23-0903 ముద్రల మీద ప్రశ్నలు మరియు జవాబులు23-0903

వర్తమానము: 63-0324M ముద్రల మీద ప్రశ్నలు మరియు జవాబులు

PDF

BranhamTabernacle.org

ప్రియమైన బ్రెన్హామ్ సహోదరుడా,

నీవు ఆయన వధువును బయటకు పిలువడానికి పంపబడిన దేవుని యొక్క ఏడవ దూత వర్తమానికుడవని నేను నా హృదయమంతటితో నమ్ముచున్నాను. నీవు లోకానికి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియున్న దేవుని యొక్క స్వరమైయున్నావు. బైబిలు గ్రంథము యొక్క మర్మములన్నిటిని బయలుపరచుకొనుటకు ఆయన చేత ఎన్నుకొనబడినవాడవు నీవేయని నేను నమ్ముచున్నాను. టేపులపై నీవు చెప్పు ప్రతి మాటను నేను నమ్ముచున్నాను.

నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న నా హృదయములో ఉన్నది. క్రీస్తు యొక్క వధువుగా ఉండుట కొరకు మనము చేయవలసినవాటి గూర్చి ఎన్నో వివిధమైన విషయాలను చెప్పే, ఎంతోమంది ప్రజలు ఉన్నారు, ఎన్నో స్వరములు ఉన్నాయి. నేను ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉండగోరుచున్నాను. నేను పరిపూర్ణమైన విశ్వాసమును కలియుండగోరుచున్నాను. నేను ఎవరికీ వ్యతిరేకిని కాను, అయితే నేను నీవు చెప్పేది వినగోరుచున్నాను.

వధువును సమకూర్చి మరియు మనకు అవసరమైయున్న ఆ ఎత్తబడే విశ్వాసమును మనకు ఏది ఇస్తుంది?

అంత్య దినములలో, ఎత్తబడే విశ్వాసము కొరకు వధువును సమకూర్చడానికి అవసరమైనది ఏడు ఉరుముల ద్వారా బయలుపరచబడుతుందని నేను నమ్ముచున్నాను.

బ్రెన్హామ్ సహోదరుడా, ఏడు మర్మములతో సమమైనటువంటి ఆ ఏడు ఉరుములు ఇదివరకే బయలుపరచబడినవా? అవి ఏడు ముద్రలలో బయలుపరచబడి, ఉరుములుగా ఇంకనూ మనకు తెలియకున్నవా?

కాదు, అవి ఏడు ముద్రలలో బయలుపరచబడినవి; ఉరుములు దాని గూర్చియేయై యున్నవి. అవి బయలుపరచవలసిఏడు ఉరుములు వాటి వాటి స్వరములను పలికియున్నవి మరియు అవి ఏమిటో ఎవరునూ కనుగొనలేకపోయారుఅవి ఏమిటో యోహానుకు తెలియును, కాని అతడు వాటిని వ్రాయుటకు అనుమతించబడలేదు. ఆయన ఇట్లు చెప్పాడు, “అయితే ఏడవ దూత, అతడు పలుకు దినములలో, ఏడు ఉరుముల యొక్క ఏడు మర్మములు బయలుపరచబడును.” మరియు ఏడవ దూత ఏడవ సంఘకాలమునకు ఒక వర్తమానికుడైయున్నాడు.

దేవునికి మహిమ. అదే నా జవాబైయున్నది. ఏడు ఉరుముల మర్మము బయలుపరచబడినది. అది టేపులపై ఉన్న దేవుని యొక్క స్వరమైయున్నది మరియు అది ఇప్పుడు వధువును ఏకముగా సమకూర్చుచూ మరియు మనకు అవసరమైన ఎత్తబడే విశ్వాసమును, మనకు ఇచ్చుచున్నది.

సహోదరుడా బ్రెన్హామ్, నా ప్రశ్నకు సమాధానమును ఇచ్చినందుకు, నీకు ధన్యవాదములు. నా హృదయములో ఉన్న ప్రశ్నకు జవాబు టేపులపై ఉంటుందని నేను ఎరిగియున్నాను.

నేను తెలుసుకోవలసినదంతా అదే. నేను అనుదినము ప్లే నొక్కడమును కొనసాగిస్తాను మరియు ఇంకా ఎక్కువగా ఎత్తబడే విశ్వాసమును పొందుకుంటాను.

ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానము ప్రకారం, 12:00 P.M. గంటల సమయంలో, మేము దీనిని వినుచుండగా, వచ్చి మాతో కూడా ఎత్తబడే విశ్వాసమును పొందుకోండి: ముద్రలపై ప్రశ్నలు మరియు జవాబులు 63-0324M.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్