23-1210 పరిపూర్ణ విశ్వాసము

వర్తమానము: 63-0825E పరిపూర్ణ విశ్వాసము

PDF

BranhamTabernacle.org

ప్రియమైన పరిపూర్ణ విశ్వాసపు వధువా,

మన విశ్వాసము వచ్చేది వినుట ద్వారాయైయున్నది, అది వాక్యమును వినుటద్వారా యైయున్నది. వాక్యము ప్రవక్త వద్దకు వస్తుంది.

ప్రవక్త అనగా:

శరీరధారియైన వాక్యము! హల్లేలూయా! ఒక పరిపూర్ణమైన ఎత్తబడుట కొరకు మీకు ఒక పరిపూర్ణమైన విశ్వాసమును తీసుకువచ్చుటకు, భౌతికమైన సూచనలు, వస్తుపరమైన సూచనలు, లేఖన సంబంధమైన సూచనల ద్వారా, వాక్యము పరిపూర్ణముగా, మానవ శరీరంలో పనిచేయుటయైయున్నది.

మనకు పరిపూర్ణమైన విశ్వాసమును ఇచ్చుటకు దేవుని యొక్క నిర్ధారించబడిన ఏకైక స్వరము మాట్లాడి మరియు మానవ శరీరముగుండా తన వాక్యమును బయలుపరచుటను వినడం ద్వారా వాక్యము మనకు ఏమి చేయమని చెప్పినదో సరిగ్గా దానినే మనము చేయుచున్నాము.

మీరు…ఆత్మ చెప్పేది గాక మరేదియు మీ చెవులకు వినపడదు. చూశారా? “చెవిగలవాడు (వినేవాడు), ఆత్మ సంఘములతో చెప్పుచున్నదానిని చూస్తాడు”; వినే సాధనమును కలిగియున్నవాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్నదానిని పట్టుకుంటాడు. చూశారా?

మనమే ప్రతీ వాక్యమును పట్టుకొనుచు మరియు నమ్ముచున్నటువంటి ఆయన యొక్క వినికిడి సాధనమైయున్నాము. ఆయన మనకు ఇట్టి ఆజ్ఞలను ఇచ్చినప్పుడు: “కేవలం టేపులలో ఉన్నదానినే చెప్పండి. నేను మీకు దేవుని స్వరమునైయున్నాను. మీరు నన్ను మీ యొక్క సంఘకాపరి అని పిలుస్తారు, నేను అదే గనుక, మీరు అట్లు పిలవడం యుక్తమే.” మనము వాటిని పాటిస్తాము. ఆయన ఏమి చెప్పినను, ఎక్కడ కూడ ఎటువంటి సందేహపు ఛాయ లేదు; మనము ముందుకు కొనసాగుతాము. ప్రభువు తన ప్రవక్త ద్వారా ఏమి మాట్లాడినను, ఏమి చెప్పికూడా దానినుండి మనలను మార్చగలిగేవారెవ్వరూ ఈ ప్రపంచములోనే లేరు, మనము కేవలం అలాగే కొనసాగిపోతాము.

ఇప్పుడు మీరు విఫలము కాలేని పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన పరిపూర్ణతలోనికి వచ్చుచున్నారు. ఆ విశ్వాసము ఎన్నడూ విఫలమవ్వదు.

ఇప్పుడు ఆయన వాక్యముపట్ల మనము పరిపూర్ణ విశ్వాసమును కలిగియున్నాము. మనము మనవైపు చూసుకోవడం లేదు. మనము యోబు వలె, దేనికీ భయపడటం లేదు. పేతురులాగా మనము పెద్ద పెద్ద అలలను చూసి భయపడుతూ నీళ్ళలో మునిగిపోవడంలేదు. ఆ రోజులు పోయినవి. ఇప్పుడు మనలో జీవిస్తూ మరియు నివసిస్తున్న పరిపూర్ణమైన వాక్యము వైపు మనము చూస్తున్నాము. మనము వధువు పదార్ధములోనికి వెళ్ళుచున్నాము. మనము ఎత్తబడు స్థితిలోనికి వెళ్ళుచున్నాము.

