23-1119 బయలుపరచబడిన దేవుని యొక్క మర్మము క్రీస్తే

ప్రవక్తకు ఎంతో ప్రియమైనవారలారా,

ఆత్మచేత మరియు సత్యవాక్యముచేత నీకు పుట్టినది—అది వారేయైయున్నారు. మరియు ప్రభువా, నీవు వారిని ఆశీర్వదిస్తావని మరియు క్రీస్తు యొక్క ప్రేమ బంధముతో వారిని దగ్గరగా కట్టియుంచుతావని నేను ప్రార్థిస్తున్నాను.

సిద్ధపడండి, మనము ముందెన్నడూ లేనట్టుగా ఆశీర్వాదములను, అభిషేకములను మరియు ప్రత్యక్షతను పొందుకొనబోవుచున్నాము. మనము దానిని మన అంతరాత్మలలో అనుభూతి చెందగలుగుచున్నాము, ఏదో సంభవించనైయున్నది. సమయము సిద్ధంగా ఉన్నది. మనమెంతో ఆసక్తిపరులమై మరియు ఎంతో గొప్ప ఆశలను పెట్టుకొనియున్నాము. మనల్ని క్రొత్త ఎత్తులకు తీసుకొనివెళ్ళి, మరియు పరిశుద్ధాత్మతో మనలను నింపి, నింపి, మరియు పిదప మరలా నింపబోవుచున్న ఒక వర్తమానము దేవుని యొక్క సింహాసనము నుండి వచ్చుటను వినడానికి ప్రపంచమంతటి నుండి వధువు కూడుకొనుచున్నది.

లేఖనము నెరవేరబోవుచున్నది. హెచ్చరిక ఇవ్వబడియున్నది. తీర్పు సమీపమున ఉన్నది. మన పెండ్లి విందు కొరకు తన వధువును పిలువడానికి ప్రభువు వచ్చుచున్నాడు. ఆఖరి పిలుపు బయలు వెడలినది. దేవుని రాకడ వచ్చియున్నది. ఆయన మనకొరకు వచ్చుచున్నాడు.

మనము దానిని చూసి మరియు దానిని స్వీకరించినట్టి ఆయన యొక్క ముందుగా నిర్ణయించబడిన విత్తనమైయున్నాము. మన పాపములు తుడిచివేయబడినవి, గతించిపోయినవి. అవి యేసు క్రీస్తు యొక్క రక్తపు సిరాలో వేయబడినవి, మరియు అవి ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనబడవు. దేవుడు వాటన్నిటినీ మర్చిపోయాడు. దేవుని సన్నిధిలో మనము, దేవుని యొక్క ఒక కుమారుడు మరియు ఒక కుమార్తెవలె నిలుచున్నాము. మనము ఇప్పుడు అయ్యున్నాము…అవుతాము కాదు; మనము ఇప్పుడు దేవుని కుమారులము మరియు కుమార్తెలమైయ్యున్నాము.

మనము ఒక్క విషయమును గుర్తిస్తాము, అది వాక్యమే. ఈ టేపులు. ఈ వర్తమానము. అవి ఒక్కటేయైయున్నవి.

మరియు ఒకసారి, కేవలం కొద్ది కాలం క్రితం, నీవు ఆ దర్శనమును చూపించినప్పుడు, ఇక్కడున్న ఈ చిన్న ఆలయములో, ఆహారమును నిలువచేయుటను గూర్చి, ఇది మాత్రమే అవసరమయ్యే ఒక సమయం వస్తుందని చూపించావు…“ఆ సమయము కొరకు ఇక్కడ ఈ ఆహారమును నిలువ చేయము

ఇదే ఆ సమయము. ఇదే ఆ ఆహారము. మనమే ఆ ప్రజలము. మనమే ఆ ప్రత్యక్షతను కలిగియున్నాము.

