23-1126 కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట

వర్తమానము: 63-0818 కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట

PDF

BranhamTabernacle.org

ఆయన మాంసములో మాంసము, ఆయన వాక్యములో వాక్యము, ఆయన జీవములో జీవము, ఆయన ఆత్మలో ఆత్మయైయున్న ప్రియమైనవారలారా,

నా ప్రశస్తమైన సహోదరీ సహోదరులారా, కేవలం ఆ ఒక్క వాక్యమును మరలా మరలా చదవండి. దేవుడు తానే మిమ్మల్ని ఏమని పిలిచాడో చదవండి. అది మనకు ఎంత విలువైనదని కేవలం మానవ మాత్రమైన పదాలలో ఎవరైనా ఎలా రాయగలరు. దానిని వ్యక్తపరచడం అసాధ్యం. మన పూర్తి హృదయములతో, మనస్సులతో మరియు అంతరాత్మలతో మనము దానిని పూర్తిగా గ్రహించి మరియు దానిని అనువర్తించిన యెడల, ఎత్తబడుట జరగవలసియుంటుందని నేను నిజముగా నమ్ముచున్నాను.

భయపడటానికి ఏమి ఉన్నది? చింతించడానికి ఏమి ఉన్నది? సాతానుడు మనతో పోరాడుతాడు, మనలను పీడిస్తాడు, మనపై వ్యాధులను విసురుతాడు, ప్రతివిధమైన దుష్ట తలంపులతో మన మనస్సులపై దాడి చేస్తాడు, అయితే మనకు హాని చేయగలిగేది ఏదియు లేదు. యేసుకు ఏదైనా హాని చేయగలిగిందా? లేదు, అటువంటప్పుడు మనకు కూడా ఏదియు హాని చేయలేదు. ఆయన ఇప్పుడు ఇట్లు చెప్పాడు: మనము ఆయన మాంసము, ఆయన వాక్యము, ఆయన జీవము, ఆయన ఆత్మయైయున్నాము.

ఆయన మనకు చెప్పుచున్నదానిని ధ్యానిస్తున్నప్పుడు మన హృదయములో ఎటువంటి ఒక సంతోషము మరియు ఎటువంటి ఒక సంతృప్తి ఉంటున్నది కదా. దేవుడు మనకు బయలుపరచుచున్న ప్రత్యక్షతలు, టేపు వెంబడి, టేపు వెంబడి టేపు. ఒక పెద్ద బుగ్గ బావి వలె పరిశుద్ధాత్మ మన అంతరంగములో ఉబుకుచున్నాడు.

దానిని చూడటానికి మరియు వినడానికి మనము ముందుగా నిర్ణయించబడ్డాము. మనము పడిపోము మరియు పడిపోజాలము లేదా తప్పుదోవలో నడిపించబడజాలము. కలుసుకొనుటకు ఏర్పాటు చేయబడిన స్థలములో, మన శిరస్సత్వమును, మన విమోచకుడిని, మన భర్తను, మన రాజును, మన ప్రభువును, మన ప్రియుడిని, మన రక్షకుడిని కలుసునే మార్గంలో మనము ఉన్నాము!

కేవలం దీనిని మరలా వినండి: దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా ఆయన సంఘమైయున్న, మనయందు నివసించుచున్నది, ప్రధానత్వము. దేవుడేమైయున్నాడో దానంతటినీ, ఆయన క్రీస్తులో కుమ్మరించాడు; మరియు క్రీస్తు ఏమైయున్నాడో అదంతయు, సంఘములోనికి; అనగా మనలోనికి, ఆయన వధువులోనికి కుమ్మరించబడినది. అది ఏదోఒక రోజు జరగబోయే ఒక కార్యము కాదు, అది సరిగ్గా ఇప్పుడే మనలో జరుగుచున్నదని ఆయన చెప్పాడు.

మీరు ఊహించగలరా, కాలము ప్రారంభమైనది మొదలుకొని, ఇప్పటి వరకు, దేవుడు తన మనస్సులో కలిగియున్న తన యొక్క గొప్ప మర్మయుక్తమైన రహస్యమును ఎవ్వరికీ తెలియజేయలేదు. ఆయన ఎందుకని అలా చేశాడు? ఎందుకనగా ఆయన వాగ్దానం చేసినట్లు ఈ అంత్య దినములలో దానిని మనకు తెలియజేయడానికి ఆయన వేచియున్నాడు. ఆయన మన కొరకు వేచియున్నాడు. మనము మాత్రమే దానిని పూర్తిగా గ్రహించగలమని, మరియు గ్రహించుతామని, ఆయనకు తెలియును….మహిమ!!!

