23-0730 రెండవ ముద్ర

వర్తమానము: 63-0319 రెండవ ముద్ర

PDF

BranhamTabernacle.org

ప్రియమైన వధువు,

1933లో ఒహియో నదిపై అగ్ని స్తంభం కనిపించినప్పటి నుండి వధువు ఈ వర్తమానము గురించి లేదా దాని వర్తమానికుడు గురించి ఆశ్చర్యపోలేదు. విలియం మారియన్ బ్రన్హామ్ దేవుని శక్తివంతమైన ఏడవ దూత వర్తమానికుడు అని మనకు తెలుసు, అతను తన వధువును పిలవడానికి భూమికి పంపాడు.

ఆ రోజు నుండి, దేవుడు తన రాకడ కొరకు తన వధువును సమకూరుస్తున్నాడు. మనము అటువంటి గొప్ప నిరీక్షణలో ఉన్నాము; ఎందుకంటే అది ఇప్పుడు ఏ రోజైనా అవుతుందని మనకు తెలుసు

అతను మునుపెన్నడూ లేని విధంగా మన విశ్వాసాన్ని నిర్మిస్తున్నాడు,మనం అతని నమ్మకమైన వధువు అని మనకు చెబుతూ, మనకు భరోసా ఇస్తున్నాడు. అతను నిల్వ చేసిన ఆహారంతో ఉండడం ద్వారా మనకు తెలుసు, మనకు ఏది అవసరమో అది టేపులపై ఉందని.

అది నిశ్చయంగా మనకు ఎలా తెలుసు ?దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు దానిని బయలుపరిచే వరకు దేవుడు ఏమీ చేయడని వాక్యం చెబుతోంది. దేవుడు ఏదైనా బయలుపరచబోతున్నప్పుడు లేదా ఏదైనా చేయబోతున్నప్పుడు, మనకు ఎత్తబడే విశ్వాసమిస్తున్నపుడు , అతను మన ప్రవక్త ద్వారా మరియు అతని ప్రవక్త ద్వారా మాత్రమే దానిని ఉరుముతాడు.

ఆశ్చర్యపోయే రోజులు అయిపోయాయి. వధువు ఒక నిర్ణయం తీసుకుంది. దేవుడు తన వధువుతో టేపులపై మాట్లాడుతున్నది వినడం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. ఈ వాక్యాలు మాత్రమే ప్రభువు ఈలాగు సెలవిస్తున్నాడు అని దేవుడు స్వయంగా నిరూపించబడినవి.

గడియ సమీపిస్తుంది మరియు మన చుట్టూ ఉన్న శత్రువుల దుర్వాసన యొక్క భారాన్ని మనం గుర్తించవచ్చు. యుద్ధాలు శ్రేణిలో ఉన్నాయి మరియు సాతాను అన్ని వైపులలో దాడి చేస్తున్నాడు, కానీ మనకు ఆత్మ సంబంధమైన ఆహారం లభించినందుకు దేవునికి స్తుతులు మరియు మనము యజమానుని బల్ల వద్ద పగలు మరియు రాత్రి కూర్చుని, మరుగైన మన్నాతో విందు చేస్తున్నాము.

అతడు ప్రతిరోజూ మనకు మరింత ఎక్కువగా బయలుపరుస్తున్నాడు, అతను మనకు చెప్తున్నాడు. “అంతా బాగానే ఉంది నా ప్రియురాలు. నేను నీతో ఉన్నాను. నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను , ఎడబాయను. పరుగెడుతూనే ఉండండి. దెయ్యాలను వెళ్లగొట్టండి.  నా అణు బాంబు, నా వాక్యము, దాన్ని ఉపయోగించండి. నేను ఆలోచించాను. అప్పుడు వ్రాయబడింది మరియు ఇప్పుడు, మీ రోజున, నేను మాట్లాడాను కాబట్టి నేను మీకు చెప్పడం మీరు వినవచ్చు, ప్రభువు ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు నా వధువు. మీరు వాక్యము శరీరధారైనవారు .”

దేవుడు మానవ పెదవుల ద్వారా మాట్లాడాడు మరియు అతని వాక్యాన్ని మనకు ఇచ్చాడు; మనము భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన వాక్యము , మన ఆలోచనలు, మన ఊహ కాదు, ఇది దేవుని వాక్యం అతడు మనకు ఇచ్చెను . మన విశ్వాసం ఆయన వాక్యంలో ఉంది మరియు ఆయన వాక్యం ఎప్పటికీ విఫలం కాదు!

ఇప్పుడు, ఈ ముద్రలు  తెరవడం మనం వింటున్నపుడు, పరిశుద్ధాత్మ మరోసారి మనతో మాట్లాడుతున్నాడు మరియు మన పేర్లను గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయడం మనం చూడవచ్చు. మనల్ని మనం అదుపు చేసుకోలేము…..అవును, అది నా పేరు అక్కడ వ్రాయబడింది. అతను నా గురించి మాట్లాడుతున్నాడు.

ఈ ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు, జెఫెర్సన్‌విల్ సమయానికి మాతో చేరండి మరియు రెండవ ముద్ర 63-0319 వినండి, మీ పేర్లు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంధములో వ్రాయబడి ఉన్నాయని దేవుని యొక్క స్వరము మీకు చెప్తుంది.

సహోదరుడు. జోసెఫ్ బ్రన్‌హామ్

వర్తమానమును వినడానికి ముందు చదవవలసిన గ్రంథాలు:

మత్తయి సువార్త 4:8 / 11:25-26 / 24:6

మార్కు సువార్త 16:16

యోహాను సువార్త 14:12

2 థెస్సలొనీకయులు 2:3

హెబ్రీయులు 4:12

ప్రకటన 2:6 / 6:3-4 / 17వ అధ్యాయం / 19:11-16

యోవేలు 2:25

ఆమోసు 3:6-7