23-0528 సార్దీస్‌ సంఘ కాలము

యోగ్యమైన ప్రియమైనవారలారా, నీతిమంతులారా,

పక్షిరాజులారా, యేసు యొక్క మధురమైన స్వరం మీతో మాట్లాడటం మరియు ఇలా చెప్పడం వినుటకు మీరు ఈ ఆదివారం కూడుకొనుటకు సిద్ధంగా ఉన్నారా:

మీరు యోగ్యమైనవారు.” “మీరు నా సొత్తు.” “మీరు నీతిమంతులు.” మీరు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు” “మీ పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాయి.”

ఇవి నా మాటలు కాదు, కానీ అవి పరలోకంలో ఉన్న మన తండ్రి, ఆయన ఎన్నుకున్న వధువైన మీతో మాట్లాడుతున్న మాటలు. పరిశుద్ధాత్మ మరోసారి వచ్చి మానవ శరీరంలో నివసించాడు, కాబట్టి ఆయన తన ఎన్నుకోబడిన వధువుతో ఈ అద్భుతమైన వాక్యాలను నేరుగా మాట్లాడుతున్నాడు.

“యేసు చెప్పాడు” అని నా నుండి లేదా ఎవరినుండైనా వాటిని వినడం చాలా అద్భుతంగా ఉంటుంది, , కానీ ఆయన ఎంచుకున్న స్వరము ద్వారా ఆయన మాట్లాడటం వినడం; ఆయన అతని ద్వారా మీకు చెప్పడం, వ్యక్తిగతంగా … అంతకంటే గొప్పది ఏమీ లేదు.

దేవుడు తన వాక్యాన్ని ప్రపంచానికి తీసుకురావడానికి అనేక స్వరాలు ఉపయోగించుకుంటాడు. ప్రపంచానికి మరియు ఆయన వధువుకు ఒక ఆశీర్వాదంగా ఉండటానికి ఆయన వారిని ఎంచుకున్నాడు మరియు ఉంచాడు.

యేసు మానవ శరీరంతో భూమిపై ఉన్నప్పుడు, ఆయనను వెంబడించడానికి మరియు వారు మరి ఎక్కువ చూసిన మరియు విన్న వాటిని ఆయన కోసం మాట్లాడటానికి మనుష్యులను, తన అపొస్తలులను కూడా ఎన్నుకున్నాడు. సువార్త, మెస్సీయ వచ్చాడన్న మంచి వార్తను వ్యాప్తి చేయడానికి ఆయన పంపిన వారు ఈ మనుష్యులు; ఆయన వారితో భూమిపై ఉన్నాడు. ఈ గొప్ప వార్తను ప్రకటించడానికి మరియు మనుష్యులందరినీ తన వద్దకు తీసుకురావడానికి ఆయన ఇద్దరిద్దరినిగా పంపాడు.

ఆయన ఒక రాత్రి వారిని కూడగట్టినప్పుడు, “ నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను.” కొందరు ఏలీయా అనియు,  కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, చెప్పుకొను చున్నారనిరి”.అందుకాయన ”మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారు” అని అడుగగా, సీమోను పేతురు – ”నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు” అని చెప్పెను. అందుకాయన – “రక్తమాంసములు నీకు బయలు పరచలేదు, పేతురు, కాని పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెను, మరియు ఈ బండ (ప్రత్యక్షత) మీద నా సంఘమును కట్టుదును.”

ఈ గొప్ప మర్మమును చూసి ప్రపంచం పొరపడింది. కొంతమంది పురుషులు పేతురు గురుంచి అని నమ్ముతారు. అది అక్కడ పడివున్న రాయి అని కొందరు భావిస్తున్నారు. కొందరు అది యేసు అని నమ్ముతారు. కానీ ప్రత్యక్షత ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇవ్వబడింది, అది ఆయన ఎవరు అనే ప్రత్యక్షత అని మనకు తెలుసు.

యేసు మరణం, సమాధి మరియు పునరుత్థానం తర్వాత, పెంతెకోస్తు దినమున, ఈ గొప్ప వార్తను ప్రపంచానికి తెలియజేయడానికి వారు పంపబడ్డారు. పేతురు మరోసారి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు మరియు ప్రజల ముందుకు వెళ్లి ఆయన పరిశుద్ధాత్మను ఎలా స్వీకరించాలో ప్రకటించాడు. మీరు పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి అని చెప్పాడు.

