Category Archives: Uncategorized

23-0611 పది మంది కన్యకలు, మరియు లక్ష నెలబై నాలుగు వేల మంది యూదులు

ప్రియమైన మన్నా ప్రేమికులారా,

ఎముక లేదా విత్తనం లేని ఆహారాన్ని మనం తినవచ్చు కాబట్టి మనము సంతోషంగా ఉన్నాము. “మన్నా” అని పిలువబడే పరలోకము నుండి వచ్చే అపూపములు పరలోకము యొక్క మాధుర్యంతో నిండి ఉన్నాయి.

ఆత్మసంబంధమైన ప్రత్యక్షత ద్వారా, విత్తనాలు లేని ఈ స్వచ్ఛమైన మన్నాను మనం పొందగల ఒకే ఒక్క స్థలం ఉందని ఆయన మనకు బయలుపరచాడు: ఆయన తన వధువు కోసం అందించిన దేవుని స్వరాన్ని వినడం ద్వారా.

సంఘములు ప్రభువు స్వరాన్ని వినాలని ప్రతి కాలములో ఆయన నిరంతర విన్నపము. ఈ చివరి కాలములో, ఆయన అభ్యర్థన ఇతర కాలముల కంటే ఎక్కువ పట్టుదలతో ఉంది; ఇది ప్రభువు రాకడ దినము. మనము ఆయన నిజమైన, నిర్థారించబడిన స్వరాన్ని తప్పక వినాలని ఆయన మనల్ని అత్యవసరంగా హెచ్చరించాడు.

ఓహ్, ప్రపంచంలో చాలా స్వరాలు ఉన్నాయి – చాలా సమస్యలు మరియు అవసరాలు శ్రద్ధ కోసం ఏడుస్తున్నాయి; కానీ ఆత్మ యొక్క స్వరం వలె అంత ముఖ్యమైన, విలువైన స్వరము ఏదీ లేదు. కాబట్టి, “సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినును గాక.”

అదిగో, సంఘములకు ఆయన హెచ్చరిక, ఆత్మ యొక్క స్వరమును వినడం ఎంత ముఖ్యము. ఖచ్చితంగా అక్కడే శత్రువు దాడి చేస్తాడు, ప్రజల నుండి ఆ స్వరమును వినడం యొక్క ప్రాముఖ్యతను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు.

చాలా స్వరాలు ఉన్నాయని చెప్తాడు. శ్రద్ధ తీసుకోవడానికి అనేక సమస్యలు మరియు అవసరాలు ఉన్నాయని, కానీ ఎప్పటికీ మర్చిపోవద్దు, మీరు ఆయన నిర్ధారించిన స్వరమును వినాలి.

అలా చెప్పడం ద్వారా నేను మిమ్మల్ని బాధపెట్టినట్లయితే నన్ను క్షమించండి, కానీ, అది మీకు కోపం కలిగించవచ్చు అని భావించాను , కానీ, నేను మీకు దేవుని యొక్క స్వరము.

సమాధానం ఉంది: నేను మీకు దేవుని యొక్క స్వరము.

ఇది ఆయన వధువుకు చాలా స్పష్టంగా ఉంది. ఇది దాచబడలేదు, ఇది సాదా దృష్టిలో ఉంది; ఎవరైనా దానిని చదవగలరు. ఆయన చెప్పని విషయాన్ని నేను ప్రజలకు చెప్పడం లేదు… నేను ఏమి కలిగించుటలేదు. మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏమిటో ఆయన స్పష్టంగా చెప్పాడు. దేవుని సంపూర్ణ చిత్తము ఆయన స్వరమును వినడం మరియు ఆయన మనకు దేవుని స్వరము.