మనము పడిపోమని ఆయన ఎరిగియున్నాడు గనుక తన వధువుగా ఉండుటకు ఆయన మనలను ఎన్నుకున్నాడు. మిగతా ప్రపంచమంతా దాని గూర్చి ఏమి చెప్పినా గాని మనము ఆయన వాక్యమునే పట్టుకొనియుంటాము. మనము ఆ వాక్యమును మరియు ఆ వాక్యమును మాత్రమే పట్టుకొనియుంటాము! అక్కడ నిలబడటానికి మనము ముందుగా నిర్ణయించబడినాము. యేసు క్రీస్తు ద్వారా మనము దత్తపుత్రులమైయున్నాము.

ఇంకా ఎంతో ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి…మిమ్మల్ని మీరు గిచ్చుకోండి. దైవత్వము (దేవుడు) మరియు శరీరము (మనము) ఒక్కటయ్యాము. అది దేవుడు మనలో ప్రత్యక్షపరచబడుటయై యున్నది.

•  దేవుడు మరియు ఆయన సంఘము ఒక్కటే, “క్రీస్తు మీలో ఉండుట.”
•  మనము దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షతయై యున్నాము.
•  మనము ఆయన నామమును కూడా భరించుచున్నాము; ఆయన పేరు యేసు అయ్యున్నది, అభిషిక్తుడు.
•  మనము క్రీస్తు యొక్క అభిషేకించబడిన శరీరమైయున్నాము.
•  ఆ శరీరము చేసినట్లే మనము దేవుడిని ప్రత్యక్షపరచుచున్నాము.

మనము ఆయన యొక్క వధువైయున్నాము, ఆయన ఆత్మతో గర్భము ధరించియున్నాము. సంఘము, ఆయన నామమును భరించి ఆయన యొక్క ఆత్మచేత గర్భము దాల్చినది, ఆయన జీవమును కలిగియుండి; పిల్లలను కనుచున్నది. సాతనుడికి కావలసిన సమాధానము మన వద్దనున్నది. శిరసత్వము ఇక్కడున్నది. క్రీస్తు, తిరిగి లేచిన ప్రభువు, ఆయన ఎప్పుడూ ఉన్నట్టి తన యొక్క అదే పునరుత్థానపు శక్తిలో ఇక్కడ ఉన్నాడు, ఆయన యొక్క పలుకబడిన వాక్యపు వధువైయున్న మనయందు తనను తాను ప్రత్యక్షపరచుకొనుచున్నాడు.

దేవుడు ఇప్పుడు తన వధువును ఏకముగా సమకూర్చుచున్నాడు. తన వధువును సమకూర్చే ఒకే ఒక్క కార్యమైయున్న, తన వాక్యము ద్వారా ప్రపంచమంతటి నుండి వారిని ఐక్యపరచుచున్నాడు. పరిశుద్ధాత్మ ఆయన వధువును నడిపించుచు మరియు సమకూర్చుచున్నాడు. ప్రతి కాలములో, ప్రవక్తయే వారి దినమునకు పరిశుద్ధాత్మయైయున్నాడు.

దీని గూర్చి ఆలోచించండి. మనము ఏడవ దూత వర్తమానికుడికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నామని ప్రజలు అన్నప్పుడు, గుర్తుంచుకోండి, ప్రపంచమనేది లేకముందే తన మనస్సులో కలిగియున్న తన రహస్యాలన్నిటిని స్వయంగా దేవుడే తన ఏడవ దూత వర్తమానికుడికి అప్పగించాడు. స్వయంగా దేవుడే ఈ మనిషిలో 100% నమ్మకాన్ని కలిగియున్నాడు, తద్వారా తన యొక్క గొప్ప అంత్య-కాల ప్రణాళికను అతని చేతుల్లో పెట్టాడు. ఆయన అతనికి ఇచ్చాడు…వినండి, ఆయన అతనికి తన రహస్యములన్నిటిని గూర్చిన ప్రత్యక్షతను ఆ మనుష్యునికి అనుగ్రహించాడు. అసలు వ్రాయబడని సంగతులను గూర్చిన ప్రత్యక్షతను కూడా ఆయన ఆ మనుష్యునికి అనుగ్రహించాడు. అతడు భూమిమీద చెప్పినది ఏదైనా ఎంతో ప్రాముఖ్యము, ఎంతగా అంటే అది పరలోకములో ప్రతిధ్వనిస్తుంది అని ఆయన చెప్పాడు.

