All posts by admin5

24-0218 ముసుగు తీయబడిన దేవుడు

వర్తమానము: 64-0614M ముసుగు తీయబడిన దేవుడు

PDF

BranhamTabernacle.org

24-0204 వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు

https://branhamtabernacle.org/te/streaming/viewservice/5617FD52-A6B1-4913-A71C-AA88527A5E0F

24-0128 మూడు రకముల విశ్వాసులు

వర్తమానము: 63-1124E మూడు రకముల విశ్వాసులు

BranhamTabernacle.org

ప్రియమైన విశ్వాసి,

నేను విశ్వాసిని, అని చెప్పడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఒక మాతాచారములో కాదు గాని; వాక్యమునందు విశ్వసించువారమైయున్నాము! ఒక సంఘశాఖలో కాదు గాని; వాక్యమునందు విశ్వసించువారమైయున్నాము! ఎవరో చెప్పినది కాదు గాని; వాక్యము ఏమి చెప్తుందో దానిని నమ్మేవారమైయున్నాము!

మనము దేనిని ప్రశ్నించము, మనము కేవలం దానిని నమ్ముతాము. వినడానికి అది ఎలా ఉన్నా గాని లేదా దాని గూర్చి ఎవరు ఏమి చెప్పదలచుకున్నా గాని, మనము ఒక అసలైన విశ్వాసియైయున్నాము. మనము వాక్యముయొక్క ఆత్మీయ ప్రత్యక్షతను కలిగియున్నాము.

మనము జీవిస్తున్న ఘడియను మనము చూస్తున్నాము. ఈ ఘడియయొక్క వర్తమానమును మనము చూస్తున్నాము. ఈ ఘడియయొక్క వర్తమానికుణ్ణి మనము చూస్తున్నాము. దేవుడు తననుతాను తన వాక్యములో బయలుపరచుకొనుటను మనము చూస్తున్నాము. ఈ వర్తమానము, ఈ వర్తమానికుడు, ఈ వాక్యము తప్ప మరేదియు లేదని మనము చూస్తున్నాము.

ఒక నిజమైన విశ్వాసి వాక్యమును తప్ప మరిదేనిని వినడు. అంతే. అతడు వాక్యమును గమనిస్తాడు. అతడు ఎటువంటి లొసుగుల కొరకు చూడటంలేదు. అతడు ఎటువంటి యుక్తుల కొరకు వెదకడంలేదు. అతడు దేవుడిని నమ్ముతాడు, మరియు అదే దానిని స్థిరపరుస్తుంది, మరియు అతడు కేవలం కొనసాగుతూనే ఉంటాడు. చూశారా? విశ్వాసి అంటే అతడే.

మనము వాక్యమును తప్ప మరిదేనిని వినలేము; ప్రవక్త వద్దకు వచ్చే వాక్యమును మాత్రమే వింటాము. ఎటువంటి లొసుగులు కాదు, ఎవరో ఇచ్చిన అనువాదము కాదు, వధువు కొరకు పలుకబడి మరియు టేపులపై ఉంచబడిన స్వచ్చమైన వాక్యమును వింటాము.

ఆత్మ ఆ వాక్యమును మనయందు పురిగొల్పినది మరియు అది జీవము దాల్చినది. విశ్వాసము ద్వారా, మనము దానిని చూస్తున్నాము, మరియు దానిని నమ్ముచున్నాము. పరలోకమునుండి ఒక శబ్ధం వస్తుంది, అది వధువులోనికి ఎటువంటి ఒక పరిశుద్ధాత్మ బాప్తిస్మమును తీసుకువస్తుందంటే, అది మనలను ఒక ఎత్తబడు క్రుపలో, భూమి మీద నుండి తీసుకువెళ్తుంది. దేవుడు దానిని వాగ్దానము చేసాడు.

మనము అన్నివేళలా, ప్రతీ దినము పరీక్షించబడుచున్నాము. మనకు కలిగే పరీక్షలు మరియు శ్రమలను గూర్చి అది దేవుడు మనలను శిక్షించడమైయున్నదని మనకు చెప్పుడానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. కానీ దేవునికి స్తోత్రం, అది అట్లు కాదు, అది అపవాదే దానిని చేస్తుండగా మరి దేవుడు దానిని అనుమతించడమైయున్నది.

మనము ఏమి చేస్తామని చూచుటకు, దేవుడు మనలను సానబట్టుచూ మలచుచున్నాడు. మనము ఎక్కడ నిలబడతామని చూచుటకు, మనలను కుదిపివేయడానికి, మనలను అట్టడుగునకు పడవేయడానికి పరీక్ష వస్తుంది. అయితే మనము ప్రతీ పోరాటమును జయిస్తాము, ఏలయనగా మనము సజీవమైన మాదిరిలుగా ఉన్నాము; దేవునియొక్క వాక్యము మనలో మరియు మన ద్వారా జీవించుచున్నది.

మనము ఆయన దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైనవారము?

