23-1105 ఆయన శ్రద్ధ వహించుచున్నాడు. మీరు శ్రద్ధ వహించుచున్నారా?

ప్రియమైన సువార్త పిల్లలారా,

మనము భూమి మీద నడిచినవారిలో అత్యంత ధన్యులైన ప్రజలమైయున్నాము. దేవుని చేత ఎన్నుకోబడిన ఏడవ దూత వర్తమానికుడు మనతో ఈ మాటలను చెప్పుటను మనము అసలు ఊహించగలమా:

నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఓ, మీరు నా స్వంత పిల్లలు అన్నట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మరియు మీరు సువార్తలో నా పిల్లలైయున్నారు. సువార్త ద్వారా, క్రీస్తునకు నేను మిమ్ములను కనియున్నాను.

దేవుడు మన పట్ల ఎంతగా శ్రద్ధవహిస్తున్నాడంటే మనతో నడుచుచున్నది కేవలం ఈ వ్యక్తి కాదు గాని అది సరిగ్గా ఆయన పైన ఉన్నది దేవుడే అని మనకు తెలియజేయుటకు, ఆయన యొక్క నిర్ధారించబడిన ప్రవక్తను ఒక అగ్ని స్థంబపు సూచనతో మన వద్దకు పంపియున్నాడు. మార్గమున నడిపించుచున్నది ఆయనేయైయున్నాడు.

ఆయన మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు గనుక, ఆ గొప్ప తీర్పు రావడానికి ముందే, రానున్న తీర్పులన్నిటి నుండి మనము విడిపించబడునట్లు ఆయన ఒక మార్గమును కలుగజేసెను. ఆ తప్పించుకునే మార్గము కేవలం ఎన్నుకొనబడిన, మనకు మాత్రమేయై యున్నది. మనము మాత్రమే ఈ జీవ కణమును అంగీకరించియున్నాము. దానిని చూచుటకు మనము మాత్రమే ముందుగా నిర్ణయించబడినాము. మనము మాత్రమే ఈ గొప్ప టేపు పరిచర్య యొక్క ప్రత్యక్షతను కలిగియున్నాము.

ఆయన ఈ పరిచర్య కొరకు మరణించాడు. ఈ దినమున పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండి ఈ కార్యములను చూపించుట కొరకు ఆయన మరణించాడు. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించాడు. ఆయన దానిని ఇక్కడికి తేసుకొనివచ్చుటకు శ్రద్ధ వహించాడు. ఆయన ప్రకటన చేయుటకు శ్రద్ధ వహించాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించాడు గనుక ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించాడు. ఆయన దీనిని చేసేంతగా, దీని కొరకు, ఈ దినమున ఈ పరిచర్యను జరిగించుటకు పరిశుద్ధాత్మను పంపేంతగా ఆయన శ్రద్ధవహించాడు.

మీరు నిత్యజీవమునకై ముందుగా నిర్ణయించబడిన యెడల, మీరు దానిని వింటారు మరియు దానిలో ఆనందిస్తారు. ఇది మీకు ఆదరణయై యున్నది. ఇది మీ జీవితమంతా మీరు తృష్ణగొనిన విషయమైయున్నది. ఇది అమూల్యమైన ముత్యమైయున్నది. మనము ఈ వర్తమానము కొరకు, ఈ స్వరము కొరకు సమస్తమును విడిచిపెడతాము. ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు మనతో మాట్లాడుటయైయున్నది.

ఎవ్వరూ మనల్ని బుజ్జగించనక్కర్లేదు, మనము విశ్వాసులమైయున్నాము, మనయొద్ద నుండి దానిని వేరుచేయునది ఏదియూ లేదు. ఎవరేమి చెప్పినా గాని మనము లెక్కచేయము, మనము ప్రతీ మాటను నమ్ముచున్నాము.

