24-0121 క్రీస్తనబడిన యేసును నేనేని చేతును? 

BranhamTabernacle.org

ప్రియమైన టేపు ప్రేమికులారా,

మనము ఈ వర్తమానమును మన హృదయ పూర్వకంగా ప్రేమిస్తున్నాము. అది దేవుని చెరుకుగడ యొక్క తీపిదనమైయున్నది. అది స్థిరముగా నిర్ధారించబడి, మరియు మళ్ళీ మళ్ళీ నిరూపించబడిన, దేవునియొక్క వాక్యమైయున్నది. ఈ వర్తమానము దేవుని వాక్యమునకు జవాబైయున్నది. ఇది అదే అభిషేకించబడిన క్రీస్తు, అనగా మన దినమునకు అభిషేకించబడిన వాక్యమైయున్నది.

ఆయన మనల్ని స్వీకరించి మరియు మనకు పరిశుద్ధాత్మ బాప్తీస్మమును ఇచ్చాడని, ఆత్మ చేత ఋజువు చేస్తూ, నిరూపించుచున్న, నిర్ధారించబడిన దేవునియొక్క వాక్యమును మనమిక్కడ కలిగియున్నాము. మనము యేసుక్రీస్తు నామములోనికి బాప్తీస్మము పొందియున్నాము. అదే సువార్త, అవే సూచక క్రియలు, అవే ఆశ్చర్య కార్యములు, అదే పరిచర్య, ఇంక అదే అగ్నిస్తంభము మన ముందు ప్రత్యక్షమై, సూచనలు మరియు అద్భుతములను చూపించుచున్నది. ఎక్కడా, ఎటువంటి సాకులు చెప్పడానికి లేదు.

ఇది దేవుడు మరియు ఆయన వధువు ఐక్యమయ్యే సమయమైయున్నది. క్రీస్తు యొక్క వధువు పిలువబడినది. మనము దేవుని రాజ్యములో ముద్రించబడినాము. ఆ యాంత్రికమైనవి కేవలం ఇక్కడ ఉండి మనల్ని భూమి మీద నుండి మహిమలోనికి, ఎత్తబడుటలోనికి తీసుకొనివెళ్ళే ఆ క్రియాశీలక శక్తి కొరకు వేచియున్నది.

క్రియాశీలక శక్తి అనగా ప్రరిశుద్ధాత్మ చేత మరలా నింపబడుటయైయున్నది. తలరాయి క్రిందకు దిగివచ్చి మరియు శరీరముతో ఐక్యమౌతుంది. పిదప, శిరస్సు మరియు శరీరము ఐక్యమైనప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ శక్తి మనలను పైకి లేపుతుంది మరియు క్రీస్తునందున్న మృతులు ఆయన పరిశుద్ధత యొక్క సౌందర్యములో లేచి, మరియు ఆకాశములోనికి వెళ్ళిపోతారు.

ఆ గడియ త్వరగా సమీపించుచున్నది. కాలము ముగింపునకు వచ్చియున్నది. తుది నిర్ణయములు తీసుకొనబడవలసియున్నది. మనయొక్క ఈ దినపు అభిషేకించబడిన వాక్యముతో మీరేమి చేస్తారు? ఈ గడియ యొక్క వర్తమానము పట్ల మీ తీర్మానం ఏమిటి?

మీరు కేవలం ఇట్లు చెప్తారా: “నేను వర్తమానమును నమ్ముచున్నాను. దేవుడు ఒక ప్రవక్తను పంపాడని నేను నమ్ముచున్నాను.”

కేవలం, “నేను వర్తమానమును నమ్ముచున్నాను,” అని చెప్పేంతవరకే రాకండి. మీరు వర్తమానికుడికి విధేయులు కండి.

మీరు వర్తమానికుడికి విధేయులు అవ్వాలంటే: గమనించండి, వార్తమానికుడికి విధేయులు కండి అని ఆయన చెప్పాడు. అటువంటప్పుడు ఆ వర్తమానికుడు చెప్పిన ప్రతీ మాటను నమ్మి మరియు ఆలకించడం ఎంత ప్రాముఖ్యమైయున్నది కదా?

మీరు ఇట్లంటారు, “సరి, సహోదరుడా బ్రెన్హామ్, చెప్పబడిన ప్రతీ మాటను నేను నమ్ముచున్నాను.” అది మంచిదే, అయితే అది—అది కేవలం చదవగలుగుటయైయున్నది.

ప్రజలు ఎందుకని టేపులతో తృప్తి చెందుటలేదు? ప్రతీ ఒక్కరూ ఒక ప్రవక్తయై యుండలేరు. కేవలం ఒక్క ప్రవక్త మాత్రమే ఉన్నాడు, మరియు వాక్యము ఆ ప్రవక్త వద్దకు వచ్చెను.

సంఘము దానిని ప్రశ్నించుటను, లేదా ఆ ప్రవక్త చెప్పిన విషయమును, భిన్నమైన స్వరములు వారికి చెప్పి అనువదించాలని కోరుటను ప్రారంభించేంత వరకు అది బాగానే ఉన్నది. వారు ఒక ఆధునిక కోరహు మరియు దాతానును కోరుకున్నారు.

