23-0625 అయ్యా, ఇదేనా అంతమునకు సూచన?

వర్తమానము: 62-1230E అయ్యా, ఇదేనా అంతమునకు సూచన?

PDF

BranhamTabernacle.org

ప్రియమైన వాక్యము ద్వారా వాక్యపు వధువా,

ఏ ప్రవక్త, ఏ అపొస్తలుడు, మనం ఇప్పుడు జీవిస్తున్నట్లుగా, ఏ కాలంలోనూ ఎప్పుడూ జీవించలేదు. ఇదే అంతము. అగ్ని స్తంభం తిరిగి వచ్చింది. ఇశ్రాయేలు పిల్లలను నడిపించిన ఆ అగ్ని స్తంభము; సౌలు డమస్కకు వెళ్లే దారిలో అతనిని నేల మీద పడివేసినది అదే. అదే అగ్నిస్తంభం అదే శక్తితో వచ్చాడు, అవే పనులు చేస్తూ, అదే వాక్యమును ప్రత్యక్షపరుస్తూ, బైబిల్‌తో వాక్యము ద్వారా వాక్యముగా నివసిస్తున్నాడు.

దాగి ఉన్న మర్మములన్ని అతనికి ప్రత్యక్షపరచబడ్డాయి. మీరు గమనించారా, అన్ని మర్మములు. కొత్తది ఏమీ లేదు, ఏదీ విడిచిపెట్టలేదు, వేరొకరి నుండి ఏమీ ప్రత్యక్షపరచబడదు. కాదు; అన్నీ అతని ఏడవ దూత వర్తమానికుడికి ప్రత్యక్షపరచబడ్డాయి మరియు మనకు ఇవ్వబడ్డాయి, ఆయన వధువుకు, టేప్ మీద.

వధువుకి అవసరమైనది అంతా అదే; మరల గమనించండి, వధువుకి అవసరమైనది అంతా. ఇతరులకు ఇతర విషయాలు అవసరం, మరియు అది వారికి ఇవ్వబడుతుంది. కానీ మనకు అవసరమైనది టేప్పై రికార్డ్ చేయబడినది మరియు మనకు ఇవ్వబడింది మరియు ఇది మనకు ఎత్తబడే విశ్వాసమును ఇస్తుంది.

ప్రభువైన దేవుడు అతనికి ఇచ్చిన సంఘము మనము. ఇది ఆయన ప్రధాన కార్యాలయం. ఇక్కడే ఉండమని ఆయన మనకు చెప్పాడు. ఏ భవనం కాదు, టేపులు. మనము ప్రతీ వాక్యమును పట్టుకొని, ఆకలిగొనియున్న మరియు నమ్మిన ఆ ప్రజల యొక్క సమూహమైయున్నాము. ఆయన మనలను ఇక్కడే ఉండి తెల్ల రాయిని, సువర్ణరంగపు రాయి, టేపులపై ఉన్న వాక్యమును, చూడమని చెప్పాడు.

పరలోకము నుండి ఒక స్వరం అతనితో మాట్లాడి, “ఆహారాన్ని తీసుకురా ఇక్కడ భద్రపరుచు. వారిని ఇక్కడ ఉంచడానికి అదొక్కటే మార్గం, వారికి ఆహారం ఇవ్వడమే”. వేరొకదాని కోసం వెతకండి, లేదా వేరొకరి నుండి కొత్తప్రత్యక్షలు వస్తాయని ఆయన చెప్పలేదు; టేప్‌పై నిల్వ చేసిన ఆహారాన్ని చూడండి, అక్కడే ఉండండి.

కానీ ఆయన ప్రత్యక్షపరిచిన అన్ని కలలలో వారు చేసినట్లుగానే, కొందరు ఆ విధంగా తీసుకున్నారు; కొందరు ఒక మార్గాన్ని, మరికొందరు మరొక దారిని తీసుకున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే ఉండి, ఆయన వారికి ఏమి చెప్పాడో చూశారు.

ఇప్పుడు దానిని కూడా ఇతరులతో పోల్చండి, కలలను. ఇది ఒక దర్శనం. ఆహారం, ఇక్కడ ఉంది. ఇది స్థలం.

ఆయన తన వధువుకు దాని కంటే స్పష్టంగా ఉండలేడు. ఇది ఒక దర్శనం, కల కాదు, ఒక దర్శనము. ఆహారం ఇక్కడ ఉంది: టేపులు. ఇది స్థలం: టేపులు. మనము ఆయన ఏమి చెప్పాడో అదే చేస్తున్నాము: టేపులను వినండి!

ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ఆత్మసంబంధమైన ప్రత్యక్షత అవసరం. ఈ ఆదివారం ఆయన మనకు చెప్పబోతున్నదంతా విశ్వసించటానికి మరియు అర్థం చేసుకోవడానికి ఆత్మసంబంధమైన ప్రత్యక్షత అవసరం. ఇది వధువుకు మహిమగల సమయం అవుతుంది.

ఈ వర్తమానములో దేవుడు మనకు చెబుతున్న మరియు ప్రత్యక్షపరుస్తున్న అనేక విషయాలు ఉన్నాయి. నేను కోట్ తర్వాత కోట్‌ని కాపీ చేసి మీకు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ అతను మీకు ప్రతి ముద్దను ప్రత్యక్షపరుస్తాడాని నాకు తెలుసు, ఎందుకంటే మీరు ఎవరో ఆయనే చెప్పారు:

ప్రభువైన దేవుడు నాకు ఇచ్చిన సంఘము ఇది. ఇక్కడ నా ప్రధాన కార్యాలయం ఉంది. నేను ఇక్కడే ఉంటాను… నమ్మే మరియు ఆకలితో మరియు పట్టుకొని ఉన్న వ్యక్తుల గుంపు ఇక్కడ ఉంది.