సోదరులు మరియు సోదరీమణులారా, మీరు మీ కాపర్లను వినకూడదని నేను చెప్పడం లేదు. వారు పరిచర్య చేస్తే వారు అబద్ధమో, తప్పో నేను అనడం లేదు. వధువుకు సహాయం చేయుటకు మరియు అసలైన వాక్యమునకు మిమ్మల్ని తిరిగి సూచించటకు ప్రభువు మమ్మల్ని ఇక్కడ ఉంచాడు; ఆ స్వరము మీరు వినగలిగే అత్యంత ముఖ్యమైనదిగా మీ ముందు ఉంచుటకు. మనం దేవుని పరిపూర్ణ చిత్తమునకు తిరిగి రావాలి. పూర్తిగా పునరుద్ధరించబడిన ఆదాము, వాక్యం వెనుక బలపరచబడ్డాడు. దేవుడు తోటలో ఆదాముతో ప్రతిరోజూ నేరుగా మాట్లాడాడు మరియు నేడు,ఆయన అదే  చేస్తున్నాడు.

మనము ఎడమలో నిలబడి ఇలా చెప్తాము “మనము సోదరులము!” మనము విభజించబడలేదు, ఒక్క శరీరము మనము; ఒక్క నిరీక్షణ మరియు బోధ, ( బైబిల్ బోధ.)

మనము సోదరలము. నేను సంఘములను విభజించడానికి ప్రయత్నించడం లేదు, వధువును ఒకచోట చేర్చగల ఏకైక విషయంతో మనలను ఒకచోట చేర్చడానికి ప్రయత్నిస్తున్నాను. మనమందరం ఏదైనా పరిచారకుడితో లేదా పరిచారుకుల బృందంతో ఏకీభవించలేము; అవన్నీ భిన్నంగా ఉంటాయి మరియు భిన్నమైన విషయాలు చెబుతారు. ఒక్క ఏడవ దూత మాత్రమే ఉన్నాడు. దేవుని యొక్క స్వరం ఒక్కటే ఉంది. దేవుడు తన వధువు కోసం టేప్‌లపై ఉంచిన స్వరము.

నేను స్పష్టముగా చెబుతున్నాను. నా ప్రత్యక్షత : టేప్‌లపై యున్న దేవుని స్వరమును వినడం దేవుని పరిపూర్ణ చిత్తము.

సమూయేలు కాలంలోలాగే, ప్రజలు అతనిని సంప్రదించి, తమను పరిపాలించడానికి ఒక రాజు కావాలని చెప్పారు. అది అతని హృదయాన్ని బాధించింది. అతను దేవుని వద్దకు వెళ్లి వారికి ఏమి కావాలో చెప్పాడు. దేవుడు సమూయేలుతో చెప్పాడు, వారు నిన్ను విసర్జించలేదు, సమూయేలు, తమ్మును ఏలకుండ వారు నన్నే విసర్జించియున్నారు.

ఆయన వారిని ఎలా పరిపాలిస్తున్నాడు? ఆయన ప్రవక్త ద్వారా ,సమూయేలు. అది ఆయన పరిపూర్ణ చిత్తము, మరియు వారు అతనిని విసర్జించారు. ఆయన వధువు అవుటకు మీరు దేవుని పరిపూర్ణ చిత్తముకు తిరిగి రావాలి. మీరు 2 పరిపూర్ణ చిత్తాలు కలిగి ఉండలేరు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు అంతా ఒకే సమయంలో దేవుని స్వరాన్ని వినడానికి కలిసి రావాలని నేను ఎంతగానో ఇష్టపడతాను. “నేను” చెబుతున్నందున కాదు, దేవుడు ఇది చేస్తున్నాడు కాబట్టి. ఆయన వధువును కలిపి తీసుకురాగలిగేది అది మాత్రమే.

జెఫెర్సన్‌విల్ సమయానికి ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు వధువు యొక్క కొంత భాగముతో వర్తమానమును వినుటకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: పది మంది కన్యకలు, మరియు లక్ష నెలబై నాలుగు వేల మంది యూదులు 60-1211M.

మీరు మాతో చేరలేకపోతే, ఈ ఆదివారం ఉదయం మీ సంఘములో దేవుని స్వరమును వినుటకు మీ కాపరిని ప్రోత్సహించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు, ప్రతి సంఘములో, ప్రతి గృహములో లేదా మీరు ఎక్కడ ఉన్నా, పరలోకము యొక్క మాధుర్యంతో నింపబడిన స్వచ్ఛమైన మన్నాను వినుచుండగా, మీరు ఊహించగలరా.

