23-0910 ఏడవ ముద్ర

వర్తమానము: 63-0324E ఏడవ ముద్ర

PDF

BranhamTabernacle.org

ప్రియమైన టేపు వధువా,

మనము ఎటువంటి దినములో జీవిస్తున్నాము గదా! ఎటువంటి ఒక గొప్ప సమయం! ఆ మర్మములు, రహస్యములు, అవన్నియు మనకు అనుదినము బయలుపరచబడుచున్నవి. కేవలం మనము దాటి వచ్చిన దానిని మనము చూడటం మాత్రమే కాదు గానీ, సరిగ్గా మనము జీవిస్తున్న ఈ ఘడియను మరియు ఖచ్చితంగా మీదటికి ఏమి ఉన్నదో దానిని మనము ఎరిగియున్నాము.

ఏమి సంభవించబోవుచున్నదో అది మనకు వచనం వెంబడి వచనం చెప్పబడుచున్నది. మనము ఎవరన్నది, అక్కడ ఎవరు ఉంటారన్నది, మరియు మనము ఏమి చేస్తామన్నది కూడా ఆయన మనకు తేటగా చెప్పుచున్నాడు. ఆ 144,000 మంది యూదులు, శ్రమల ద్వారా శుద్ధిచేయబడిన సంఘము, పట్టణములోనికి వారి మహిమను మరియు ఘనతను తీసుకొనివచ్చే ద్రాక్షాతోటలోని పనివారు.

అయితే పిదప అది మీరు కాదని ఆయన మనతో చెప్తాడు…ఓ కాదు, మీరు నా వధువైయున్నారు, మీరు నాతో కూడా ఆ పట్టణంలో ఉన్నారు. మీరు అక్కడ బయట ఆ ద్రాక్షాతోటలలో పనిచేయబోవడంలేదు, మీరు నా ప్రియురాలైయున్నారు. మీరు మీ రాజునైన నాతో కూడా ఉన్న, నా రాణియైయున్నారు. మీరు జగత్తు పునాది వేయబడకముందే నేను ఎన్నుకొనిన అయిదవ-భాగములోని ఒక్క-వంతువారై యున్నారు. నేను ఈ చోటును మీ కొరకు మాత్రమే చేసియున్నానుమరియు సరిగ్గా మీకు ఇష్టమైన విధంగా చేశాను.

ఆయన తన అద్భుతమైన వాక్యమును మనకు బయలుపరచుచు, వారము వెంబడి వారము, రోజు వెంబడి రోజు, ఘడియ వెంబడి ఘడియ, మనతో మాట్లాడుచుండగా మనము ఆయన బల్ల చుట్టూ కూడుకొనుటను గూర్చి ఆలోచించుటయే, అద్భుతంగా ఉన్నది. మనము ఎవరమో; మరియు ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో; ఏమి జరిగినదో, ఏమి జరిగుచున్నదో, మరియు ఏమి జరుగబోతుందో ఆయన మళ్ళీ మళ్ళీ మనతో చెప్పుచున్నాడు.

అది మనకు ఎంత విలువైనదో వ్యక్తపరచడానికి, లేదా ఆయన ఈ సంగతులను మనతో మాట్లాడుటను మనము విన్నప్పుడు ఎటువంటి అనుభూతిని పొందుతామో వ్యక్తపరచడానికి మాటలు లేవు. మనము ప్లే ను నొక్కి మరియు ఆ స్వరమును వింటున్నప్పుడు, మనము ఈ లోకమును విడిచిపెట్టి మరియు తక్షణమే పరలోకపు స్థలములలో ఆయనతో కూడా కూర్చొనుచున్నాము. మన ప్రాణములు ఆదరించబడినవి. పరిశుద్ధాత్మ మనల్ని పూర్తిగా తనయొక్క ఆత్మతో నింపుటను మనము అనుభూతిచెందుచున్నాము. అది ఒక వివరించలేనటువంటి ఆనందమైయున్నది. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ టేపులలో పలుకబడిన ప్రతీ మాటను, ఆయన మన కొరకు పలికాడు. మనము ఏది వినడం అవసరమో మరియు దానిని మనము ఎప్పుడు వినడం అవసరమో ఖచ్చితంగా ఆయనకు తెలుసు…మరియు అనేకసార్లు మనము దానిని మళ్ళీ మళ్ళీ వినవలసిన అవసరం ఉన్నది….మరియు ప్రతీసారి అది మన ప్రాణములను ఉప్పొంగజేస్తుంది.

