23-1203 నేనెలా జయించగలను?

ప్రియమైన కొలను లిల్లీ,

ఆదివారమున మన ప్రభువు మాట్లాడి మరియు ఇప్పుడు ఏమి జరుగుతుందన్నదాని గూర్చి మనతో చెప్పుటను మనం విన్నప్పుడు మన హృదయములు ఆనందముతో ఎలా గంతులు వేసినవి కదా. మనము వాక్యముతో ఐక్యమవుతూ మరియు ఆయనతో ఏకమగుచున్నాము. మనకు ముందుగా వెళ్ళిన పరిశుద్ధులతో ఏకమగుటకు మనము త్వరలోనే వారితో ఐక్యమవుతాము. పిదప గొఱ్ఱెపిల్ల పెండ్లి విందు కొరకై మనమందరము ఒక్కటిగా క్రీస్తుతో ఐక్యమవుతాము.

ఒక క్షణములో, కనురెప్ప పాటులో అనే దాని గూర్చి ఆలోచించమని, ఆయన మనతో చెప్పినప్పుడు మన ఆత్మలు ఎటువంటి ఆనందముతో నిండినవి గదా, లోకానికి అసలు ఏమి జరుగుతుందో తెలియదు; కానీ అకస్మాత్తుగా, ముందుగా వెళ్ళిన మన ప్రియులను మనము మన కన్నుల యెదుట చూస్తాము, మరియు మనం వారితో మరలా ఐక్యమవుతాము.

ఒక్క క్షణములో, మన తండ్రులు, మన తల్లులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, భర్తలు, భార్యలు, పిల్లలు, ఇంకా మన ప్రవక్త కూడా మన యెదుట నిలబడియుడుండుటను మనము చూస్తామన్నదాని గూర్చి ఆలోచించడానికి, ఎటువంటి ఎదురుచూపులు మన హృదయములో నిండుచున్నవి కదా. మనము వారిని, శరీరంలో చూస్తాము!!

సరిగ్గా అప్పుడే, ఇది అదే; సమయం వచ్చేసింది, మనము సాధించాము, అది ముగిసింది అని మనము తెలుసుకుంటాము. ప్రత్యక్షత వలన కలుగు ఉత్తేజం గురించి మాట్లాడండి!! కేవలం ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ మరియు మాట్లాడుతుంటేనే, మహిమ, హల్లేలూయా, ప్రభువు నామము స్తుతింపబడును గాక అంటూ, మీరు కేకలు వేయడాన్ని నేను వినగలుగుచున్నాను.

మన కొరకు ఉంచబడిన ఈ ప్రేమలేఖలపై విందు చేసుకొనుచు, మనము ఎటువంటి ఒక సమయమును కలిగియుంటున్నాము కదా. మనము కోరిన ఏ సమయములోనైనా బయటకు తీసి మరియు వాటిని మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదువుకోగలిగే ప్రేమలేఖలు. అది మాత్రమే కాదు గాని, ఇంకా గొప్ప విషయమేమిటంటే, మన ప్రభువు స్వయంగా తానే మానవ పెదవుల గుండా మాట్లాడి మరియు మనతో ఇట్లు చెప్పడాన్ని మనము వినగలుగుచున్నాము, “నా ప్రియమైన వారలారా, నేను ఈ ప్రేమలేఖలను కేవలం మీ కొరకే భద్రపరిచాను. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాననియు మరియు మీరు నావారనియు నేను మీకు చెప్పుటను మీరు వినడం మీకు అవసరమయ్యే ఒక సమయము వస్తుందని నాకు తెలుసు.”

“శత్రువు మీపై దాడి చేసినప్పుడు, మీరు మీ పరీక్షలు మరియు శ్రమలన్నిటిగుండా వెళ్తున్నప్పుడు, మీరు నావారై యున్నారని ప్రతీ రోజు నేను మీకు చెప్పగోరుచున్నాను. నేను ఇదివరకే వెలను చెల్లించాను. నేను ఇదివరకే అది ఏదైనా గాని దానిని జయించాను…నా ప్రియమైనవారలారా నేను చెప్పేది మీకు వినిపించిందా? మీకు అవసరమైయున్నది ఏదైనా, నేను దానిని ఇదివరకే మీ కొరకు జయించాను, ఎందుకనగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.”

