23-1001 తృతీయ నిర్గమము

ప్రియమైన నిర్గమపు వధువా,

ఈనాడు సంభవించుటను మనము చూస్తున్న ఈ కార్యములు, ఒక ఇరవై సంవత్సరాల క్రితం లేదా నలభై సంవత్సరాల క్రితం జరిగియుండేవి కావు; అవి ఈనాడు మాత్రమే జరుగుచున్నవి. ఇదే ఘడియయైయున్నది! ఇదే సమయమైయున్నది! అది నెరవేరుటకు ఇదే సమయమైయున్నది. దేవుడు దానిని వాగ్దానము చేశాడు, మరియు ఇదిగో అది ఇక్కడ ఉన్నది.

మనము ఆత్మీయ అవగాహనను కలిగియున్నాము; ఈ దేశము యొక్క అక్రమము సంపూర్ణమైనది. ఘడియ వచ్చియున్నది. వాగ్దాన దేశమునకు వెళ్ళుటకు సమయమైనది. కేవలం మరొక దేశమునకు వెళ్ళడం కాదు గాని, మనము ఎదురుచూసినటువంటి మన భవిష్యత్తు గృహమునకు వెళ్ళుటయైయున్నది.

కేవలం దాని గూర్చి ఆలోచించండి, మనల్ని నడిపించేది ఒక ప్రవక్త కంటే గొప్పదైయున్నది. అది దానిని నిరూపించుటకు తన వాక్యముతో, దేవుడే మన మధ్య శరీరధారియగుటయై యున్నది. ఏ ఇతర ప్రవక్త కంటెను వెయ్యి రెట్లు అధికముగా నిరూపించిన ఒక ప్రవక్త. ఆ వాగ్దాన దేశమునకు, ఆ వెయ్యేండ్ల పాలనకు మనల్ని నడిపించుచున్నది అగ్నిస్తంభమైయున్నది.

అతడు తప్పిపోకుండా ఉండటం కోసం, ఆయన మన ప్రవక్తను ఎన్నుకొని మరియు అతనికి అగ్నిస్తంభమనే ఒక సహజాతీతమైన సూచనను ఇచ్చాడు. ప్రవక్త చెప్పినవి స్వయంగా దేవుని యొక్క మాటలే. ఆయన తననుతాను మనకు నిర్ధారించుకొని, మరియు ఆయన యొక్క సంపూర్ణ వాక్య ప్రత్యక్షతను మనకు ఇవ్వడానికి, ఆయన మన ప్రవక్తను తీసుకొని, అతనికి తర్ఫీదు ఇచ్చి, పిదప అగ్నిస్తంభముతో అతణ్ణి మన వద్దకు పంపించాడు.

మనము ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళగోరినయెడల, దేవుడు తన ప్రణాళికను మార్చలేడని, మరియు ఆయన దానిని మార్చడని, మనము ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన దేవుడైయున్నాడు, మరియు ఆయన అలా చేయలేడు. ఆయన ఎన్నడూ ఒక గుంపుతో వ్యవహరించడని ఆయన మనకు చెప్పాడు. ఆయన ఎన్నడూ ఆ విధంగా వ్యవహరించలేదు. ఆయన ఒక్కొక్కరిగా మనతో వ్యవహరిస్తాడు. మనలను ఈ దేశానికి నడిపించేందుకు మనకు మలాకీ 4 ను పంపుతాడని ఆయన తన వాక్యములో మనకు వాగ్దానం చేసాడు, మరియు ఆయన పంపించాడు.

అయితే మీరు చూడండి, ఆహాబు ఒక పద్దతిని కలిగియున్నాడు, అది దేవుని యొద్ద నుండి వచ్చినదని అతడు అనుకున్నాడు. అతడు ఇట్లన్నాడు, “విద్యావంతులు మరియు తర్ఫీదు పొందినవారైన, నాలుగు వందల మందిని నేను కలిగియున్నాను.” మరియు ఈనాడు పరిచారక గుంపులు చెప్పుకొనుచున్నట్లే, తాము హెబ్రీ ప్రవక్తలని వారు చెప్పుకున్నారు.

అనేకులు దీనిని స్వీకరించగోరరు, కానీ పాత కాలపు ఏలియా వలెనే, దేవుని యొక్క ఏడవ దూత వర్తమానికుడైన, మన కాపరి, ఆయన యొక్క వధువును నడిపించుటకు ప్రపంచానికే కాపరియైయున్నాడు.

ఆయన మలాకీ 4:5, మరియు ప్రకటన 10:7 అయ్యున్నాడు. ఆయన తన గురించి బైబిలు గ్రంథము ముందుగా చెప్పిన లేఖనాలన్నింటి యొక్క నెరవేర్పుయై యున్నాడు. ఈ వర్తమానమే, ఈ స్వరమే, తన వధువును పిలుచుచున్న దేవుని యొక్క స్వరమైయున్నది. ఇది ఈ దినము కొరకైన దేవుని యొక్క నమూనాయైయున్నది.

అది అదే అభిషేకించబడిన పద్దతి ద్వారా, అదే అగ్ని స్తంభమైయున్నది. అదే దేవుడు అవే కార్యములను చేయుచున్నాడు.

ఇప్పుడు వాక్యము శరీరధారియై మరియు ఆయన యొక్క వాక్య వధువైయున్న మన శరీరములో, మన మధ్య నివసించుచున్నది.

మనము ఆయనకు కేకలు పెట్టి మరియు ఆయనకు కృతఙ్ఞతలు చెల్లించుదాము, ఆయనను స్తుతించుదాము, ఆయన మన కొరకు చేసిన దానంతటికి: మనలను రక్షించినందుకు, మనలను ముందుగా ఏర్పరచుకున్నందుకు, మనలను నీతిమంతులుగా తీర్చినందుకు ఆయనను ఆరాధించుదాము.

సరిగ్గా ఇప్పుడు ఆయన మన కొరకు ఏమి చేస్తున్నాడంటే; మనము ఎవరమన్నది మనకు చెప్పుచూ, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షతను మనకు ఇచ్చుచున్నాడు. మరియు ఆయన మన కొరకు చేయబోయేదంతా ఏమిటంటే… వచ్చి మరియు ఆయన వధువుగా మనలను తీసుకొని మరియు నిత్యత్వమంతా మనము ఆయనతో ఉండటానికి, ఆయన మన కొరకు చేసిన భవిష్యత్తు గృహముకు మనలను తీసుకొనిపోవడమైయున్నది.

మనకు అవసరమైన దేనికొరకైనా, ఆయనకు మొఱ్ఱపెట్టండి. తన పిల్లలు దానిని చేయాలనే ఆయన కోరుచున్నాడు. మనము తృప్తిచెంది మరియు మనకు అవసరమైనదానిని పొందుకునేంత వరకు ఆయనకు మొఱ్ఱ పెట్టండి.

వచ్చి మరియు ఆయన యొక్క వధువులో ఒక భాగముతో ఐక్యమై జఫర్సన్ విల్ కాలమానం ప్రకారము ఆదివారము 12:00 P.M., గంటలకు ప్రపంచానికి దేవుని యొక్క కాపరియైయున్న, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు, మనకు దీనిని చెప్పుటను వినండి: తృతీయ నిర్గమము 63-0630M.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

వర్తమానమునకు ముందు చదువవలసిన లేఖనాలు:

నిర్గమకాండము 3:1-12
ఆదికాండము 37 వ అధ్యాయము
ఆదికాండము 43 వ అధ్యాయము