చూడండి, అది వాక్యమునకు ఒక చిన్న తప్పుడు అనువాదముతో ప్రారంభమైనది, మరియు, అదే కార్యము జరుగుచున్నది, అది అదే విధంగా అంతమగుచున్నది.

అది వాక్యమునకు ఒక చిన్న తప్పుడు అనువాదముతో ప్రారంభమైనది, మరియు దానితోనే అంతమౌతుంది, టేపులతో మీరు ఎంతగా నిలచియుండవలసియున్నదో మీరు నిశ్చయంగా గుర్తించవచ్చును. దేవుడు ఎందుకని వధువు కొరకు ఈ వర్తమానమును రికార్డు చేపించి మరియు భద్రపరిచాడో మీరు నిశ్చయంగా చూడవచ్చును.

మీ సంఘకాపరులను తక్కువ చేయడానికో, లేదా మీ కాపరులు చెప్పేది వినవద్దని చెప్పడానికో నేను ఈ సంగతులను చెప్పడంలేదు, లేదండి, అయితే ప్లే బటన్ను నొక్కి మరియు టేపులో ఉన్న ఈ వర్తమానమును వినడం యొక్క ప్రాముఖ్యతను మీకు చూపించడానికి చెప్పుచున్నాను.

సంఘము దానిని మరలా, మరలా, మరలా, మరియు మరలా ఎంతగా పరీక్షించుకోవలసియున్నది కదా! మనము ఆయన రాకడకై వేచియున్నాము. మనము మేల్కొనియుండి, ఆ కొనిపోబడుట కొరకు వేచియున్నాము. మనము దానిని, ఎవరో చెప్పిన విషయంతో కాదు గాని వాక్యముతో సరిచూసుకొనుట మంచిది. క్రీస్తుతో ఒక వ్యక్తిగత అనుభవము కలిగియుండుట చేత, మిమ్మల్ని మీరు ఎరిగియున్నారని, నిశ్చయం చేసుకోండి. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ దానిని సరిచూసుకోండి.

ఆయన ఏమి చెప్పాడు? మనము మళ్ళీ, మళ్ళీ, మరియు మళ్ళీ వాక్యముతో దానిని సరిచూసుకోవలసియున్నది. మీరు దానిని వాక్యముతో ఎలా సరిచూసుకుంటారు? ఈ దినమునకైన వాక్యము ఏమిటి? అది ఆది నుండి అదే విధంగా ఉన్నటువంటి, బైబిలు గ్రంథమైయున్నది.

తన వాక్యమునకు అనువాదకుడు ఎవరని దేవుడు చెప్పుచున్నాడు? నేనా? మీ సంఘకాపరియా? కాదు, ఈ గడియకు దేవుని యొక్క నిర్థారించబడిన ప్రవక్త మాత్రమే వాక్యమునకు అనువాదకుడైయున్నాడు. కావున, ఎవరైనా చెప్పే వాక్యమును మీరు మళ్ళీ, మళ్ళీ, మరియు మళ్ళీ టేపులతో సరిచూసుకోవలసియున్నది!

ఆ విషయం సత్యమైయ్యుండి, మరియు ఏ వ్యక్తియైనా, లేదా ఏ సంఘకాపరియైనా చేయగలిగే ఏకైక ప్రాముఖ్యమైన విషయము ప్లే ను నొక్కడమే అని మీరు నమ్ముచున్నారు.

అటువంటప్పుడు వర్తమానమును నమ్ముచున్నాను అని చెప్పుకునే ఏ వ్యక్తికైనా దానిని చెప్పడం ఎందుకని అంత కష్టమగుచున్నది? ఎందుకనగా కేవలం వారు దానిని నమ్మడంలేదు.

మీ తుది నిర్ణయం ఏమిటి? నేను మరియు నా ఇంటి వారమైతే, ఈ వర్తమానముతో మరియు దేవుని వర్తమానికునితో, ఈ టేపులతో నిలిచియుంటాము. టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడం కంటే ప్రముఖ్యమైనదేదియు లేదని మేము నమ్ముచున్నాము.

•  ఒకే ఒక్క యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు స్వరము ఉన్నది.
•  అగ్నిస్తంభము చేత నిర్ధారించబడిన ఒకే ఒక్క స్వరము ఉన్నది.
•  ఒకే ఒక్క ఏడవ దూత వర్తమానికుడు ఉన్నాడు.
•  వధువంతయు ఏకీభవించగల ఒకే ఒక్క స్వరము ఉన్నది.
•  ఈ తరమునకు ఒకే ఒక్క దేవుని స్వరము ఉన్నది.

మీరును అదే ప్రత్యక్షతను కలిగియున్న యెడల వచ్చి, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా, ఆదివారం 12:00 P.M., గంటల సమయమప్పుడు: క్రీస్తనబడిన యేసును నేనేని చేతును? 63-1124M అనే వర్తమానమును వినుచు మరియు మా తుది నిర్ణయమును తీసుకొనుచుండగా, నాతో మరియు ప్రపంచ వ్యాప్తంగా అదే విషయమును నమ్ముచున్న ఒక చిన్న విశ్వాసులతో గుంపుతో చేరండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్