 ఆకలితో మరియు పట్టుకొని ఉన్న సమూహమైయున్నాము. చాలామంది మనల్ని అపార్థం చేసుకుంటారు మరియు ఎగతాళి చేస్తారు, కానీ అది సరే, మనము ప్రేమిస్తాము మరియు వారికొరకు ప్రార్థిస్తాము; కానీ మనలను నడిపించడానికి ఒక్క స్వరము మాత్రమే కావాలి.

నన్ను క్షమించండి, కానీ నేను మీకు ఈ కోట్ ఇవ్వాలి.

“అతడు బూర ఊదబోవుచుండగా, మర్మము సమాప్తమగును.” ఇప్పుడు, గమనించండి, ప్రకటన 10 లోని ఏడు ముద్ర స్వరాలు ప్రత్యక్షపర్చబడటానికి  ఇది సమయం. మీకు అర్ధమైనదా? గ్రంధము యొక్క అన్ని మర్మలు పూర్తయినప్పుడు! మరియు బైబిల్ చెప్పింది, ఇక్కడ, అతడు మర్మములను పూర్తిచేస్తాడు.

మర్మములను ఎవరు పూర్తి చేస్తారు? మీ కాపరి? ఒక గుంపు? నేనా? ఏడవ దూత వర్తమానికుడు: విలియం మారియన్ బ్రాన్‌హామ్. అతనికి ముందు, అతని సమయంలో లేదా అతని తర్వాత ఎవరూ లేరు. ఆయన మర్మములను పూర్తిచేస్తాడు.

ఇది ముగింపు సమయం కావచ్చు. ఇంద్రధనుస్సులు ఆకాశంలో విహరించే సమయం కావచ్చు మరియు పరలోకం నుండి “ఇక సమయం లేదు” అని ప్రకటన వస్తుంది. అలా అయితే, మన దేవుణ్ణి కలుసుకోవడానికి, మిత్రులారా, మనల్ని మనం సిద్ధం చేసుకుందాము.

అవును ప్రభూ, మేము మిమ్మలిని కలవడానికి సిద్ధంగా ఉండాలనుకుంటున్నాము. మేము చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నాము. మేము మీ పరిపూర్ణ చిత్తములో ఉండాలనుకుంటున్నాము. దయచేసి మాకు చెప్పండి తండ్రీ, మేము సిద్ధం కావడానికి ఏమి చేయాలి?

ఇప్పుడు చాలా ఆహారాన్ని ఉంచారు. దానిని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు దానిని ఉపయోగించుకుందాం.

మీ వధువు కోసం మీరు ఉంచిన ఆహారం మరియు దాన్ని ప్రత్యక్షపరుస్తున్నందుకు ధన్యవాదాలు తండ్రి. మేము దీన్ని ప్రతిరోజూ ఉపయోగిస్తున్నాము.

ఇక్కడ ఉన్న నా చిన్న సంఘము క్షమాపణ కోసం నేను ప్రార్థిస్తున్నాను, మీరు నన్ను నడిపించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి నన్ను పంపారు. వారిని దీవించు ప్రభూ. నేను దర్శనాలు మరియు కలలు మరియు విషయాలు చెప్పిన దాని ప్రకారం నేను చేసాను, కాబట్టి, నాకు తెలిసిన ఉత్తమమైనదానితో. నాకు తెలిసిన అంతటితో ఆహారం మొత్తము నేను వారి కోసం ఉంచాను ప్రభువా. ఏది ఏమైనా, ప్రభువా, మేము నీ వారము.

ధన్యవాదాలు ప్రభూ, మీరు మాకు మరోసారి చెప్పారు, మా ప్రయాణానికి కావలసిన ఆహారాన్ని అంతా మీరు ఉంచారు.

మీలో ప్రతి ఒక్కరితో ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు, జెఫెర్సన్‌విల్ సమయమునకు నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, అయ్యాలరా, ఇదేనా అంతానికి సూచనా? 62-1230E మునుపెన్నడూ లేని విధంగా మనకు విషయాలు ప్రత్యక్షపరచబడతాయని నాకు తెలుసు. ఇది మనం వినడం చివరిసారి కావచ్చు.

ఎత్తబడే విశ్వాసంలోకి ఎలా ప్రవేశించాలో మనకు తెలియజేయడానికి ఇది ఏదైనా అయితే? ఔనా? మనం పరిగెత్తామా, గోడల మీద దూకుతామా? మరియు ఏదైనా జరగబోతోందా, మరియు ఈ పాత, చెడిపోయిన, నీచమైన శరీరాలు మారబోతున్నాయా? నేను దానిని చూడడానికి జీవించగలనా, ఓ ప్రభూ? నేను చూసేంత దగ్గరగా ఉందా? ఇదేనా తరం? అయ్యాలారా, నా సోదరులారా, సమయం ఎంత? మనం ఎక్కడ ఉన్నాం?

బ్రో. జోసెఫ్ బ్రాన్‌హామ్