అది ఎంత అల్పమైనది అయినా, ఎవ్వరూ నీ స్థానమును తీసుకోలేరు. “నేను కేవలం ఒక గృహిణిని,” అని నీవు అనవచ్చును. ఎవ్వరూ నీ స్థానమును తీసుకోలేరు. దేవుడు, తనయొక్క గొప్ప వ్యవస్థలో, క్రీస్తుయొక్క శరీరమును, ఎంత స్థిరంగా క్రమపరచాడంటే, నీ స్థానమును తీసుకోగలవారు, ఎవ్వరూ లేరు.

అది ఎంత అద్భుతంగా ఉంది కదా? మనలో ప్రతి ఒక్కరికీ ఒక స్థానము ఉన్నది. దేవుడు ప్రపంచమును ఉనికిలోనికి పలికినప్పుడు మనలో ప్రతి ఒక్కరము ఇక్కడ ఉండియున్నాము. సరిగ్గా అప్పుడే ఆయన మన శరీరమును ఇక్కడ ఉంచాడు. తన వాక్యమును నెరవేర్చి మరియు మనకు నిత్యజీవమును ఇచ్చుటకు, దేవుడు ఈ సమయమున మనలను భూమి మీద ఉంచాడు.

ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయము తీసుకోవలసియున్నది. ఈ వాక్యము, ఈ వర్తమానము, ఈ వర్తమానికుడి విషయంలో మీరెక్కడ నిలబడతారు? టేపులలో పలుకబడిన ఆ వాక్యమును వినడం అనేది ఎంత ప్రాముఖ్యము?

టేపు పరిచర్యల ద్వారా, ప్రపంచములోని వివిధమైన ప్రాంతములన్నిటికి, ఈ టేపులు అందజేయబడతాయి.

ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వధువు కొరకు దేవునియొద్ద నుండి పంపబడిన టేపు పరిచర్యయైయున్నది. నీవు ఎక్కడున్నావన్నది, నీవు ఎవరివన్నది, మరియు నీవు వాక్యములోని విశ్వాసివా కాదా అన్నది ఇది నీకు ఖచ్చితంగా చెప్తుంది.

ఈ తరగతులలో నీవు ఏదో ఒకదానిలో ఉన్నావు. ప్రస్తుతం మీరున్న స్థితిలో, ప్రస్తుత మానసిక స్థితిలో, ప్రత్యక్షంగా ఈ జనసమూహములో ఉన్న మీరు, మరియు తర్వాత పరోక్షంగా ఈ టేపులను వినేవారు, ఈ టేపును వినిన తర్వాత, మీ యొక్క మానసిక స్థితియే, మీరు ఏ తరగతిలో ఉన్నారో మీకు ఋజువు చేస్తుంది.

ఈ టేపును విన్న తర్వాత, మీరు ఏ తరగతి ప్రజలకు చెందినవారని అది ఋజువు చేస్తుంది. ఈ టేపులలో పలుకబడిన స్వచ్ఛమైన వాక్యము కంటే ఎక్కువైనదేదో అవసరమని కొంతమంది నమ్ముతారు. ఒక-మనుష్యుని వర్తమానము వంటి దినములు గతించిపోయినవని; మీరు మీ సంఘకాపరి చెప్పేదానిని వినాలని లేదా మీరు నశించినట్లే అని కొంతమంది నమ్ముతారు.

టేపులను వినుటకు ప్రాముఖ్యతను ఇచ్చే విషయములోనే ఈనాడు వర్తమానములో అత్యంత గొప్ప విభజన కలుగుచున్నది. సంఘములో టేపులను ప్లే చేయడం తప్పని; సంఘకాపరి మాత్రమే పరిచర్య చేయాలనీ కొంతమంది బోధిస్తారు. కొంతమంది అవి సమముగా ఉండవలసియున్నవని చెప్తారు, కానీ వారు సంఘములో టేపులను ఎన్నడూ ప్లే చేయరు, ఒకవేళ చేసినా ఎప్పుడో ఒకసారి మాత్రమే అట్లు చేస్తారు.

వాక్యమును గూర్చి అనేక ఉద్దేశములు, అనేక ఆలోచనలు, అనేక అనువాదములు ఉండగా, ఎవరు చెప్పేది నిజం? మీరు ఎవరిని నమ్మాలి? అది మనలో ప్రతి ఒక్కరమూ మనల్ని మనము ప్రశ్నించుకోవలసిన ప్రశ్నయైయున్నది.

ఎవరో చెప్పేదానితో కాదు గాని, వాక్యముతో దానిని సరిచూడమని ప్రవక్త మనకు చెప్పియున్నాడు. మీరు దానిని ఎలా చేస్తారు? దానిని చేయడానికి ఒకేఒక్క మార్గమున్నది, ప్లేను నొక్కడమే.