“ఒక ప్రపంచమనేది లేకమునుపే నేను మిమ్మల్ని ఎరిగియున్నాను. అప్పుడు మీరు నాలో ఒక భాగమైయున్నారు. అది మీకిప్పుడు జ్ఞాపకము లేదు, కాని నాకు జ్ఞాపకమున్నది. నేను మీకు చెప్పినదానిని మర్చిపోవద్దు, మీరు నా మాంసములో మాంసము, నా ఆత్మలో ఆత్మ, నా ఎముకలో ఎముకయై యున్నారు.”

“నేను మీకు దేని గూర్చియైతే చెప్పుచున్నానో ఇప్పుడు ఆ సమయము వచ్చియున్నది. బాధలు, పరీక్షలు మరియు శ్రమలు ఇకమీదట ఉండవు; ఆ రోజులు గతించిపోయినవి. ఇక ఇప్పుడు కేవలం మనమందరము కలిసి నిత్యత్వములో గడపడమేయైయున్నది.”

“ధైర్యము తెచ్చుకోండి. ముందుకు కొనసాగుతూ ఉండండి. ఆ దినము ఉదయించుటకు సమయమైనది. అనుదినము మీరు ఎదుర్కుంటున్న ఒత్తిడంతయు కేవలం మిమ్మల్ని నాకు ఇంకా దగ్గరగా తెచ్చుటకేయైయున్నది.”

“మీ మీదికి ఏదైనా వచ్చినప్పుడు, మరియు మీరు ఎంతగానో కృంగిపోయినట్లు, అలసిపోయినట్లు మరియు సోమ్మసిల్లినట్లు మీకు అనిపించుచు మరియు మీరు అసలు ఇక కొనసాగలేనట్లుగా అగుపించుచున్నప్పుడు, నేను సరిగ్గా మీతోనే ఉన్నానని, మీరెన్నడూ మర్చిపోకూడదు. నా వాక్యము మీలో జీవించుచున్నది. మీరే నా వాక్యమైయున్నారు.”

“మాట మాత్రము పలుకుడి, అని నేను మీతో చెప్పియున్నాను. మీరు కోరినవి ఏవైనా, మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు వాటిని పొందుకుంటారని నమ్మండి మరియు మీరు వాటిని పొందుకుంటారు. అవి మీకు ఇవ్వబడతాయి. నేను ఇదివరకే మీ కొరకు వాటిని జయించాను.”

ఈ మాటలు మనకు ఎంత విలువైనవి కదా. అనుదినము అవి మనలను పోషించుచున్నవి. అవి మన ఆత్మలను ఉత్సాహపరిచి మరియు మనలను ఆయనతో కూడ పరలోక స్థలములలో కూర్చుండబెడతాయి. మనము కేవలం దేవుని కొరకు మరియు ఆయన వాక్యము కొరకు బ్రదుకుచున్నాము. మనకు ఒక్క లక్ష్యమున్నది, అది యేసు క్రీస్తే. దానికి వెలుపల, ఏదియు లెక్కలోనికి రాదు.

మనము దర్శనమును పట్టుకున్నాము. తెర తొలగించబడినది మరియు మనము ఆయనను, ఆయన వాక్యము శరీరధారియై, మానవ పెదవులగుండా మనతో మాట్లాడుటను చూస్తున్నాము. మనము ఈ వాక్యముతో, ఈ వర్తమానముతో, ఆ స్వరముతో ప్రేమలో ఉన్నాము.

ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, వచ్చి మాతో చేరి మరియు మీ జీవితములోని అతిగొప్ప అనుభవాన్ని పొందుకోండి. సాతానుడు మీ మార్గాములోకి విసిరే ప్రతీ పోరాటమును ఎలా జయించాలో వినండి. మీరు యేసు క్రీస్తు యొక్క వధువైయున్నారని ఎరిగియుండి ఆనందముతో మరియు సంతోషముతో మీ హృదయములను నింపుకోండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

63-0825M నేనెలా జయించగలను?

కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:

ప్రకటన 3:21-22