దర్శనాలు, కలలు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, తెరకు ఆవల, మనలను తెల్లని వస్త్రములలో చూచుట, మూడవ ఈడ్పు, ఉడతలను సృష్టించుట, దేవుని యొక్క ఖడ్గము తన చేతిలో పరిపూర్ణముగా ఇమిడిపోవుట, దాచబడిన ఆహారము, బల్ల యొక్క తలవైపున కూర్చుండబెట్టబడటం, ఉరుములు, బలమైన దూతలు వచ్చి ఆయనను పైకి తీసుకొనివెళ్ళడం, ఆయనకు ఎంతో విలువైన ఆ ప్రత్యేకమైన ఏడవ దూత, BRANHAM అని ఉచ్చరించిన ఆ ఏడు పర్వత శికరముల యొక్క నిత్యమైన సూచన, ఆ టేపులపై ఉన్నదానిని మాత్రమే చెప్పండి అని, విఫమవ్వలేని మాటలను నేను కలిగియున్నాను అని, తాను ఒక ఉన్నతమైన పిలుపునకు పిలువబడినాడని, నేను మీకు నా ప్రత్యక్షతను చెప్తాను అని, నేను మీకు దేవుని స్వరమునైయున్నాను అని, టేపు బోధనతో నిలిచియుండండి అని, నేను మిమ్మల్ని వధువు అని పిలువబోవుచున్నాను అని ఆయన మనకు చెప్పుటను వినుటకు మనము ఎన్నడూ అలసిపోము, ప్రతీ దానిని, ప్రతీ చిన్న పదమును, ప్రతీ శ్వాసను…మనము దానంతటిని ప్రేమిస్తున్నాము.

ఇది నా దర్శనము. టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరము దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమైయున్నది, విరామ చిహ్నము. టేపులను ప్లే చేయడం దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమైయున్నది, విరామ చిహ్నము. బోధకులు, ఉపదేశకులు, అపొస్తలులు, ప్రవక్తలు, సంఘ కాపరులు, చెప్పేది మీరు వినవచ్చును, కానీ టేపులే మీరు వినవలసిన ప్రాముఖ్యమైన స్వరమైయున్నది, మరియు అట్లుండవలసియున్నది, విరామ చిహ్నము. ఈయన మాట వినుడి, అని స్వయంగా దేవుడే చెప్పిన ఒకే ఒక్క స్వరము టేపులపై ఉన్న స్వరమేయైయున్నది, విరామ చిహ్నము.

నా సహోదరీ సహోదరులారా, నేను ఎవరికీ వ్యతిరేకిని కాను, నేను కేవలం ఆ స్వరము పక్షమున ఉన్నాను. ఈ వర్తమానమును నమ్మి, మరియు ప్రేమిస్తున్నామని చెప్పుకొను వారందరినీ, మనము ప్రేమించవలసియున్నది మరియు నేను ప్రేమిస్తున్నాను. ప్లే ను నొక్కమంటూ నేను ప్రజలకు తప్పును చెప్పుచున్నానని మీకు అనిపించినా గాని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మరియు మీరును నన్ను ప్రేమిస్తున్నారని నేను నమ్ముచున్నాను. మనమందరము ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉండగోరుచున్నాము. దయచేసి దేవుడు ఏమి చేయడానికి మిమ్మల్ని పిలిచాడో దానిని చేస్తూనే ఉండండి; బోధించండి, ఉపదేశించండి, ఒక కాపరిగా ఉండండి, కేవలం వారు వినవలసిన ప్రాముఖ్యమైన స్వరము ఏమిటో మీ మందకు చెప్పండి.

