23-0618 లవొదికయ సంఘకాలము

ప్రియమైన తప్పిపోని వాక్యపు విశ్వాసులారా,

ఈ ఏడు సంఘకాలములు వినడం మరియు చదవడం ఎంత అద్భుతంగా ఉంది. మనం వినే ప్రతి వర్తమానముతో, మనం చదివే ప్రతి అధ్యాయంతో, ఆయన మనకు మరింత ప్రత్యక్షతను ఇస్తున్నాడు.  స్పష్టంగా ప్రతి సంఘకాలము గుండా మనము వస్తున్నట్టు స్పష్టంగా చూడగలుగుతున్నాము…. ఆయన వధువు, అసలైన వాక్యముతో ఉంది.

అన్ని కాలాలో మనం రెండు ఆత్మలను స్పష్టంగా చూస్తున్నాము; సాతానుడి మోసం మరియు అబద్ధాలు, దేవుని వాక్యాన్ని మార్చడం, ప్రజలను మోసగించడం, భ్రష్టు పట్టించడం మరియు జయించడం. కానీ అన్ని సమయాలలో దేవుని యొక్క చిన్న నమ్మకమైన ప్రజలు, ఆయన వధువు, ప్రతి వాక్యమును పట్టుకొని ఉంటుంది.

ప్రజలకు ఎల్లప్పుడూ ఒక స్థిరమైన హెచ్చరిక ఇవ్వబడుతుంది, మీరు తప్పనిసరిగా వాక్యముతో ఉండండి. మీరు వాక్యమును పక్కనపెట్టిన మరు క్షణము , మీరు సాతాను యొక్క గొప్ప జాలములో చిక్కుకుంటారు; మొదటి నుండి అవ్వ చేసినట్లుగా. ఆమె వాక్యమును ఉపయోగించడంలో విఫలమైంది. వాక్యానికి నేరుగా అవిధేయత చూపించి ఆదాము విఫలమయ్యాడు. కానీ యేసు, ఆయన వ్యక్తిగత జీవితంలో, ఆయనతో పోరాడుతూ, దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా అధిగమించాడు.

మనం ఆయన సింహాసనంలో కూర్చోవాలనుకుంటే, మనం ఆ సజీవమైన వాక్యమై ఉండాలని ఆయన చెప్పాడు. మన ప్రార్థనలు, ఉపవాసాలు లేదా మన పశ్చాత్తాపం కూడా మనకు ఆ ఆధిక్యతను ఇవ్వవు. ఇది వాక్య వధువుకు మాత్రమే ఇవ్వబడుతుంది.

నేను చాలా చెప్పాలనుకుంటున్నాను మరియు మీలో ప్రతి ఒక్కరితో పంచుకోవడానికి నేను ఇష్టపడే ఉల్లేఖనలు ఉన్నాయి; అవి అంతులేనివి. ఈ వర్తమానము మీ ప్రతి ఒక్కరి హృదయాల్లో మండుతుందని మరియు నాలాగే మీరు కూడా ప్రతి వాక్యమును ఇష్టపడతారని నాకు తెలుసు. మనము చేయాలనుకుంటున్నది దాని గురించి మాట్లాడటం మరియు సహవాసం చేయడం. ప్రపంచం తెలుసుకోవాలని మనము కోరుకుంటున్నాము: అవును, మనము టేప్ ప్రజలము. అవును, మేము ప్లే నొక్కుతాము. అవును, టేపులపై ఉన్నస్వరము వధువును పరిపూర్ణం చేయబోతోందని మనము నమ్ముతున్నాము. అవును, టేపులు వధువును ఏకం చేస్తాయి. అవును, ప్లే నొక్కడం దేవుని పరిపూర్ణ చిత్తము. అవును, నేను ఆయన వధువును.

చాలా లేఖల నుండి నేనే పునరావృతం చేస్తున్నాను అని నాకు తెలుసు, కానీ  చాలా సంతోషంగా ఉన్నాను, చాలా కృతజ్ఞతతో ఉన్నాను, చాలా ఖచ్చితంగా ఉన్నాను… ఇది కేవలం నిస్సందేహమైనది, ఇది ఆయన వధువు కోసం దేవుని కార్యక్రమం.

మనం వింటున్న ప్రతి వర్తమానముతో, మనం ఆశ్చర్యపోతాం, మనం వింటున్న వాటిని వారు ఎందుకని చూడలేక, చదవలేక మరియు వినలేక పోతున్నారు?  అక్కడే ఉంది, టేప్ పై, టేప్ తర్వాత, టేప్ తర్వాత. యేసు నికోదేముతో ఇలా చెప్పినట్లు వారితో చెప్పాలని నాకు అనిపిస్తుంది: “నీవు ఇశ్రాయేలుకు భోధకుడవై యుండి వీటిని ఎరుగవా?”

దూత దీన్ని ఎంత సరళంగా చేస్తాడో కేవలం వినండి.

మానవ నడవడిని ఒక్క దానిని ఆధారము చేసికొనియే ఇది మనకు తెలియును, ఎక్కువ మంది  ఉన్న చోట వారందరూ కలిసి పట్టుకున్న ఒక ప్రధాన భోద యొక్క చిన్న అంశాలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయని ఎవరికైనా తెలుసు.

మానవ నడవడిపై మాత్రమే, ఆత్మీయ వివేచన అవసరం లేదు, ఒక ప్రధాన భోద యొక్క చిన్న అంశాలపై ఇద్దరు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారని అందరికీ తెలుసు.