ఆయన మనకొరకు ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నాడు; మనకు స్వస్థత అవసరమైన యెడల, మనం కేవలం ఆయన వాక్యమును మన హృదయ లోతులనుండి నమ్ముతాము. అప్పుడు ఇక ఏ సలహాదారుడు, ఏ ఆదరించువాడు, ఏ వైద్యుడు, ఏ ఆసుపత్రి, ఏ పరిశీలన ఏమి చెప్పినా లెక్కలేదు గాని, మనము కేవలం ఆయన వాక్యమును నమ్ముతాము. మనము దానిని ఎరిగియున్నాము! దాని విషయమై ఇంకేమియు చెప్పనవసరంలేదు; మనము దానిని ఎరిగియున్నాము.

ఆయన తన ప్రవక్త చేత తన వధువు కొరకు ఆహారమును భద్రము చేపించేంతగా ఆయన మన పట్ల శ్రద్ధవహించాడు. ఆయన ప్రతీ కాపరికి, సేవకునికి, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల గుంపుకు వారి సహవాసములో లేదా వారి గుంపులలో ఆయన సూచనలను వెంబడించి మరియు ఈ టేపులను ప్లే చేయమని కూడా ఆయన సూచించాడు.

ఈ ఉదయము, ప్రార్థన చేపించుకోబోయే మీరు, మరియు ప్రపంచవ్యాప్తంగా, ఈ టేపును వినుచున్న మీరు, దీనిని చేస్తే చాలు, మరియు ఈ టేపు ప్లే చేయబడిన తర్వాత, మరియు ఒక సహవాసములో, అడవులలో ఉన్న గుంపులు లేదా మీరెక్కడున్నా గాని అక్కడ దానిని ప్లే చేయుచున్న ఆ సేవకుడు లేదా ఆ వ్యక్తి, మొదటిగా మీ యొక్క ఒప్పుకోలును స్పష్టంగా తెలియజేసి, మరియు పిదప మీ హృదయములో, విశ్వాసము తప్ప, మరేదియు లేకుండా వచ్చి, మరియు ప్రార్థన చేపించుకున్నయెడల, మరప్పుడు ఆ ఔషదము పని చేస్తుంది.

సంఘములో టేపులను ప్లే చేయమని ప్రవక్త ఎన్నడూ చెప్పలేదని మన విమర్శకులు చెప్తారని నేను అనుకున్నాను? వారి సంఘాలలో మాత్రమే కాదు గాని, అడవులలోనైనా లేదా మీరు ఎక్కడున్నా గాని…టేపులు ప్లే చేయండని ఆయన చెప్పాడు.

దేవుడు తన నిర్ధారించబడిన ఏడవ దూత వర్తమానికుడి ద్వారా పలికినదానికి మీరు లోబడి మరియు ఖచ్చితంగా దాని ప్రకారంగా చేసినయెడల, అప్పుడు మీరెన్నడూ కలిగిలెనటువంటి ఘనమైన విశ్వాసమును మీరు కూడా పొందుకోగలరు.

నేను, నేను…దీనిని సమీపించడానికి, మొదటిగా, ప్రజలు విశ్వాసముతో అభిషేకించబడవలసియున్నది. మీరు—మీరు, మీరు విశ్వాసమును కలిగిలేనియెడల, అప్పుడు అసలు—అసలు ప్రార్థన చేపించుకొనుటకు రావలసిన అవసరమే లేదు, ఎందుకనగా దానికి మీ విశ్వాసము మరియు నా విశ్వాసము అవసరమైయున్నది; ఆయనను నమ్ముటకు నా విశ్వాసము, ఆయనను నమ్ముటకు మీ విశ్వాసము అవసరమైయున్నది.

మనము అట్లు ఊహించుట లేదు, లేదా అంచనా వేయడం లేదు, లేదా ఆశించుట లేదు. టేపులు ఈ దినము కొరకై దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది. అది విలియమ్ మారియన్ బ్రెన్హామ్ అను పేరుగల ఒక మనుష్యుని యొక్క మాటలు కావుగాని, అవి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బయలుపరచబడిన మాటలైయున్నవి. అది ఖచ్చితంగా, “ఆమేన్!” అది మన యొక్క అంతిమమైయున్నది. అది సత్యమైయున్నది మరియు అది సత్యము గాక మరొకటి కాదు.