టేపు పై ఉన్న ఆ స్వరము మాత్రమే ప్రతీసారి ఒకే విషయాన్ని చెప్తుంది. అది ఎప్పుడూ మారదు. టేపులపై ఉన్న ప్రతీ మాటకు మాత్రమే వధువు ఆమేన్ అని చెప్పగలుగుతుంది, కానీ ఏ ఇతర వ్యక్తియైనా చెప్పే ప్రతీ మాటకు వధువు ఆమేన్ అని చెప్పలేదు, విరామ చిహ్నము.

మీరు దానిని నమ్మనియెడల, మీరు వధువు కాదు. మీరు దానిని నమ్మినయెడల, అప్పుడు టేపులను వినడమే వారు వినవలసిన ప్రాముఖ్యమైన స్వరమని మీ మందకు చెప్పడానికి మీకు ఎటువంటి సమస్య ఉండదు.

ఈ వ్యాఖ్యానములు చేయుట ద్వారా వారి సంఘ కాపరులు చెప్పేది వినవద్దని మరియు వారి సంఘములను విడిచిపెట్టమని నేను చెప్తున్నట్లు అనేకములైన పరిచర్యలనుండి నేను విన్నాను, ఇది నిజము కాదు. నేను ఎన్నడూ దానిని చెప్పను మరియు దానిని నమ్మకండి.

నేను ఎన్నడూ చెప్పనివాటిని, ఎన్నడూ నమ్మని వాటిని అనేకులు చెప్పుచున్నారన్నది వాస్తవము. నేను చెప్పినదానికి మరియు నేను నమ్ముచున్నదానికి తప్ప, నేను వాటికి జవాబుదారిని కాను. నేను ఖచ్చితంగా దేనిని నమ్ముచున్నాను అనుదానిని బహిరంగముగా స్పష్టంగా మాట్లాడి మరియు దానిని లేఖ రూపంలో పెట్టియున్నాను. నేను చెప్పుచున్నదానిని / నా భావమును వారు / మీరు మీకు అనుకూలంగా మలచుకొనుచున్నారు.

వధువు అంతయు ఒకే విషయాన్ని చెప్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విషయాన్ని చెప్పుట కాదు. ఒకే స్వరము. ఒకే ప్రవక్త. ఒకే వధువు.

ఆయన వధువుగా ఉండాలంటే, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది విశ్వాసులు చేస్తున్నట్లు, మీరు సరిగ్గా ఒకే సమయానికి వర్తమానమును వినవలసియున్నదని నేను నమ్మడంలేదు, అయితే మీరు ఆదివారము ఉదయమున ఏడవ దూత వర్తమానికుని స్వరమును వినవలసియున్నదని నేను నమ్ముచున్నాను…మొదట స్వరమును ప్లే చేయండి.

మీరు మాతో కూడా దీనిని వినడానికి ఆహ్వానించబడినారు: ఏడవ ముద్ర 63-0324E, ఆదివారము 12:00 P.M., జఫర్సన్ విల్ కాలమానము ప్రకారము, ప్రపంచ వ్యాప్తంగానున్న వధువులో ఒక భాగంగా ఒకే సమయానికి ఆ స్వరమును వినండి.

సహోదరుడు. జోస్సఫ్ బ్రెన్హామ్

వర్తమానమును వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:

ద్వితియోపదేశకాండము 29:16-19
I రాజులు 12:25-30
యెహేజ్కేలు 48:1-7, 23-29
మత్తయి 24:31-32
ప్రకటన 7
ప్రకటన 8:1
ప్రకటన 10:1-7
ప్రకటన 14