24-0114 మీలో ఉన్నవాడు

వర్తమానము: 63-1110E మీలో ఉన్నవాడు

PDF

BranhamTabernacle.org

ప్రియమైన పరిపూర్ణ విశ్వాసముగల విశ్వాసుల్లారా,

ప్రతీరోజు గొప్ప ఎదురుచూపుతో మన గుండెలు వేగముగా కొట్టుకొనుచున్నవి. త్వరలో రానైయున్న ఆయన రాకడయొక్క గడియ సమీపించుట కొరకు మనము వేచియున్నాము. భయములన్నియు కనుమరుగయ్యాయి. “మనము ఆయన వధువేనా”? అని ఇక ఎంతమాత్రము ఆలోచనలేదు. మనము ఆయన వధువైయున్నాము అని, ముందెన్నడూ లేనంతగా అది మన హృదయాలలో లంగరు వేయబడియున్నది.

మనము ఒక పరలోకపు వాతావరణములోనికి ఎత్తబడియున్నాము, తన సంఘములో, మరలా శరీరధారియైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యను వినుచున్నాము. ఇది ఒక మానవుడు కాదు గాని, ఇది దేవుడే తన వధువుతో మాటలాడుటయై యున్నదని, ఈ వర్తమానము దేవునియొక్క వాక్యముచేత ఎంతో క్షుణ్ణంగా నిర్ధారించబడినది.

ఈ టేపులలో మనతో మాట్లాడుచున్నది ఒక మానవుడు కాదు, అది దేవుడే అని మనము నమ్ముచున్నాము.

నేనేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, “మీ నమ్మకాన్ని కోల్పోకండి.” సాతాను నా గురించి మీతో చెడుగా చెప్పనివ్వకండి; ఎందుకనగా, చాలా కలవు. కాని మీరైతే ఆ నమ్మకాన్ని ఉంచండి; ఎందుకనగా అలాగు మీరు ఉంచనట్లైతే, అది జరగదు. ఒక మనిషిగా, నా వైపు చూడకండి; నేను ఒక మనిషినే, నేను అనేక తప్పిదాలను కలిగియున్నాను. అయితే నేను ఆయన గూర్చి ఏమి చెప్పుచున్నానో దానివైపు చూడండి. అది ఆయనే. ఆయన మాత్రమే.

మీరు విశ్వాసమును కలిగియుండి మరియు ఆయన చెప్పేది నమ్మవలసియున్నది, లేనియెడల అది జరగదు. మనము చేస్తామని అనేకులు అనుకున్నట్లు, మనము దేవుని ప్రవక్తను ఒక మనిషిగా చూడము. మనము మానవ శరీరమనే ఆ తెరకు ఆవల ఉన్నాము, మరియు మనము చూసేది మరియు వినేది అంతయు దేవుడు మానవ పెదవుల ద్వారా మాట్లాడుటయైయున్నది, మరియు మనం ధైరాన్ని కలిగియుండి ప్రతీ మాటను నమ్ముచున్నాము.

అది ఈ దినమునకైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయైయున్నది. ఆ టేపులలో మాట్లాడేది, ఒక మానవుడు కాదు, దేవుడే అని నమ్ముటయైయున్నది. నా స్నేహితుడా, నీవు దానిని తప్పిపోయావంటే, నీవు గడియ యొక్క వర్తమానమును తప్పిపోయినట్లే మరియు నీవు వధువుగా ఉండలేవు.

సాతానుడు దానికి వాడి అనువాదమును పెడతాడు, మరియు 99% శాతం వాడు హవ్వకు చేసినట్లే వర్తమానమును ఎత్తి చూపిస్తాడు, అయితే ఆమె వాక్యముతో నిలబడవలసిందిగా ఆజ్ఞాపించబడినది; ఆదాము ఆమెతో చెప్పినది దేవుడు చెప్పినదే, దాని భావం ఏమిటని వేరెవరో చెప్పినది కాదు. ఆమె దేవునియొక్క స్వరముతో నిలిచియుండవలసి యుండెను.