ఒక సరియైన జవాబు, ఒక సరియైన మార్గము ఉండవలసియున్నది. ప్రతీఒక్కరూ తమకు తాముగా నిర్ణయించుకోవలసియున్నది. ఈ వర్తమానము వినే ప్రతీఒక్కరి భవిష్యత్తును ఈ ఆదివారము నిర్ధారిస్తుంది.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన విషయం: యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో ఉన్న ఒకేఒక్క వ్యక్తి ఎవరు? అగ్నిస్తంభము ఎవరిని నిర్ధారించినది? యేసుకు మనలను ఎవరు పరిచయం చేస్తారు? విఫలమవ్వని వాక్యమును పలికినది ఎవరు? భూమి మీద పలుకబడిన ఎవరి మాటలు, పరలోకములో ప్రతిధ్వనించేంతగా ప్రాముఖ్యమైయున్నవి?

సరియైన జవాబులను మీరు పొందగోరుచున్నయెడల, ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు వచ్చి: 63-1124E — మూడు రకముల విశ్వాసులు అనే వర్తమానమును వినమని మిమ్మల్ని ఆహ్వానించగోరుచున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

కూటమునకు ముందు చదువవలసిన లేఖనములు:

పరిశుద్ధ. యోహాను 6:60-71

24-0121 క్రీస్తనబడిన యేసును నేనేని చేతును? 

BranhamTabernacle.org

ప్రియమైన టేపు ప్రేమికులారా,

మనము ఈ వర్తమానమును మన హృదయ పూర్వకంగా ప్రేమిస్తున్నాము. అది దేవుని చెరుకుగడ యొక్క తీపిదనమైయున్నది. అది స్థిరముగా నిర్ధారించబడి, మరియు మళ్ళీ మళ్ళీ నిరూపించబడిన, దేవునియొక్క వాక్యమైయున్నది. ఈ వర్తమానము దేవుని వాక్యమునకు జవాబైయున్నది. ఇది అదే అభిషేకించబడిన క్రీస్తు, అనగా మన దినమునకు అభిషేకించబడిన వాక్యమైయున్నది.

ఆయన మనల్ని స్వీకరించి మరియు మనకు పరిశుద్ధాత్మ బాప్తీస్మమును ఇచ్చాడని, ఆత్మ చేత ఋజువు చేస్తూ, నిరూపించుచున్న, నిర్ధారించబడిన దేవునియొక్క వాక్యమును మనమిక్కడ కలిగియున్నాము. మనము యేసుక్రీస్తు నామములోనికి బాప్తీస్మము పొందియున్నాము. అదే సువార్త, అవే సూచక క్రియలు, అవే ఆశ్చర్య కార్యములు, అదే పరిచర్య, ఇంక అదే అగ్నిస్తంభము మన ముందు ప్రత్యక్షమై, సూచనలు మరియు అద్భుతములను చూపించుచున్నది. ఎక్కడా, ఎటువంటి సాకులు చెప్పడానికి లేదు.

ఇది దేవుడు మరియు ఆయన వధువు ఐక్యమయ్యే సమయమైయున్నది. క్రీస్తు యొక్క వధువు పిలువబడినది. మనము దేవుని రాజ్యములో ముద్రించబడినాము. ఆ యాంత్రికమైనవి కేవలం ఇక్కడ ఉండి మనల్ని భూమి మీద నుండి మహిమలోనికి, ఎత్తబడుటలోనికి తీసుకొనివెళ్ళే ఆ క్రియాశీలక శక్తి కొరకు వేచియున్నది.

క్రియాశీలక శక్తి అనగా ప్రరిశుద్ధాత్మ చేత మరలా నింపబడుటయైయున్నది. తలరాయి క్రిందకు దిగివచ్చి మరియు శరీరముతో ఐక్యమౌతుంది. పిదప, శిరస్సు మరియు శరీరము ఐక్యమైనప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ శక్తి మనలను పైకి లేపుతుంది మరియు క్రీస్తునందున్న మృతులు ఆయన పరిశుద్ధత యొక్క సౌందర్యములో లేచి, మరియు ఆకాశములోనికి వెళ్ళిపోతారు.

ఆ గడియ త్వరగా సమీపించుచున్నది. కాలము ముగింపునకు వచ్చియున్నది. తుది నిర్ణయములు తీసుకొనబడవలసియున్నది. మనయొక్క ఈ దినపు అభిషేకించబడిన వాక్యముతో మీరేమి చేస్తారు? ఈ గడియ యొక్క వర్తమానము పట్ల మీ తీర్మానం ఏమిటి?

మీరు కేవలం ఇట్లు చెప్తారా: “నేను వర్తమానమును నమ్ముచున్నాను. దేవుడు ఒక ప్రవక్తను పంపాడని నేను నమ్ముచున్నాను.”

కేవలం, “నేను వర్తమానమును నమ్ముచున్నాను,” అని చెప్పేంతవరకే రాకండి. మీరు వర్తమానికుడికి విధేయులు కండి.

మీరు వర్తమానికుడికి విధేయులు అవ్వాలంటే: గమనించండి, వార్తమానికుడికి విధేయులు కండి అని ఆయన చెప్పాడు. అటువంటప్పుడు ఆ వర్తమానికుడు చెప్పిన ప్రతీ మాటను నమ్మి మరియు ఆలకించడం ఎంత ప్రాముఖ్యమైయున్నది కదా?

