23-1008 నీ జీవితం సువార్తకు యోగ్యమైనదిగా ఉన్నదా?

ప్రియమైన దేవుని ప్రవక్త యొక్క మందా,

మనము ప్రార్థించుకుందాము.

పరలోకపు తండ్రీ, నిత్యత్వమునకు ఈవలి వైపున ప్రపంచమంతటి నుండి కూడుకొనుటకు మరొక సమయమును కలిగియున్నందుకు మేము ఎంతో కృతజ్ఞులమైయున్నాము. ఏక మనస్సు కలిగి మరియు నీతో ఏకాత్మలో ఉండుటకు; నీ స్వరము మాతో మాట్లాడుటను వినడానికి కృతజ్ఞులమైయున్నాము. ముందున్న ప్రయాణము కొరకు మమ్మల్ని ధైర్యపరచి మరియు బలపరచుటకు, నీ యొద్ద నుండి నూతన బలము రావలెనని మరొక్కసారి మేము ఎదురుచూస్తున్నాము.

మా కొరకు ఏర్పాటుచేయబడిన మన్నాను పొందుకోవడానికి మేము కూడుకొనుచున్నాము. అది ప్రయాణములో మాకు శక్తిని ఇచ్చుటకు నీవు దాచిపెట్టిన ఆ ఆత్మీయ మన్నాయైయున్నది. కేవలం అది మాత్రమే రాబోవు దినములలో మమ్మల్ని కాపాడగలదు.

నీవు నీ సంఘమును క్రమములో పెట్టగలుగుటకు ముందు, నీవు ఒక్క చోట, మమ్మల్ని సమకూర్చి, మరియు ఒక్క ఆత్మలోకి మమ్మల్ని తీసుకొనిరావలసియున్నదని, నీవు చెప్పావు. పిదప నాయకత్వం వహించుటకు నీవు నీ యొక్క పరిశుద్ధాత్మను పంపెదవు, ఏదో ఒక సార్వత్రిక సంఘ సమైఖ్యనో, ఏదో ఒక మనుషుల గుంపునో కాదు గాని, పెదవి నుండి చెవికి అన్నట్లు మాతో మాట్లాడేందుకు నీ పరిశుద్ధాత్మను పంపుతావు.

నీవు నీ యొక్క దూత ద్వారా మాట్లాడి మరియు మాకు ఇట్లు చెప్పావు:

“మీరు మీ సంఘ కాపరితో నిలబడాలని మరియు ఇక్కడ బోధించబడిన బోధనతో నిలబడాలని నేను కోరుచున్నాను. ఈ వాక్యముతో నిలిచియుండండి, దానిని విడిచిపెట్టకండి! ఏది ఏమైనా గానీ మీరు సరిగ్గా వాక్యముతో నిలిచియుండండి, ఆ వాక్యముతోనే నిలిచియుండండి!”

తండ్రీ, మేము నీ వాక్యమునకు విధేయులమై మరియు మా సంఘ కాపరితో నిలిచియుంటున్నాము. అది ఈ దినమునకు దేవుని యొక్క స్వరమైయున్నది, మా దినమునకు ప్రత్యక్షపరచబడి మరియు నిర్ధారించబడిన నీ యొక్క స్వచ్చమైన వాక్యమును మాత్రమే అతడు మాట్లాడుతాడు.

సొదొమ దినములలో జరిగినట్లు, మనుష్యకుమారుని రాకడలో జరుగునని నీవు మాకు చెప్పావు; మమ్మల్ని నడిపించుటకు మేము రెండు సంగతులను కలిగియుంటామని, మరియు మిగతా ప్రపంచము రెండు సంగతులను కలిగియుంటుందని నీవు చెప్పావు. వారి యొక్క రెండు సంగతులు ఇద్దరు ప్రసంగికులైయున్నారు.

కాని నీ యొక్క ఆత్మీయ సంఘమునకు, ముందుగా నిర్ణయించబడి, ఎన్నుకొనబడిన నీ యొక్క వధువుకు, మా రెండు సంగతులు ఏవనగా నీవు, ఒక మానవ శరీరములో ప్రత్యక్షపరచుకొని, అగ్నిస్తంభము ద్వారా మమ్మల్ని నడిపించడమైయున్నది.