బ్రో. జోసెఫ్ బ్రాన్‌హామ్

23-0604 ఫిలదెల్ఫియ సంఘకాలము

ప్రియమైన శ్రీమతి యేసు క్రీస్తు,

అది అద్భుతంగా అనిపించడం లేదా? గొర్రెపిల్ల  ఆయన వధువు ఎప్పటికీ దేవుని యొక్క అన్ని పరిపూర్ణతలలో స్థిరపడ్డారు.మనము దానిని ఎలా వర్ణించగలము? మనము దాని గురించి ఆలోచిస్తాము.మనము దాని గురించి కల కంటాము. దాని గురించి వాక్యం ఏమి చెబుతుందో మనం చదువుతాము. ఆయన మనతో తన స్వంత పరిశుద్ధతను పంచుకోవడం మనం చూస్తాము. ఆయనలో, మనము దేవుని యొక్క నీతిగా ఉన్నాము.

మనం ప్లే నొక్కినప్పుడు, మరియు దేవుడే తన బలిష్టుడైన దూత ద్వారా మనతో మాట్లాడటం మరియు ఈ విషయాలు చెప్పినప్పుడు అది మనకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది.

ఈ జీవితంలో ఏదీ లేదు, అది సంతృప్తికరంగా ఉండవచ్చు, మంచిగా మరియు బాగుగా ఉండవచ్చు, కానీ మీరు క్రీస్తులో మొత్తం సంపూర్ణతను కనుగొంటారు. ఆయన పక్కన సమస్తమూ అల్పమైపోతుంది.

ఆయన మనకు కొత్త నామము కలిగియుంటామని చెప్పాడు, ఆయన నామము. ఆయన మనలను తన వద్దకు తీసుకున్నప్పుడు ఆయన పేరు మనకు ఇవ్వబడుతుంది. ఇది మనం ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లికొడుకు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనము వెళ్తాం. ఆయనచేత మనం ఎప్పటికీ విడిచిపెట్టబడము. ఆయన పక్షాన్ని మనము ఎప్పటికీ విడిచిపెట్టము.మనము ఆయనతో ఆయన సింహాసనాన్ని పంచుకుంటాము. ఆయన మహిమతో, గౌరవంతో మనం కిరీటాన్ని ధరిస్తాం.

మరియు ఆయన తనను తాను ప్రపంచానికి నిరూపించగా, మరియు ప్రపంచం అంతా ఆయన పాదాలకు నమస్కరించగా, ఆ సమయంలో ప్రపంచం అంతా పరిశుద్దుల పాదాలకు నమస్కరిస్తుంది, వారు ఆయనతో సరిగ్గా నిలబడ్డారని రుజువుచేయడమైనది. దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించబడును గాక!

మనం ఆయన వధువుగా ఉంటామని దైవ ఆజ్ఞ ద్వారా ఆయన మనల్ని ముందుగానే ఎరిగియుండెను. ఆయన మనలను ఎంచుకున్నాడు; మనము ఆయనను ఎంచుకోలేదు. ఆయన మనలను పిలిచాడు; మనము మనముగా రాలేదు. ఆయన మన కోసం మరణించాడు. ఆయన మనలను తన రక్తంలో కడిగాడు. ఆయన మన కోసం మూల్యం చెల్లించాడు. మనము ఆయనకు చెందినవారము, మరియు ఆయనకు మాత్రమే. మనము ఆయనకు పూర్తిగా కట్టుబడి ఉన్నాము మరియు ఆయన బాధ్యతను అంగీకరించాడు. ఆయన మనకు శిరస్సు. అతను తన దూత ద్వారా మనతో మాట్లాడతున్నాడు మరియు మనము విధేయులై ఉంటాము, ఎందుకంటే అది మన ఆనందం.