ఇది లోకము ఎన్నడూ చూడనటువంటి అత్యంత గొప్ప దినమైయున్నది. తన ప్రవక్త యొక్క జీవితంలో నివసించి మరియు తననుతాను బయలుపరచుకున్న యేసుక్రీస్తు యొక్క జీవము, ఇప్పుడు మనలో, అనగా తన వధువులో జీవిస్తున్నది.

ఆయన మనకు ఏమి చేయమని ఆజ్ఞాపించాడో సరిగ్గా దానినే మనము చేస్తున్నాము: టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరముతో నిలిచియుండుట ద్వారా వాక్యముతో నిలిచియుండండి. అది ఈ దినమునకైన దేవుని యొక్క టేపు పరిచర్య మరియు ప్రణాళికయై యున్నది.

విలియమ్ మారియన్ బ్రెన్హామ్ దేవుని చేత ఎన్నుకోబడిన ఏడవ దూత వర్తమానికుడని, వాక్యములో దాగియున్న మర్మాలన్నిటినీ బయలుపరచుటకు దేవుని చేత ఎన్నుకోబడినవాడని, ఈ తరానికి దేవునియొక్క స్వరమని, ఏ మనుష్యుడు కలిగిలేనటువంటి విశ్వాసమును కలిగియున్నవాడని, “ప్రజలు నిన్ను నమ్మునట్లు నీవు చేయగలిగితే, ఏదియు నీ ప్రార్థనల ముందు నిలువనేరదు,” అని ప్రభువుయొక్క దూత ద్వారా చెప్పపడినవాడని మీరు నిజంగా నమ్మినట్లైతే అప్పుడు ఈ ఆదివారము ఏ ఇతర దినములకంటెను అత్యంత ప్రాముఖ్యమైన దినమైయ్యుంటుంది.

ఈ వర్తమానము యొక్క ప్రత్యక్షతను మనయొద్ద నుండి తీసివేయగలుగునది ఏదియు లేదు, ఏదియు లేదు. మనము ఎన్నడూ దానిని సందేహించలేము. ఆయన దానిని చెప్పాడంటే, మనము దానిని నమ్ముతాము. మనము దానిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, మరి అయిననూ మనము దానిని నమ్ముతాము.

స్వయంగా యేసు మనతో ఇట్లు చెప్పాడు: “మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు.” దానిని మన హృదయాలలో నాన్చబడనివ్వండి. ఆయన ఆత్మ మనలో జీవిస్తున్నది. దానిని మనము అర్థం చేసుకోగలమా? మీరు ఈ లేఖను చదువుచుండగా, సరిగ్గా ఇప్పుడు, పరిశుద్ధాత్మ, స్వయంగా దేవుడు, ఆ అగ్నిస్తంభము, మనయందు జీవిస్తూ మరియు మనయందు నివసిస్తున్నాడని మీరు అర్థం చేసుకోగలరా? అది సత్యమని మనకు ఎట్లు తెలియును? దేవుడు దానిని చెప్పాడు!!

మనము ఎంతటి ఒక ఓడిపోయినవారమని సాతానుడు ఎప్పుడూ మనకు చెప్తూనే ఉన్నాడు. మరియు వాడు చెప్పేది నిజమే, మనము ఓడిపోయినవారమే. మనము వాక్యములో ఉండవలసిన చోట లేమని, వాడు మనకు గుర్తు చేస్తుంటాడు. మరలా నిజమే, మనము అక్కడ లేము. చేయుటకు మనము ఎరిగియున్న శ్రేష్ఠమైనవాటిని మనము చేయము. వాడు నిజమే చెప్పుచున్నాడు, ప్రభువా మమ్మల్ని క్షమించుము.

అయిననూ మా పొరపాట్లు, మా బలహీనతలు, మా వైఫల్యములన్నియు ఉన్నప్పటికినీ, మేము వధువైయున్నాము, అనే సత్యమును అది మార్చలేదు. మేము ప్రతీ వాక్యమును నమ్ముచున్నాము!