గాలులు వీచనిమ్ము. తుఫానులు కుదుపనిమ్ము. మేము మాత్రం, ఎప్పటికీ సురక్షితంగా ఉన్నాము. మేము సరిగ్గా అక్కడ నీ వాక్యముపై విశ్రాంతి పొందుచున్నాము. సమయం ఆసన్నమైనది. ఆత్మీయ నిర్గమము వచ్చియున్నది. మేము నీ స్వరమును వినుచు, అనుదినము నీతో మాట్లాడుచు మరియు నీతో నడుచుచున్నాము. మేము నీతో ఒక స్థిరమైన సహవాసములో ఉన్నాము.

మేము నీ చేతులుగాను, నీ కళ్ళుగాను, నీ నాలుకగాను ఉండగోరుచున్నాము. నీవు ద్రాక్షావల్లివి, మేము నీ తీగెలమైయున్నాము. తండ్రీ, నీ ఫలమును మేము ఫలించుటకు, మమ్మల్ని ఉత్తేజపరచుము. నీ సువార్తకు యోగ్యమైన జీవితమును కలిగియుండాలన్నదే మా ఏకైక కోరికయైయున్నది.

తండ్రీ, నీ పనిని కొనసాగించుటకు మరియు నీ వాగ్దాన వాక్యమును నెరవేర్చుటకు, నిన్ను నీవు మా ద్వారా ప్రతిబింబించుకొనుము. నీతి యావత్తును నెరవేర్చడానికి, ఈ దినమునకు నీ వర్తమానికులుగా ఉండాలన్నదే మా కోరికయైయున్నది.

నీవు మాతో ఈ విధంగా చెప్పుటను వినాలని మేము కోరుచున్నాము:

రేడియో ద్వారా వినుచున్నవారు లేదా…టేపు రంగములో ఉన్నవారు, మరియు ఇక్కడున్నవారి కొరకు, నా ప్రార్థన ఇదే. “నేను బహుగా ఆనందించాను. జగత్తు పునాది వేయబడక ముందే మీ కొరకు సిద్ధపరచబడిన నిత్యత్వపు సంతోషాలలోనికి ప్రవేశించండి,” అని దేవుడు చెప్పునటువంటి జీవితమును, ఈ రాత్రి మొదలుకొని, ఇకమీదటను మనము జీవించునట్లు, పరలోకము యొక్క, కృపగల దేవుడు, మనందరిమీద తన యొక్క ధన్యకరమైన పరిశుద్ధాత్మను ప్రకాశింపజేయును గాక. పరలోకపు దేవుడు మీ అందరిమీద తన ఆశీర్వాదములను కుమ్మరించును గాక.

మహిమ…తండ్రీ అది మేమే, టేపు రంగములో ఉన్న నీ వధువైయున్నాము. నిజముగా, నీవు నీ ఆశీర్వాదములను మా మీదకు పంపుచున్నావు, మేము వింటున్న ప్రతీ వర్తమానము ద్వారా, నీవు బహుగా ఆనందించుచున్నావనియు, మేము నీ వదువైయున్నామనియు మాతో చెప్పుచున్నావు.

మా సంఘకాపరి చెప్పేది, దేవుడు తన వధువును బయటకు పిలిచి మరియు ఆమెను నడిపించుటకై లోకమునకు పంపినట్టి తన కాపరి చెప్పేది మీరు వినగోరిన యెడల, ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా, 12:00 P.M., సమయముకు, వచ్చి మాతో కూడా చేరండి, దేవుని యొద్ద నుండి అతడు ఈ వర్తమానమును తెచ్చుచుండగా, అతడు నిత్యజీవపు మాటలు చెప్పడాన్ని వినేందుకు, మాతో కూడా చేరండి: నీ జీవితం సువార్తకు యోగ్యమైనదిగా ఉన్నదా? 63-0630E.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్