ప్రారంభం నుండి ముగింపు వరకు, టేపులపై ఉన్న వర్తమానము అంతా దేవుడి నుండి మనకు. ఆ జీవితం మనలో ఉండనివ్వండి. మనలను శుద్ధి చేసేది ఆయన రక్తంగా ఉండనివ్వండి. మనలను నింపేది ఆయన ఆత్మగా ఉండనివ్వండి. మన హృదయంలో మరియు నోటిలో ఆయన వాక్యమును ఉండనివ్వండి. ఆయన దెబ్బలచేత మనకు స్వస్థత కలగనివ్వండి.  యేసు, మరియు యేసు మాత్రమే ఉండనివ్వండి. మనం చేసిన నీతి క్రియల వల్ల కాదు. క్రీస్తు నా జీవితము. ఈ వర్తమానము మన జీవితం, ఎందుకంటే ఇది క్రీస్తు.

”ఓహ్, ప్రపంచంలో చాలా స్వరాలు ఉన్నాయి – చాలా సమస్యలు మరియు అవసరాలు శ్రద్ధ కోసం ఏడుస్తున్నాయి; కానీ ఆత్మ యొక్క స్వరం వలె అంత ముఖ్యమైన, విలువైన స్వరము ఏదీ లేదు. కాబట్టి, “సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినును గాక.”

ఈ రోజు కోసం దేవునికి ఒక స్వరం ఉంది. ఇది దేవుని స్వరం అని అగ్ని స్తంభం ద్వారా నిర్థారించబడినది. ఈ రోజుకు టేప్ పై యున్న స్వరము కంటే ముఖ్యమైన, విలువైన స్వరము ఏదీ లేదు.

జెఫెర్సన్‌విల్ సమయానికి ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు మాతో చేరండి. పూర్తిగా తేనెతో నిండిన జోలె సంచి మన దగ్గర ఉంది. మనము దానిని ఏ సంఘము మీద కాకుండా బండ మీద ఉంచుదాము, బండ మీద, క్రీస్తు యేసు. మరియు గొర్రెలైన మీరు నాకడానికి వెళ్ళండి. మీరు ఖచ్చితంగా వెంటనే బాగుపడతారు. ఆ బండను నాకినప్పుడు పాపపు పంక్తి తొలగిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఇదే, దేవుని స్వరము మనకు అంతా చెప్తున్నప్పుడు వచ్చి వినండి : ఫిలదెల్ఫియ సంఘకాలము 60-1210.

బ్రో. జోసెఫ్ బ్రాన్‌హామ్

23-0528 సార్దీస్‌ సంఘ కాలము

యోగ్యమైన ప్రియమైనవారలారా, నీతిమంతులారా,

పక్షిరాజులారా, యేసు యొక్క మధురమైన స్వరం మీతో మాట్లాడటం మరియు ఇలా చెప్పడం వినుటకు మీరు ఈ ఆదివారం కూడుకొనుటకు సిద్ధంగా ఉన్నారా:

మీరు యోగ్యమైనవారు.” “మీరు నా సొత్తు.” “మీరు నీతిమంతులు.” మీరు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు” “మీ పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాయి.”

ఇవి నా మాటలు కాదు, కానీ అవి పరలోకంలో ఉన్న మన తండ్రి, ఆయన ఎన్నుకున్న వధువైన మీతో మాట్లాడుతున్న మాటలు. పరిశుద్ధాత్మ మరోసారి వచ్చి మానవ శరీరంలో నివసించాడు, కాబట్టి ఆయన తన ఎన్నుకోబడిన వధువుతో ఈ అద్భుతమైన వాక్యాలను నేరుగా మాట్లాడుతున్నాడు.

“యేసు చెప్పాడు” అని నా నుండి లేదా ఎవరినుండైనా వాటిని వినడం చాలా అద్భుతంగా ఉంటుంది, , కానీ ఆయన ఎంచుకున్న స్వరము ద్వారా ఆయన మాట్లాడటం వినడం; ఆయన అతని ద్వారా మీకు చెప్పడం, వ్యక్తిగతంగా … అంతకంటే గొప్పది ఏమీ లేదు.

దేవుడు తన వాక్యాన్ని ప్రపంచానికి తీసుకురావడానికి అనేక స్వరాలు ఉపయోగించుకుంటాడు. ప్రపంచానికి మరియు ఆయన వధువుకు ఒక ఆశీర్వాదంగా ఉండటానికి ఆయన వారిని ఎంచుకున్నాడు మరియు ఉంచాడు.

