23-0716 ఏడు సంఘకాలములు మరియు ఏడు ముద్రలకు మధ్యనున్న ఎడమ

వర్తమానము: 63-0324M ఏడు సంఘకాలములు మరియు ఏడు ముద్రలకు మధ్యనున్న ఎడమ

PDF

BranhamTabernacle.org

ప్రియమైన చిన్న కొలను తామరలారా

మనము బురద నీటిని నెట్టుకోని పై భాగానికి వచ్చాము మరియు మన రెమ్మలను విరజిమ్మాము. చిన్న పుష్పదళాలు బయటకు వచ్చి లోయలోని వళ్ళీ పద్మాన్ని ప్రతిబింబింపచేస్తున్నాయి. మన జీవితాలను పూర్తిగా దేవునికి మరియు ఆయన వాక్యానికి అంకితం చేసాము.

మనము అంత్యకాలంలో ఉన్నాము మరియు తూర్పు మరియు పడమర, ఉత్తరం మరియు దక్షిణాల నుండి వస్తున్నాము,ఎత్తబడుట కోసం సిద్ధమవుతున్నాము. మనలోని ప్రతి నరము పరిశుద్ధాత్మతో నిండిపోయే వరకు కొన్ని నిమిషాల పాటు మనల్ని మనం స్థిరంగా ఉంచుకుంటున్నాము.మనము పైకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాము.

రోజు రానే వచ్చింది. ఆయనతో నిజమైన ఏకత్వములో ఆయనతో ఒకటిగా ఆయన ప్రజలను ఆయన పిలుస్తున్నారు. యేసుక్రీస్తు మన శరీరంలో ఆయన ఆత్మతో జీవిస్తున్నాడు, ప్రపంచానికి ఒక ధ్వజముగా ఆయన చేసిన పనులనే చేస్తున్నాడు.

లేఖనంలో అత్యంత ఉత్కృష్టమైన విషయం మన కాలంలో జరుగుతోంది. ఒక కార్యము, ఒక దేవదూత కూడా, ఏమీ చేయలేడు, గొర్రెపిల్ల మాత్రమే. ఆయన వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడి చేతి నుండి పుస్తకాన్ని తీసుకున్నాడు, దానిని తెరిచాడు, ముద్రలను చించివేసి , దానిని ఆయన వధువు అయిన మనకు ప్రత్యక్షపర్చడానికి భూమిపైకి తన ఏడవ దూతకు పంపాడు.

జరుగుతున్న విషయాలు; ఆయన ప్రతిరోజూ మనకు ప్రత్యక్ష పరుస్తున్న వాక్యము, మాటలకు అతీతమైనది. మనము మన గొంతులను పెంచి మరియు కేకలు వేస్తాము, హల్లెలూయా! ఆయన వాక్యము యొక్క  ప్రత్యక్షత,బయలుపరుచుట, అభిషేకము, శక్తి, మహిమ కాలము ప్రారంభమైనప్పటినుండి కంటే ఎక్కువగా ఉంది.

స్వర్గంలో, మరియు భూమిపై, మరియు భూమి క్రింద, సముద్రం లోపల ఉన్న ప్రతి జీవితో, మరియు వాటిలో ఉన్నవన్నీ మనం కేకలు వేస్తాము: ఆశీర్వాదాలు, గౌరవం, మహిమ, శక్తి, సింహాసనంపై కూర్చున్న ఆయనికి, మరియు గొర్రెపిల్లకి నిరంతరము, ఆమేన్! ఆమేన్, మరియు ఆమేన్!

ప్రతి జీవి, ప్రతి మనిషి కాలము ప్రారంభం నుండి ఈ రోజు కొరకు వేచి ఉన్నారు. ఆయన పుస్తకాన్ని తీసుకోవడానికి ముందు, దానిని విప్పి మరియు ఆయన మర్మములు ఆయన ఎన్నుకున్న వధువుకు ప్రత్యక్షపరచటానికి ఆయన ఎంచుకున్న దూత భూమిపైకి వచ్చేవరకు దేవుడు కూడా వేచి ఉన్నాడు.

కాలము  ప్రారంభమైనప్పటినుండి భూమిపై ఏ మనిషికి ఎప్పుడూ తెలియనటువంటిది మనకు ఇప్పుడు తెలుసు. పడిపోవడముతో కోల్పోయింది ప్రతీది. ఆయన వాక్యములో దాచబడిన ప్రతీది. వధువుకు కావలిసిన ప్రతీది రికార్డ్ చేయబడినది మరియు దేవుని యొక్క చిన్న స్టోరేహౌస్ లో ఉంచబడినది.

కాలము తెరకి అవతల ఆయన మనకు చూపించాడు మరియు అవతల ఆయనతో మనలను మనము చూసుకుంటాము. వాక్యము వినుటద్వారా వధువు తనను తాను సిద్ధపరుచుకుంది.

మనము శిక్షణలో ఉన్నాము. మనము దేవుని యొక్క మొత్తం కవచాన్ని ధరించాము. ఏదీ మనలను కదిలించదు. ఏదీ మనలను భయపెట్టదు. ఏదీ మనకు హాని కలిగించదు. ఒక వాక్యము రాజీకి కూడా ఏది మనలను ఏమీ చేయలేదు.మనము వాక్యము.

మన చేతుల్లో మన గుత్తితో ఆయన కోసము ఎదురుచూస్తున్నాము. కేవలం సమయము గురించి. పాత గడియారం కదులుతున్నది. గుర్రాల పరుగు, చక్రాల క్రింద ఇసుక పొర్లడం మనము వింటున్నాము. పాత రథము ఆపబోతోంది.

ఆయన వచ్చినప్పుడు మనం ఈ ప్రాచీన ప్రపంచం నుండి ఆయన చేతుల్లోకి దూకుతాము. ఆయన మనలను పట్టుకుని, “నేను మీ కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళాను, అది ఇప్పుడు అంతా అయిపోయింది, హనీ” అని చెబుతాడు.

ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా మనము ఎదురు చూస్తున్నాం. మనము మరోసారి ఏడు ముద్రలను వినాలని ఆయన కోరుకుంటున్నందున మనము చాలా సంతోషిస్తున్నాము. మనం వినే ప్రతి వర్తమానము మనం ఇంతకు ముందెన్నడూ విననట్లే ఉన్నందున, మనం మరింత ప్రత్యక్షతను పొందబోతున్నామని మనకు తెలుసు.

ఈ రోజు జీవిస్తూ మరియు ఈ వర్తమానమును వినడం రికార్డ్ చేయబడినప్పటి కంటే కూడా గొప్పది. ఆయన ఇప్పుడు మనకు మరిన్నిటిని ప్రత్యక్షపరుస్తున్నాడు. ఏమి జరగవచ్చు?

జెఫెర్సన్‌విల్ సమయానికి మధ్యాహ్నం 12:00 గంటలకు మాతో కలిసి రండి మరియు వినడం ఆనందించండి: 63-0317E ఏడు సంఘకాలములు మరియు ఏడు ముద్రలకు మధ్యనున్న ఎడమ. ఇది వధువు తినడానికి ప్రభువు సిద్ధం చేసిన ఆహారం.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

వర్తమానుము వినడానికి సిద్ధపడుటకు చదవవలసిన గ్రంథాలు:

లేవీయకాండము 25:47-55

యిర్మీయా 32:1-15

జెకర్యా 3:8-9 / 4:10

రోమియులు ​​8:22-23

ఎఫెసీయులు 1:13-14 / 4:30

ప్రకటన 1:12-18 / 5వ అధ్యాయం / 10:1-7 / 11:18