మన వైపు గాని లేదా మనము చేయగలిగే దేనివైపు గాని మనము చూచుకొనుటలేదు, మనము ఒక గందరగోళమై యున్నాము. ఆయన మనలను ఎన్నుకున్నాడని మరియు ఆయన వాక్యము యొక్క ప్రత్యక్షతను మనకు ఇచ్చియున్నాడని మరియు మనయొద్ద నుండి ఆ ప్రత్యక్షతను ఏదియు తీసివేయలేదని మాత్రమే మనము ఎరిగియున్నాము. అది మన హృదయములో మరియు మన అంతరాత్మలో స్థిరపరచబడియున్నది.

మనము పరిపూర్ణమైన విశ్వాసమును కలిగియుండాలని ఆయన మనకు చెప్పాడు. ప్రభువా, నీ వాక్యమందు మేము పరిపూర్ణమైన విశ్వాసమును కలిగియున్నాము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యునదని నీ ప్రవక్త ఏదైతే చెప్పాడో దానియందు మేము విశ్వాసమును కలిగియున్నాము. అది తన వాక్యము కాదు, కానీ అది మా కొరకైన నీ వాక్యమైయున్నది.

మాకు అవసరమున్నవాటిని గూర్చి, మేము కేవలం నీ వాక్యమును నమ్మి, మరియు నీ వాక్యము పట్ల విశ్వాసము కలిగియున్నట్లయితే, మాకు ఏది అవసరమున్నదో దానిని మేము పొందుకోగలమని నీ ప్రవక్త మాకు చెప్పియున్నాడు. మేము నమ్ముచున్నాము.

ప్రభువా, నాకొక అవసరత ఉన్నది. నీ వాక్యములో నాకున్న విశ్వాసమంతటితో నేను నీ యెదుటకు వచ్చుచున్నాను, ఏలయనగా అది విఫలమవ్వజాలదు. అయితే ఈనాడు, ప్రభువా, నేను నా విశ్వాసముతో మాత్రమే కాదు గాని, బలిష్ఠుడైన నీ ఏడవ దూత వర్తమానికుడికి నీవు ఇచ్చిన విశ్వాసముతో నీ యెదుటకు వచ్చుచున్నాను.

ఓ ప్రభువైన దేవా, మా పట్ల కనికరము కలిగియుండమని నేను నిన్ను వేడుకొనుచున్నాను. మరియు ఇక్కడ కూర్చొనియున్న ప్రతీ స్త్రీ మరియు పురుషుడు, ఎటువంటి వ్యాధితో లేదా ఎటువంటి బాధతో ఉన్నప్పటికినీ; ప్రజల కొరకు మోషే తనకు తాను ఆ ఖాళీలో నిలబడినట్లు, ప్రభువా, ఈ రాత్రి నేను నీ యెదుట నా హృదయము పరచియుంచుతున్నాను. మరియు నీ యందు, నేను కలిగియున్న విశ్వాసమంతటితో, నీవు నాకిచ్చిన ఆ విశ్వాసమును, నేను వారికి ఇచ్చుచున్నాను.

మరియు నేను ఇట్లు చెప్పుచున్నాను: నేను కలిగియున్నదానినే, నేను ఈ జనసమూహముకు ఇచ్చుచున్నాను! నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, మీ వ్యాధిని వదిలించుకోండి, ఎందుకనగా మీలో ఉన్నవాడు, మీ జీవమును తీయుటకు ప్రయత్నించుచున్న దయ్యము కంటే గొప్పవాడు. మీరు దేవుని పిల్లలైయున్నారు. మీరు విమోచింపబడినవారై యున్నారు.

అది పూర్తైనది. ఆయన వాక్యము విఫలమవ్వజాలదు. మనకు అవసరమైనది ఏదైనా, మనము దానిని పొందుకోగలము.

ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, ప్రపంచమంతటి నుండి వధువుయొక్క భాగము కూడుకొని దేవుని యొక్క వాక్యము ఆయన విశ్వాసమును మన విశ్వాసముతో కలుపుటను వింటుండగా ఈ గొప్ప ఆశీర్వాదమును మరియు దేవుని యొద్ద నుండి అభిషేకమును పొందుకొనుటకు వచ్చి మాతో చేరండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

63-1110E మీలో ఉన్నవాడు