యేసు మానవ శరీరంతో భూమిపై ఉన్నప్పుడు, ఆయనను వెంబడించడానికి మరియు వారు మరి ఎక్కువ చూసిన మరియు విన్న వాటిని ఆయన కోసం మాట్లాడటానికి మనుష్యులను, తన అపొస్తలులను కూడా ఎన్నుకున్నాడు. సువార్త, మెస్సీయ వచ్చాడన్న మంచి వార్తను వ్యాప్తి చేయడానికి ఆయన పంపిన వారు ఈ మనుష్యులు; ఆయన వారితో భూమిపై ఉన్నాడు. ఈ గొప్ప వార్తను ప్రకటించడానికి మరియు మనుష్యులందరినీ తన వద్దకు తీసుకురావడానికి ఆయన ఇద్దరిద్దరినిగా పంపాడు.

ఆయన ఒక రాత్రి వారిని కూడగట్టినప్పుడు, “ నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను.” కొందరు ఏలీయా అనియు,  కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, చెప్పుకొను చున్నారనిరి”.అందుకాయన ”మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారు” అని అడుగగా, సీమోను పేతురు – ”నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు” అని చెప్పెను. అందుకాయన – “రక్తమాంసములు నీకు బయలు పరచలేదు, పేతురు, కాని పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెను, మరియు ఈ బండ (ప్రత్యక్షత) మీద నా సంఘమును కట్టుదును.”

ఈ గొప్ప మర్మమును చూసి ప్రపంచం పొరపడింది. కొంతమంది పురుషులు పేతురు గురుంచి అని నమ్ముతారు. అది అక్కడ పడివున్న రాయి అని కొందరు భావిస్తున్నారు. కొందరు అది యేసు అని నమ్ముతారు. కానీ ప్రత్యక్షత ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇవ్వబడింది, అది ఆయన ఎవరు అనే ప్రత్యక్షత అని మనకు తెలుసు.

యేసు మరణం, సమాధి మరియు పునరుత్థానం తర్వాత, పెంతెకోస్తు దినమున, ఈ గొప్ప వార్తను ప్రపంచానికి తెలియజేయడానికి వారు పంపబడ్డారు. పేతురు మరోసారి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు మరియు ప్రజల ముందుకు వెళ్లి ఆయన పరిశుద్ధాత్మను ఎలా స్వీకరించాలో ప్రకటించాడు. మీరు పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి అని చెప్పాడు.

పరిశుద్ధాత్మ పేతురుపై ఎంతటి స్థానం ఉంచాడు. ప్రజలు ఆయనను ఎలా చూస్తున్నారో మనం ఊహించవచ్చు. యేసు ఇక్కడ భూమిపై శరీరంతో ఉన్నప్పుడు అతను ఆయనతో కలిసి నడిచాడు. అతను ఆయన స్నేహితుడు. ప్రతిరోజూ ఆయన పక్కనే ఉండేవాడు. ప్రత్యక్షతను ఇవ్వడానికి ఆయన ఎన్నుకున్నవాడు. కానీ దేవుడు తన ప్రవక్తగా మరొకరిని ఎంచుకున్నాడు: పౌలు.

పౌలుతో ఉండడానికి పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు, అతడు అన్యజనులతో కలిసి తిని త్రాగుచున్నాడు. కానీ యాకోబు నుండి ఒక గుంపు అక్కడికి వచ్చినప్పుడు, అతను తనను తాను ఉపసంహరించుకున్నాడు మరియు భయపడిపోయాడు. పౌలు అతన్ని ఇతరుల ముందు బాహాటంగా మందలించాడు మరియు అతను సత్యం ప్రకారంగా నడవలేదని  అతనను నిందించాడు. సహోదరుడు బ్రాన్‌హామ్‌ మాట్లాడుతూ, పేతురు యూదుల వలన పట్టుసడిలినట్లే ఉన్నాడు.

