23-1029 ఒక ఖైదీ

వర్తమానము: 63-0717 ఒక ఖైదీ

PDF

BranhamTabernacle.org

ప్రియమైన ఖైదీలారా,

మీరు నోవహు దినములలో, లేదా మోషే దినములలో జీవించియున్నయెడల అప్పుడు మీరు జీవించియుండే జీవితమును, ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం ప్రతిబింబిస్తుంది, ఎందుకనగా మీరు అదే ఆత్మతో నింపబడియున్నారు. ఇప్పుడు మీలోనున్న అదే ఆత్మ అప్పుడు ప్రజలలో ఉన్నది.

మీరు నోవహు దినములలో జీవించియున్నయెడల, అప్పుడు మీరు ఎవరి పక్షమున నిలిచియుండేవారు? ఓడను నిర్మించి మరియు ప్రజలను నడిపించడానికి నోవహు దేవుని చేత ఎన్నుకోబడినవాడని నమ్ముచూ మీరు అతనితో కూడ ఓడలోనికి వెళ్ళియుండేవారా, లేదా, “నేను కూడా ఒక ఓడను నిర్మించగలను. నేను కూడా ఒక మంచి నావికుడను మరియు ఒక మంచి ఓడ నిర్మాణకుడనైయున్నాను” అని చెప్పియుండేవారా?

మోషే దినములలో మీరు జీవించియున్నయెడల విషయం ఏమిటి? మీరు మోషేతో నిలిచియుండి మరియు ప్రజలను నడిపించడానికి దేవుడు అతడిని ఎన్నుకున్నాడని నమ్మియుండేవారా, లేదా, “మేము కూడా పరిశుద్ధులమే, మేము చెప్పవలసిన విషయం ఒకటి ఉన్నది. దేవుడు మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు” అని కోరహు దాతానులు చెప్పినప్పుడు వారితో వెళ్ళియుండేవారా?

మనలో ప్రతీ ఒక్కరు, ఈ దినమున, జీవ మరణముల మధ్య ఒకదానిని ఎన్నుకోవలసియున్నది.మీరు దేని పక్షమున ఉన్నారని మీరు చెప్పేది నేను లెక్కచేయను. అనుదినము, మీరు ఏమి చేస్తారో, అదే, మీరు ఏమైయున్నారన్నది ఋజువు చేస్తుంది. మేము ప్రతీ రోజు ప్లే ని నొక్కుతాము.

మీరు ప్రతీ రోజు వాక్యములో ఉంటున్నారా? మీరు ప్రార్థించుచు, మీరు చేయుచున్న ప్రతిదానిలో ప్రభువు యొక్క పరిపూర్ణమైన చిత్తమును వెదకుచున్నారా? మీరు ప్రతీ రోజు ప్లేను నొక్కి మరియు దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరమును వినుచున్నారా? ప్లే నొక్కడం ఖచ్చితంగా అవసరమని మీరు నమ్ముచున్నారా? టేపులలో ఉన్న ఆ స్వరము ఈ దినమునకైన దేవుని యొక్క స్వరమని మీరు నమ్ముచున్నారా?

మాకైతే, దానికి జవాబు అవును. మేము దేవుని యొక్క వాక్యమునకు, ఆయన వర్తమానమునకు, మన దినమునకై దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరమునకు ఖైదీలమైయున్నామని ప్రపంచానికి చెప్పుచున్నాము. అవును, ప్లేను నొక్కడాన్ని మేము మా హృదయపూర్వకంగా నమ్ముచున్నాము. అవును, 7వ సంఘకాల వర్తమానికుడు వధువును నడిపించడానికి పిలువబడినాడని మేము నమ్ముచున్నాము. అవును, టేపులలో ఉన్న ఆ స్వరమే వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరమైయున్నది.

దేవుని యొక్క ప్రేమ, ఆయన స్వరము, ఈ వర్తమానము ఎంతో మహత్తరమైనది, అది మాకు, దాని నుండి మేము తొలగిపోలేనంతటి, ఒక గొప్ప ప్రత్యక్షతయైయున్నది. మేము దానికి ఒక ఖైదీయైపోయాము.

