23-0924 ఆయన రాకడకు ముందే ప్రకాశిస్తున్న ఎర్రని దీపము

వర్తమానము: 63-0623E ఆయన రాకడకు ముందే ప్రకాశిస్తున్న ఎర్రని దీపము

BranhamTabernacle.org

ప్రియమైన నిర్భయమైన వధువా,

హెచ్చరిక!! హెచ్చరిక!! ఎఱ్ఱని దీపము ప్రకాశించుచున్నది. తెర దించబడే సమయం సమీపించియున్నది. మనము ప్రతీది, ప్రతీదానిని ప్రక్కకు పెట్టి, మరియు సిద్ధముగా ఉండవలసియున్నది. మనము అంతమున ఉన్నాము. మనము ఆది నుండి ఎదురుచూస్తూ ఉండిన సమయము ఆసన్నమైనది. ప్రవచనము ఇప్పుడు నెరవేర్చబడుచున్నది.

1963 ను దాటి అరవై సంవత్సరాలకు ముందు ఈ దినమును అనగా సెప్టెంబరు 2023 ను చూడటానికి, మన దినములో జరిగే ప్రతీదానిని చూచుటకు…ప్రపంచము ఉండే స్థితిని, స్త్రీల యొక్క అనైతికతను, సంఘము ఉన్నటువంటి స్థితిని, ప్రజల యొక్క పిచ్చితనమును; దుర్మార్గముగా, గ్రుడ్డిదై, దిగంబరియై, ప్రభుత్వము యొక్క శాఖలన్నిటిలోను ఉన్నటువంటి ఆ మహా వేశ్యను, రాజకీయములో కుళ్ళును చూచుటకు దేవుడు తన గొప్ప పక్షిరాజు వర్తమానికుడిని ఆకాశాములోనికి కొనిపోయాడు, మరియు అతడు సంభవించబోవువాటి గూర్చి మనలను హెచ్చరించాడు.

అది ఎలా ఉంటుందని అతడు మనకు చెప్పాడో సరిగ్గా అలాగే అది మన కన్నులయెదుట నెరవేరియుండుటను మనము ఇప్పుడు చూస్తున్నాము. ఈ సంగతులన్నియూ జరుగుటను చూసినది మనమే. ప్రతీది దాని స్థానములో ఉన్నది. అది మురికితో నిండిన ఒక పెద్ద కుండవలె అయిపోయినది.

ప్రపంచమంతయూ ఒక భయాందోళనతో ఉన్నది. ఏ నిరీక్షణయూ మిగిలిలేదని వారికి తెలుసు. రోజురోజుకి అది ఇంకా దరిద్రముగా మారుచున్నది. భూమిమీదంతట భయము వ్యాపించుచున్నది. ఆర్ధిక వ్యవస్థ కూలిపోయినది, కారణము లేకుండా హత్యలు జరుగుచున్నవి, స్త్రీలు పురుషులుగా ఉండగోరుచున్నారు, పురుషులు స్త్రీలుగా ఉండగోరుచున్నారు. ఏదైనను మరియు ప్రతీదియును అంగీకరించబడుచున్నది. ఏ క్షణములో ఏమి జరుగవచ్చునో గదా? అది ఒక అగ్ని పర్వతమువలె ఉన్నదని వారికి తెలుసు; అది ఏ క్షణములోనైనా పేలబోవుచున్నది. వారి ముఖములపైనను, వారి క్రియలలోను మీరు దానిని చూడవచ్చు, నిరీక్షణ లేదు, భయమేయున్నది.

క్రైస్తవులని-చెప్పుకునేవారు కూడా లింగ-మార్పిడి చేసుకున్నవారిని సంఘ కాపురులుగా, ప్రజల యొక్క ఆత్మీయ నాయకులుగా స్వీకరిస్తున్నారు. ఇది సొదొమ గొమొఱ్ఱా కంటెను దరిద్రముగా మారినది. సాతానుడు మరియు వాడి రాజ్యము ఐక్యమగుచు ఒక్కటైపోయినది. వాడు వాని లక్ష్యమును సాధించాడు.

అయితే దేవునికి మహిమ, ఈ గందరగోళము మరియు ఈ భయమంతటి మధ్య, తండ్రి, తన యొక్క ఎన్నుకోబడిన ప్రజల గుంపును మరియు తన యొక్క ప్రియ వధువునుయైన, మనలను తన చేతులలో భద్రముగా ఉంచాడు మరియు ముందెన్నడూ లేనంతగా ఆయనతో ఒక ఆత్మీయ ఐక్యతను మనము కలిగియుంటున్నాము. ఇది మన జీవితాలలో అతి గొప్ప ఘడియయైయున్నది. ఇది అద్భుతమైనది. ఇది మహిమకరమైనది. ఇది సహజాతీతమైనది. ఇది మనము వ్యక్తపరచగలిగే మాటలకు మించియున్నది.

మన శరీరము వాక్యమగుచున్నది, మరియు వాక్యము శరీరమగుచున్నది; వ్యక్తపరచబడుచున్నది, నిర్ధారించబడుచున్నది. ఈ దినమున ఏమి జరుగునని బైబిలు గ్రంథము చెప్పెనో, దినదినము, సరిగ్గా అదే జరుగుచున్నది.