ఈ రోజు ఇది మనకు ఏమి చెబుతుంది? అది ఎవరు అన్నది ముఖ్యం కాదు. వారికి పరిశుద్ధాత్మ ఎంత ఉంది అన్నది కాదు. వారికి ఎలాంటి అధికారం లేదా పిలుపు ఉంది అని కాదు. మీరు మీ సంపూర్ణత  కోసం దేవుడు ఎన్నుకున్న ప్రవక్తతో ఖచ్చితంగా ఉండాలి. ఆయన, మరియు ఆయన మాత్రమే, దేవుని వాక్యం యొక్క దైవిక అనువాదకుడు.

ఇది పేతురుకు లేదా అప్పుడు కాని ఇప్పుడు కాని దేవుడు ఎన్నుకున్న శిష్యులలో ఎవరినీ వ్యతిరేకించాలని కాదు. వారు సువార్తను వ్యాప్తి చేయడానికి ఎన్నుకోబడ్డారు, కానీ దేవుడు తన సంఘము పైన ఒక్క మనుష్యుని ఎన్నుకున్నాడు. ప్రభువు ఈలాగు సెలవిచుచున్నాడు తో దేవుడు ఎన్నుకున్న ప్రవక్త, ఆయన మాత్రమే వారు కాదు. వారికి వారి స్థానం ఉంది, కానీ ఆయన వధువు కోసం అంత్యపు వాక్యముతో,ఆయన సంఘమును క్రమంలో ఉంచడానికి ఒక్క ప్రవక్త ఉన్నాడు.

మన రోజు కోసం దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరాన్ని వినడానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇది చూపిస్తుంది. ఆయన ఎన్నుకున్న ఒక్కడు ఆయన వాక్యానికి దైవిక అనువాదికుడు. ఆయన దూత ద్వారా ఆయన స్వరాన్ని వినడం కంటే గొప్పది ఏదీ లేదు; ఆయన ఎంచుకున్న స్వరం, మనం ఎంచుకున్నది కాదు.

దేవుడు తన వాక్యంతో ఉండే మరియు ఆయన ఎంచుకున్న దూతతో ఉండే ఎన్నుకున్న ప్రజల గుంపును మనం అన్ని కాలాల్లో చూస్తాము. ఆ స్వరము మనం ఎవరు, వారిలో ఒకరమని రోజూ మనకు ప్రకటిస్తోంది.

ఆయన తన సంఘమునకు సంస్కర్తలను పంపుతాడు, కానీ ఈ రోజు, ఆయన తన పునరుద్ధారకుడును పంపాడు; “నేను పునరుద్ధరిస్తాను, మరియు నేను పిల్లల హృదయాలను తిప్పుతాను, ఎందుకంటే నా స్వరం యొక్క రోజుల్లో నేను మీకు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి.”

జెఫెర్సన్‌విల్ సమయానికి ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఆ స్వరాన్ని మాతో వినవలసిందిగా మీరు ఆహ్వానించబడ్డారు, సార్దీస్‌ సంఘ కాలము 60-1209 వినుచుండగా ఆయన మనతో మాట్లాడుతూ మరియు  మనకు నిజమైన మరియు అబ్భదపు సంఘమును చూపుతాడు.

సహోదరుడు. జోసెఫ్ బ్రెన్హామ్. 

23-0312 పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము

వర్తమానము: 64-0802 పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము

BranhamTabernacle.org

23-0101 దేవుని చిత్తము కాకుండా దేవునికి సేవ చేయుటకై ప్రయత్నించుట

వర్తమానము: 65-0718M దేవుని చిత్తము కాకుండా దేవునికి సేవ చేయుటకై ప్రయత్నించుట

PDF

BranhamTabernacle.org

22-1218 ఆయన వాక్యమును గూర్చి దేవుడు ఎప్పుడైనా తన మనస్సు మార్చుకొనునా?

వర్తమానము: 65-0418E ఆయన వాక్యమును గూర్చి దేవుడు ఎప్పుడైనా తన మనస్సు మార్చుకొనునా?

PDF

BranhamTabernacle.org