మేము సమస్తమును త్యజించుకున్నాము. ఎవరు ఏమి చెప్పినాగాని, మేము దీనికి కట్టుబడియున్నాము. మేము అసలు దానినుండి తొలగిపోలేనట్లు దానిలో ఏదో విషయమున్నది. అది మా జీవితముల యొక్క సంతోషమైయున్నది. అది లేకుండా మేము బ్రతుకలేము.

ప్రభువునకు మరియు ఆయన వర్తమానమునకు ఒక ఖైదీగా ఉండుటకు, మేము ఎంతో సంతోషించుచున్నాము, మరియు కృతజ్ఞులమైయున్నాము, మరియు ఎంతో అతిశయపడుచున్నాము; ఏలయనగా అవి ఒక్కటేయైయున్నవి. అది మాకు జీవము కంటె ఎక్కువైయున్నది. రోజురోజుకి మేము ఆయన వధువు అన్నది మాకు మరింత తేటగా మరియు మరింత వాస్తవముగా మారుచున్నది. మేము ఆయన యొక్క పరిపూర్ణ చిత్తములో ఉన్నాము. మేము వాక్యమును పలుకగలము, ఏలయనగా మేము శరీరధారియైన వాక్యమైయున్నాము.

క్రీస్తు మరియు ఈ ఘడియ కొరకైన ఆయన వర్తమానముతో తప్ప మేము మరి దేనితోను సంబంధము కలిగిలేము; కనీసం మా తండ్రితోనైనా, మా తల్లితోనైనా, మా సహోదరునితోనైనా, మా సహోదరితోనైనా, మా భర్తతోనైనా, మా భార్యతోనైనా, ఎవరితోనైనా సంబంధమును కలిగిలేము. మేము క్రీస్తుతో, మరి ఆయనతో మాత్రమే సంబంధమును కలిగియున్నాము. మేము ఈ వర్తమానముతో, ఈ స్వరముతో, సంబంధము కలిగియుండి మరియు జోడించబడియున్నాము, ఏలయనగా ఇది ఈ దినమునకు దేవుడు ఏర్పాటుచేసిన మార్గమైయున్నది, మరియు వేరే ఏ మార్గమూ లేదు.

మేము ఇకమీదట ఎంతమాత్రము మా స్వంత స్వార్ధమునకు, మా స్వంత ఆశయమునకు ఖైదీలము కాము. మమ్మల్ని మేము పూర్తిగా ఆయనకు అప్పగించుకొని మరియు ఆయనకు జోడించబడియున్నాము. మిగతా ప్రపంచమంతా ఏమనుకున్నాగాని, మిగతా ప్రపంచమంతా ఏమి చేసినాగాని, మేము ప్రేమ సంకెళ్ళతో, ఆయనకు మరియు ఆయన స్వరమునకు జోడించబడియున్నాము.

ఖైదీలుగా ఉన్నందుకు మేము ఎంతో కృతజ్ఞులమైయున్నాము. తండ్రీ, ప్రతీ దినములో, ప్రతీ నిమిషములోని, ప్రతీ క్షణము, ఏమి చేయవలెనో నాకు చెప్పుము. మేము చేసే ప్రతిదానిలో, మేము మాట్లాడే ప్రతి విషయములో, మరియు మేము ప్రవర్తించే విధానములో నీ స్వరము మమ్మల్ని నిర్దేశించును గాక. మేము నిన్ను తప్ప మరిదేనిని తెలుసుకొనగోరడం లేదు.

ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., సమయమప్పుడు ఒక ఖైదీగా ఎలా మారాలి అనుదానిని మేము వినుచుండగా వచ్చి మాతో కూడ చేరండి: ఒక ఖైదీ 63-0717.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

వర్తమానమునకు ముందు చదువవలసిన లేఖనములు:

ఫిలేమోను 1:1

పీ ఎస్: సహోదరుడా బ్రెన్హామ్, మీరు ఫిలేమోను అని ఉచ్చరించే విధానము మాకు చాలా ఇష్టం, వధువుకు అది పరిపూర్ణమైనది.