మీరు ఇట్లంటారు, “సరి, సహోదరుడా బ్రెన్హామ్, చెప్పబడిన ప్రతీ మాటను నేను నమ్ముచున్నాను.” అది మంచిదే, అయితే అది—అది కేవలం చదవగలుగుటయైయున్నది.

ప్రజలు ఎందుకని టేపులతో తృప్తి చెందుటలేదు? ప్రతీ ఒక్కరూ ఒక ప్రవక్తయై యుండలేరు. కేవలం ఒక్క ప్రవక్త మాత్రమే ఉన్నాడు, మరియు వాక్యము ఆ ప్రవక్త వద్దకు వచ్చెను.

సంఘము దానిని ప్రశ్నించుటను, లేదా ఆ ప్రవక్త చెప్పిన విషయమును, భిన్నమైన స్వరములు వారికి చెప్పి అనువదించాలని కోరుటను ప్రారంభించేంత వరకు అది బాగానే ఉన్నది. వారు ఒక ఆధునిక కోరహు మరియు దాతానును కోరుకున్నారు.

చూడండి, అది వాక్యమునకు ఒక చిన్న తప్పుడు అనువాదముతో ప్రారంభమైనది, మరియు, అదే కార్యము జరుగుచున్నది, అది అదే విధంగా అంతమగుచున్నది.

అది వాక్యమునకు ఒక చిన్న తప్పుడు అనువాదముతో ప్రారంభమైనది, మరియు దానితోనే అంతమౌతుంది, టేపులతో మీరు ఎంతగా నిలచియుండవలసియున్నదో మీరు నిశ్చయంగా గుర్తించవచ్చును. దేవుడు ఎందుకని వధువు కొరకు ఈ వర్తమానమును రికార్డు చేపించి మరియు భద్రపరిచాడో మీరు నిశ్చయంగా చూడవచ్చును.

మీ సంఘకాపరులను తక్కువ చేయడానికో, లేదా మీ కాపరులు చెప్పేది వినవద్దని చెప్పడానికో నేను ఈ సంగతులను చెప్పడంలేదు, లేదండి, అయితే ప్లే బటన్ను నొక్కి మరియు టేపులో ఉన్న ఈ వర్తమానమును వినడం యొక్క ప్రాముఖ్యతను మీకు చూపించడానికి చెప్పుచున్నాను.

సంఘము దానిని మరలా, మరలా, మరలా, మరియు మరలా ఎంతగా పరీక్షించుకోవలసియున్నది కదా! మనము ఆయన రాకడకై వేచియున్నాము. మనము మేల్కొనియుండి, ఆ కొనిపోబడుట కొరకు వేచియున్నాము. మనము దానిని, ఎవరో చెప్పిన విషయంతో కాదు గాని వాక్యముతో సరిచూసుకొనుట మంచిది. క్రీస్తుతో ఒక వ్యక్తిగత అనుభవము కలిగియుండుట చేత, మిమ్మల్ని మీరు ఎరిగియున్నారని, నిశ్చయం చేసుకోండి. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ దానిని సరిచూసుకోండి.

ఆయన ఏమి చెప్పాడు? మనము మళ్ళీ, మళ్ళీ, మరియు మళ్ళీ వాక్యముతో దానిని సరిచూసుకోవలసియున్నది. మీరు దానిని వాక్యముతో ఎలా సరిచూసుకుంటారు? ఈ దినమునకైన వాక్యము ఏమిటి? అది ఆది నుండి అదే విధంగా ఉన్నటువంటి, బైబిలు గ్రంథమైయున్నది.

తన వాక్యమునకు అనువాదకుడు ఎవరని దేవుడు చెప్పుచున్నాడు? నేనా? మీ సంఘకాపరియా? కాదు, ఈ గడియకు దేవుని యొక్క నిర్థారించబడిన ప్రవక్త మాత్రమే వాక్యమునకు అనువాదకుడైయున్నాడు. కావున, ఎవరైనా చెప్పే వాక్యమును మీరు మళ్ళీ, మళ్ళీ, మరియు మళ్ళీ టేపులతో సరిచూసుకోవలసియున్నది!

ఆ విషయం సత్యమైయ్యుండి, మరియు ఏ వ్యక్తియైనా, లేదా ఏ సంఘకాపరియైనా చేయగలిగే ఏకైక ప్రాముఖ్యమైన విషయము ప్లే ను నొక్కడమే అని మీరు నమ్ముచున్నారు.

అటువంటప్పుడు వర్తమానమును నమ్ముచున్నాను అని చెప్పుకునే ఏ వ్యక్తికైనా దానిని చెప్పడం ఎందుకని అంత కష్టమగుచున్నది? ఎందుకనగా కేవలం వారు దానిని నమ్మడంలేదు.

మీ తుది నిర్ణయం ఏమిటి? నేను మరియు నా ఇంటి వారమైతే, ఈ వర్తమానముతో మరియు దేవుని వర్తమానికునితో, ఈ టేపులతో నిలిచియుంటాము. టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడం కంటే ప్రముఖ్యమైనదేదియు లేదని మేము నమ్ముచున్నాము.