మనం ప్రార్థించినప్పుడు, మనం అడిగినదానిని మనము పొందుకుంటామని మనము నమ్ముచున్నాము, మరియు మనం దానిని పొందుకుంటాము; అది మనకు అనుగ్రహించబడుతుంది. కాలము, శూన్యము, మరేదియు దానిని ఎన్నడూ మార్చలేదు. అది జరిగినదని మనకు తెలుసు. అది ఇదివరకే ముగించబడినది. మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకనగా అది మన వాక్యము కాదు గానీ, అది ఆయన పలికి మరియు మనకు ఇచ్చినట్టి, ఆయన యొక్క వాక్యమైయున్నది. దానిని పలుకుటకు మనము శక్తిని మరియు పరిపూర్ణ విశ్వాసమును కలిగియున్నాము.

సరిగ్గా యేసు తన విషయంలో చేసినట్లే, మనము ఎవరమైయున్నామని; మన స్థానమును మనము గుర్తించుచున్నాము. అప్పుడు మనము చేయవలసిన ఒకేఒక్క కార్యమేదనగా, మనమేమైయున్నామనే దానిలో విశ్వాసము ఉంచడమే. మనము ఏమైయున్నామని వాక్యము చెబుతుందో దానిలో విశ్వాసమును కలిగియుండండి! అప్పుడు దేవుని యొక్క వాక్యము మన లోపలికి వచ్చి మరియు దానినది ప్రత్యక్షపరచుకుంటుంది; ఏలయనగా మనము ఒక విశ్వాసియై యున్నాము. మరియు ఒక విశ్వాసి అనగా “మనలో కదలాడుచున్న దేవునియొక్క విశ్వాసమే.”

మరియు ఇప్పుడు, మనము అదే ఆత్మతో అభిషేకించబడుచున్నాము, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును ప్రకాశింపజేయుటకు; అభిషేకించబడిన మెస్సీయాలమై యున్నాము; అంత్య దినమందు మెస్సీయాలమై యున్నాము, ఆయన మృతునిగా లేడు కాని, పరిశుద్ధాత్మ రూపంలో, ఆయన తన ప్రజలలో ఉన్నాడనియు; తన వధువుకు, ఒక ప్రేమ వ్యవహారముతో, తననుతాను ఆమెలోనికి కుమ్మరించుకుంటూ, ఆమె మధ్యన సంచరించుచున్నాడనియు చూపించుటకైయున్నది. వారు పెండ్లి విందు కొరకు ఒక్కటగుచున్నారు; మరియు అదే దేవుని ద్వారా, అదే వాక్యములో, వాగ్దానము చేయబడిన అవే సూచనలు, ఆయన యొక్క అవే కార్యరూపణలను చేయుచున్నవి.

దానిని నమ్మడం తప్ప మనము చేయుటకు ఇంకేమియు లేదు; మరియు ఒక పరిపూర్ణమైన విశ్వాసమును సృష్టించే పదార్థము అదేనని నమ్మటం తప్ప మరేమియు లేదు. దానిని మరలా వినండి, పరిపూర్ణమైన విశ్వాసమును సృష్టించే పదార్థము అదేనని నమ్మడమైయున్నది.

ఒక్క వాక్యమునైనా సందేహపడునట్టి ఒక్క అణువైనా మీ శరీరములో ఉన్నదా: లేదు
మీరు ప్రతీ వాక్యమును నమ్ముచున్నారా: అవును
ఈ వర్తమానముయొక్క ప్రత్యక్షతను ఆయన మీకు అనుగ్రహించాడా: అవును
వధువు మాత్రమే నిజమైన ప్రత్యక్షతను కలిగియుంటుందా: అవును
మీరు ఆయనయొక్క వధువైయున్నారని మీకు తెలుసా: అవును
ప్రతీ వాక్యమును నమ్ముటద్వారా అది మీకు పరిపూర్ణమైన విశ్వాసమును ఇస్తుందని ఆయన చెప్పాడా: అవును
అప్పుడు మీరు పరిపూర్ణమైన విశ్వాసపు వాక్య వధువైయున్నారు!!

