24-0128 మూడు రకముల విశ్వాసులు

వర్తమానము: 63-1124E మూడు రకముల విశ్వాసులు

BranhamTabernacle.org

ప్రియమైన విశ్వాసి,

నేను విశ్వాసిని, అని చెప్పడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఒక మాతాచారములో కాదు గాని; వాక్యమునందు విశ్వసించువారమైయున్నాము! ఒక సంఘశాఖలో కాదు గాని; వాక్యమునందు విశ్వసించువారమైయున్నాము! ఎవరో చెప్పినది కాదు గాని; వాక్యము ఏమి చెప్తుందో దానిని నమ్మేవారమైయున్నాము!

మనము దేనిని ప్రశ్నించము, మనము కేవలం దానిని నమ్ముతాము. వినడానికి అది ఎలా ఉన్నా గాని లేదా దాని గూర్చి ఎవరు ఏమి చెప్పదలచుకున్నా గాని, మనము ఒక అసలైన విశ్వాసియైయున్నాము. మనము వాక్యముయొక్క ఆత్మీయ ప్రత్యక్షతను కలిగియున్నాము.

మనము జీవిస్తున్న ఘడియను మనము చూస్తున్నాము. ఈ ఘడియయొక్క వర్తమానమును మనము చూస్తున్నాము. ఈ ఘడియయొక్క వర్తమానికుణ్ణి మనము చూస్తున్నాము. దేవుడు తననుతాను తన వాక్యములో బయలుపరచుకొనుటను మనము చూస్తున్నాము. ఈ వర్తమానము, ఈ వర్తమానికుడు, ఈ వాక్యము తప్ప మరేదియు లేదని మనము చూస్తున్నాము.

ఒక నిజమైన విశ్వాసి వాక్యమును తప్ప మరిదేనిని వినడు. అంతే. అతడు వాక్యమును గమనిస్తాడు. అతడు ఎటువంటి లొసుగుల కొరకు చూడటంలేదు. అతడు ఎటువంటి యుక్తుల కొరకు వెదకడంలేదు. అతడు దేవుడిని నమ్ముతాడు, మరియు అదే దానిని స్థిరపరుస్తుంది, మరియు అతడు కేవలం కొనసాగుతూనే ఉంటాడు. చూశారా? విశ్వాసి అంటే అతడే.

మనము వాక్యమును తప్ప మరిదేనిని వినలేము; ప్రవక్త వద్దకు వచ్చే వాక్యమును మాత్రమే వింటాము. ఎటువంటి లొసుగులు కాదు, ఎవరో ఇచ్చిన అనువాదము కాదు, వధువు కొరకు పలుకబడి మరియు టేపులపై ఉంచబడిన స్వచ్చమైన వాక్యమును వింటాము.

ఆత్మ ఆ వాక్యమును మనయందు పురిగొల్పినది మరియు అది జీవము దాల్చినది. విశ్వాసము ద్వారా, మనము దానిని చూస్తున్నాము, మరియు దానిని నమ్ముచున్నాము. పరలోకమునుండి ఒక శబ్ధం వస్తుంది, అది వధువులోనికి ఎటువంటి ఒక పరిశుద్ధాత్మ బాప్తిస్మమును తీసుకువస్తుందంటే, అది మనలను ఒక ఎత్తబడు క్రుపలో, భూమి మీద నుండి తీసుకువెళ్తుంది. దేవుడు దానిని వాగ్దానము చేసాడు.

మనము అన్నివేళలా, ప్రతీ దినము పరీక్షించబడుచున్నాము. మనకు కలిగే పరీక్షలు మరియు శ్రమలను గూర్చి అది దేవుడు మనలను శిక్షించడమైయున్నదని మనకు చెప్పుడానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. కానీ దేవునికి స్తోత్రం, అది అట్లు కాదు, అది అపవాదే దానిని చేస్తుండగా మరి దేవుడు దానిని అనుమతించడమైయున్నది.

మనము ఏమి చేస్తామని చూచుటకు, దేవుడు మనలను సానబట్టుచూ మలచుచున్నాడు. మనము ఎక్కడ నిలబడతామని చూచుటకు, మనలను కుదిపివేయడానికి, మనలను అట్టడుగునకు పడవేయడానికి పరీక్ష వస్తుంది. అయితే మనము ప్రతీ పోరాటమును జయిస్తాము, ఏలయనగా మనము సజీవమైన మాదిరిలుగా ఉన్నాము; దేవునియొక్క వాక్యము మనలో మరియు మన ద్వారా జీవించుచున్నది.

మనము ఆయన దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైనవారము?

అది ఎంత అల్పమైనది అయినా, ఎవ్వరూ నీ స్థానమును తీసుకోలేరు. “నేను కేవలం ఒక గృహిణిని,” అని నీవు అనవచ్చును. ఎవ్వరూ నీ స్థానమును తీసుకోలేరు. దేవుడు, తనయొక్క గొప్ప వ్యవస్థలో, క్రీస్తుయొక్క శరీరమును, ఎంత స్థిరంగా క్రమపరచాడంటే, నీ స్థానమును తీసుకోగలవారు, ఎవ్వరూ లేరు.