మరియు మీరు దేవుని యొక్క అంతిమమును, ఆయన వాక్యమును, ఒక ఫలానా విషయముపై ఒక వాగ్దానమును మీరు కనుగొనినయెడల మొదట అది దేవుని యొక్క వాక్యమని మీరు తెలుసుకోవలసియున్నది, నెరవేర్చబడుచున్నట్లు మీరు చూస్తున్న ఆ విషయము దేవుడే అని మీరు తెలుసుకోవలసియున్నది. అక్కడ—అక్కడ—ఇక “బహుశా అట్లుండవచ్చును, అది ఆ విధంగా జరుగవచ్చును, అది జరుగుతుంది అన్నట్లు అగుపించుచున్నది,” అనేవి ఇక ఉండవు. “అది దేవుడే!” పిదప మీరు ఆ స్థానమునకు వచ్చినపుడు, మరప్పుడు అది అమూల్యమైన ముత్యమైయున్నది, దానికి వ్యతిరేకంగా మీకు చెప్పుచున్న దేనినుండియైనా లేదా ఎవ్వరినుండియైనా మీరు దూరమవ్వవలసియున్నది. మనుష్యుడు ఏమి సాధించాడన్నదానివైపు మీరు చూడకూడదు.

ఈ ఆదివారము మనము ఒక గొప్ప పెద్ద ప్రేమ విందును కలిగియుండబోవుచున్నాము. దేవుని యొక్క నిర్ధారించబడిన ఏడవ దూత మనకు చెప్పినదానిని మనము చేయబోవుచున్నాము: ప్లే నొక్కి మరియు లోబడతాము.

మనకు అవసరమైనది ఏదైనా, మనము దానిని పొందుకుంటాము. ఆయనను నమ్మేందుకు ఆయన విశ్వాసముతోపాటు మనము మన విశ్వాసమును ఉంచుతున్నాము గనుక మనము దానిని పొందుకోబోవుచున్నాము. అప్పుడు మనమందరము ఇట్లు చెప్తాము:

ఈ సమయము నుండి, నా సమస్యలు తీరిపోయినవని నా హృదయములో ఏదో చెప్పుచున్నది. నేను—నేను బాగయ్యాను, నేను బాగవ్వబోవుచున్నాను అనియా”? మీరు దానిని నమ్ముచున్నారా? మీ చేతులను పైకెత్తండి, “నేను దానిని నమ్ముచున్నాను!” దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

దేవుడు శ్రద్ధవహించుచున్నాడు గనుక, మీరు వచ్చి మాతో చేరవలెనని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను; లేదా మీ కాపరిని, మీ నాయకుడిని, ప్రవక్త యొక్క సూచనలను వెంబడించుటకు ప్రోత్సహించండి, మరియు ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., సమయమప్పుడు మేము దీనిని వినుచుండగా దేవుని యొక్క ఏడవ దూత వర్తమానికుడు దేవుని యొక్క వాక్యమును పలుకుటను విని మరియు మీకు అవసరమైయున్న ప్రతిదానిని పొందుకోవలెనని కోరుచున్నాను: 63-0721 ఆయన శ్రద్ధ వహించుచున్నాడు. మీరు శ్రద్ధ వహించుచున్నారా?

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

కూటముకు ముందు చదువవలసిన లేఖనములు:

పరిశుద్ధ. యోహాను 5:24 / 15:26
1 పేతురు 5:1-7
హెబ్రీ 4:1-4

గమనిక: నవంబర్ 5న, ఈ ఆదివారముతో జఫర్సన్ విల్ కు DST సమయము ముగిసిపోతుంది. దయచేసి మీ ప్రాంతములో టేపును ప్రారంభించుటకు మీ స్థానిక సమయమును సరిచూసుకోండి.