•  ఒకే ఒక్క యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు స్వరము ఉన్నది.
•  అగ్నిస్తంభము చేత నిర్ధారించబడిన ఒకే ఒక్క స్వరము ఉన్నది.
•  ఒకే ఒక్క ఏడవ దూత వర్తమానికుడు ఉన్నాడు.
•  వధువంతయు ఏకీభవించగల ఒకే ఒక్క స్వరము ఉన్నది.
•  ఈ తరమునకు ఒకే ఒక్క దేవుని స్వరము ఉన్నది.

మీరును అదే ప్రత్యక్షతను కలిగియున్న యెడల వచ్చి, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా, ఆదివారం 12:00 P.M., గంటల సమయమప్పుడు: క్రీస్తనబడిన యేసును నేనేని చేతును? 63-1124M అనే వర్తమానమును వినుచు మరియు మా తుది నిర్ణయమును తీసుకొనుచుండగా, నాతో మరియు ప్రపంచ వ్యాప్తంగా అదే విషయమును నమ్ముచున్న ఒక చిన్న విశ్వాసులతో గుంపుతో చేరండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

24-0114 మీలో ఉన్నవాడు

వర్తమానము: 63-1110E మీలో ఉన్నవాడు

PDF

BranhamTabernacle.org

ప్రియమైన పరిపూర్ణ విశ్వాసముగల విశ్వాసుల్లారా,

ప్రతీరోజు గొప్ప ఎదురుచూపుతో మన గుండెలు వేగముగా కొట్టుకొనుచున్నవి. త్వరలో రానైయున్న ఆయన రాకడయొక్క గడియ సమీపించుట కొరకు మనము వేచియున్నాము. భయములన్నియు కనుమరుగయ్యాయి. “మనము ఆయన వధువేనా”? అని ఇక ఎంతమాత్రము ఆలోచనలేదు. మనము ఆయన వధువైయున్నాము అని, ముందెన్నడూ లేనంతగా అది మన హృదయాలలో లంగరు వేయబడియున్నది.

మనము ఒక పరలోకపు వాతావరణములోనికి ఎత్తబడియున్నాము, తన సంఘములో, మరలా శరీరధారియైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యను వినుచున్నాము. ఇది ఒక మానవుడు కాదు గాని, ఇది దేవుడే తన వధువుతో మాటలాడుటయై యున్నదని, ఈ వర్తమానము దేవునియొక్క వాక్యముచేత ఎంతో క్షుణ్ణంగా నిర్ధారించబడినది.

ఈ టేపులలో మనతో మాట్లాడుచున్నది ఒక మానవుడు కాదు, అది దేవుడే అని మనము నమ్ముచున్నాము.

నేనేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, “మీ నమ్మకాన్ని కోల్పోకండి.” సాతాను నా గురించి మీతో చెడుగా చెప్పనివ్వకండి; ఎందుకనగా, చాలా కలవు. కాని మీరైతే ఆ నమ్మకాన్ని ఉంచండి; ఎందుకనగా అలాగు మీరు ఉంచనట్లైతే, అది జరగదు. ఒక మనిషిగా, నా వైపు చూడకండి; నేను ఒక మనిషినే, నేను అనేక తప్పిదాలను కలిగియున్నాను. అయితే నేను ఆయన గూర్చి ఏమి చెప్పుచున్నానో దానివైపు చూడండి. అది ఆయనే. ఆయన మాత్రమే.

మీరు విశ్వాసమును కలిగియుండి మరియు ఆయన చెప్పేది నమ్మవలసియున్నది, లేనియెడల అది జరగదు. మనము చేస్తామని అనేకులు అనుకున్నట్లు, మనము దేవుని ప్రవక్తను ఒక మనిషిగా చూడము. మనము మానవ శరీరమనే ఆ తెరకు ఆవల ఉన్నాము, మరియు మనము చూసేది మరియు వినేది అంతయు దేవుడు మానవ పెదవుల ద్వారా మాట్లాడుటయైయున్నది, మరియు మనం ధైరాన్ని కలిగియుండి ప్రతీ మాటను నమ్ముచున్నాము.

అది ఈ దినమునకైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయైయున్నది. ఆ టేపులలో మాట్లాడేది, ఒక మానవుడు కాదు, దేవుడే అని నమ్ముటయైయున్నది. నా స్నేహితుడా, నీవు దానిని తప్పిపోయావంటే, నీవు గడియ యొక్క వర్తమానమును తప్పిపోయినట్లే మరియు నీవు వధువుగా ఉండలేవు.

సాతానుడు దానికి వాడి అనువాదమును పెడతాడు, మరియు 99% శాతం వాడు హవ్వకు చేసినట్లే వర్తమానమును ఎత్తి చూపిస్తాడు, అయితే ఆమె వాక్యముతో నిలబడవలసిందిగా ఆజ్ఞాపించబడినది; ఆదాము ఆమెతో చెప్పినది దేవుడు చెప్పినదే, దాని భావం ఏమిటని వేరెవరో చెప్పినది కాదు. ఆమె దేవునియొక్క స్వరముతో నిలిచియుండవలసి యుండెను.