అది ఎంత అద్భుతంగా ఉంది కదా? మనలో ప్రతి ఒక్కరికీ ఒక స్థానము ఉన్నది. దేవుడు ప్రపంచమును ఉనికిలోనికి పలికినప్పుడు మనలో ప్రతి ఒక్కరము ఇక్కడ ఉండియున్నాము. సరిగ్గా అప్పుడే ఆయన మన శరీరమును ఇక్కడ ఉంచాడు. తన వాక్యమును నెరవేర్చి మరియు మనకు నిత్యజీవమును ఇచ్చుటకు, దేవుడు ఈ సమయమున మనలను భూమి మీద ఉంచాడు.

ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయము తీసుకోవలసియున్నది. ఈ వాక్యము, ఈ వర్తమానము, ఈ వర్తమానికుడి విషయంలో మీరెక్కడ నిలబడతారు? టేపులలో పలుకబడిన ఆ వాక్యమును వినడం అనేది ఎంత ప్రాముఖ్యము?

టేపు పరిచర్యల ద్వారా, ప్రపంచములోని వివిధమైన ప్రాంతములన్నిటికి, ఈ టేపులు అందజేయబడతాయి.

ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వధువు కొరకు దేవునియొద్ద నుండి పంపబడిన టేపు పరిచర్యయైయున్నది. నీవు ఎక్కడున్నావన్నది, నీవు ఎవరివన్నది, మరియు నీవు వాక్యములోని విశ్వాసివా కాదా అన్నది ఇది నీకు ఖచ్చితంగా చెప్తుంది.

ఈ తరగతులలో నీవు ఏదో ఒకదానిలో ఉన్నావు. ప్రస్తుతం మీరున్న స్థితిలో, ప్రస్తుత మానసిక స్థితిలో, ప్రత్యక్షంగా ఈ జనసమూహములో ఉన్న మీరు, మరియు తర్వాత పరోక్షంగా ఈ టేపులను వినేవారు, ఈ టేపును వినిన తర్వాత, మీ యొక్క మానసిక స్థితియే, మీరు ఏ తరగతిలో ఉన్నారో మీకు ఋజువు చేస్తుంది.

ఈ టేపును విన్న తర్వాత, మీరు ఏ తరగతి ప్రజలకు చెందినవారని అది ఋజువు చేస్తుంది. ఈ టేపులలో పలుకబడిన స్వచ్ఛమైన వాక్యము కంటే ఎక్కువైనదేదో అవసరమని కొంతమంది నమ్ముతారు. ఒక-మనుష్యుని వర్తమానము వంటి దినములు గతించిపోయినవని; మీరు మీ సంఘకాపరి చెప్పేదానిని వినాలని లేదా మీరు నశించినట్లే అని కొంతమంది నమ్ముతారు.

టేపులను వినుటకు ప్రాముఖ్యతను ఇచ్చే విషయములోనే ఈనాడు వర్తమానములో అత్యంత గొప్ప విభజన కలుగుచున్నది. సంఘములో టేపులను ప్లే చేయడం తప్పని; సంఘకాపరి మాత్రమే పరిచర్య చేయాలనీ కొంతమంది బోధిస్తారు. కొంతమంది అవి సమముగా ఉండవలసియున్నవని చెప్తారు, కానీ వారు సంఘములో టేపులను ఎన్నడూ ప్లే చేయరు, ఒకవేళ చేసినా ఎప్పుడో ఒకసారి మాత్రమే అట్లు చేస్తారు.

వాక్యమును గూర్చి అనేక ఉద్దేశములు, అనేక ఆలోచనలు, అనేక అనువాదములు ఉండగా, ఎవరు చెప్పేది నిజం? మీరు ఎవరిని నమ్మాలి? అది మనలో ప్రతి ఒక్కరమూ మనల్ని మనము ప్రశ్నించుకోవలసిన ప్రశ్నయైయున్నది.

ఎవరో చెప్పేదానితో కాదు గాని, వాక్యముతో దానిని సరిచూడమని ప్రవక్త మనకు చెప్పియున్నాడు. మీరు దానిని ఎలా చేస్తారు? దానిని చేయడానికి ఒకేఒక్క మార్గమున్నది, ప్లేను నొక్కడమే.

ఒక సరియైన జవాబు, ఒక సరియైన మార్గము ఉండవలసియున్నది. ప్రతీఒక్కరూ తమకు తాముగా నిర్ణయించుకోవలసియున్నది. ఈ వర్తమానము వినే ప్రతీఒక్కరి భవిష్యత్తును ఈ ఆదివారము నిర్ధారిస్తుంది.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన విషయం: యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో ఉన్న ఒకేఒక్క వ్యక్తి ఎవరు? అగ్నిస్తంభము ఎవరిని నిర్ధారించినది? యేసుకు మనలను ఎవరు పరిచయం చేస్తారు? విఫలమవ్వని వాక్యమును పలికినది ఎవరు? భూమి మీద పలుకబడిన ఎవరి మాటలు, పరలోకములో ప్రతిధ్వనించేంతగా ప్రాముఖ్యమైయున్నవి?

సరియైన జవాబులను మీరు పొందగోరుచున్నయెడల, ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు వచ్చి: 63-1124E — మూడు రకముల విశ్వాసులు అనే వర్తమానమును వినమని మిమ్మల్ని ఆహ్వానించగోరుచున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

కూటమునకు ముందు చదువవలసిన లేఖనములు:

పరిశుద్ధ. యోహాను 6:60-71