కార్యములు, మనము వాటితో కొనసాగలేకపోయేంత వేగముగా జరుగుచు, నెరవేరుచున్నవి. మనము ఆయనతో ఐక్యమవ్వుటకు; మన ప్రభువైన యేసు యొక్క రాకడకు మనమెంతో సమీపమున ఉన్నాము, అక్కడ వాక్యము వాక్యముగా మారుతుంది.

మన చుట్టూ ఈ సంగతులన్నీ జరగడంతో, ఇంతకంటే సంతోషముగా, ఇంతకంటే సంతుష్టిగా లేదా ఇంతకంటే పరిపూర్ణ సంతృప్తితో మనము ఎన్నడూ లేము. మన హృదయములు మరియు అంతరాత్మలు చెప్పలేని ఆనందముతో మరియు మహిమతో నిండి ఉబుకుచున్నవి. ఇది ఒక నమ్మలేని నిజము.

ఆది నుండియే మనము దేవుని యొక్క కుమారుడిగా మరియు కుమార్తెగా ఉండుటకు, ఏర్పర్చబడ్డామని ఎరిగియుండి, మనము ముందెన్నడూ లేని విధంగా ఆదరణ పొందుచున్నాము.

మనము క్రీస్తు యొక్క రక్తములో కడుగబడిన, క్రీస్తు యొక్క పరిశుద్ధ వధువైయున్నాము. ప్రశస్తమైన, పరిశుద్ధమైన, పాపములేని దేవుని కుమారుడు, తన స్వంత రక్తపు నీటిలో తాను కడిగినటువంటి ఒక నిష్కలంకమైనదై, సంకరము లేని వాక్య-వధువుతో నిలబడియున్నాడు. కాలము ప్రారంభమవ్వుటకు ముందే, ఆయన వలెనే, మనము తండ్రి యొక్క రొమ్మున ఏర్పరచబడియున్నాము…మహిమ!! హల్లేలూయా!

మనము అది మాత్రమే కాదు గాని, అతి త్వరలో, ఏర్పరచబడినవారి యొక్క పెండ్లి ఉంగరమును ధరించుకొని, మనము ఆకాశములో ఆ వివాహములోనికి వెళ్ళుచున్నాము. ఆయన మనలను ఎరిగియున్నాడు…కేవలం దానిని ధ్యానించండి, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను ఎరిగియున్నాడు, కావున అక్కడే ఆయన మనకు ఆ పెండ్లి ఉంగరమును తొడిగి మరియు మన పేరును తన యొక్క నూతన గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉంచాడు, క్షమించబడుట మాత్రమే కాదు గాని, నీతిమంతులుగా తీర్చబడియున్నాము.

దీనంతటినీ పొందుకోవడానికి ఒకే ఒక్క మార్గము కలదు, మీరు దేవుడు ఏర్పాటుచేసిన ఒకే ఒక్క మార్గము ద్వారా రావలసియున్నది. అసలైన వాక్యము ద్వారాయైయున్నది, ప్లే నొక్కండి.

మేము ఈ ప్రత్యక్షతను కలిగియున్నందుకు ఎంతో కృతజ్ఞులమైయున్నాము. అది మాకెంతో తేట తెల్లముగా ఉన్నది. రక్తమాంసములు దీనిని మాకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న మా తండ్రి మాకు దీనిని బయలుపరిచాడు మరియు దానికై మేము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో ఆయనకు వ్యక్తపరిచేందుకు మాటలు లేనేలేవు…అద్భుతమైన కృప.

పెదవి నుండి చెవికి అన్నంత సమీపముగా దేవుని యొక్క స్వరము మీతో మాట్లాడుటను వినుటకు మించినది మరేదియు లేదు. మన అంతరాత్మను నింపివేసే ఆనందము. ఆలోచించడమనేది లేదు, ఊహించడమనేది లేదు, లేదు, కనీసం నిరీక్షించడమనేది కూడా లేదు, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని, మనకు తెలియును. టేపు మీద తప్ప మరే స్థలములోను అటువంటి 100% నిశ్చయతను మీరు కలిగియుండలేరు.

మనము జీవించుచున్న దినమును గూర్చి, దేవుడు మాకు చెప్పడాన్ని మేము వింటుండగా, తన యొక్క గొప్ప పక్షిరాజు ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుచు మరియు ఈ వర్తమానమును మాకు ఇచ్చుచుండగా మీరును మాతో చేరవలెనని నేను మిమ్మల్ని ఆహ్వానించగోరుచున్నాను: ఆయన రాకడను సూచించే ప్రకాశించుచున్న ఎఱ్ఱని దీపము 63-0623E.

ప్రపంచవ్యాప్తంగా, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M గంటలకు., మేము కూడుకుంటాము. మీరు మాతో కలవలేనియెడల, మీరు ఎక్కడున్నా గాని, మీరు ఏమి చేస్తున్నా గాని, ప్లేను నొక్కి మరియు ఆ నిత్యజీవపు మాటలను వినండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

వర్తమానమును వినుటకు ముందు చదవాల్సిన లేఖనములు:

పరి. మత్తయి 5:28 / 22:20 / 24వ అధ్యాయము
2 తిమోతీ 4వ అధ్యాయము
యూదా 1:7
ఆదికాండము 6వ అధ్యాయము