ఇతరులు ఈ టేపు పరిచర్యయొక్క ప్రాముఖ్యతను తప్పిపోవచ్చును. మనము తప్పిపోము. ఇదే మన జీవితమైయున్నది, మన సర్వము ఇదేయైయున్నది. ఇది మనకు జీవము కంటే విలువైనది. మనకు దేని గూర్చియైనా ఒక ప్రశ్న ఉన్నప్పుడు, దానిని మనకు వివరించమని, లేదా దానిని మన కోసం వెదకిపెట్టమని మనము ఎవరిని అడుగము. మనము గ్రహించడంలో విఫలమైనా లేదా మనకు ఒక ప్రశ్న ఉన్నా దేవునియొక్క దూత ఏమి చేయమని మనకు సూచించాడో సరిగ్గా దానినే మనము చేస్తాము.

మీకు అది అర్థమైనదా? మీరు విఫలమైతే, తిరిగి మరలా ఈ టేపుయొద్దకు రండి. నేను ఎంతకాలం మీతో ఉంటానో నాకు తెలియదు. గుర్తుంచుకోండి, ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యొక్క, సత్యమైయున్నది. ఇది సత్యము. ఇది లేఖనమైయున్నది.

మీరు విఫలమైతే, తిరిగి టేపు వద్దకు రండి.

మా మీద కోపానికి రాకండి, ఆయనే దానిని చెప్పాడు…అదియేగాక, ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యొక్క సత్యమైయున్నది. దానిలో ఒక భాగము, దానిలో కొంచెము, లేదా దానిలో ఏది అభిషేకించబడినది మరియు ఏది అభిషేకించబడలేదని ఎవరైనా అనువాదం ఇచ్చినవి మాత్రమే అని ఆయన చెప్పలేదు. ఈ టేపులు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నవి.

మీకు అది అర్థం కాకపోవచ్చును, లేదా దానిని గ్రహించలేకపోవచ్చును, లేదా ఇంకా అది మీకు బయలుపడి యుండకపోవచ్చును. కాని మాకైతే, ఆయన తన ప్రవక్త ద్వారా మాకు చెప్పుచున్న విషయము ఇదేయైయున్నది.

మీరు మీ భార్యకు, మీరు వివాహం చేసుకోబోయే అమ్మాయికి విషయాలను ఎలా చెప్తారో మీకు తెలుసు కదా. మీరు ఆమెను ఎంతగానో ప్రేమిస్తారు, మీరు ఆమెకు రహస్యాలను చెప్తారు, మరియు ఆమెను అక్కున చేర్చుకొని, మరియు ప్రేమింపజేసుకొని మరియు ఆ విధంగా ఉంటారు. అది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు.

దేవుడు, క్రీస్తు, సంఘానికి దానినే చేయుచున్నాడు. చూశారా? ఆయన ఆమెకు రహస్యాలను, సరిగ్గా ఆ రహస్యాలను తెలియజేయుచున్నాడు. ఈ సరసాలాడేవారికి కాదు; ఆయన భార్యకి అని నా ఉద్దేశ్యమైయున్నది.

మరియు మనము దానంతటినీ పొందుకొనుచున్నాము. ఓ ఒక పెండ్లి కుమార్తె తన వివాహానికి ముందు ఎంత సంతోషంగా మరియు అత్యుత్సాహంగా ఉంటుంది కదా. మనం అసలు కుదురుగా ఒక చోట నిలబడలేము. మనము నిమిషాలను….క్షణాలను లెక్కబెట్టుచున్నాము. ఆయన మనలను ఎంతగా ప్రేమించుచున్నాడన్నది ఆయన మనకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాడు.