ఆదివారమున నీ వాక్యమును వినుటకు మేము కూడుకొనుచుండగా ఓ ప్రభువా ముందెన్నడూ లేనట్లుగా మమ్మల్ని సిద్ధపరచుము. ఇక ఎన్నడూ మేము మావైపు చూసుకోకుండా, కేవలం నీవు మా కొరకు పలికినట్టి నీ వాక్యమును నమ్మునట్లు మాకు సహాయము చేయుము. మూడవ ఈడ్పు పనిచేయుటను మేము చూశాము మరియు అది మాలో నివసించుచున్నదని ఎరిగియున్నాము. మేము నీ వాక్యమును పలుకుచు మరియు నమ్ముచుండవలసియున్నది.

నీ యొక్క పరిపూర్ణమైన వాక్య వధువు కొరకు నీవు త్వరలో వచ్చుచున్నావని మేము ఎరిగియున్నాము. మాకు అవసరమైయున్నది ఏదైనా, తండ్రీ, మాకు అవసరమైయున్నది ఏదైనా, మేము దానిని పొందుకుంటామని మాకు తెలియును. ఏలయనగా అది నీవు ఇదివరకే మా కొరకు పలికినట్టి నీ వాక్యమైయున్నది. కేవలం దానిని నమ్మడం తప్ప చేయడానికి మరేదియు లేదు. మేము నమ్ముచున్నాము తండ్రీ, మేము నమ్ముచున్నాము. ఇప్పుడు మమ్మల్ని నీ వాక్యముపై పనిచేయనిమ్ము.

మా వైఫల్యాలను, పాపములను మరియు అతిక్రమములన్నిటినీ మేము ఒప్పుకొనుచున్నాము. ఎక్కడైతే నీ కృప మరియు కనికరముల ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడినామో అట్టి నీ కుమారుని రక్తముగుండా మమ్మల్ని చూడుము. ముందెన్నడూ లేనటువంటి మార్పు నీ వధువులో జరుగును గాక. నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించి మరియు మా అవసరతలన్నిటినీ నీవు మాకు అనుగ్రహించుదువు గాక.

రోగులు వారికున్న బాధలన్నిటి నుండి స్వస్థత పొందుదురు గాక. పడిపోయినవారు తిరిగి వాక్యము వద్దకు వచ్చుదురు గాక. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నీ వధువు ఈ దినముకై నీవు ఏర్పాటుచేసిన మార్గమును చూసి మరియు నమ్ముదురు గాక.

మీ పైన చేతులు ఉంచుటకు మీకు ఎవరూ లేనట్లైతే…మీ పైన మీరే చేతులు పెట్టుకోండి…మీరు ఒక విశ్వాసియై యున్నారు. మీరు వాక్యముగా మారినారు; మీరు వాక్యమును స్వీకరించియుండగా, మీరు వాక్యముగా మారినారు.

ప్రభువైన యేసూ రమ్ము, నీ వాక్యము యొక్క సన్నిధిలో పడియుండి పరిపక్వమగుచూ, నీ వధువు తననుతాను సిద్ధపరచుకొనుచున్నది. మేము నీ వాక్యముచేత అలంకరించబడి మరియు వస్త్రధారణ చేసుకొనగోరుచున్నాము.

ఈ ఆదివారము వచ్చి ముందెన్నడూ లేనివిధంగా మమ్మల్ని అభిషేకించుము, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, నీ వధువులోని భాగంగా మేము కూడుకొని మరియు నీవు మాట్లాడుటను వినుచుండగా: పరిపూర్ణమైన విశ్వాసము 63-0825E ను ఎలా పొందుకోవాలో మాకు బయలుపరచుము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:

పరి. మార్కు 11:22-26 / 16:15-18
పరి. యోహాను 14:12 / 15:7
హెబ్రీ 11:1 / 4:14
యాకోబు 5:14
1 యోహాను 3:21