23-1112 ముందు అతడిని హెచ్చరించకుండా దేవుడెన్నడూ మనుష్యుని తీర్పులోనికి పిలువడు

ప్రియమైన చిన్న బ్యాలెన్సు స్ప్రింగు, ముఖ్యమైన స్ప్రింగు, రైతు మరియు గృహిణి,

మీరు చేయవలెనని దేవుడు మీకిచ్చినదేదైనా, మీరు దానిపై గృహనిర్వాహకత్వమును కలిగియున్నారు. మీరు దాని విషయమై దేవునికి జవాబునివ్వవలసియున్నారు. మీరు ఎంత అల్పమైనవారని శత్రువు మీకు చెప్పినా గాని మీరు దేవునికి ఎంతో ప్రాముఖ్యమైయున్నారు, ఎంతగా అంటే మీరు లేకుండా ఆయన యొక్క గొప్ప గడియారము నడువదు.

ఆయన మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మిమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, మరియు తన గొప్ప అంత్యకాల వర్తమానము యొక్క ప్రత్యక్షతను మీకు అనుగ్రహించాడు. ఆయనకు మీపై 100% నమ్మకమున్నది. మీరు ఖచ్చితంగా యేసు క్రీస్తు యొక్క వధువైయున్నారు, ఆయన యొక్క ప్రియురాలైయున్నారు, మరియు ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు.

దేశములన్నిటిలో ఉన్న ప్రజలను ఆయన స్థిరంగా ఇట్లు హెచ్చరించాడు, “పశ్చాత్తాప పడుడి, లేదా నశించిపోతారు”, “వాక్యమునొద్దకు తిరిగి రండి”, “సిద్ధపడండి, ఏదో సంభవించనైయున్నది.” చిట్టచివరకు ఆ ఘడియ వచ్చియున్నది. సరిగ్గా ఆయన వస్తాడని మనకు వాగ్దానం చేసినట్లే, దేవుడు తన వధువు కొరకు వచ్చుచున్నాడు. ఆయన చక్రము నుండి తన చక్రమును పిలిచాడు.

“ఆయన జరుగుతుందని ఏదైతే చెప్పాడో, అది జరగలేదు. సమస్త కార్యములు అలాగే ఉన్నవి,” అని చెప్పుచూ, ఈనాడు అనేకులు దేవుని యొక్క గొప్ప అంత్య-కాల వర్తమానము నుండి పడిపోయారు. దేవుని ప్రవక్తల యొక్క అనేక ప్రవచనములు నెరవేరడానికి ముందే అనేక తరములు గడిచిపోయినవి. మరి అయిననూ, అక్షరాల, సరిగ్గా వారు చెప్పినట్లే, అవి సంభవించినవి.

ఆయనయొక్క బైబిలు గ్రంథము మనకిట్లు చెప్పుచున్నది: “నోవహు దినములలో జరిగినట్లు, మనుష్య కుమారుని రాకడలో జరుగును”. దేవుడు ఆ గొప్ప జలప్రళయ కాలములో ప్రపంచమును నాశనము చేయడానికి తీర్పును పంపుటకు ముందు, దేవుడు లోకానికి ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త ఏమి చేశాడు?

ఆయన ప్రజలను ఆ సమయము కొరకు సిద్ధపరిచాడు. నోవహు ప్రజలను సిద్ధపరిచాడు, మరియు అది తీర్పుకు ముందు ఒక కనికరపు పిలుపైయున్నది.

నోవహు దేనిగూర్చియైతే ప్రజలను హెచ్చరించాడో ఆ తీర్పు రావడానికి ముందే అతడు వారిని సిద్ధపరిచాడు. అది ఆ దినమునకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది.

దేవుడు ఎన్నడూ తన ప్రణాళికను మార్చుకోడని దేవుని ప్రవక్త మనకు చెప్పాడు. ఆయన అప్పుడు ఏమి చేసాడో, దానినే ఈనాడు చేస్తాడు. మనము కేవలం ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గాముతో నిలిచియుండి మరియు ప్లేను నొక్కుతాము.

అప్పుడన్నట్లే, మనము దేవుని ప్రవక్తను అధికంగా హెచ్చిస్తున్నామని ప్రజలు అంటారు; అయితే అది విలియమ్ బ్రెన్హామ్ కాదుగాని, అది పరిశుద్ధాత్మయైయున్నాడు. మనము, ఆమేన్, అని చెప్తాము, మనము మనుష్యుడు చెప్పేది వినము, మనము కేవలం ఆయన చెప్పినదివింటాము.

