23-0709 దేవుడు సామాన్యతలో తనకుతాను మరుగుచేసికొని అటుతరువాత, ఆవిధముగనే తనకుతాను బయలుపరచుకొనును

వర్తమానము: 63-0317M దేవుడు సామాన్యతలో తనకుతాను మరుగుచేసికొని అటుతరువాత, ఆవిధముగనే తనకుతాను బయలుపరచుకొనును

PDF

BranhamTabernacle.org

ప్రియమైన ప్రత్యేకించబడిన ప్రజలారా, విడ్డూరంగా, వింతగా యున్నవారులారా, ఆత్మసంబంధమైన యాజకులు, రాజ వంశపువారు.

మునుపెన్నడూ లేనివిధంగా ఆయన వాక్యాన్ని ప్రత్యక్షపరుస్తూ, తన వధువుకు ఎంతటి మహిమాన్వితమైన సమయాన్ని ఇస్తున్నాడు. మనం విన్న ప్రతి వర్తమానము మనం ఇంతకు ముందెన్నడూ విననట్లే అనిపిస్తుంది. పరలోకం నుండి దిగి వస్తున్న స్వచ్ఛమైన మన్నాపై విందు చేస్తున్నప్పుడు మన హృదయాలు మరియు ఆత్మలు ఆనందంతో నిండి ఉన్నాయి. ఆయన మనకు ప్రత్యక్షత తర్వాత ప్రత్యక్షత తినిపిస్తునప్పుడు ఇది త్వరలో రాబోయే మన వివాహ విందు యొక్క పూర్వప్రదర్శన లాగా అనిపిస్తుంది.

మనము మన పెదవుల ఫలాల ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన త్యాగాలను అర్పిస్తున్నాము,ఆయన నామాన్ని స్తుతిస్తున్నాము. మనము పరలోక నక్షత్రాల వలె మన స్థానాన్ని తీసుకున్నాము.

ఆయన మనలను పరలోకపు స్థలములలో ఏకం చేసారు, ఆయన పరిశుద్ధాత్మను మనపై కుమ్మరించారు, త్వరలో ఆయన రాకడ కోసం మనల్ని సిద్ధం చేస్తున్నారు. మనం ఆలోచించగలిగేది అదే. మన మనసులో ఉన్నది అదే. మనం చేయాలనుకుంటున్నది వాక్యము వినడమే. మనం ఆయన వధువు అని పదే పదే చెబుతున్నారు.ఆయన చూపించిన మార్గములో నివాసము చేయడము ఆయన పరిపూర్ణ చిత్తమైనది.

మనము ఆయన టేప్ పరిచర్య విభాగంలో సైనికులం, మరియు మనము దాని గురించి చాలా గర్వపడుతున్నాము. ఇది గౌరవ చిహ్నం. మనము దానిని బిగ్గరగా కేకలు వేసి ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాము, అవును, మేము వారిలో ఒకరిగా ఉన్నాము.

మనం తినడానికి నిల్వచేసిన ఆహారాన్ని ఆయన అందించాడు. స్వయంగా దేవుని మన్నా ఆయన వధువుతో మాట్లాడుతూ, మనం ఆయన సైన్యంలో ఉన్నామని తెలియజేస్తుంది.

మనము పరలోకం యొక్క గొప్ప పందిరి క్రింద చాలా సామరస్యంగా కూడుకుంటున్నాము, ఆత్మ మరియు శరీరం రెండింటికీ స్వచ్చందంగా స్వస్థత అయ్యే వరకు పరిశుదాత్మ శరీరంలోని ప్రతి అవయవాన్ని ఉంచింది .

మనము దేవుని వాక్యాన్ని తీసుకుంటాము మరియు దెయ్యం మరియు అతని శక్తిని ఓడించాము. మనము ఆ వాక్యముతో అతనిని తోళ్లుగా కోస్తాము. మన నాయకుడు మనతో ఇలా అన్నాడు: “మీరు వాక్యం. భయపడవద్దు. దెయ్యం దగ్గరకు వెళ్లి, ‘ఇది వ్రాయబడింది’ అని చెప్పండి.

ఆయన మనలను తన సైనికులుగా ఎంపిక చేసుకున్నాడు. మనము శిక్షణలో ఉన్నాము, ఆయన వాక్యంతో బలపరచబడ్డాము. మనము ఇప్పుడు దుస్తులు ధరించి పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. మన 5 స్టార్ జనరల్ ఏమి చేయాలో మనకు ఆదేశించారు: నా టేప్ భోదతో సరిగ్గా ఉండండి.

మరియు టేపు ఏమిచెప్పినదో అదే చెప్పుటకు మీరు నిశ్చయించుకొనవలెను. ఏమి చెప్పవద్దు. చూశారా? కారణం. నా స్వంతముగా నేనేమి చెప్పుటలేదు. అది చెప్పునది ఆయనే. మీరు గమనించారా? చాలసార్లు గందరగోళం జరుగుతుంది. ప్రజలులేచి, “ఫలానావారు అది చెప్పారు. ఆ విధముగా అది అర్ధం” అని చెప్తారు. అది—ఆలాగు ఉన్నట్లుగానే దానిని వదలివేయండి.