ప్రజలు తాము చెప్పేది చేయకపోతే, లేదా వారు వారిని విడిచిపెట్టినట్లయితే, అప్పుడు వినాశనం వెంబడిస్తుందని వారందరూ అంగీకరించవచ్చు మరియు చెప్పవచ్చు. కానీ నిజమైన ప్రవక్త ఎల్లప్పుడూ ఒకరిని వాక్యానికి నడిపిస్తాడు మరియు ప్రజలను యేసుక్రీస్తుకు చేర్చుతాడు మరియు అతను ప్రజలకు భయపడమని లేదా అతను చెప్పేదానికి భయపడమని చెప్పడు, కానీ వాక్యం చెప్పేదానికి భయపడమని చెప్తాడు.

వాక్యం ఏమి చెబుతుంది? నేను ప్రవక్తయైన ఏలీయాను మీయొద్దకు పంపుతాను. స్వరము యొక్క దినములలో. ఒక్క వాక్యపు ప్రవక్త మాత్రమే ఉంటాడు… ఒక్కడే… ఎందుకంటే దేవుడు ప్రత్యక్షతను ఆ ఒక్కడికి మాత్రమే అప్పగించాడు. ఆయనే నా వధువును పునరుద్ధరించేవాడు.

చాలా స్వరాలు మరియు అనేక అభిప్రాయాలు మరియు ఉల్లేఖనలు ఉన్నప్పుడు, ఒకరు ఖచ్చితంగా ఎలా ఉండగలరు?

ఈ చివరి కాలములో పునరుద్ధరింపబడే తప్పిపోని శక్తి ఎవరు కలిగివుంటారు, ఎందుకంటే ఈ చివరి కాలము పవిత్రమైన వాక్య వధువును తిరిగి  బయలుపరచబోతోంది?

తప్పుపోనీ శక్తి ఉన్న అతనిని, వధువు వినాలనుకుంటుంది ఎందుకంటే అతను వధువును పునరుద్ధరించేవాడు. ఆయన భిన్నఅభిప్రాయాలను కలిగి ఉండడు, ఆయన వాక్యం.

ప్రశ్న: ప్రభువా, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, తప్పిపోనీ వాక్యములను కలిగి ఉన్న అతను ఎవరు?

దానినెవరు కలిగియుందురో మీకు చెప్పెదను. హనోకు నుండి ఈ రోజు వరకు అన్ని కాలాల్లో ఉన్న ఏ ప్రవక్త కంటెను  పూర్తిగా నిర్ధారించబడిన , లేదా మరింత పూర్తిగా నిర్ధారించబడిన ప్రవక్త, ఎందుకంటే మూలరాయియగు ప్రవచనాత్మక పరిచర్యను కలిగియుండవలిసిన అవసరము ఇతనికి ఉండును మరియు దేవుడు అతనికి చూపించును. అతను తన కోసం మాట్లాడవలసిన అవసరం లేదు, సూచన యొక్క స్వరం ద్వారా దేవుడు అతని కోసం మాట్లాడతాడు.ఆమెన్.

సమాధానం: విలియం మారియన్ బ్రాన్హామ్.

ఈ రోజు ఎన్నుకోబడిన వధువైన మిమ్మల్ని ప్రోత్సహించనివ్వడి. మీరు మోసపోలేరు మరియు మీరు మోసపోరు. మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎవరు మోసము చేయలేరు. పౌలు గాని తప్పు మార్గములో ఉండి యుండినచో ఎవనిని అనగా ఏర్పరచబడిన వానిని మోసము చేయలేకపోయి ఉండును. మొదటి ఎఫెస్సు సంఘ కాలములో ఉండిన, ఏర్పర్చబడిన వారు మోసపుచ్చబడలేదు. వారు అబద్ధపు అపొస్తలులను మరియు ప్రవక్తలను పరీక్షించి, వారు అబద్ధికులని కనుగొని  బయటకు పంపించి వేసిరి.

మహిమ వధువు….మీరు ఆయన గొర్రెలు మరియు మీరు ఆయన స్వరమును విన్నారు మరియు మీరు ఆయనను వెంబడిస్తున్నారు. మీరు జీవిస్తున్న వాక్యపు వధువు!!

ఈ వాక్యములను తెలుసుకోవడం కంటే గొప్పది ఏమీ లేదు. మీ హృదయంలో మరియు ఆత్మలో తెలుసుకోవడానికి, మీరు ఆయన వధువు. ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజులు రానే వచ్చాయి. వధువు తనను తాను గుర్తిస్తుంది మరియు ఆయనతో ఒకటౌతుంది; మనము దేవుని నూతన సృష్టి.

మరోసారి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు ఎక్కడ సమావేశమైనా ఆదివారం నాడు దేవుని స్వరమును వినండి. మీరు దేవుడు నిర్ధారించిన స్వరమును వింటున్నంత కాలం మీరు ఏ వర్తమానమును వింటున్నారనేది పట్టింపు లేదు. ఆయన వధువును సమకూర్చడానికి మరియు పునరుద్ధరించడానికి దేవుడు పిలిచిన మరియు ఏర్పరచుకున్న స్వరము ఆ స్వరము.

అన్ని సంఘములకు, ప్రజలందరికీ, ఈ ఆదివారం 12:00P.M., జెఫర్‌సన్‌విల్‌ సమయానికి మాతో వినడానికి మీరు ఆహ్వానించబడ్డారు, 60-1211E లవొదికయ సంఘకాలము మనము వినుటకు కూడుకుందాము.