ముందెన్నడూ లేని విధంగా సాతానుడు మనపై దాడి చేస్తూనే ఉంటాడు, అయితే వాడు సిద్ధంగా లేని ఒక విషయమేమిటంటే, మనమెవరమో మనకు ఇప్పుడు తెలుసు. ఇక ఎటువంటి సందేహము లేదు, మనము పలుకబడిన వాక్యమైయున్నాము. మనము వాక్యమును పలుకగలము, మరియు మనము పలుకుచున్నాము. సాతానుడికి జవాబు మన దగ్గర ఉన్నది. దేవుడు తనను తాను నిర్ధారించుకున్నాడు. దేవుడు తనను తాను ఋజువు చేసుకున్నాడు. మనము ఆయనయొక్క సజీవ వాక్యమైయ్యుండి మరియు ఆయన మనకిచ్చిన అధికారమంతటితో పలుకుచున్నాము.

మరియు ఈనాడు ఆయన ఇక్కడ, తన వాక్యములో ఉన్నాడు, అక్కడ చేసిన అదే కార్యమును నెరవేర్చుచున్నాడు.. ఆమె వేరొక శిరసత్వమును గుర్తించదు. లేదు, అయ్యా. ఏ బిషప్పు లేడు, వేరెవ్వరు లేరు. ఆమె ఒక్క శిరసత్వమును మాత్రమే గుర్తిస్తుంది, అది క్రీస్తే, మరియు క్రీస్తు వాక్యమైయున్నాడు. ఓ, మై! ఫ్యూ! నేను దానిని ప్రేమించుచున్నాను. హ! అవును, అయ్యా.

మనము ఒక రాజ్యానికి చెందియున్నాము, మరియు దేవునియొక్క వాక్యము మన స్వంత జీవితములో ఆత్మయు మరియు జీవమునైయుండుటయే ఆ రాజ్యము. కావున, మనము ఆయనయొక్క జీవించుచున్న వాక్యమైయున్నాము.

నా స్నేహితులారా, దానిని స్వీకరించి మరియు దానిని నమ్మడానికి మీరు నిజమైన ప్రత్యక్యతను కలిగియుంటే ఇదే దానంతటిని చెప్పుచున్నది.

ఇప్పుడు గమనించండి, ప్రాచీన ఇశ్రాయేలుకు మాదిరిగా, ఒకే విధంగా, ఒక్క శిరసత్వము క్రింద ఐక్యమైయ్యుండుట. ఇప్పుడు దానిని మీరు పొందుకొనుచున్నారా? పాతకాలపు ఇశ్రాయేలు వలె; ఒక్క దేవుడు, తాను వాక్యమైయున్నాడని, అగ్నిస్తంభముచేత నిర్ధారించబడి, మరియు ఒక ప్రవక్త ద్వారా తనను తాను బయలుపరచుకున్నాడు. అదే దేవుడు, అదే అగ్నిస్తంభము, అదే విధానం; ఆయన తన విధానాన్ని మార్చుకోలేడు. అది…అది ఎంతో పరిపూర్ణముగా ఉన్నది.

ప్రవక్త…అది బాగుగా అర్థమగును గాక. ఆ దినమునకు వాక్యమైయ్యున్నాడని, ఒక్క దేవుడు, ఒక ప్రవక్త ద్వారా, ఒక అగ్నిస్తంభముచేత నిర్ధారించబడినాడు, మరియు ఆయన మారజాలడు.

నేను ఇలా చెప్పుకుంటూ పోవచ్చు, మరియు కొటేషన్ వెంబడి కొటేషన్ ను తీసుకొని మనము ఆనందించుచు సహవాసము చేయగలము; మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు దీనిని వినుచుండగా, మనము సహవాసము కలిగియుంటాము: బయలుపరచబడిన దేవుని యొక్క మర్మము క్రీస్తే 63-0728.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

కూటమునకు ముందు చదువవలసిన లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 16:15-17
పరిశుద్ధ. లూకా 24వ అధ్యాయము
పరిశుద్ధ. యోహాను 5:24 / 14:12
1 కోరింథీ 2వ అధ్యాయము
ఎఫెసీ అధ్యాయము 1
కొలొస్సీ అధ్యాయము 1
ప్రకటన 7:9-10