దేవుడు ఈ లోకములోనికి పరిశుద్ధాత్మ చేత నింపబడిన గొప్ప వ్యక్తులను పంపాడనుటలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీరిలో ప్రతియొక్కరు, పరిశుద్ధాత్మతో నింపబడి కూడా, తప్పైయుండవచ్చును. వారు చెప్పేది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని దేవుడెన్నడూ నిర్ధారించలేదు, మరియు వాటిలో ప్రతీ మాటను నమ్మమని మీకెన్నడూ చెప్పలేదు. దేవుని యొద్ద నుండి ఆ అధికారము కలిగిన ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు, అదే ఆయన యొక్క ఏడవ దూత వర్యమానికుడు.

మీరు, ఒక సంఘకాపరిని కలిగియుండవచ్చును, మీరు కలిగియుండవలసియున్నది. అయితే ఆ సంఘకాపరి ఈ టేపులలో ఉన్న దేవుని స్వరమే వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరము అని మీకు చెప్పనియెడల, మరియు ప్రవక్త దీనిని చెప్పాడు అని కేవలం అతడు దానిని మీకు చెప్పడం కాకుండా, మీతో కలిసి ఆ టేపులను వినుట ద్వారా మొదటిగా అతడు వాటిని మీ ముందు ఉంచనియెడల, మీరు తప్పుడు సంఘకాపరిని కలిగియున్నారు.

మిమ్మల్ని నడిపించుచున్నది ఎవరైనా గాని, అది పరిశుద్ధాత్మ అని మీరు చెప్పుకున్నా గాని, అది మిమ్మల్ని ఈ వర్తమానముతో, ఆ స్వరముతో ఐక్యపర్చడం మంచిది, ఎందుకనగా, “నేను మీకు దేవుని స్వరమునైయున్నాను,” అని చెప్పగల ఏకైక స్వరము అదేయై యున్నది.

దానిని చూడటానికి మీరు ముందుగా నిర్ణయించబడియుంటీ, మీరు దానిని చూస్తారు. మీరు నిర్ణయించబడనట్లైతే, మీరు దానిని ఎప్పటికీ చూడరు; దానిని చూడటానికి మీరు ముందుగా నిర్ణయించబడలేదు.

దేశాలు ఐక్యమగుటను మనము చూస్తున్నాము, లోకము ఐక్యమగుటను మనము చూస్తున్నాము, సంఘాలు ఐక్యమగుటను మనము చూస్తున్నాము. వధువు ఐక్యమగుటను, వాక్యముతో ఐక్యమగుటను మనము చూస్తున్నాము. ఎందుకు? వాక్యము దేవుడైయున్నాడు. మరియు వాక్యము…పెండ్లి కుమారుడు (వాక్యమైయుండగా), మరియు పెండ్లి కుమార్తె (వాక్యమును వినేదానిగా ఉండగా), వారిరువురూ ఒక ఐక్యతలోనికి కూడివచ్చెదరు. ఒక వివాహమువలె వారు ఐక్యమగుదురు. చూడండి, ఒక వివాహము కొరకు వారు సిద్ధపడుచున్నారు, మరియు వారు—వారు ఒక్కటౌతారు. వాక్యము మీరుగా, మరియు మీరు వాక్యముగా అవుతారు. యేసు ఇట్లు చెప్పాడు, “ఆ దినమున మీరు దానిని తెలుసుకుంటారు. తండ్రి ఏమైయున్నాడో అదంతయు, నేను అయ్యున్నాను; మరియు నేను ఏమైయున్నానో అదంతయు, మీరు అయ్యున్నారు; మరియు మీరు ఏమైయున్నారో అదంతయు, నేను అయ్యున్నాను. నేను తండ్రియందును, తండ్రి నాయందును, నేను మీయందును, మరియు మీరు నాయందును ఉన్నారని ఆ దినమున మీరు ఎరుగుదురు.

ఈ ఆదివారమున జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు మేము, ఐక్యమగు కాలము మరియు సూచన 63-0818 అనుదానిని వినుచుండగా, వచ్చి దేవుని స్వరము చుట్టూ మాతో ఐక్యమవ్వవలెనని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

కూటమునకు ముందు చదువవలసిన లేఖనములు:

కీర్తన 86:1-11
పరిశుద్ధ. మత్తయి 16:1-3