ఇది లోకము ఎన్నడూ చూడనటువంటి అత్యంత గొప్ప దినమైయున్నది. తన ప్రవక్త యొక్క జీవితంలో నివసించి మరియు తననుతాను బయలుపరచుకున్న యేసుక్రీస్తు యొక్క జీవము, ఇప్పుడు మనలో, అనగా తన వధువులో జీవిస్తున్నది.

ఆయన మనకు ఏమి చేయమని ఆజ్ఞాపించాడో సరిగ్గా దానినే మనము చేస్తున్నాము: టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరముతో నిలిచియుండుట ద్వారా వాక్యముతో నిలిచియుండండి. అది ఈ దినమునకైన దేవుని యొక్క టేపు పరిచర్య మరియు ప్రణాళికయై యున్నది.

విలియమ్ మారియన్ బ్రెన్హామ్ దేవుని చేత ఎన్నుకోబడిన ఏడవ దూత వర్తమానికుడని, వాక్యములో దాగియున్న మర్మాలన్నిటినీ బయలుపరచుటకు దేవుని చేత ఎన్నుకోబడినవాడని, ఈ తరానికి దేవునియొక్క స్వరమని, ఏ మనుష్యుడు కలిగిలేనటువంటి విశ్వాసమును కలిగియున్నవాడని, “ప్రజలు నిన్ను నమ్మునట్లు నీవు చేయగలిగితే, ఏదియు నీ ప్రార్థనల ముందు నిలువనేరదు,” అని ప్రభువుయొక్క దూత ద్వారా చెప్పపడినవాడని మీరు నిజంగా నమ్మినట్లైతే అప్పుడు ఈ ఆదివారము ఏ ఇతర దినములకంటెను అత్యంత ప్రాముఖ్యమైన దినమైయ్యుంటుంది.

ఈ వర్తమానము యొక్క ప్రత్యక్షతను మనయొద్ద నుండి తీసివేయగలుగునది ఏదియు లేదు, ఏదియు లేదు. మనము ఎన్నడూ దానిని సందేహించలేము. ఆయన దానిని చెప్పాడంటే, మనము దానిని నమ్ముతాము. మనము దానిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, మరి అయిననూ మనము దానిని నమ్ముతాము.

స్వయంగా యేసు మనతో ఇట్లు చెప్పాడు: “మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు.” దానిని మన హృదయాలలో నాన్చబడనివ్వండి. ఆయన ఆత్మ మనలో జీవిస్తున్నది. దానిని మనము అర్థం చేసుకోగలమా? మీరు ఈ లేఖను చదువుచుండగా, సరిగ్గా ఇప్పుడు, పరిశుద్ధాత్మ, స్వయంగా దేవుడు, ఆ అగ్నిస్తంభము, మనయందు జీవిస్తూ మరియు మనయందు నివసిస్తున్నాడని మీరు అర్థం చేసుకోగలరా? అది సత్యమని మనకు ఎట్లు తెలియును? దేవుడు దానిని చెప్పాడు!!

మనము ఎంతటి ఒక ఓడిపోయినవారమని సాతానుడు ఎప్పుడూ మనకు చెప్తూనే ఉన్నాడు. మరియు వాడు చెప్పేది నిజమే, మనము ఓడిపోయినవారమే. మనము వాక్యములో ఉండవలసిన చోట లేమని, వాడు మనకు గుర్తు చేస్తుంటాడు. మరలా నిజమే, మనము అక్కడ లేము. చేయుటకు మనము ఎరిగియున్న శ్రేష్ఠమైనవాటిని మనము చేయము. వాడు నిజమే చెప్పుచున్నాడు, ప్రభువా మమ్మల్ని క్షమించుము.

అయిననూ మా పొరపాట్లు, మా బలహీనతలు, మా వైఫల్యములన్నియు ఉన్నప్పటికినీ, మేము వధువైయున్నాము, అనే సత్యమును అది మార్చలేదు. మేము ప్రతీ వాక్యమును నమ్ముచున్నాము!

మన వైపు గాని లేదా మనము చేయగలిగే దేనివైపు గాని మనము చూచుకొనుటలేదు, మనము ఒక గందరగోళమై యున్నాము. ఆయన మనలను ఎన్నుకున్నాడని మరియు ఆయన వాక్యము యొక్క ప్రత్యక్షతను మనకు ఇచ్చియున్నాడని మరియు మనయొద్ద నుండి ఆ ప్రత్యక్షతను ఏదియు తీసివేయలేదని మాత్రమే మనము ఎరిగియున్నాము. అది మన హృదయములో మరియు మన అంతరాత్మలో స్థిరపరచబడియున్నది.