ఇది విలియం బ్రాన్‌హామ్ టేపులపై మనకు చెబుతున్నది కాదు, దేవుడు ఆయన వధువుతో టేపులపై చెబుతున్నది. ఇవి ఆయన ఆదేశాలు. మీ 5 స్టార్ జనరల్ నుండి వచ్చిన ఈ ఆదేశాలను పాటించడానికి ఒకే ఒక మార్గం ఉంది మరియు దానిని అలాగే వదిలివేయండి, ప్లే నొక్కండి.

మనం దేవుని సైన్యంలో ఉన్నాము, కాబట్టి మనం ఆయన ఆదేశాలను పాటించాలి వాక్యము కొరకు వాక్యము. మనము ముందుకు వెళ్తున్నాము. మనము పరాక్రమవంతులము, విశ్వాసముగల పురుషులము, శక్తిగల పురుషులము, వివేచన గల పురుషులము, ప్రత్యక్షత గలిగిన పురుషులము.

మనం మరలా తండ్రితో పరిపూర్ణ సహవాసంలో ఉన్నాము, అగాధం యొక్క అవతలి వైపు నిలబడి, మనకు వ్యతిరేకంగా ఉన్న పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా. ఆయన పునరుద్ధరించబడిన ఆదాము.

ఇది మరోకసారి సామాన్యతలో దేవుడు. ఇది అందరికీ కాదు, ఆయన వధువు మాత్రమే, మరియు మనము దానిని స్పష్టంగా మరియు స్వచ్ఛమైన దృష్టిలో చూస్తున్నాము.

ఏడు ముద్రలు మరోసారి వినడానికి నేను చాలా ఎదురు చూస్తున్నాను. మునుపెన్నడూ లేని విధంగా ఆయన తన వాక్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు. మనము ఆయన వాక్యము యొక్క గొప్ప ప్రత్యక్షతను పొందుతాము.

ఆయన మనకు మరింత ప్రత్యక్షపరచడానికి ఈ రోజు వరకు వేచి ఉన్నాడు. మనకు కావలసింది అంతా రికార్డ్ చేయబడింది మరియు మన వేలి దూరంలో వినడానికి అందుబాటులో ఉంది.

ఈ వర్తమానము వధువును పరిపూర్ణం చేసే ఆ ఏడు ఉరుములు; ఎందుకంటే వధువుకు మన ఏడవ దూత వర్తమానికుడు ద్వారా దేవుని మర్మములు అన్నీ ప్రత్యక్షపరచబడతాయి.

ప్రపంచ చరిత్రలో ఇది అత్యంత మహిమాన్వితమైన సమయం. మనము ఆయన వధువు కోసం ఆయన రాకడ అంచున ఉన్నాము. లేఖనాల్లో చెప్పబడిన ఈ విషయాలన్నిటి గురుంచి ప్రపంచం ఎదురుచూస్తోంది; మధ్యానమందు సూర్యుడు దిగిపోవడం మరియు అన్ని రకాల విషయాలు జరగడం వంటివి. కానీ ఇది ఇప్పటికే అయిపోయింది మరియు వారికి తెలియదు.

జ్ఞప్తించుకోండి. ఆ మర్మమైన ఏడు ఉరుములతో అది ముద్రించబడినది. చూశారా!

మనము మరొకసారి దేవుని ఉరుమును మరియు ఆయన వధువుకు ఏడు ముద్రలపై ప్రత్యక్షత వినుటకు కూడుకొనుచుండగా గొప్ప విషయాలు జరగబోతున్నాయి.

జెఫెర్సన్‌విల్ సమయానికి మధ్యాహ్నం 12:00 గంటలకు మాతో చేరాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: 63-0317M – దేవుడు సామాన్యతలో తనకుతాను మరుగుచేసికొని అటుతరువాత, ఆవిధముగనే తనకుతాను బయలుపరచుకొనును అనే వర్తమానముతో మేము ఈ గొప్ప సిరీస్‌ను ప్రారంభిస్తున్నాము.

బ్రదర్ బ్రాన్‌హామ్ బ్రాన్‌హామ్ గుడారాన్ని మరియు ప్రజలను తిరిగి దేవునికి అంకితం చేసినట్లే, మనల్ని, మన ఇళ్లను, మన చర్చిలను లేదా మనం ఎక్కడ కూడుకున్నా ఆయనకు తిరిగి అంకితం చేద్దాం.

బ్రో. జోసెఫ్ బ్రాన్‌హామ్.

వర్తమానమును వినడానికి ముందు సిద్దపడుటకు చదువవలిసిన లేఖనములు.

1 దినవృత్తాంతములు 17:1-8

యెషయా 35:8 / 40:1-5 / 53:1

మలాకీ 3వ అధ్యాయం

మత్తయి సువార్త 11:10, 11:25-26

యోహాను సువార్త 14:1-6

1 కొరింథీయులు 13వ అధ్యాయం

ప్రకటన 21వ అధ్యాయం