పరిశుద్ధాత్మయే ఈ ఘడియకు ప్రవక్తయైయున్నాడు; ఆయన తన వాక్యమును నిర్థారించుచూ, దానిని ఋజువు చేయుచున్నాడు. మోషే యొక్క ఘడియకు పరిశుద్ధాత్మయే ప్రవక్తయైయున్నాడు. మీకాయా యొక్క ఘడియకు పరిశుద్ధాత్మయే ప్రవక్తయైయున్నాడు. వాక్యమును వ్రాసిన పరిశుద్ధాత్మయే, వచ్చి, మరియు వాక్యమును నిర్థారిస్తాడు.

అయితే గడిచిన వారమే సహోదరుడు బ్రెన్హామ్ దీనిని మీకు చెప్పారు;

ఇప్పుడు, చూడండి, మీరు ఏమి వినుచున్నారో దాని విషయమై జాగ్రత్తపడవలెనని నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని కోరాను. చూశారా? దానిలో కేవలం మానవ దృష్టినుండియైనవి అనేకములున్నవి.

దేవుడు నాకు దానిని చెప్పాడని నేను చెప్పడంలేదు. “నేను” దానిని నమ్ముచున్నాను, చూడండి. మరియు ఆ విధంగా చేయకూడదని నేను నమ్ముచున్నాను.

నాకు మరియు నా ఇంటివారి కొరకైతే, ఏ ఇతర సేవకుడు, బిషప్పు, లేదా ఏ మనుష్యుని కంటెను దేవుని యొక్క ఏడవ దూత వర్తమానికుడు ఏమి నమ్ముతాడో, ఏమి తలంచుతాడో లేదా కనీసం ఏమి అనుభూతి చెందుతాడో, దానినే నేను తీసుకుంటాను.

దేవుని ప్రవక్త నమ్ముచున్నది, అనుభూతి చెందుచున్నది, లేదా కనీసం తలంచేది, ప్రేరేపించబడినదో కాదో అని చూచుటకు దేవుడు ఎన్నడైనా ఎవరిని పంపాడు?…ఎవరని నేను అనుకొనుచున్నానో మీకు చెప్పనివ్వండి.

కోరహును చూడండి, దేవుడు ఒక వర్తమానముతో మోషేను పంపిన దినములలో, కోరహు మరియు దాతాను ఆలోచించి, మోషే వద్దకు వచ్చి, మరియు ఇట్లన్నారు, “ఇప్పుడు, ఒక్క నిమిషము ఆగుము, నిన్ను నీవు అధికముగా హెచ్చించుకొనుచున్నావు! సముద్రతీరాన ఉన్న ఏకైక స్పటికము నీవొక్కడివే అని; నీటి గుంటలోని బాతు, నీవొక్కడివే అని నీవు అనుకొనుచున్నావా. పరిశుద్ధులైన ఇతర ప్రజలు కూడా ఉన్నారని, నేను నీకు తెలియజేసెదను!”

హెచ్చరిక, తీర్పు సమీపమున ఉన్నది. అసలైన వాక్యము నొద్దకు తిరిగి రండి. మన దినమునకు నిర్థారించబడిన దేవుని స్వరమునొద్దకు తిరగి రండి. దేవుని ప్రవక్త వద్దకు తిరిగి రండి. ఈ వర్తమానమునొద్దకు, ఆయన స్వరమునొద్దకు తిరిగి రండి. అది మీకు మొట్టమొదటి విషయము మరియు అత్యంత ముఖ్యమైన విషయమై ఉండవలసియున్నది.

ఈ వర్తమానమును బోధించుటకు మరియు ప్రసంగించుటకు, ఇతరులు ఒక స్వరమును, మరియు ఒక పిలుపును కలిగియున్నారనుటలో ఎటువంటి సందేహము లేదు. అయితే మీరు దేవుని వధువైయ్యుండగోరిన యెడల, మీ గృహములలో, మీ కారులలో, మరియు ముఖ్యంగా, మీ సంఘాలలో మీరు వినగలిగే ఈ టేపులు, ఆ స్వరము, మీకు ప్రాముఖ్యమైన స్వరమైయ్యుండవలసియున్నది.

ప్రభువు రాకడ సమీపంలో ఉన్నదని దేవుని ప్రవక్త లోకాన్ని హెచ్చరిస్తుండగా, ఆదివారమునాడు, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., సమయమప్పుడు, వచ్చి మాతో కలిసి ఆ స్వరమును వినండి. ఇదే చివరి సారి కావచ్చును.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

ముందు అతడిని హెచ్చరించకుండా దేవుడెన్నడూ మనుష్యుని తీర్పులోనికి పిలువడు 63-0724.

కూటముకు ముందు చదువవలసిన లేఖనములు:

యెషయా 38:1-5
ఆమోసు 1 అధ్యాయము