మనము పరిపూర్ణమైన విశ్వాసమును కలిగియుండాలని ఆయన మనకు చెప్పాడు. ప్రభువా, నీ వాక్యమందు మేము పరిపూర్ణమైన విశ్వాసమును కలిగియున్నాము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యునదని నీ ప్రవక్త ఏదైతే చెప్పాడో దానియందు మేము విశ్వాసమును కలిగియున్నాము. అది తన వాక్యము కాదు, కానీ అది మా కొరకైన నీ వాక్యమైయున్నది.

మాకు అవసరమున్నవాటిని గూర్చి, మేము కేవలం నీ వాక్యమును నమ్మి, మరియు నీ వాక్యము పట్ల విశ్వాసము కలిగియున్నట్లయితే, మాకు ఏది అవసరమున్నదో దానిని మేము పొందుకోగలమని నీ ప్రవక్త మాకు చెప్పియున్నాడు. మేము నమ్ముచున్నాము.

ప్రభువా, నాకొక అవసరత ఉన్నది. నీ వాక్యములో నాకున్న విశ్వాసమంతటితో నేను నీ యెదుటకు వచ్చుచున్నాను, ఏలయనగా అది విఫలమవ్వజాలదు. అయితే ఈనాడు, ప్రభువా, నేను నా విశ్వాసముతో మాత్రమే కాదు గాని, బలిష్ఠుడైన నీ ఏడవ దూత వర్తమానికుడికి నీవు ఇచ్చిన విశ్వాసముతో నీ యెదుటకు వచ్చుచున్నాను.

ఓ ప్రభువైన దేవా, మా పట్ల కనికరము కలిగియుండమని నేను నిన్ను వేడుకొనుచున్నాను. మరియు ఇక్కడ కూర్చొనియున్న ప్రతీ స్త్రీ మరియు పురుషుడు, ఎటువంటి వ్యాధితో లేదా ఎటువంటి బాధతో ఉన్నప్పటికినీ; ప్రజల కొరకు మోషే తనకు తాను ఆ ఖాళీలో నిలబడినట్లు, ప్రభువా, ఈ రాత్రి నేను నీ యెదుట నా హృదయము పరచియుంచుతున్నాను. మరియు నీ యందు, నేను కలిగియున్న విశ్వాసమంతటితో, నీవు నాకిచ్చిన ఆ విశ్వాసమును, నేను వారికి ఇచ్చుచున్నాను.

మరియు నేను ఇట్లు చెప్పుచున్నాను: నేను కలిగియున్నదానినే, నేను ఈ జనసమూహముకు ఇచ్చుచున్నాను! నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, మీ వ్యాధిని వదిలించుకోండి, ఎందుకనగా మీలో ఉన్నవాడు, మీ జీవమును తీయుటకు ప్రయత్నించుచున్న దయ్యము కంటే గొప్పవాడు. మీరు దేవుని పిల్లలైయున్నారు. మీరు విమోచింపబడినవారై యున్నారు.

అది పూర్తైనది. ఆయన వాక్యము విఫలమవ్వజాలదు. మనకు అవసరమైనది ఏదైనా, మనము దానిని పొందుకోగలము.

ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, ప్రపంచమంతటి నుండి వధువుయొక్క భాగము కూడుకొని దేవుని యొక్క వాక్యము ఆయన విశ్వాసమును మన విశ్వాసముతో కలుపుటను వింటుండగా ఈ గొప్ప ఆశీర్వాదమును మరియు దేవుని యొద్ద నుండి అభిషేకమును పొందుకొనుటకు వచ్చి మాతో చేరండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

63-1110E మీలో ఉన్నవాడు

24-0107 ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు

వర్తమానము: 63-1110M ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు

BranhamTabernacle.org

ప్రియమైన ప్రత్యేకించబడిన ప్రజలారా,

ఆయన తన వాక్యమును నెరవేర్చగలుగునట్లు, దేవుడు మన దినములో వచ్చి మరియు తనను తాను మానవ గుడారములో, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ అను పేరుగల ఒక వ్యక్తిలో బయలుపరచుకున్నాడు. అదియే మన దినమునకైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయైయున్నది.

ఆ స్వరమును విని మరియు ప్రతీ మాటను నమ్ముటయే ఈ దినమునకు దేవుడు ఏర్పాటు చేసిన ఒకేఒక్క మార్గమైయున్నది. ఆయన తన పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన చాలా మంది మనుష్యులను లోకమునకు పంపించాడు, కానీ ఆయన వాక్యమును బయలుపరచుటకు మరియు ఆయన యొక్క వధువును నడిపించుటకు మాత్రం ఆయన ఒక్క మనుష్యుడినే పంపి మరియు ఆ ఒక్కని ద్వారానే ఆయన మాట్లాడినాడు.

ఆయన తన ప్రణాళికనుగాని లేదా తాను కార్యములను చేసే తన విధానాన్నిగాని ఎన్నడూ మార్చుకోడు. ఆయన మొదటిసారి దానిని చేసినట్లే, ప్రతీసారి చేస్తాడు. ఆయన స్వయంగా తానే తన ప్రజలను, అగ్నిస్తంభముచేత నడిపిస్తాడు.