పరిశుద్ధాత్మ పేతురుపై ఎంతటి స్థానం ఉంచాడు. ప్రజలు ఆయనను ఎలా చూస్తున్నారో మనం ఊహించవచ్చు. యేసు ఇక్కడ భూమిపై శరీరంతో ఉన్నప్పుడు అతను ఆయనతో కలిసి నడిచాడు. అతను ఆయన స్నేహితుడు. ప్రతిరోజూ ఆయన పక్కనే ఉండేవాడు. ప్రత్యక్షతను ఇవ్వడానికి ఆయన ఎన్నుకున్నవాడు. కానీ దేవుడు తన ప్రవక్తగా మరొకరిని ఎంచుకున్నాడు: పౌలు.

పౌలుతో ఉండడానికి పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు, అతడు అన్యజనులతో కలిసి తిని త్రాగుచున్నాడు. కానీ యాకోబు నుండి ఒక గుంపు అక్కడికి వచ్చినప్పుడు, అతను తనను తాను ఉపసంహరించుకున్నాడు మరియు భయపడిపోయాడు. పౌలు అతన్ని ఇతరుల ముందు బాహాటంగా మందలించాడు మరియు అతను సత్యం ప్రకారంగా నడవలేదని  అతనను నిందించాడు. సహోదరుడు బ్రాన్‌హామ్‌ మాట్లాడుతూ, పేతురు యూదుల వలన పట్టుసడిలినట్లే ఉన్నాడు.

ఈ రోజు ఇది మనకు ఏమి చెబుతుంది? అది ఎవరు అన్నది ముఖ్యం కాదు. వారికి పరిశుద్ధాత్మ ఎంత ఉంది అన్నది కాదు. వారికి ఎలాంటి అధికారం లేదా పిలుపు ఉంది అని కాదు. మీరు మీ సంపూర్ణత  కోసం దేవుడు ఎన్నుకున్న ప్రవక్తతో ఖచ్చితంగా ఉండాలి. ఆయన, మరియు ఆయన మాత్రమే, దేవుని వాక్యం యొక్క దైవిక అనువాదకుడు.

ఇది పేతురుకు లేదా అప్పుడు కాని ఇప్పుడు కాని దేవుడు ఎన్నుకున్న శిష్యులలో ఎవరినీ వ్యతిరేకించాలని కాదు. వారు సువార్తను వ్యాప్తి చేయడానికి ఎన్నుకోబడ్డారు, కానీ దేవుడు తన సంఘము పైన ఒక్క మనుష్యుని ఎన్నుకున్నాడు. ప్రభువు ఈలాగు సెలవిచుచున్నాడు తో దేవుడు ఎన్నుకున్న ప్రవక్త, ఆయన మాత్రమే వారు కాదు. వారికి వారి స్థానం ఉంది, కానీ ఆయన వధువు కోసం అంత్యపు వాక్యముతో,ఆయన సంఘమును క్రమంలో ఉంచడానికి ఒక్క ప్రవక్త ఉన్నాడు.

మన రోజు కోసం దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరాన్ని వినడానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇది చూపిస్తుంది. ఆయన ఎన్నుకున్న ఒక్కడు ఆయన వాక్యానికి దైవిక అనువాదికుడు. ఆయన దూత ద్వారా ఆయన స్వరాన్ని వినడం కంటే గొప్పది ఏదీ లేదు; ఆయన ఎంచుకున్న స్వరం, మనం ఎంచుకున్నది కాదు.

దేవుడు తన వాక్యంతో ఉండే మరియు ఆయన ఎంచుకున్న దూతతో ఉండే ఎన్నుకున్న ప్రజల గుంపును మనం అన్ని కాలాల్లో చూస్తాము. ఆ స్వరము మనం ఎవరు, వారిలో ఒకరమని రోజూ మనకు ప్రకటిస్తోంది.

ఆయన తన సంఘమునకు సంస్కర్తలను పంపుతాడు, కానీ ఈ రోజు, ఆయన తన పునరుద్ధారకుడును పంపాడు; “నేను పునరుద్ధరిస్తాను, మరియు నేను పిల్లల హృదయాలను తిప్పుతాను, ఎందుకంటే నా స్వరం యొక్క రోజుల్లో నేను మీకు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి.”

జెఫెర్సన్‌విల్ సమయానికి ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఆ స్వరాన్ని మాతో వినవలసిందిగా మీరు ఆహ్వానించబడ్డారు, సార్దీస్‌ సంఘ కాలము 60-1209 వినుచుండగా ఆయన మనతో మాట్లాడుతూ మరియు  మనకు నిజమైన మరియు అబ్భదపు సంఘమును చూపుతాడు.

సహోదరుడు. జోసెఫ్ బ్రెన్హామ్.