్యక్తియైయున్నాడు. నేను మీకు చెప్పినదంతా ఈ ప్రవక్తను గూర్చియేయైయున్నది. ఇప్పుడు మనమందరమూ ఆయన చెప్పేది వినవలసియున్నది. ఆ పూర్వికుడైన యోహాను వలె, నేను తగ్గవలసియున్నది మరియు ఆయన హెచ్చవలసియున్నది.

దేవుని ప్రణాళిక ఇంకనూ నెరవేర్చబడుచున్నది. వధువు ఇంకనూ ఆయన స్వరము చుట్టూ ఐక్యమగుచున్నది. అయితే మనమిప్పుడు ప్రపంచమంతటి నుండి ఐక్యమగుచున్నాము. ప్రతీ ఆదివారము, వధువులో ఒక భాగము, ఒకే సమయంలో ప్రతీ మాటను వినుట కొరకు గొప్ప ఎదురుచూపుతో వేచియుంటున్నది.

బహుశా మనము ఇదివరకే ఈ వర్తమానమును కొన్ని వందల సార్లు వినియుండవచ్చును, అయిననూ ఈసారే మొదటిసారి వింటున్నట్లు అనిపిస్తుంది. ముందెన్నటి కంటెను ఒక గొప్ప ప్రత్యక్షతను మనము పొందుకోబోవుచున్నామని మనము ఎరిగియున్నాము.

వేరే ఏ స్థలములో మనము ఉండాలనుకోవడం లేదు. ఏదియు ప్రాముఖ్యమైనది కాదు. మనకైతే, ఇదే అది. ఇది మనకొరకైన దేవుని యొక్క ప్రణాళికయైయున్నది. ఈ స్వరము ఆయన యొక్క వధువును పిలుచుచు, ఐక్యము చేయుచూ మరియు పరిపూర్ణము చేయుచున్నది…మరియు మనమే ఆ వధువైయున్నాము.

ఈ ఆదివారమున జఫర్సన్ విల్ కాలమానం ప్రకారం, 12:00 P.M., గంటలప్పుడు, మేము కూడుకొని మరియు దేవుని యొక్క స్వరము మాకు దీనిని బయలుపరచుటను వినుచుండగా మీరు మాతో కూడా చేరాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: ఆరవ ముద్ర 63-0323.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

వర్తమానమును వినుటకు ముందు వినవలసిన లేఖనములు:

నిర్గమకాండము 10:21-23
యెషయా 13:6-11
దానియేలు 12:1-3
మత్తయి 24:1-30
మత్తయి 27:45
పరిశుద్ధ. యోహాను 10:27
ప్రకటన 6 , ప్రకటన 11:3-6