ఎన్నడూ మర్చిపోకండి, మీరు దేవునియొక్క ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వధువైయున్నారు మరియు దానిని మీ వద్ద నుండి తీసివేయగల్గుటకు దయ్యము చేయడానికైనా లేదా చెప్పడానికైనా ఏమీ లేదు, ఏమియు లేదు! జగత్తుపునాది వేయబడకముందే ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడే ఆయన మిమ్మల్ని ఎరిగియున్నాడు, మరియు మీరు ఆయనతో ఉండియున్నారు. ఆయనకు మీ పేరు తెలుసు. మీ గురించి ప్రతీది ఆయనకు తెలుసు. మీ హెచ్చు తగ్గులను ఆయన ఎరిగియున్నాడు. ఆయన మీ వైఫల్యాలను, మీ తప్పులను ఎరిగియున్నాడు, మరి అయిననూ ఆయన మిమ్మల్ని ప్రేమించి మరియు మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఏలయనగా మీరు ఆయనలో భాగమైయున్నారు.

మీ అంతరాత్మ కేవలం ఆయన వాక్యముమీద మాత్రమే పోషించబడగల్గుతుంది. ఆయన వాక్యము తప్ప మరేదియు మిమ్మల్ని తృప్తిపరచలేదు. ఆయన వాక్యమును చదివి మరియు ఆయనను ధ్యానించుటకు, మీ హృదయాంతరంగముల నుండి ప్రార్థించుటకు మీరు ఇష్టపడతారు. ఆయన స్వరము నేరుగా మీతో మాట్లాడుటను మీరు విన్నప్పుడు, అది మిమ్మల్ని కాలముయొక్క తెరను దాటి పైకి లేపుతుంది. ఏలయనగా పెదవి నుండి చెవికి ఆయన మీతో మాట్లాడుతూ, తన వాక్యమును బయలుపరచుకుంటూ, మీరు నా వధువు, అని మీకు జ్ఞాపకముచేయుచుండగా, మీరు ఆయనతో కూడ పరలోక స్థలములలో కూర్చొనియున్నారని మీరు ఎరుగుదురు.

దయ్యము నిన్ను కొడుతూ మరియు కొడుతూ మరియు కొడుతూనే ఉండవచ్చును. కొన్నిసార్లు నీవు క్రుంగిపోయి మరియు నీవు పూర్తిగా విఫలమైనవాడవని; ఇంకెవ్వరికంటెను ఎక్కువగా నీవు ఆయనను విఫలపరచావని అనుకోవచ్చును. నీవు దరిద్రులకే దరిద్రుడవై యుండవచ్చును, అయితే నీ అంతరాత్మయొక్క అంతరంగములో, ఎక్కడో, ఆ మెల్లని స్వరము ఇట్లు చెప్పుటను నీవు వింటావు: “నిన్ను నానుండి ఏదియు వేరు చేయలేదు, నీవు నా వాక్యమైయున్నావు. స్వయంగా నేనే, నీ పేరును నా గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉంచాను.”

ఈరోజు మిమ్మల్ని ఉత్సాహపరచుటకు నేనేమి చెప్పగలను?

కేవలం వాక్యములో నిలచియుండండి. అనుదినము ప్లే ను నొక్కండి మరియు దేవుని స్వరము యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని మాట్లాడుచు మరియు ఇట్లు చెప్పుటను వినండి; నేను మిమ్మల్ని నా వాక్యము చుట్టూ ఐక్యపరచుచున్నాను. నా వాక్యము మీలో జీవించుచు నివసించుచున్నది గనుక, మీరు దేనినైనా జయించగలరు. మీరు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగియున్నారని, నేను మీకు ఋజువు చేసియున్నాను. మీరు గురుతును అనువర్తించుకున్నారు, మరియు అది మిమ్మల్ని ఒత్తిడిలోనికి తీసుకొనివెళ్ళినది. నేను నా వాక్యము వెనుక నిలుచుంటాను. నేనేమి చేస్తానని చెప్పానో దానిని నేను చేస్తాను.

టేపులలో ఆయన మనతో మాట్లాడునట్టి తన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. మన మధ్యనున్నది, అది ఎవరో ఒక మానవుడు, ఒక శరీరసంబంధమైన వ్యక్తి కాదని మనకు తెలుసు. అది మనతో, అనగా తన వధువుతో మాట్లాడుచున్న నిత్యుడైన దేవుడైయున్నాడు.

ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., గంటలప్పుడు ఆ మెల్లని స్వరమును వినుటకు మేము కూడుకొనుచుండగా మీరు వధువుతో కూడ చేరవలెనని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము: 63-1110M ఇప్పుడు చెరలోనున్న ఆత్మలు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:

ఆదికాండము 15:16
పరిశుద్ధ. మత్తయి 23:27-34
పరిశుద్ధ. యోహాను 4:23-24 / 6:49 / 14:12
1 పేతురు 3:18-22
2 పేతురు 2:4-5
యూదా 1:5-6